చాలా మందికి మధ్యాహ్నం భోజనం తర్వాత నిద్ర ముంచుకు వచ్చినా చాలామంది పడుకోరు. ఎందుకంటే ఆ సమయంలో పడుకుని లేస్తే బద్దకంగా ఉంటుందని. మధ్యాహ్నం కునుకేస్తే ళ్లీ రాత్రి నిద్ర పట్టదనే భ్రమలో ఉంటారు. అయితే భోజనం తర్వాత చిన్న న్యాప్ తీసుకోవడం తప్పుకాదని, నిర్మోహమాటంగా కునుకు తీయవచ్చని సెలబ్రిటీ న్యూట్రిషియన్ రుజుత దివేకర్ తెలిపారు. ఈ విషయాన్ని ఆమె తన సోషల్ మీడియా పోస్టు ద్వారా పేర్కొన్నారు. ఇప్పటికే కరీనా కపూర్, అలియా భట్ వంటి తారలకు ఆమె ఫిట్‌నెస్ ట్రైనర్. పోషకాహారం, వ్యాయామం వంటి విషయాల్లో అనేక సూచనలు ఇస్తుంటారు. ఈసారి మద్యాహ్నం భోజనం తర్వాత ఒక చిన్న కునుకు తీయడం గురించి తెలిపారు.
ఆమె పోస్టులో.. ఎవరైతే సరిగా ఆహారం, నిద్ర లేకుండా ఉంటారో వారు యోగా పురోగతి సాధించలేరని భగవద్గీత చెబుతుందని అన్నారు. ప్రతి మతం, సంస్కృతి కూడా మధ్యాహ్న భోజనం తర్వాత ఓ చిన్నపాటి కునుకు అవసరమని చెబుతోందన్నారు. అలాగే ఇస్లామిక్ సంస్కృతి కూడా కేవలం దయ్యాలు మాత్రమే మధ్యాహ్నం విశ్రాంతి తీసుకోవని అన్నారు. ప్రముఖ అథ్లెట్ రోనాల్డో కూడా మధ్యాహ్నం నిద్ర తీసుకుని ఎన్నో ఘనతలు సాధించారని ఉదాహరణగా పేర్కొన్నారు.
దివేకర్ చెప్పిన దాని ప్రకారం మధ్యాహ్నం కునుకు తీసుకోవడం వల్ల ఉపయోగాలు
► ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
► రక్తపోటుతో బాధపడే వారికి ఉపకరిస్తుంది.
► శరీరంలోని హార్మోన్ల సమతుల్యతను మెరుగు పరుస్తుంది.
► డయాబెటిస్, ధైరాయిడ్, పీసీఓడితో బాధపడేవారికి దోహదపడుతుంది
► జీర్ణక్రీయను మెరుగు పరుస్తుంది
► కొవ్వును కరిగిస్తోంది
► నిద్రలేమి సమస్య ఉన్న వారికి ఆ సమస్యను దూరం చేస్తుంది.
► అనారోగ్యంతో ఉన్న వారు కోలుకోవడానికి ఉపయోగపడుతోంది.
♦ అయితే మెరుగైన ప్రయోజనాల కోసం దీనిని సరైన క్రమంలో చేయాలని సూచించారు. ఈ పద్దతిని వామకుక్షి అంటారని, ఇందులో దశలు ఉన్నట్లు తెలిపారు.
► ఎప్పుడు - భోజనం తర్వాత
► ఎలా - మీ ఎడమ వైపు తిరిగి పడుకోవాలి (వామకుక్షి)
► ఎంత సమయం- 10 - 30 నిమిషాలు( అనారోగ్యంతో ఉన్నవారు, చిన్న పిల్లలు, వృద్ధులు..90 నిమిషాలు)
► అనువైన సమయం - మధ్యాహ్నం 1 గంట నుంచి 3 మధ్య
►ఎక్కడ ఉన్నారనే దాని ఆధారంగా భోజనం తర్వాత విశ్రాంతి తీసుకోవడానికి వివిధ మార్గాలు
ఇంట్లో ఉంటే, మంచం మీద పడుకోండి
పనిలో ఉంటే మీ తలని డెస్క్ మీద ఉంచి విశ్రాంతి తీసుకోండి. ప్రత్యామ్నాయంగా తేలికైన కుర్చీపై ఒరగవచ్చు.
► చేయకూడనివి
► సాయంత్రం 4 గంటల నుంచి 7 మధ్య కునుకు తీసుకోవద్దు.
► విశ్రాంతికి ముందు టీ, కాఫీ, సిగరెట్లు, చాక్లెట్ వంటివి తీసుకోవడం.
► మొబైల్ చూడటం.
► 30 నిమిషాలకు మించి నిద్ర పోవడం
► టీవీ పెట్టి నిద్ర పోవడం
చూశారుగా మధ్యాహ‍్నం కాసింత సమయం విశ్రాంతి తీసుకోవడం వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో. కాబట్టి ఇక నుంచి మీరు కూడా ఈ అలవాటును ప్రయత్నించండి.
Comments
Please login to add a commentAdd a comment