మెరిసే మోము కోసం
బ్యూటిప్స్
ఎండలో తిరగడం వల్ల అందమైన ముఖం కాస్త నల్లగా వాడిపోతుంది. అప్పుడు ఇంటికి వచ్చిన వెంటనే చెక్కు తీసిన కీరాను మిక్సీలో వేసి పేస్ట్‌లా చేసుకోవాలి. అందులో కొన్ని పచ్చిపాలు పోసి కలపాలి. మొదట ముఖాన్ని కడుక్కొని ఆ మిశ్రమాన్ని అప్లై చేసుకోవాలి. ఓ అరగంట తర్వాత ముఖాన్ని చల్లటి నీటితో కడుక్కుంటే పోయిన ముఖకాంతి తిరిగి వస్తుంది.
చాలామంది కంటిరెప్పలు తరచూ ఊడిపోతుంటాయి. దాంతో కళ్ల అందం తగ్గుతుంది. అలా కాకుండా ఉండాలంటే రోజూ వాటికి ఆల్మండ్ ఆయిల్ రాస్తే రెప్పలు ఊడిపోకుండా ఉంటాయి. అంతే కాదు కనుబొమ్మలకు కూడా ఈ ఆల్మండ్ ఆయిల్ రాసుకుంటే అవి ఒత్తుగా పెరుగుతాయి.
స్లీవ్ లెస్ డ్రెస్సులు వేసుకోవాలనుకున్నప్పుడు చేయి మొత్తం ఒకే రంగులో లేదని బాధగా ఉందా? అయితే ప్రతిరోజూ రాత్రి నిద్రపోయే ముందు చేతులకు మీగడ, గ్లిజరిన్ కలిపిన మిశ్రమాన్ని రాసుకోవాలి. అలా ఒక రెండు వారాలు క్రమం తప్పకుండా చేస్తే ముఖం లాగే చేతులు కూడా కాంతివంతంగా మెరుస్తుంటాయి.