ఆపరేషన్ బ్లాక్ మనీపై బీజేపీ ఎంపీ, ఫైర్ బ్రాండ్ సుబ్రహ్మణ్య స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. డీమానిటైజేషన్ పథకంపై ప్రభుత్వానికి సరియైన ప్రణాళిక లేదని మండిపడ్డారు. పెద్దనోట్ల రద్దు, కొత్తనోట్ల జారీ ప్రక్రియలో పేలవమైన ప్రణాళిక,అమలు కారణంగా గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. పేలవమైన ప్రణాళికతో తీసుకున్న ఆర్థికశాఖ చర్య దేశాన్ని అయోమయంలోకి నెట్టేసిందన్నారు.