bed cart
-
ఏకంగా శునకాలకై.. అమెరికన్ కంపెనీ 'కడీ' పేరుతో..
చాలామంది జంతుప్రేమికులు ఇళ్లల్లో శునకాలను పెంచుకుంటూ ఉంటారు. ఇళ్లలో అవి ఏ మూలనో పడుకుంటూ ఉంటాయి. అవి పడుకునే చోట పాత బొంతలో, దుప్పట్లో పరుస్తూ ఉంటారు. బాగా సంపన్నులైతే సోఫా కుర్చీలను పెంపుడు శునకాలకు మంచాలుగా మార్చేస్తుంటారు. అమెరికన్ కంపెనీ ‘థింకో ఎల్ఎల్సీ’ శునకాల కోసం ‘కడీ’ పేరుతో ఒక స్మార్ట్ మంచానికి రూపకల్పన చేసింది.దీని తయారీకి చైనీస్ కంపెనీ లావో ఇంటర్నేషనల్ ట్రేడ్ కంపెనీ సాంకేతిక సహకారం అందించింది. శునకాలకు అన్ని విధాలా సౌకర్యవంతంగా ఉండేలా రూపొందించిన ఈ బెడ్ స్మార్ట్‌ఫోన్‌కు అనుసంధానమై యాప్ ద్వారా పనిచేస్తుంది. దీనిపై పడుకున్న శునకానికి ఆహ్లాదం కలిగించేలా సంగీతం వినిపిస్తుంది. ఒంటికి హాయి నిచ్చేలా ఉష్ణోగ్రతను సర్దుకుంటుంది.యాప్ ద్వారా కూడా దీని ఉష్ణోగ్రతను మార్చుకునే వీలు ఉంది. దీనిపై పడుకున్న శునకం నిద్ర తీరుతెన్నులను యాప్ ద్వారా ఎప్పటికప్పుడు తెలియజేస్తుంది. అంతేకాదు, శునకం ఆరోగ్యంలో మార్పులను కూడా ఇది నిశితంగా గమనిస్తూ, అవసరమైన సందర్భాల్లో యాప్ ద్వారా యజమానులను హెచ్చరిస్తుంది. ఈ స్మార్ట్ బెడ్‌ను ‘థింకో ఎల్ఎల్సీ’ జూన్ నెలాఖరులోగా మార్కెట్లోకి విడుదల చేయనుంది. దీని ధరను ఇంకా ప్రకటించలేదు.బీపీ చెకింగ్ స్మార్ట్‌వాచీలు..జీవనశైలి వ్యాధుల్లో హై బీపీ ఒకటి. ప్రపంచవ్యాప్తంగా హై బీపీ బాధితులు నానాటికీ ఎక్కువవుతున్నారు. బీపీ చెక్ చేయించుకోవాలంటే డాక్టర్ దగ్గరకు లేదా డయాగ్నస్టిక్స్ సెంటర్‌కు వెళ్లాలి. లేకుంటే, సొంతగా బీపీ మెషిన్ కొని ఇంట్లో పెట్టుకోవాలి. బయటకు వెళ్లేటప్పుడు ఈ మెషిన్‌ను వెంట తీసుకుపోవడం కుదిరే పని కాదు. ఈ సమస్యకు చెక్ పెట్టడానికే అమెరికన్ కంపెనీ వైహెచ్ఈ టెక్నాలజీ తాజాగా బీపీ చెకింగ్ స్మార్ట్ వాచీని అందుబాటులోకి తెచ్చింది.మిగిలిన స్మార్ట్‌వాచీల మాదిరిగానే ఇది కూడా రీచార్జబుల్ బ్యాటరీతో పనిచేస్తుంది. ఈ వాచీని చేతికి తొడుక్కుంటే, బీపీ ఎంత ఉందో ఎప్పటికప్పుడు నిరంతరాయంగా చూపిస్తూ ఉంటుంది. ఒకవేళ బీపీ ఆందోళనకరమైన స్థాయిలో ఉంటే డాక్టర్ వద్దకు వెళ్లి తగిన చికిత్స తీసుకునేందుకు దోహదపడుతుంది. బీపీ చెకింగ్‌ను సులభతరం చేసిన ఈ స్మార్ట్‌వాచీ కోసం ఆన్లైన్లో ఆర్డర్లు వెల్లువెత్తుతున్నాయి. దీని ధర 199 డాలర్లు (రూ.16,564) మాత్రమే!ఇవి చదవండి: నిద్దురలో బాగా గురక కొడ్తున్నారా! అయితే ఈ దిండు.. -
పిల్లలకు వాటిని దూరం చేయండి.. లేదంటే రాత్రి నిద్రపోయే ముందు పడకపై..
న్యూఢిల్లీ: స్మార్ట్‌ఫోన్... ఆధునిక యుగంలో మనుషుల శరీరంలో ఒక అవయవంగా మారిపోయిందనడం ఎంతమాత్రం అతిశయోక్తి కాదు. కోవిడ్–19 మహమ్మారి రంగప్రవేశం చేశాక స్మార్ట్ఫోన్ల బెడద మరింత పెరిగింది. ఆన్లైన్ క్లాసుల పేరుతో పిల్లలు సైతం ఈ ఫోన్లకు అలవాటుపడ్డారు. ఎంతగా అంటే.. మన దేశంలో 23.8 శాతం మంది పిల్లలు పడుకునే ముందు పడకపై ఫోన్ ఉపయోగిస్తున్నారు. స్మార్ట్ఫోన్లు ఉపయోగిస్తున్న చిన్నారుల్లో 37.15 శాతం మందిలో ఏకాగ్రత స్థాయిలు తగ్గిపోతున్నాయి. ఈ విషయాన్ని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ బుధవారం లోక్‌సభలో లిఖితపూర్వకంగా తెలియజేశారు. జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చేపట్టిన అధ్యయనాన్ని బట్టి చూస్తే.. భారత్‌లో 23.80 శాతం మంది రాత్రిపూట నిద్రపోయే ముందు పడకపై స్మార్ట్‌ఫోన్ వాడుతున్నట్లు స్పష్టమవుతోందని పేర్కొన్నారు. 37.15 శాతం మంది చిన్నారుల్లో స్మార్ట్‌ఫోన్ వాడకంవల్ల ఎల్లప్పుడూ లేదా తరచుగా ఏకాగ్రతా స్థాయిలు తగ్గుతున్నాయి. -
న్యూజిలాండ్‌లో నవారు మంచం ధరెంతో తెలుసా?
New Zealand Indian Charpai Price: నవారు మంచం.. భారతీయ గ్రామీణ ప్రజలకు ఈ పేరు గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. దాదాపు అందరి ఇళ్లల్లోనూ ఇవి కనిపిస్తుంటాయి. పల్లెటూరులో ఉండేవాళ్లు ఎక్కువగా నవారు మంచాలపైనే పడుకుంటారు. ఇక వేసవికాలం వచ్చిదంటే ఆరు బయట నవారు మంచం మీదే హాయిగా నిద్రిస్తారు. పొద్దంతా పనిచేసి అలసిపోయి అలా కాసేపు మంచంపై ఒరిగితే చాలు.. మనసుకు ఎంతో ప్రశాంతంగా అనిపిస్తుంది. అయితే ఊళ్లలో నవారు మంచం అల్లేవారు ఉంటారు. లేదంటే ఇంట్లోని వారే నవారును అల్లుకుంటారు. లేదా మంచం కొనాలంటే కనీసం 800 నుంచి 10 వేల వరకు ఖర్చవుతుందంతే.. అయితే న్యూజిలాండ్‌లో మాత్రం నవారు మంచానికి ఉన్న ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. అక్కడి అన్నాబెల్లె అనే ఓ ఈ కామర్స్ సైట్ ‘వింటేజ్ ఇండియన్ డేబెడ్’తో నవారు మంచానికి ఏకంగా 41, 297 రూపాయల ధర నిర్ణయించింది. వాస్తవానికి దీన ధర 61,980 ఉండగా డిస్కౌంట్ తర్వాత 41 వేలుగా ఉంది. ప్రస్తుతం ఈ మంచం ధర సోషల్ మీడియాలో వైరలవుతోంది. దీనిని చూసిన నెటిజన్లు మంచం ధర తెలిసి ఆశ్చర్యపోతున్నారు. అంత ధర వెచ్చించి కొనుగోలు చేస్తారా అని సందేహం వ్యక్తం చేస్తున్నారు. -
నిద్ర పట్టడం లేదా..? ఇవి చేస్తే ఈజీగా..
రాత్రిళ్లు నిద్ర పట్టడం లేదా.. బెడ్‌పై అటు ఇటు దొర్లుతున్నా కళ్లు మూసుకోవడం లేదా..? అయితే ఈ టిప్స్ పాటించండి.. ఎంచక్కా నిద్రపోండి. పడుకునే ముందు నాటు ఆవునెయ్యి గోరువెచ్చగా చేసుకొని ముక్కు రంధ్రాల్లో రెండు చుక్కలు వేసుకోవాలి. గసగసాలను దోరగా వేయించి పల్చని బట్టలో వేసుకుని నిద్రించే ముందు వాసన పీలుస్తూ ఉండాలి. చేతివేళ్లతో లేదా దువ్వెనతో తలవెంట్రుకలను మృదువుగా దువ్వుకుంటూ ఉండాలి. చేతులతో అరికాళ్లను మెల్లమెల్లగా మర్దన చేసుకోవాలి. రాత్రి పడుకునేముందు అరికాళ్లకు ఆముదం లేదా నువ్వుల నూనె, లేదా కొబ్బరి నూనెతో మర్దన చేయాలి. రాత్రి పూట కాసిని గోరువెచ్చని పాలు తాగాలి. నిద్ర పోవడానికి రెండు గంటల ముందు నుంచి మొబైల్ ఫోన్ చూడటం మానేయాలి. అంతేకాదు, రాత్రిళ్లు తల పక్కన మొబైల్ పెట్టుకుంటే రేడియేషన్ ప్రభావం వల్ల కూడా సరిగా నిద్ర రాదు. కాబట్టి మొబైల్‌ను దూరంగా పెట్టడం మంచిది. రోజూ రాత్రి పడుకునే ముందు కొద్దిసేపు కళ్లు మూసుకుని ధ్యానం చేయాలి లేదా ఏవైనా సుందర దృశ్యాలను ఊహించుకోవాలి. ఓంకారం లేదా మృదువైన లలిత సంగీతాన్ని పెట్టుకొని ప్రశాంతంగా కళ్లు మూసుకుని శ్వాస మీద ధ్యాస పెడితే తొందరగా నిద్ర పడుతుంది. -
‘మంచం’తో దున్నేశాడు!
జల్ గావ్: పేద రైతులు పడే కష్టానికి ఈ చిత్రం ఒక ఉదాహరణ. రూ. 70,000 వెచ్చించి ఎడ్లు కొనే స్థోమత లేక మహారాష్ట్రలోని జల్ గావ్ జిల్లాకు చెందిన విఠల్ హరి మండోలే అనే రైతు మంచంతో దుక్కి దున్ని వ్యవసాయం చేస్తున్నాడు. చేసిన అప్పులు ఎలా తీర్చాలని పొలంలో మంచంపై కూర్చుని మథనపడుతున్న సమయంలో ఈ ఆలోచన తట్టింది. తను కూర్చున్న మంచంతోనే దుక్కి దున్నొచ్చు కదా అని ఆలోచించాడు. అనుకున్నదే తడవుగా మంచం తీసుకుని ఒక చివర రాళ్లు పెట్టి, మరో చివర తాను లాగుతూ కౌలుకు తీసుకున్న మూడెకరాల్లో సేద్యం చేస్తున్నాడు. ఇతను చేసే సేద్యం చూడడానికి చుట్టుపక్కల గ్రామాల రైతులు కూడా వచ్చి అభినందనలు తెలుపుతున్నారు. అన్నట్లు పుట్టెడు కష్టాల్లో ఉన్న ఈ రైతుకు ఎవరైనా దాతలు సహాయం చేయాలనుకుంటే 7798348533 నెంబరును సంప్రదించవచ్చు.