
సాక్షి,హైదరాబాద్: భాగ్యనగరంలో పలు ప్రాంతాల్లో ఆదివారం(జూన్30) సాయంత్రం భారీ వర్షం కురిసింది. భారీ వర్షం కారణంగా రోడ్లపై వాహనాల రాకపోకలకు ఇబ్బందులెదురయ్యాయి.
సికింద్రాబాద్, బేగంపేట్, బోయిన్‌పల్లి, తిరుమలగిరి, బొల్లారం రామంతాపూర్, ఉప్పల్, దిల్‌సుఖ్‌నగర్, ఎల్బీనగర్, హయత్‌నగర్, కేపీహెచ్‌బీ, కూకట్‌పల్లి, హైదర్‌నగర్, నిజాంపేట్, బోరబండ, యూసుఫ్‌గూడ, జూబ్లీహిల్స్, మైత్రీవనం, అమీర్‌పేట, పంజాగుట్టల్లో భారీ వర్షం కురిసింది. వరద నీరు చేరడంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.
రోడ్లపై అక్కడక్కడా నీరు నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వరద సమస్య ఉన్న ప్రాంతాల్లో జీహెచ్‌ఎంసీ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment