నిద్ర పట్టడం లేదా..? ఇవి చేస్తే ఈజీగా.. | Sakshi Health Tips For Sleeping | Sakshi
Sakshi News home page

నిద్ర రావడం కోసం అద్భుత చిట్కాలు

Published Wed, May 19 2021 9:39 AM | Last Updated on Wed, May 19 2021 1:50 PM

Sakshi Health Tips For Sleeping

రాత్రిళ్లు నిద్ర పట్టడం లేదా.. బెడ్‌పై అటు ఇటు దొర్లుతున్నా కళ్లు మూసుకోవడం లేదా..? అయితే ఈ టిప్స్‌ పాటించండి.. ఎంచక్కా నిద్రపోండి.

  • పడుకునే ముందు నాటు ఆవునెయ్యి గోరువెచ్చగా చేసుకొని ముక్కు రంధ్రాల్లో రెండు చుక్కలు వేసుకోవాలి.
  • గసగసాలను దోరగా వేయించి పల్చని బట్టలో వేసుకుని నిద్రించే ముందు వాసన పీలుస్తూ ఉండాలి.
     
  • చేతివేళ్లతో లేదా దువ్వెనతో తలవెంట్రుకలను మృదువుగా దువ్వుకుంటూ ఉండాలి.  
  • చేతులతో అరికాళ్లను మెల్లమెల్లగా మర్దన చేసుకోవాలి. 
     
  • రాత్రి పడుకునేముందు అరికాళ్లకు ఆముదం లేదా నువ్వుల నూనె, లేదా కొబ్బరి నూనెతో మర్దన చేయాలి.
  • రాత్రి పూట కాసిని గోరువెచ్చని పాలు తాగాలి.
     
  • నిద్ర పోవడానికి రెండు గంటల ముందు నుంచి మొబైల్‌ ఫోన్‌ చూడటం మానేయాలి. అంతేకాదు, రాత్రిళ్లు తల పక్కన మొబైల్‌ పెట్టుకుంటే రేడియేషన్‌ ప్రభావం వల్ల కూడా సరిగా నిద్ర రాదు. కాబట్టి మొబైల్‌ను దూరంగా పెట్టడం మంచిది.
     
  • రోజూ రాత్రి పడుకునే ముందు కొద్దిసేపు కళ్లు మూసుకుని ధ్యానం చేయాలి లేదా ఏవైనా సుందర దృశ్యాలను ఊహించుకోవాలి. 
     
  • ఓంకారం లేదా మృదువైన లలిత సంగీతాన్ని పెట్టుకొని ప్రశాంతంగా కళ్లు మూసుకుని శ్వాస మీద ధ్యాస పెడితే తొందరగా నిద్ర పడుతుంది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement