సరిహద్దులో గన్‌తో కనిపిస్తే కాల్చేయడమే: పరీకర్ | Parikar gives full powers to soldiers | Sakshi
Sakshi News home page

సరిహద్దులో గన్‌తో కనిపిస్తే కాల్చేయడమే: పరీకర్

Published Tue, Nov 22 2016 2:51 AM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM

సరిహద్దులో గన్‌తో కనిపిస్తే కాల్చేయడమే: పరీకర్ - Sakshi

సరిహద్దులో గన్‌తో కనిపిస్తే కాల్చేయడమే: పరీకర్

పనాజీ: ఎవరైనా మెషీన్ గన్ లేక పిస్టల్‌తో కనిపిస్తే కాల్చిపడేయాలని కశ్మీర్‌లోని జవాన్లకు పూర్తి అధికారాలు ఇచ్చినట్లు రక్షణ మంత్రి మనోహర్ పరీకర్ వెల్లడించారు. ఉగ్రవాదుల చేతుల్లో అమరులయ్యే వరకు వేచి చూడక వారిని అంతం చేయాలని సైన్యానికి సూచించినట్లు పేర్కొన్నారు. వాస్కోలో ఆదివారం రాత్రి బీజేపీ ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న పరీకర్ మాట్లాడుతూ.. పాకిస్తాన్ పాల్పడుతున్న కాల్పుల ఉల్లంఘనలకు ధీటైన సమాధానమివ్వాలంటూ మన సైన్యానికి సూచించినట్లు తెలిపారు.

శత్రువును అంతం చేసేందుకు ఇప్పుడు రక్షణ శాఖ నుంచి ఎలాంటి అనుమతి అక్కర్లేదని స్పష్టం చేశారు. అలాగే ముంబైలో విధ్వంసక నౌక ‘ఐఎన్‌ఎస్ చెన్నై’ను జాతికి అంకితమిస్తూ.. ఇటీవల భారత సైన్యం నిర్వహించిన సర్జికల్ దాడులు దూకుడుతో చేసినవి కావని, అలాగని వెనక్కుతగ్గబోమని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement