చిన్నారి నేత్రాల్లో వెంట్రుకలు | Hair and eyes of a child | Sakshi
Sakshi News home page

చిన్నారి నేత్రాల్లో వెంట్రుకలు

Published Fri, Mar 11 2016 3:26 AM | Last Updated on Sun, Sep 3 2017 7:26 PM

Hair and eyes of a child

ఓర్వకల్లు: పదకొండేళ్ల చిన్నారి నేత్రాల నుంచి వెంట్రుకలు వస్తున్న వింత స్థితి ఉప్పలపాడు గ్రామంలో వెలుగు చూసింది. గ్రామానికి చెందిన నాయిని వెంకటలక్ష్మమ్మ, నారాయణ దంపతుల కుమార్తె రూప స్థానిక ప్రభుత్వ పాఠశాలలో 6వ తరగతి చదువుతోంది. బాలిక వారం రోజులుగా కళ్ల మంటలతో బాధపడుతోంది. ఈ క్రమంలో కళ్ల నుంచి తరుచుగా నీరు కారుతుండేది. బుధవారం రాత్రి నుంచి కళ్లలో వెంట్రుకలు వస్తుండడంతో తల్లిదండ్రుల్లో ఆందోళన మొదలైంది. శుక్రవారం వైద్యులను సంప్రదిస్తామని వారు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement