కేంద్రలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా జరుపున్న ఉత్సవాలపై కాంగ్రెస్ నేత కపిల్ సిబాల్ విరుచుకుపడ్డారు.
న్యూఢిల్లీ: కేంద్రలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా జరుపున్న ఉత్సవాలపై కాంగ్రెస్ నేత కపిల్ సిబాల్ విరుచుకుపడ్డారు. ఓ వైపు దేశంలో వ్యవసాయ రంగం కుంటుపడుతోంటే ప్రభుత్వం కళ్లు మూసుకుందని విమర్శించారు. తాజాగా రాష్ట్రాల్లో దెబ్బతిన్న కాంగ్రెస్ పార్టీలో సర్జరీ చేసుకోవాలన్న విమర్శకుల మాటలపై స్పందించిన ఆయన సర్జరీ చేయించుకోవాలని కానీ అది దేశ రాజకీయాల మీదని అన్నారు. ఉత్తరప్రదేశ్ నుంచి కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థిగా కపిల్ సిబాల్ పేరును ప్రకటించారు.