న్యూఢిల్లీ: స్మార్ట్‌ఫోన్... ఆధునిక యుగంలో మనుషుల శరీరంలో ఒక అవయవంగా మారిపోయిందనడం ఎంతమాత్రం అతిశయోక్తి కాదు. కోవిడ్–19 మహమ్మారి రంగప్రవేశం చేశాక స్మార్ట్‌ఫోన్ల బెడద మరింత పెరిగింది. ఆన్‌లైన్ క్లాసుల పేరుతో పిల్లలు సైతం ఈ ఫోన్లకు అలవాటుపడ్డారు. ఎంతగా అంటే.. మన దేశంలో 23.8 శాతం మంది పిల్లలు పడుకునే ముందు పడకపై ఫోన్ ఉపయోగిస్తున్నారు.
స్మార్ట్‌ఫోన్లు ఉపయోగిస్తున్న చిన్నారుల్లో 37.15 శాతం మందిలో ఏకాగ్రత స్థాయిలు తగ్గిపోతున్నాయి. ఈ విషయాన్ని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ బుధవారం లోక్‌సభలో లిఖితపూర్వకంగా తెలియజేశారు. జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చేపట్టిన అధ్యయనాన్ని బట్టి చూస్తే.. భారత్‌లో 23.80 శాతం మంది రాత్రిపూట నిద్రపోయే ముందు పడకపై స్మార్ట్‌ఫోన్ వాడుతున్నట్లు స్పష్టమవుతోందని పేర్కొన్నారు. 37.15 శాతం మంది చిన్నారుల్లో స్మార్ట్‌ఫోన్ వాడకంవల్ల ఎల్లప్పుడూ లేదా తరచుగా ఏకాగ్రతా స్థాయిలు తగ్గుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment