కాంగ్రెస్‌కి 220 సీట్లు వస్తాయి: మల్లు రవి | There is a possibility that Congress will get 220 seats at national level | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌కి 220 సీట్లు వస్తాయి: మల్లు రవి

Published Sun, May 19 2019 3:44 AM | Last Updated on Sun, May 19 2019 3:44 AM

There is a possibility that Congress will get 220 seats at national level - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కేంద్రంలో పగ్గాలు చేపట్టేందుకు బీజేపీ తప్ప ఏ పార్టీ మద్దతిచ్చినా తీసుకుంటామని, అందులో టీఆర్‌ఎస్‌తో సహా అన్ని పార్టీలు ఉంటాయ ని టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లురవి చెప్పారు. జాతీయ స్థాయిలో కాంగ్రెస్‌ పార్టీకి 220 సీట్ల వరకు వచ్చే అవకాశం ఉందన్నారు. శనివారం గాంధీభవన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ వ్యవహారశైలి గోడ మీద పిల్లిలా ఉందని వ్యాఖ్యానించారు.

భావసారూప్య పార్టీలతో కలిసి కేంద్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తుందని, రాహుల్‌ గాంధీ ప్రధాని అవుతారని ధీమా వ్యక్తం చేశారు. తుది విడత ఎన్నికల ప్రచారం ముగుస్తున్న సం దర్భంగా నిర్వహించిన విలేకరుల సమావేశాల్లో మోదీ మాట తీరుకు, రాహు ల్‌ మాట తీరుకు భూమికి, ఆకాశానికి ఉన్నంత తేడా ఉందన్నారు. మోదీని విలేకరులు ప్రశ్నలు అడిగితే అమిత్‌ షా సమాధానం చెప్పారని ఎద్దేవా చేశా రు. తెలంగాణలోనూ కాంగ్రెస్‌ పార్టీ మెజార్టీ స్థానాలు కైవసం చేసుకుంటుందని, తాను నాగర్‌కర్నూల్‌ నుంచి లక్ష ఓట్ల మెజార్టీతో గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు.    

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement