
నా వయసు 39 ఏళ్లు. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాను. ఎప్పుడూ కంప్యూటర్‌పై వర్క్ చేస్తుంటాను. ఈమధ్య కళ్లు విపరీతంగా పొడిగా అనిపిస్తున్నాయి. అప్పుడు నీళ్లతో కళ్లు కడుక్కుంటున్నాను. నా సమస్యకు పరిష్కారం చెప్పండి. – సంపత్‌కుమార్, హైదరాబాద్
కంప్యూటర్‌పై ఎప్పుడూ కనురెప్పలను ఆర్పకుండా ఏకాగ్రతతో చూసేవారికి కన్నుపొడిబారే సమస్య రావచ్చు. దీనికి వయసు పైబడటం, ఎప్పుడూ ఎయిర్ కండిషన్డ్ గదుల్లో ఉండటం, కంటికి గాయం కావడం, కంటికి వచ్చే మెబోమియన్ ఇన్ఫెక్షన్ వంటివి కారణాలు కావచ్చు. వైద్యపరిభాషలో మీ సమస్యను ‘కెరటో కంజంక్టివైటిస్ సిక్కా’ అంటారు. ఇందులో కంటిలోని కార్నియా, కంజంక్టివా పొరలు పొడిబారిపోతాయి. దీన్నే ‘కంప్యూటర్ విజన్ సిండ్రోమ్’ అని కూడా అంటారు. ఈ సమస్య నివారణ కోసం చేయాల్సినవి...
►కంటి రెప్పలను తరచూ ఆర్పుతూ ఉండాలి. ఎప్పుడూ తదేకంగా చూస్తూ ఉండకూడదు ∙కంప్యూటర్‌పై పనిచేస్తున్న గదిలో తగినంత తేమ (హ్యుమిడిటీ) ఉండేలా జాగ్రత్త తీసుకోవాలి. ఇందుకోసం రూమ్‌లో హ్యుమిడిఫైయర్ ఉంచుకోవాలి ∙మీ పనిలో మధ్యమధ్య కంటికి కాస్త విశ్రాంతినివ్వండి మీరు కంప్యూటర్ మీద చదువుతున్నప్పుడు స్క్రీన్ మీకు నేరుగా ఉండాలి. స్క్రీన్‌ను వాలుగా ఉంచి చదవవద్దు. మీరు స్క్రీన్‌పై చూడాల్సి ఉన్నప్పుడు స్క్రీన్‌కూ, దాని బ్యాక్‌డ్రాప్‌కూ ఎక్కువ కాంట్రాస్ట్ లేకుండా చూసుకోండి మీరు టీవీ చూసేటప్పుడు గదిలో వెలుతురు ఉండేలా చూసుకోండి. ఎప్పుడూ చీకట్లో టీవీ చూడవద్దు. టీవీ చూసే సమయంలో స్క్రీన్‌నే తదేకంగా చూడవద్దు. మధ్యమధ్యన దృష్టిని మరలుస్తూ ఉండాలి తరచూ ఆరుబయటకు వెళ్తూ ఉండండి. ఎప్పుడూ ఏసీలో ఉండేవారు తరచూ స్వాభావికమైన సూర్యకాంతికి ఎక్స్‌పోజ్ అయ్యేలా జాగ్రత్త తీసుకోవాలి. ఏసీ ఇంటెన్సిటీని మరీ ఎక్కువగా పెంచుకోవద్దు. ఇది కళ్లు మరీ పొడిబారడానికి దారితీస్తుంది. డాక్టర్‌ను సంప్రదించి ఆర్టిఫిషియల్ టియర్స్ వాడాలి. యాంటీ గ్లేర్ గ్లాసెస్ కొంతవరకు మీకు ఉపయోగపడతాయి ఆరుబయట తిరిగేప్పుడు కళ్లజోడును కాసేపు తీయండి ∙ఒత్తిడిని తగ్గించుకోండి. యోగా వంటి రిలాక్సేషన్ టెక్నిక్స్‌ను అవలంబించండి ∙కంటికి మురికి తగలకుండా జాగ్రత్తలు తీసుకోండి. చేతులు మురికి అయినప్పుడు వాటితోనే కళ్లు తుడుచుకోవద్దు ∙మీ కళ్లు శుభ్రం చేసుకోడానికి, ముఖం కడుక్కోడానికి శుభ్రమైన నీటిని ఉపయోగించండి. అందులో డిటర్జెంట్ లేకుండా చూసుకోండి ∙పొగతాగే అలవాటు తక్షణం మానివేయండి.
కార్నియా చుట్టూ తెల్ల అంచు ఏమిటిది?
నా వయస్సు 18 ఏళ్లు. రెండేళ్ల కిందట నాకు రెండు కళ్లలోనూ కార్నియా (నల్లగుడ్డు) చుట్టూ అంచున తెల్ల చారలా కనిపిస్తోంది. కళ్ల డాక్టర్‌గారికి చూపించాను. ‘డస్ట్ అలర్జీ’ అని ఐ డ్రాప్స్ రాసి ఇచ్చారు. అవి వేసుకున్న కొన్ని నెలలకు తగ్గినట్లే తగ్గి వుళ్లీ ఎప్పటిలాగే వస్తోంది. ఎన్నోచోట్ల చూపించాను. కానీ ఇది వూత్రం తగ్గడం లేదు. దయచేసి సలహా ఇవ్వండి.
– నవీన, గూడూరు
మీరు చెప్పిన లక్షణాలను బట్టి చూస్తే ఇది ‘వీకేసీ’ (వెర్నల్ కెరటో కంజంక్టివైటిస్) అనే అలర్జీతో వచ్చిన సవుస్య అని తెలుస్తోంది. బయటి కాలుష్యానికీ, పుప్పొడికీ, దువు్మూ ధూళి వంటి వాటికి ఎక్స్‌పోజ్ అయితే ‘హైపర్ సెన్సిటివిటీ ఉన్నవాళ్లకు ఇలాంటి సవుస్య వచ్చే అవకాశం ఉంది. అందుకే కాలుష్యాలకు దూరంగా ఉండాలి. ప్లెయిన్ ప్రొటెక్టివ్ గ్లాసెస్ వాడితే చాలావుటుకు కళ్లకు రక్షణ ఉంటుంది. ఈ సవుస్య ఉన్నవారు ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు కంటిని స్వచ్ఛమైన నీటితో కడుగుతూ ఉండాలి. డాక్టర్‌ను సంప్రదించి యాంటీ అలర్జిక్ చుక్కల వుందు ఎక్కువ కాలం వాడాల్సి ఉంటుంది. ఇందులో స్టెరాయిడల్, నాన్ స్టెరాయిడల్ (స్టెరాయిడ్ లేనివి) అనే రెండు మందులు ఉంటాయి. స్టెరాయిడ్ మాత్రం దీర్ఘకాలం వాడకూడదు. దీనితో చాలా దుష్పరిణామాలు ఉంటాయి. నాన్‌స్టెరాయిడ్ (స్టెరాయిడ్ లేనివి) మాత్రం చాలా కాలం వరకు వాడవచ్చు. దీనితో తప్పకుండా అలర్జీ నియంత్రణలోకి వస్తుంది. ఈ సవుస్యను దీర్ఘకాలం ఇలాగే వదిలేస్తే చూపు వుందగించడం, కార్నియా పొర దెబ్బతినడం వంటి సవుస్యలు వస్తాయి. కాబట్టి వీలైనంత త్వరగా డాక్టర్‌కు చూపించుకొని, వుందులు వాడండి. ఇప్పుడు ఈ సమస్యకు వుంచి వుందులు అందుబాటులో ఉన్నాయి. కాబట్టి ఈ సవుస్య గురించి మీరు ఆందోళనపడాల్సిన అవసరం లేదు.
కళ్లకూ వ్యాయామాలు ఉన్నాయా?
దేహంలో అన్ని అవయవాలకు బలం చేకూర్చడానికి ప్రత్యేకమైన వ్యాయామాలు ఉన్నట్లే కళ్లకూ ఉంటాయా? – సుధీర్, గుంటూరు
ఆరోగ్యంగా ఉండటం కోసం సాధారణంగా అందరూ చేసే వ్యాయామాలే కంటికి కూడా మేలు చేస్తాయి. అయితే మీకు ఏవైనా కంటి సమస్యలు అంటే ఉదాహరణకు మెల్లకన్ను గానీ, లేదా లేజీఐ అంటే ఒక కంటిలో చూపు మందగించడం వంటి సమస్య ఉంటే ఆ పరిస్థితిని చక్కదిద్దడానికి కొన్ని ప్రత్యేకమైన వ్యాయామాలు ఉంటాయి. అవి ఈ సమస్యలు ఉన్నవారి చూపు మెరుగుదలకు చాలా తోడ్పడతాయి. అయితే అందరూ చేసుకోడానికి మాత్రం కంటి ఉపశమనం కోసం తాత్కాలికంగా మాత్రమే ఉపయోగపడే కొన్ని వ్యాయామాలూ ఉంటాయి. అవి... కంటిపై ఉన్న భారాన్ని తాత్కాలికంగా తొలగించి, కొద్దిపాటి ఉపశమనాన్ని మాత్రమే ఇస్తాయి. వీటి ద్వారా అప్పటికప్పుడు కనిపించే ప్రయోజనమే తప్ప దీర్ఘకాలిక లాభం ఉండదు. అవి...
∙తదేకంగా చూడకుండా కంటిని తరచూ అటు ఇటు కదలిస్తూ ఉండటం ∙రెండుకళ్లనూ అరచేతులతో మూసుకొని కళ్లకు తాత్కాలిక విశ్రాంతి ఇచ్చి, కొంతసేపు ఉపశమనం కలిగించడం (దీన్ని పామింగ్ అంటారు) ∙బ్లింకింగ్ (రెండు రెప్పలనూ ఠక్కున కొడుతూ ఉండటం, ఈ ప్రక్రియలో కారు అద్దాలపై నీరు చిమ్మి వైపర్స్‌తో శుభ్రం చేసినట్లుగానే, కంటిలోని నీటి (లాక్రిమల్ సెక్రిషన్స్) సహాయం వల్ల బ్లింకింగ్ చేసినప్పుడల్లా కన్ను శుభ్రమవుతుంది ∙యానింగ్ (ఆవలించడం – మనం ఆవలించినప్పుడు ఒక్కోసారి కంటిలో కొద్దిగా నీళ్లు రావడం అందరికీ అనుభవంలోకి వచ్చే విషయమే. ఈ కన్నీరు (లాక్రిమల్ సెక్రిషన్) కంటిలోని పొడిదనాన్ని తొలగించి, కన్నును తేమగా ఉండేలా చేస్తుంది. కళ్లు అలసిపోయి భారంగా ఉన్నప్పుడు ఈ వ్యాయామాలు చేసి, తాత్కాలిక ఉపశమనాన్ని పొందవచ్చు.
డాక్టర్ రవికుమార్ రెడ్డి
కంటి వైద్య నిపుణులు, మెడివిజన్ ఐ హాస్పిటల్, హైదరాబాద్
Comments
Please login to add a commentAdd a comment