హైదరాబాద్లో పలుచోట్ల భారీవర్షం | Heavy rain lashes Hyderabad | Sakshi
Sakshi News home page

Published Mon, Sep 16 2013 7:47 PM | Last Updated on Thu, Mar 21 2024 6:14 PM

వరుసగా మూడోరోజూ కురిసిన వర్షంతో నగరం జలమయమైంది. సోమవారం మధ్యాహ్నం, సాయంత్రం వేళల్లో కుండ పోత వాన పడింది. ఈ వర్షానికే రహదారులు వరద నీటితో పోటెత్తాయి. నాలాలు, డ్రైనేజీ పైప్‌లైన్లు ఉప్పొంగడంతో లోతట్టు ప్రాంతాల్లోని బస్తీలను మురుగు నీరు ముంచెత్తింది. రాజేంద్ర నగర్, అత్తాపూర్, పాతబస్తీ , ఉప్పగూడ, ఛత్రినాక తదితర ప్రాంతాలు భారీ వర్షం తాకిడికి రో్డ్డన్నీజలమయమైయ్యాయి. భారీ వర్షానికి మూసీనది ఉధృతంగా ప్రవహిస్తోంది. రాజేంద్ర నగర్ లో మోకాళ్ల లోతు చేరింది. నీరు రోడ్డుపై నిలిచిపోవడంతో ప్రయాణికులకు ఇబ్బందులకు లోనైయ్యారు. చాదర ఘాట్ వంతెన పై నుంచి వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో అధికారులు పాత వంతెనను మూసివేసి ట్రాఫిక్ ను గోల్నాక వైపునకు మళ్లించారు. ఈ భారీ వర్షానికి జనం తీవ్ర ఇబ్బందులకు గురైయ్యారు. లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లలోకి వరదనీరు చేరడంతో ప్రజలకు ఇక్కట్లు తప్పడం లేదు. ముంపుకు గురైన ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు జీహెచ్ఎంసీ అదికారులు సహాయక చర్యలు చేపట్లారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement