lashes
-
హైదరాబాద్‌లో పలుచోట్ల భారీ వర్షం
సాక్షి,హైదరాబాద్: భాగ్యనగరంలో పలు ప్రాంతాల్లో ఆదివారం(జూన్30) సాయంత్రం భారీ వర్షం కురిసింది. భారీ వర్షం కారణంగా రోడ్లపై వాహనాల రాకపోకలకు ఇబ్బందులెదురయ్యాయి. సికింద్రాబాద్, బేగంపేట్, బోయిన్పల్లి, తిరుమలగిరి, బొల్లారం రామంతాపూర్, ఉప్పల్, దిల్సుఖ్నగర్, ఎల్బీనగర్, హయత్‌నగర్, కేపీహెచ్‌బీ, కూకట్పల్లి, హైదర్‌నగర్, నిజాంపేట్, బోరబండ, యూసుఫ్‌గూడ, జూబ్లీహిల్స్, మైత్రీవనం, అమీర్‌పేట, పంజాగుట్టల్లో భారీ వర్షం కురిసింది. వరద నీరు చేరడంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.రోడ్లపై అక్కడక్కడా నీరు నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వరద సమస్య ఉన్న ప్రాంతాల్లో జీహెచ్ఎంసీ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. -
హైదరాబాద్‌లో భారీ వర్షం
సాక్షి,హైదరాబాద్: రాజధాని హైదరాబాద్ నగరంలో పలు చోట్ల ఆదివారం(జూన్23) సాయంత్రం భారీ వర్షం కురిసింది. అమీర్‌పేట్, ఎస్సార్‌నగర్, బోరబండ, పంజాగుట్ట, యూసఫ్‌గూడ, మాదాపూర్, గచ్చిబౌలి, రాయదుర్గం, చంపాపేట్, సైదాబాద్, చాదర్‌ఘాట్, మలక్‌పేట్, సరూర్‌నగర్, అమీర్‌పేట్, ఎస్సార్‌నగర్, బోరబండపంజాగుట్ట, యూసఫ్‌గూడ, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ ఎల్బీనగర్, మియాపూర్, చందానగర్, లింగంపల్లి, కొండాపూర్ ప్రాంతాల్లో కుండపోత వర్షం కురిసింది. భారీ వర్షంతో పలుచోట్ల ట్రాఫిక్‌జామ్ అయింది. వాహనదారులు ఇబ్బంది పడ్డారు. హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై వరదనీరు చేరింది. ఓ వైపు రహదారి విస్తరణ పనులు, మరోవైపు వరదనీటితో వాహనదారులు ఇక్కట్లకు గురయ్యారు. పలు చోట్ల వరద నీటి కారణంగా వాహనాలు స్లోగా వెళ్లాయి. -
హైదరాబాద్‌లో భారీ వర్షం
సాక్షి,హైదరాబాద్: రాజధాని హైదరాబాద్ నగరంలో సోమవారం(జూన్17) పలు ప్రాంతాల్లో వర్షం దంచి కొట్టింది. మధ్యాహ్నం ఒక్కసారిగా ఆకాశంలో మబ్బులు కమ్మి భారీ వర్షం కురిసింది. అమీర్‌పేట, బంజారాహిల్స్, పంజాగుట్ట, ఖైరతాబాద్, సెక్రటేరియట్, లక్డీకాపూల్ మాదాపూర్, గచ్చిబౌలి ఏరియాల్లో వర్షం పడింది. వర్షం కారణంగా పలు పలు ప్రాంతాల్లో నీరు నిలిచి ట్రాఫిక్ నిలిచిపోయింది. ఒక్కసారిగా కురిసిరన కుండపోత వర్షంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. -
జలసంద్రంగా మారిన హైదరాబాద్.. వాహనదారులకు చుక్కలు (ఫొటోలు)
-
హైదరాబాద్ లో మళ్ళీ దంచికొట్టిన వర్షం
-
రెప్పపాటులో రికార్డు కొట్టేసింది..
నాకు నేనే సాటి.. నాకెవరూ రారు పోటీ అంటోంది ఈ ఫొటోలో ఉన్నామె. పోటీ ఎందులో అంటారా? ఆమె కళ్లు చూశారా.. ఆ కంటి రెప్పలకున్న వెంట్రుకలు చూశారా..? అంతపెద్దగా ఉన్నాయేంటి అనుకుంటున్నారా? అవును ప్రపంచంలోకెల్లా అతి పొడవైన కనురెప్ప వెంట్రుకలు ఉన్న ఆమె గిన్నిస్ రికార్డు సొంతం చేసుకుంది. ఈ విషయంలో 2016లోనే రికార్డు సృష్టించిన ఆమె.. ఇప్పుడా రికార్డును తనే బ్రేక్ చేసింది. చైనాలోని చాంగ్జౌ నగరానికి చెందిన యూ జియాంజియా 2016లో 12.5 సెంటీమీటర్ల (4.88 అంగుళాలు) పొడవైన కనురెప్పల రోమాలతో రికార్డు సృష్టించింది. సీన్ కట్‌చేస్తే.. ఐదేళ్లలో అవి రెట్టింపు అయ్యాయి. ఎడమ కనురెప్ప వెంట్రుకలు ఏకంగా 20.5 సెంటీమీటర్ల (8 అంగుళాలు) పొడవు పెరిగాయి. దీనితో మరోసారి గిన్నిస్ బుక్‌లోకెక్కింది. తాను ఓసారి పర్వత ప్రాంతాల్లో ఏడాదిన్నర నివసించానని, అప్పుడే బుద్ధుడు పొడవైన వెంట్రుకలను బహుమానంగా ఇచ్చాడని ఆమె అంటోంది. చదవండి: చావు నోట్లో తలపెట్టి వచ్చాడు.. తిమింగలం నోటిలో 30 సెకన్ల పాటు -
బడ్జెట్‌పై కాంగ్రెస్ పెడార్థాలు తీస్తోంది
న్యూఢిల్లీ: పార్లమెంట్లో ఇటీవల తాము ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్‌పై ప్రతిపక్షాలు అపార్థాలు సృష్టిస్తున్నాయని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆరోపించారు. దేశవ్యాప్తంగా గ్రామీణ రహదారుల నిర్మాణం, పేదలకు పక్కా ఇళ్లు, ఉచితంగా వంటగ్యాస్, రేషన్ పంపిణీ వంటివి చేపడుతున్నా మోదీ ప్రభుత్వం ధనికులకు అనుకూల మంటున్నాయని విమర్శించారు. శుక్రవారం మంత్రి రాజ్యసభలో బడ్జెట్‌పై జరిగిన చర్చకు సమాధానమిచ్చారు. కోవిడ్ మహమ్మారితో ప్రపంచ ఆర్థిక వ్యవస్థలన్నీ అతలాకుతలమైన తరుణంలో ‘ఆత్మనిర్భర్ భారత్’ సాధనకు బడ్జెట్ ఒక ఆయుధమని ఆమె అభివర్ణించారు. ‘స్వల్పకాలిక తక్షణ పరిష్కారాలను వెదకడానికి బదులుగా ఆర్థిక వ్యవస్థపై గుణాత్మక ప్రభావం చూపే ఉద్దీపనను, గట్టి ఉద్దీపనను కల్పించేందుకు ఈ బడ్జెట్లో ప్రయత్నం జరిగింది. ఈ క్లిష్ట సమయంలో సాయం కోసం ఎదురు చూస్తున్న ప్రజలకు తక్షణ ఉపశమనం కలిగించేందుకు స్వల్ప కాలిక చర్యలు తీసుకుంటూనే మాధ్యమిక, దీర్ఘ కాలిక స్థిరవృద్ధి సాధనకు చర్యలు ప్రకటించాం’ అని తెలిపారు. దేశంలోని పేదలు, బడుగు వర్గాలకు సాయపడేలా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు స్పష్టంగా కనిపిస్తున్నా, ప్రభుత్వం కొందరు పారిశ్రామికవేత్తల కోసమే పనిచేస్తోందన్న ప్రతిపక్షాల తప్పుడు ప్రచారం ఆగడం లేదు’ అని అన్నారు. ‘మా ప్రభుత్వం తీసుకువచ్చిన ఈ మార్కెట్‌ప్లేస్, యూపీఐలను కొందరు ధనికులు, కొందరు అల్లుళ్లే వినియోగిస్తున్నారా?’ అంటూ మంత్రి వ్యాఖ్యానించడంతో కాంగ్రెస్ సభ్యులు అభ్యంతరం తెలిపారు. బడ్జెట్లో పేర్కొన్న అంకెలపై మాజీ ఆర్థిక మంత్రి పి.చిదంబరం అనుమానం వ్యక్తం చేయడంపై ఆమె స్పందిస్తూ..‘యూపీఏ హయాంలో అభివృద్ధి సాధించినట్లు చూపేందుకు కృత్రిమ గణాంకాలతో వ్యయాన్ని పెంచారు. సబ్సిడీని ప్రభుత్వ బడ్జెట్ నుంచి కంపెనీలకు తరలించారు. కానీ, 2021–22 బడ్జెట్లో పారదర్శకత పాటిస్తూ వ్యయ వివరాలన్నీ స్పష్టంగా పేర్కొన్నాం’అని తెలిపారు. -
నా కొడుకుపై పద్మవ్యూహం
బెంగళూరు: లోక్‌సభ ఎన్నికల్లో మాండ్య స్థానం నుంచి బరిలో ఉన్న తన కొడుకు నిఖిల్‌ను ఓడించేందుకు కాంగ్రెస్ తదితరులు కలిసి పద్మవ్యూహం పన్నారని కర్ణాటక సీఎం కుమారస్వామి ఆరోపించారు. మహాభారత యుద్ధకాలంలో అర్జునుడి కొడుకు అభిమన్యుడిని చంపేందుకు కౌరవులు పద్మవ్యూహం పన్నినట్లుగా ఈ ఎన్నికల్లో నిఖిల్‌ను ఓడించేందుకు కాంగ్రెస్, ఇతరులు స్వతంత్ర అభ్యర్థి సుమలతతో కుమ్మక్కయ్యారన్నారు. ‘మాండ్యలో జరుగుతున్న పరిణామాలు చేయిదాటి పోయాయి. స్వతంత్ర అభ్యర్థిగా ఉన్న సుమలతకు కాంగ్రెస్‌తోపాటు బీజేపీ, రైతు సంఘాలు మద్దతిస్తున్నాయి. జేడీఎస్‌ను అణచివేయటానికి వీరంతా చేతులు కలిపారు’ అని శుక్రవారం ఆయన మీడియాతో అన్నారు. ఈ వ్యాఖ్యలపై సుమలత స్పందించారు. ‘అవును, కాంగ్రెస్ కార్యకర్తలు నావెంటే ఉన్నారు. నన్ను ఓడించటానికి ప్రభుత్వ యంత్రాంగం, మంత్రులు, ఎమ్మెల్యేలు కలిసి పద్మవ్యూహం పన్నారు’ అంటూ తిప్పికొట్టారు. ఎన్నికల సమయంలో ప్రజల మద్దతు పొందేందుకు పాక్‌తో యుద్ధభయాన్ని ప్రధాని మోదీ కల్పిస్తారని రిటైర్డు సైనికాధికారి ఒకరు రెండేళ్ల క్రితమే తనతో చెప్పారని సీఎం కుమారస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘నా మాటలు గుర్తుంచుకోండి. లోక్‌సభ ఎన్నికలకు ముందు పాక్‌తో సంక్షోభం సృష్టించి, ప్రజలను మరోసారి తప్పుదోవ పట్టించి ఓట్లు పొందేందుకు మోదీ ప్రయత్నిస్తారు’ అని రెండేళ్ల క్రితమే రిటైర్డ్ సైనికాధికారి ఒకరు తనతో చెప్పినట్లు వెల్లడించారు. -
నోట్ల రద్దుపై స్వామి సంచలన వ్యాఖ్యలు
-
