ఆర్మీ విజయాన్ని బీజేపీ రాజకీయం చేస్తోంది
న్యూఢిల్లీ: భారత ఆర్మీ విజయాన్ని బీజేపీ రాజకీయం చేస్తోందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కపిల్ సిబల్ విమర్శించారు. సర్జికల్ దాడులను బీజేపీ తమ ఖాతాలో వేసుకుని లబ్ధి పొందాలని చూస్తోందని ఆరోపించారు.
1965, 1971ల్లో భారత్ సాధించిన విజయాలను బీజేపీ మరచిపోతోందని సిబల్ అన్నారు. ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీలు దేశం కోసం ప్రాణత్యాగం చేశారని పేర్కొన్నారు. మసూద్ అజహర్ వంటి ఉగ్రవాదులను విడిచిపెట్టిన ఘనత బీజేపీదేనని విమర్శించారు. భదత్ర దళాలకు బీజేపీ క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.