
New Zealand Indian Charpai Price: నవారు మంచం.. భారతీయ గ్రామీణ ప్రజలకు ఈ పేరు గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. దాదాపు అందరి ఇళ్లల్లోనూ ఇవి కనిపిస్తుంటాయి. పల్లెటూరులో ఉండేవాళ్లు ఎక్కువగా నవారు మంచాలపైనే పడుకుంటారు. ఇక వేసవికాలం వచ్చిదంటే ఆరు బయట నవారు మంచం మీదే హాయిగా నిద్రిస్తారు. పొద్దంతా పనిచేసి అలసిపోయి అలా కాసేపు మంచంపై ఒరిగితే చాలు.. మనసుకు ఎంతో ప్రశాంతంగా అనిపిస్తుంది. అయితే ఊళ్లలో నవారు మంచం అల్లేవారు ఉంటారు. లేదంటే ఇంట్లోని వారే నవారును అల్లుకుంటారు. లేదా మంచం కొనాలంటే కనీసం 800 నుంచి 10 వేల వరకు ఖర్చవుతుందంతే..
అయితే న్యూజిలాండ్‌లో మాత్రం నవారు మంచానికి ఉన్న ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. అక్కడి అన్నాబెల్లె అనే ఓ ఈ కామర్స్ సైట్ ‘వింటేజ్ ఇండియన్ డేబెడ్’తో నవారు మంచానికి ఏకంగా 41, 297 రూపాయల ధర నిర్ణయించింది. వాస్తవానికి దీన ధర 61,980 ఉండగా డిస్కౌంట్ తర్వాత 41 వేలుగా ఉంది. ప్రస్తుతం ఈ మంచం ధర సోషల్ మీడియాలో వైరలవుతోంది. దీనిని చూసిన నెటిజన్లు మంచం ధర తెలిసి ఆశ్చర్యపోతున్నారు. అంత ధర వెచ్చించి కొనుగోలు చేస్తారా అని సందేహం వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment