Napping
-
భోజనం చేసి మధ్యాహ్నం పూట నిద్రపోతున్నారా? పక్షవాతం వస్తుందట!
శరీరానికి నిద్ర చాలా అవసరం. సాధారణంగా మనిషికి కనీసం 7గంటల పాటు నిద్ర అవసరం. అయితే మనలో చాలామందికి మధ్యాహ్నం పూట నిద్రపోయే అలవాటు ఉంటుంది. మధ్యాహ్నం భోజనం చేశాక కాసేపయినా కునుకు తీయాలనుకుంటారు. అయితే ఇదంత మంచిది కాదంటున్నారు నిపుణులు. 20 నిమిషాల నుంచి అరగంట వరకు నిద్రపోతే పర్వాలేదు గానీ.. గంటల తరబడి నిద్రపోతే తీవ్ర అనారోగ్య సమస్యలకు దారితీస్తాయట. కునుకు తీస్తున్నారా? ఇక అంతే సంగతి ► పగటిపూట తరచుగా నిద్రపోయే వారిలో అధిక బరువు పెరిగే అవకాశం ఉందని అధ్యయనాలు చెబుతున్నాయి ► మధ్యాహ్నం ఎక్కువసేపు నిద్రపోయే వారిలో కార్డియోవాస్కులర్ వ్యాధి 34 శాతం పెరిగినట్లు నిపుణులు గుర్తించారు. ► గంటల తరబడి నిద్రపోవడం వల్ల రాత్రి నిద్రకు భంగం కలుగుతుందని, దీనివల్ల ఉదయం పూట అలసటగా ఉంటుందట. ► తరచూ మధ్యాహ్నం నిద్రపోవడం వల్ల నిద్రలేమి సమస్య తలెత్తుందని, ఇది తీవ్ర పరిణామాలకు దారితీస్తుందని అధ్యయనంలో వెల్లడైంది. ► మరీ ముఖ్యంగా 20 ఏళ్లు పైబడిన వారు మధ్యాహ్నం అస్సలు నిద్రపోకూడదట. ఇది అనారోగ్య సమస్యలకు దారితీస్తుందట. ► మధ్యాహ్నం 90 నిమిషాల కంటే ఎక్కువసేపు నిద్రపోయే వారికి పక్షవాతం వచ్చే ప్రమాదం 25 శాతం ఉంటుందని మెడికల్ జర్నల్ ఆఫ్ అమెరికన్ అకాడమీ ఆఫ్ న్యూరాలజీ నిపుణులు తెలిపారు. ► మధ్యాహ్న నిద్ర వల్ల రాత్రి సమయాల్లో సరిగా నిద్రపోరు. దీనివల్ల రక్తపోటు, గుండె జబ్బులు, ఊబకాయం, డిప్రెషన్ వంటి సమస్యలకు దారితీస్తాయి. ఏ సమయంలో నిద్రపోతే మంచిది మధ్యాహ్నం నిద్రపోయేవారిలో చాలామందికి ఏ సమయంలో ఎప్పటినుంచి నిద్రపోతే మంచిది అన్న సందేహం ఉంటుంది. అయితే మధ్యాహ్నం ఒంటి గంట నుంచి 3గంటల మధ్యలోనే చిన్న కునుకు తీస్తే మంచిదట. అది కూడా 10నుంచి గరిష్టంగా 30నిమిషాల వరకు మధ్యాహ్నం నిద్రపోతే ఆరోగ్యానికి కూడా మంచిదే. -
'చాన్స్ కూడా ఇవ్వలేదు'.. సిరాజ్ దెబ్బకు లేచి కూర్చొన్నాడు
టీమిండియా, ఆస్ట్రేలియా మధ్య డబ్ల్యూటీసీ ఫైనల్లో ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 296 పరుగులకు ఆలౌట్ కావడంతో ఆసీస్‌కు 173 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. అనంతరం ఆసీస్ రెండో ఇన్నింగ్స్ ఆరంభించింది. అయితే పాపం పొద్దున నుంచి ఫీల్డింగ్ చేసి అలిసిపోయాడేమో తెలియదు కానీ డ్రెస్సింగ్ రూమ్‌లో లబుషేన్ రిలాక్స్ అయ్యాడు. కుర్చూన్న కుర్చీలోనే రిలాక్స్ అయ్యాడు. కళ్లు మూసుకుపోతుండడంతో చిన్న కునుకు తీయాలనకున్నాడు. కానీ సిరాజ్ లబుషేన్న్కు ఆ చాన్స్ కూడా ఇవ్వలేదు. లబుషేన్ అలా కునుకు తీస్తున్నాడో లేదో.. ఇక్కడ సిరాజ్ వార్నర్‌ను ఔట్ చేసేశాడు. ఇన్నింగ్స్ మూడో ఓవర్ సిరాజ్ వేశాడు. ఆ ఓవర్ మూడో బంతిని వార్నర్ ఫ్లిక్ చేసే క్రమంలో బ్యాట్ ఎడ్జ్ తాకి కీపర్ భరత్ చేతుల్లో పడింది. నిద్ర కళ్లతోనే చూసిన లబుషేన్ వార్నర్ ఔట్ అయ్యాడని తెలియగానే ఒక్కసారి ఉలిక్కిపడి లేచాడు. పాపం మంచిగా రెస్ట్ తీసుకుందామనుకున్నాడు..కానీ సిరాజ్ ఆ అవకాశం కూడా ఇవ్వలేదుగా అంటూ అభిమానులు కామెంట్ చేశారు. దీనికి సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సిరాజ్ దెబ్బకు నిద్రమత్తు పూర్తిగా పాయే.. ఇక వార్నర్ ఔటైన అనంతరం క్రీజులోకి వచ్చిన లబుషేన్ నిద్రమత్తును సిరాజ్ తన బౌలింగ్‌తో పూర్తిగా తొలగించాడు. అదే ఓవర్లో ఐదో బంతిని సిరాజ్ బౌన్సర్ వేశాడు. లబుషేన్ ఫ్రంట్‌ఫుట్ వచ్చి షాట్ ఆడే యత్నంలో విఫలమయ్యాడు. అంతే బంతి వేగంగా వచ్చి వేలుకు బలంగా తాకింది. దీంతో దెబ్బకు బ్యాట్ వదిలేసి నొప్పితో అల్లాడిపోయాడు. ఈ దెబ్బతో కొన్ని సెకన్ల ముందు ఉన్న నిద్రమత్తు పూర్తిగా తొలిగిపోయి ఉండొచ్చు అని అభిమానులు పేర్కొన్నారు. Marnus labuschagne was sleeping. Siraj took a wicket and man had to wake up immediately 😭#WTCFinal2023 #WTC23 pic.twitter.com/s239Ijt3Fz — Cricket With Abdullah 🏏 (@Abdullah__Neaz) June 9, 2023 Mohammed Siraj gatecrashes Marnus Labuschagne's sleep 🤣😂 📸: Disney + Hotstar pic.twitter.com/f2InAuplFW — 𝚂𝚘𝚕𝚘_𝚙𝚞𝚛𝚞𝚜𝚑𝚘𝚝𝚑𝚊𝚖_7 (@lpurushothamre1) June 9, 2023 View this post on Instagram A post shared by ICC (@icc) చదవండి: 512 రోజులు.. కొత్తగా కనిపిస్తున్న రహానే -
ఆఫీసులో నిద్రకు న్యాప్బాక్సెస్..
ఆఫీసులో నిద్ర వస్తోందా? అయితే భోజనం చేసిన తరువాత హాయిగా నిద్రపోవచ్చు. కాకపోతే ఇక్కడ కాదు.. జపాన్‌లో. నిద్ర పునరుత్తేజాన్నిస్తుందన్న విషయం అందరికీ తెలిసిందే. రోజంతా అధిక పనితో అలసిపోయినా... రాత్రి మంచి నిద్రతో మరునాడు ఉత్సాహంగా పనిచేస్తాం. మరి పగటిపూట అధిక పనిగంటల వల్ల అలసిపోతే..? అది ఉత్పాదకతను దెబ్బతీస్తుంది. సీఎన్‌బీసీ తాజా నివేదిక ప్రకారం.. ప్రపంచంలో అత్యధిక గంటలు పనిచేసేది జపనీయులేనట. అందుకే పది గంటలకు పైగా పనిచేయించుకునే రెండు జపాన్ కంపెనీలు పరిష్కారమార్గాన్ని కనిపెట్టాయి. నిద్రలేమితో బాధపడుతున్న తమ ఉద్యోగుల కోసం టోక్యోకి చెందిన ఫర్నిచర్ కంపెనీ ఇటోకీ, ప్లైవుడ్ కంపెనీ కొయొజు గోహన్ సంస్థలు సంయుక్తంగా న్యాప్బాక్స్ కాన్సెప్ట్‌ను తీసుకొచ్చాయి. మధ్యాహ్నం భోజనం తరువాత కొద్దిసేపు ఆ న్యాప్ బాక్సుల్లో కునుకుతీయొచ్చు. కొద్దిపాటి పవర్‌న్యాప్ తరువాత మళ్లీ కొత్త శక్తితో పనిచేయొచ్చన్నమాట. ఆహా... బెడ్ మీద హాయిగా అడ్డం ఒరిగేయొచ్చని ఆనందించకండి. అవి నిట్టనిలువునా ఉండే బాక్సెస్. వీటిని ‘కమిన్ బాక్సెస్’అంటున్నారు. ఫ్లెమింగోలాగా నిలబడే నిద్రపోవాలన్నమాట. అయితే తల, మోకాళ్లకు ఇబ్బంది లేకుండా, మనిషి పడిపోకుండా సౌకర్యవంతమైన సపోర్ట్ సిస్టమ్ ఉంటుందని చెబుతున్నారు. పనినుంచి తప్పించుకోవడానికి ఉద్యోగులు బాత్రూమ్లో ఎక్కువ సేపు గడిపేకంటే.. ఈ కమిన్ బాక్సెస్‌లో కునుకు బెటర్ అని ఇటోకి కమ్యూనికేషన్స్ డైరెక్టర్ సీకో కవాషిమా చెబుతున్నారు. అయితే... బ్లూమ్‌బర్గ్ దీన్ని ట్విట్టర్ వేదికగా పంచుకోగా... నెటిజన్లు పలు విధాలుగా స్పందిస్తున్నారు. ఆరోగ్యకరమైన పని పరిస్థితులని ఒకరు మెచ్చుకుంటే... శవపేటికలను తలపిస్తున్న వాటిలో పడుకోవడం ఊహించడానికే కష్టంగా ఉందని మరొకరు కామెంట్ చేశారు. వీటికంటే పాశ్చాత్య దేశాల్లోని స్లీపింగ్ రూమ్స్‌లా సౌకర్యవంతంగా ఏర్పాటు చేస్తే మంచిదని ఇంకొకరు సలహా ఇచ్చారు. -
లంచ్ తర్వాత ఓ కునుకు తీయొచ్చు..
చాలా మందికి మధ్యాహ్నం భోజనం తర్వాత నిద్ర ముంచుకు వచ్చినా చాలామంది పడుకోరు. ఎందుకంటే ఆ సమయంలో పడుకుని లేస్తే బద్దకంగా ఉంటుందని. మధ్యాహ్నం కునుకేస్తే ళ్లీ రాత్రి నిద్ర పట్టదనే భ్రమలో ఉంటారు. అయితే భోజనం తర్వాత చిన్న న్యాప్ తీసుకోవడం తప్పుకాదని, నిర్మోహమాటంగా కునుకు తీయవచ్చని సెలబ్రిటీ న్యూట్రిషియన్ రుజుత దివేకర్ తెలిపారు. ఈ విషయాన్ని ఆమె తన సోషల్ మీడియా పోస్టు ద్వారా పేర్కొన్నారు. ఇప్పటికే కరీనా కపూర్, అలియా భట్ వంటి తారలకు ఆమె ఫిట్నెస్ ట్రైనర్. పోషకాహారం, వ్యాయామం వంటి విషయాల్లో అనేక సూచనలు ఇస్తుంటారు. ఈసారి మద్యాహ్నం భోజనం తర్వాత ఒక చిన్న కునుకు తీయడం గురించి తెలిపారు. ఆమె పోస్టులో.. ఎవరైతే సరిగా ఆహారం, నిద్ర లేకుండా ఉంటారో వారు యోగా పురోగతి సాధించలేరని భగవద్గీత చెబుతుందని అన్నారు. ప్రతి మతం, సంస్కృతి కూడా మధ్యాహ్న భోజనం తర్వాత ఓ చిన్నపాటి కునుకు అవసరమని చెబుతోందన్నారు. అలాగే ఇస్లామిక్ సంస్కృతి కూడా కేవలం దయ్యాలు మాత్రమే మధ్యాహ్నం విశ్రాంతి తీసుకోవని అన్నారు. ప్రముఖ అథ్లెట్ రోనాల్డో కూడా మధ్యాహ్నం నిద్ర తీసుకుని ఎన్నో ఘనతలు సాధించారని ఉదాహరణగా పేర్కొన్నారు. దివేకర్ చెప్పిన దాని ప్రకారం మధ్యాహ్నం కునుకు తీసుకోవడం వల్ల ఉపయోగాలు ► ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ► రక్తపోటుతో బాధపడే వారికి ఉపకరిస్తుంది. ► శరీరంలోని హార్మోన్ల సమతుల్యతను మెరుగు పరుస్తుంది. ► డయాబెటిస్, ధైరాయిడ్, పీసీఓడితో బాధపడేవారికి దోహదపడుతుంది ► జీర్ణక్రీయను మెరుగు పరుస్తుంది ► కొవ్వును కరిగిస్తోంది ► నిద్రలేమి సమస్య ఉన్న వారికి ఆ సమస్యను దూరం చేస్తుంది. ► అనారోగ్యంతో ఉన్న వారు కోలుకోవడానికి ఉపయోగపడుతోంది. ♦ అయితే మెరుగైన ప్రయోజనాల కోసం దీనిని సరైన క్రమంలో చేయాలని సూచించారు. ఈ పద్దతిని వామకుక్షి అంటారని, ఇందులో దశలు ఉన్నట్లు తెలిపారు. ► ఎప్పుడు - భోజనం తర్వాత ► ఎలా - మీ ఎడమ వైపు తిరిగి పడుకోవాలి (వామకుక్షి) ► ఎంత సమయం- 10 - 30 నిమిషాలు( అనారోగ్యంతో ఉన్నవారు, చిన్న పిల్లలు, వృద్ధులు..90 నిమిషాలు) ► అనువైన సమయం - మధ్యాహ్నం 1 గంట నుంచి 3 మధ్య ►ఎక్కడ ఉన్నారనే దాని ఆధారంగా భోజనం తర్వాత విశ్రాంతి తీసుకోవడానికి వివిధ మార్గాలు ఇంట్లో ఉంటే, మంచం మీద పడుకోండి పనిలో ఉంటే మీ తలని డెస్క్ మీద ఉంచి విశ్రాంతి తీసుకోండి. ప్రత్యామ్నాయంగా తేలికైన కుర్చీపై ఒరగవచ్చు. ► చేయకూడనివి ► సాయంత్రం 4 గంటల నుంచి 7 మధ్య కునుకు తీసుకోవద్దు. ► విశ్రాంతికి ముందు టీ, కాఫీ, సిగరెట్లు, చాక్లెట్ వంటివి తీసుకోవడం. ► మొబైల్ చూడటం. ► 30 నిమిషాలకు మించి నిద్ర పోవడం ► టీవీ పెట్టి నిద్ర పోవడం చూశారుగా మధ్యాహ్నం కాసింత సమయం విశ్రాంతి తీసుకోవడం వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో. కాబట్టి ఇక నుంచి మీరు కూడా ఈ అలవాటును ప్రయత్నించండి. View this post on Instagram Week 5 guideline - Take a short afternoon nap post lunch. It is one of the most critical but overlooked aspects of wellbeing. People associate it with lethargy, obesity and fear that it may lead to no sleep in the night but nothing could be further away from the truth. Every religion, culture and even the wisdom of yoga endorses a short afternoon nap. If the Bhagvad Gita says that one who doesn’t eat or sleep in moderation cannot achieve yoga, then the Islamic culture says that only devils don’t nap. Ronaldo, amongst the greatest athletes of our times attributes his performances to the afternoon nap. So why must you nap? • Improved heart health, especially good for people with high BP or those who have already done procedures on their heart • Improved hormonal balance (Diabetes, PCOD, Thyroid, also classical overeaters) • Improved digestion (IBS, constipation, acne and dandruff) • Improved sleep at night (insomnia, frequent travellers, shaadi goers and jet lag) • Improved recovery (from workouts, illnesses) • Improved fat loss (because of all the factors above) But for all these benefits you have to do it the right way. And there is a name for the right way of doing it – its called Vamakukshi. Here are the steps - When - right after lunch How - lie down in the foetal position on your left side (Vamakukshi) Length - 10 - 30 mins nap (about 90 mins for the very young, the very old, the very sick) Ideal time – between 1-3 pm Different ways to rest post lunch based on where you are - - If at home, lie down on the bed - If at work, just put your head down on the desk and rest (tell your HR it increases productivity). - Alternatively, you can doze off on an easy chair and if you cannot do that either, just go to a window and look far away, stare in space and allow your mind to unwind. What to totally not do - • Nap between 4-7pm • Have stimulants like tea, coffee, cigarettes, chocolate post lunch • Get on the phone and surf and excite your senses • Sleep beyond 30 mins • Sleep with TV on So, from this week, let’s make afternoon naps great again. Fill the Week 4 form here - link in bio and video in story. #12week2020 #12weekbook - bit.ly/12weekbook A post shared by Rujuta Diwekar (@rujuta.diwekar) on Feb 4, 2020 at 2:59am PST -
‘వాళ్లు’ నిద్రపోతూ పని చేస్తారు!
జపాన్ వాళ్లకు పని రాక్షసులని పేరు. వాళ్లు పని కోసం నిద్రను కూడా త్యాగం చేస్తారంటారు. మరి నిజంగానే నిద్ర పోకపోతే ఆరోగ్యం ఏం కావాలి? జపాన్ వాళ్లు నిద్రే పోరనేది అబద్ధం. అయితే రాత్రవుతూనే మంచం మీద చేరి, సూర్యోదయమవుతూనే మెలకువలోకి రావడం అనే భావనను మాత్రమే వాళ్లు నిద్రగా భావించరు. బస్సులో నిలబడి ప్రయాణిస్తూ, రైలు కోసం ఎదురుచూస్తూ, లిఫ్టులో పదమూడో అంతస్తుకు ఎక్కుతూ కూడా వాళ్లు ఒక కునుకు తీస్తారు. పోతూ పోతూ ఏదైనా గోడ కనబడితే దానికి చేతిని ఆనించి కూడా ఒక కునుకు తీసి వెళ్తారు. దీన్నే జపాన్‌లో ‘ఇనెమురి’ అంటారు. నిద్రపోతూనే హాజరుగా ఉండటం అని దీనికి అర్థం చెప్పొచ్చు. క్లాసులో పాఠం వింటూ, మీటింగులో భాగస్వామి అవుతూ కూడా వాళ్లు ఇనెమురి చేస్తారు. మన దగ్గర కూడా అట్లా చాలామంది పడుకుంటారుగదా అనొచ్చు. అట్లా పడుకునేవాళ్లకు ఆపాదించే గౌరవం ఎంత? కానీ అదే జపనీయులు దాన్ని తక్కువగా చూడరు. సామాజికంగా దానికి ఆమోదం ఉంది. యుద్ధం తర్వాత, ఎక్కువ పని చేయడం గొప్ప గుణం అనే భావనలోంచి ఈ విధానం పుట్టింది. అందుకే, ఎవరైనా అలా నిద్ర పోతున్నారంటే, ‘పాపం, రాత్రంతా బాగా పనిచేసివుంటాడు’ అని సంశయలబ్ధిని వాళ్లు ఇస్తారు. ‘ఈ ఇనెమురి మనం అనుకునే నిద్రలాంటిది కాదు; అలాగని మధ్యాహ్నపు కునుకు కాదు; అది జపాన్‌కే ప్రత్యేకమైన నిద్రా విధానం. నిద్ర కాని నిద్ర’ అంటారు జపనీయుల నిద్ర అలవాట్ల మీద అధ్యయనం చేసిన డాక్టర్ బ్రిగిట్ స్టెగార్. ‘ఆయా సాంఘిక సందర్భంలో నిష్క్రియత్వంతో పాల్గొంటూనే, తమ వంతు వచ్చినప్పుడు ఠక్కున భాగస్వామి కావడం ఇందులో ఉన్న కిటుకు,’ అంటారు స్టెగార్. ఇంకొక అంశం ఏమిటంటే, చాలామంది సరిగ్గా నిద్ర పోవాలంటే తమకు ఏకాంతం కావాలంటారు. కానీ జపనీయులు ఇతరుల కంపెనీలో కూడా నిద్రను ఆనందిస్తారు. భూకంపం, సునామీ లాంటివి జపాన్‌లో సంభవించినప్పుడు కూడా ఇట్లా బహిరంగ సమూహాలుగా నిద్రపోగలగడం వారిని ఉపశమించేలా చేయగలిగింది.