రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్), కేంద్రంలో భారతీయ జనతా పార్టీ(బీజేపీ)లు ప్రతిపక్షం గొంతు నొక్కుతున్నాయని టీపీసీసీ ఉపాధ్యక్షులు మల్లు రవి, ప్రధాన కార్యదర్శి మహేశ్ కుమార్ లు విమర్శించారు.
హైదరాబాద్: రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్), కేంద్రంలో భారతీయ జనతా పార్టీ(బీజేపీ)లు ప్రతిపక్షం గొంతు నొక్కుతున్నాయని టీపీసీసీ ఉపాధ్యక్షులు మల్లు రవి, ప్రధాన కార్యదర్శి మహేశ్ కుమార్ లు విమర్శించారు. బుధవారం గాంధీభవన్ లో విలేకరులతో మాట్లాడిన వారు తెలంగాణ డెమొక్రటిక్ ఫ్రంట్ బహిరంగ సభలో పాల్గొన్న మేధావులను అరెస్టు చేశారన్నారు.
రెండేళ్ల పాలనలో మోదీ, కేసీఆర్ లు ఒరగబెట్టిందేమీ లేదనీ, కేవలం ప్రచారంతోనే కాలం గడిపారని విమర్శించారు.