శరీరానికి నిద్ర చాలా అవసరం. సాధారణంగా మనిషికి కనీసం 7గంటల పాటు నిద్ర అవసరం. అయితే మనలో చాలామందికి మధ్యాహ్నం పూట నిద్రపోయే అలవాటు ఉంటుంది. మధ్యాహ్నం భోజనం చేశాక కాసేపయినా కునుకు తీయాలనుకుంటారు. అయితే ఇదంత మంచిది కాదంటున్నారు నిపుణులు. 20 నిమిషాల నుంచి అరగంట వరకు నిద్రపోతే పర్వాలేదు గానీ.. గంటల తరబడి నిద్రపోతే తీవ్ర అనారోగ్య సమస్యలకు దారితీస్తాయట.
కునుకు తీస్తున్నారా? ఇక అంతే సంగతి
► పగటిపూట తరచుగా నిద్రపోయే వారిలో అధిక బరువు పెరిగే అవకాశం ఉందని అధ్యయనాలు చెబుతున్నాయి
► మధ్యాహ్నం ఎక్కువసేపు నిద్రపోయే వారిలో కార్డియోవాస్కులర్ వ్యాధి 34 శాతం పెరిగినట్లు నిపుణులు గుర్తించారు.
► గంటల తరబడి నిద్రపోవడం వల్ల రాత్రి నిద్రకు భంగం కలుగుతుందని, దీనివల్ల ఉదయం పూట అలసటగా ఉంటుందట.
► తరచూ మధ్యాహ్నం నిద్రపోవడం వల్ల నిద్రలేమి సమస్య తలెత్తుందని, ఇది తీవ్ర పరిణామాలకు దారితీస్తుందని అధ్యయనంలో వెల్లడైంది.
► మరీ ముఖ్యంగా 20 ఏళ్లు పైబడిన వారు మధ్యాహ్నం అస్సలు నిద్రపోకూడదట. ఇది అనారోగ్య సమస్యలకు దారితీస్తుందట.
► మధ్యాహ్నం 90 నిమిషాల కంటే ఎక్కువసేపు నిద్రపోయే వారికి పక్షవాతం వచ్చే ప్రమాదం 25 శాతం ఉంటుందని మెడికల్ జర్నల్ ఆఫ్ అమెరికన్ అకాడమీ ఆఫ్ న్యూరాలజీ నిపుణులు తెలిపారు.
► మధ్యాహ్న నిద్ర వల్ల రాత్రి సమయాల్లో సరిగా నిద్రపోరు. దీనివల్ల రక్తపోటు, గుండె జబ్బులు, ఊబకాయం, డిప్రెషన్ వంటి సమస్యలకు దారితీస్తాయి.
ఏ సమయంలో నిద్రపోతే మంచిది
మధ్యాహ్నం నిద్రపోయేవారిలో చాలామందికి ఏ సమయంలో ఎప్పటినుంచి నిద్రపోతే మంచిది అన్న సందేహం ఉంటుంది. అయితే మధ్యాహ్నం ఒంటి గంట నుంచి 3గంటల మధ్యలోనే చిన్న కునుకు తీస్తే మంచిదట. అది కూడా 10నుంచి గరిష్టంగా 30నిమిషాల వరకు మధ్యాహ్నం నిద్రపోతే ఆరోగ్యానికి కూడా మంచిదే.
Comments
Please login to add a commentAdd a comment