నోట్ల రద్దుపై స్వామి సంచలన వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: ఆపరేషన్ బ్లాక్ మనీపై బీజేపీ ఎంపీ, ఫైర్ బ్రాండ్ సుబ్రహ్మణ్య స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. డీమానిటైజేషన్ పథకంపై ప్రభుత్వానికి సరియైన ప్రణాళిక లేదని మండిపడ్డారు. పెద్దనోట్ల రద్దు, కొత్తనోట్ల జారీ ప్రక్రియలో పేలవమైన ప్రణాళిక,అమలు కారణంగా గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. పేలవమైన ప్రణాళికతో తీసుకున్న ఆర్థికశాఖ చర్య దేశాన్ని అయోమయంలోకి నెట్టేసిందన్నారు. తమ తప్పులేదని ఆర్థికశాఖ వాదించడం సులభమేకానీ, ఆకస్మికచర్యలు చేపట్టకపోవడం క్షమించరానిదని ధ్వజమెత్తారు. ఈ విషయంలో ఆర్థికమంత్రిత్వ శాఖ సరియైన ఏర్పాట్లు చేయకపోవడం తనను బాధించిందని పేర్కొన్నారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు కూడా అయిన అవినీతి నిరోధంపై ఒక కార్యక్రమంలో పాల్గొనేందుకు హాంగ్ కాంగ్ వెళ్లిన స్వామి ఈ వ్యాఖ్యలు చేసినట్టు సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ రిపోర్ట్ చేసింది. కాగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ నవంబరు 8న రూ. 500, 1,000 నోట్ల చలామణి రద్దు చేయడంతో దేశంలో కలకలం రేపింది. ఏటీఎం కేంద్రాల వద్ద, బ్యాంకుల వద్ద ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు. ఈ నేపథ్యంలో అటు ఆర్థిక శాఖ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పరిస్థితిని చక్కదిద్దడానికి మల్లగుల్లాలు పడుతోంది. అటు 50 రోజులు సహకరిస్తే ప్రజలు కోరుకున్న భారతాన్నిస్తానన్నారు. అవినీతిపై మొదలుపెట్టిన పోరాటం ఆగదని, తను తప్పుచేశానని భావిస్తే బహిరంగంగా ఉరేయమంటూ ఉద్వేగంగా గోవాలో ప్రకటించిన సంగతి తెలిసిందే. -
చెరువులను తలపిస్తున్న హైదరాబాద్ రోడ్లు
-
సర్జరీ పార్టీలో కాదు రాజకీయాల్లో చేయాలి
న్యూఢిల్లీ: కేంద్రలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా జరుపున్న ఉత్సవాలపై కాంగ్రెస్ నేత కపిల్ సిబాల్ విరుచుకుపడ్డారు. ఓ వైపు దేశంలో వ్యవసాయ రంగం కుంటుపడుతోంటే ప్రభుత్వం కళ్లు మూసుకుందని విమర్శించారు. తాజాగా రాష్ట్రాల్లో దెబ్బతిన్న కాంగ్రెస్ పార్టీలో సర్జరీ చేసుకోవాలన్న విమర్శకుల మాటలపై స్పందించిన ఆయన సర్జరీ చేయించుకోవాలని కానీ అది దేశ రాజకీయాల మీదని అన్నారు. ఉత్తరప్రదేశ్ నుంచి కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థిగా కపిల్ సిబాల్ పేరును ప్రకటించారు. -
నాదే పూచీ అన్న పవన్ ఏడి?
- ప్రశ్నిస్తానన్న పవన్ ఎక్కడ? - వైఎస్సార్ సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా రాజమహేంద్రవరం: ఇంటికో ఉద్యోగం లేదంటే నెలకు రూ.రెండు వేల నిరుద్యోగ భృతి ఇస్తానని ఎన్నికల సమయంలో హామీలు ఇచ్చి, గద్దెనెక్కిన సీఎం చంద్రబాబు రెండేళ్లైనా వాటిని అమలు చేయకుండా యువతను మోసం చేశారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం అధ్యక్షుడు జక్కంపూడి రాజా ధ్వజమెత్తారు. రాజమహేద్రవరంలో బుధవారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఇచ్చిన ఏ ఒక్క హామీనీ చంద్రబాబు అమలు చేయలేదని మండిపడ్డారు. యువత తల్చుకుంటే ప్రభుత్వాలు కూలిపోరుున ఘటనలను చంద్రబాబు గుర్తుచేసుకోవాలని సూచించారు. కాపులను బీసీల్లో చేరుస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి ఇప్పుడు కమిషన్ పేరుతో తాత్సారం చేస్తున్నారని దుయ్యబట్టారు. చంద్రబాబు కాపుల నమ్మకాన్ని కోల్పోయారన్నారు. చంద్రబాబు ఇచ్చే హామీలకు నాది పూచీ అన్న పవన్ కల్యాణ్ ఇప్పడు ఎక్కడున్నారని ప్రశ్నించారు. సినిమాల్లోలాగా ఎప్పుడో ఒకసారి అలా వచ్చి మెరిసిపోతున్నారని ఆక్షేపించారు. ప్రశ్నించేందుకు పార్టీ పెట్టానన్న వ్యక్తి ఇప్పుడు కనిపించకుండాపోయాడని విమర్శించారు. తనను నమ్మి టీడీపీకి ఓట్లేసిన కాపు యువతను పవన్ కల్యాణ్ ఏమి సమాధానం చెబుతారని ధ్వజమెత్తారు. జనసేన పార్టీ పెట్టి ప్రజలకు ఏం సేవ చేశారని ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానని ఒకసారి, పోటీ చేయడానికి తన దగ్గర డబ్బులు లేవని మరోసారి చెబుతూ గందరగోళం స్పష్టిస్తున్నారని మండిపడ్డారు. గత ఎన్నికల్లో కాపులకు అత్యధికంగా సీట్లిచ్చిన ఘనత వైఎస్సార్ సీపీదేనన్నారు. వచ్చే ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో యువజన విభాగం కీలక పాత్ర పోషించేలా కృషి చేస్తానన్నారు. -
ఏమి సాధించారని సంబరాలు?
హైదరాబాద్: టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడుస్తున్న సందర్భంగా ఏమి సాధించారని సంబరాలు చేసుకుంటున్నారని సీపీఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ప్రశ్నించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం మాటలు ఎక్కువ, చేతలు తక్కువగా ఉన్నాయని.. కొన్ని వాగ్దానాల అమలు కనీస స్థాయిలో కూడా జరగలేదని విమర్శించారు. రాష్ట్రంలో అత్యధిక సంఖ్యలో ఉన్న ఎస్సీ,ఎస్టీ,బీసీ,మైనారిటీల అభివృద్ధికి రెండేళ్లలో ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. ఎస్సీ,ఎస్టీల అభ్యున్నతికి చర్యలు తీసుకోకపోగా వారికి నష్టం కలిగించే విధంగా వ్యవహరించరన్నారు. కేజీ టు పీజీ అమలుపై ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించారు. దళితులకు భూ పంపిణీ ఏ మాత్రం ముందుకు సాగడం లేదని, రెండు పడకల ఇళ్ల నిర్మాణానికి ఆతీగతీ లేదని, అందరికీ విద్య అనేది అందని ద్రాక్షగా మారిందని విమర్శించారు. విద్య,వైద్యరంగాల్లో పేదలకు తగిన న్యాయం జరగాలని, ఆయా సౌకర్యాల సాధన కోసం తమ పార్టీ ఉద్యమించనున్నట్లు ప్రకటించారు. ప్రాజెక్టుల పేరుతో 4.5 లక్షల ఎకరాల రైతుల భూమిని ప్రభుత్వం కాజేస్తోందని ఆరోపించారు. ప్రాజెక్టుల కింద నష్టపోయే భూములకు 2013 చట్టప్రకారం నిర్దేశించిన పరిహారం చెల్లించకుండా, పునరావాస చర్యలు చేపట్టకుండా దొంగదారిన జీవోలు తెచ్చిందని ధ్వజమెత్తారు. బుధవారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ అఖిలపక్షసమావేశాన్ని నిర్వహిస్తే ప్రాజెక్టుల నిర్వాసితుల పునరావాసానికి టీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోలు 123, 214 రైతులకు ఏ విధంగా నష్టదాయకమో రుజువు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని సవాల్ విసిరారు. ప్రాజెక్టుల రీడిజైన్ వల్ల ప్రభుత్వం ఏమి సాధించిందో అర్థం కావడం లేదన్నారు. పాలన సౌలభ్యం కోసం జిల్లాల ఏర్పాటును తమ పార్టీ స్వాగతిస్తున్నా.. ప్రక్రియ పారదర్శకంగా సాగడం లేదన్నారు. జిల్లాల ఏర్పాటుపై రాష్ర్ట ప్రభుత్వ ప్రతిపాదనలను, ఆలోచనలను వెల్లడించకుండా కలెక్టర్లు ప్రతిపాదనలతో రావాలని చెప్పడం తప్పుడు పద్ధతి అని విమర్శించారు. కరువు, ఇతర సమస్యలను పక్కదారి పట్టించేందుకే కొత్త జిల్లాల ప్రతిపాదన తెచ్చారనే అభిప్రాయం కూడా ఉందన్నారు. మహబూబ్‌నగర్ జిల్లాలో వలసలే లేవని ఆ జిల్లా కలెక్టర్ ఇచ్చిన నివేదిక పచ్చి అబద్ధమన్నారు. కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులను ఆదుకుంటామని హామీ ఇచ్చి, మున్సిపల్, ఆశ తదితరుల సమ్మెలను సీఎం కేసీఆర్ క్రూరంగా అణచివేశారన్నారు. ప్రభుత్వంలోకి వచ్చాక 4 నెలల్లోనే మైనారిటీలకు 12 శాతం రిజర్వేషన్లు అమలుచేస్తామని హామీనిచ్చి 24 నెలలు గడిచినా దానిపై ఏ చర్యా తీసుకోలేదన్నారు. -
ప్రతిపక్షం గొంతు నొక్కేస్తున్నారు
హైదరాబాద్: రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్), కేంద్రంలో భారతీయ జనతా పార్టీ(బీజేపీ)లు ప్రతిపక్షం గొంతు నొక్కుతున్నాయని టీపీసీసీ ఉపాధ్యక్షులు మల్లు రవి, ప్రధాన కార్యదర్శి మహేశ్ కుమార్ లు విమర్శించారు. బుధవారం గాంధీభవన్ లో విలేకరులతో మాట్లాడిన వారు తెలంగాణ డెమొక్రటిక్ ఫ్రంట్ బహిరంగ సభలో పాల్గొన్న మేధావులను అరెస్టు చేశారన్నారు. రెండేళ్ల పాలనలో మోదీ, కేసీఆర్ లు ఒరగబెట్టిందేమీ లేదనీ, కేవలం ప్రచారంతోనే కాలం గడిపారని విమర్శించారు. -
చెన్నైలో మళ్లీ వర్షాలు
-
తిరుపతిలో చెరువులైన రోడ్లు
-
తిరుమలలో రికార్డు స్థాయిలో వర్షం
-
హైదరాబాద్‌లో పలుచోట్ల భారీ వర్షం
-
తడిసి ముద్దవుతున్న తెలంగాణ
-
తిరుమలలో తెరిపినివ్వని భారీ వర్షం
-
ఉత్తరాంధ్రాలో భారీ వర్షాలు
-
వర్ష బీభత్సం
-
హైదరాబాద్‌లో పలుచోట్ల భారీవర్షం
-
మరో రెండు రోజుల్లో భారీ వర్షాలు