almond oil
-
Hair Care: ఉల్లిపాయ రసంలో బాదం నూనె కలిపి జుట్టుకు పట్టించారంటే!
Hair Care And Beauty Tips In Telugu: జుట్టు రాలడం తగ్గాలంటే ఈ చిట్కాలు ట్రై చేసి చూడండి. బాదం నూనెతో వీటిని కలిపి కురులకు పట్టిస్తే ప్రయోజనకరంగా ఉంటుంది. ఉల్లిపాయ రసంలో.. మీడియం సైజులో ఉన్న ఉల్లిపాయను తీసుకుని సన్నగా తురిమి రసం తియ్యాలి. ఈ రసాన్ని రెండు టేబుల్ స్పూన్ల బాదం నూనెలో వేసి కలిపి, కుదుళ్ల నుంచి చివర్లవరకు పట్టించి ఇరవై నిమిషాలపాటు మర్దన చేయాలి. నలభై నిమిషాల తరువాత తలస్నానం చేయాలి. వారానికి రెండు సార్లు ఈ విధంగా చేయడం వల్ల జుట్టు రాలడం తగ్గి, ఒత్తుగా పెరుగుతుంది. ఉసిరిపొడితో.. బాదం నూనెలో ఉసిరిపొడి లేదా రెండు టీస్పూన్ల తాజా నిమ్మరసం వేసి కలిపి జుట్టుకు పట్టించాలి. మర్దనచేసి అరగంట తరువాత తలస్నానం చేయాలి. వారానికి రెండు సార్లు ఈవిధంగా చేస్తే వెంట్రుకలు రాలడం తగ్గుతుంది. కురులకు పోషణ అంది నల్లగా నిగనిగలాడుతూ పెరుగుతాయి. ఆవనూనె వల్ల.. ఆవాల నుంచి తీసిన నూనెలో విటమిన్ ఎ పుష్కలంగా లభిస్తుంది. ఇది జుట్టు బాగా పెరగడానికి దోహదం చేస్తుంది. అంతేకాదు, చుండ్రు నుంచి కూడా ఉపశమనం కలిగిస్తుంది. కానీ ఆవాలను మోతాదుకు మించి ఒకేసారిగా ఎక్కువగా వాడితే టాక్సిక్ కారణంగా ఇబ్బందులు తప్పవని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. మొటిమలను తగ్గించుకోవాలంటే.. కొబ్బరి నూనెలో ఆవాలు వేయించి చల్లారనివ్వాలి. ఆ తర్వాత ఆ నూనెను వడగట్టి రాత్రి నిద్ర పోవడానికి ముందు నీటితో ఈ నూనెను కలిపి ముఖానికి పట్టించాలి. ఉదయాన్నే కడిగేస్తే మంచి ఫలితం కనిపిస్తుంది. చదవండి: Cervical Spondylosis: మెడ వెన్నుపూసలు అరిగిపోయాయా? వేపాకు, వేప పువ్వుల రసం.. ఇంకా.. Hair Care Tips: జుట్టు రాలడం.. చుండ్రు సమస్య వేధిస్తోందా? కొబ్బరి నూనె, ఆముదం కలిపి.. -
బ్యూటిప్స్
♦ ఒక్కొక్కసారి స్నానం చేసినా, ఏ సబ్బుతో ముఖం కడిగినా తాజాగా ఉన్నట్లనిపించదు. కాలుష్యం చర్మరంధ్రాల్లో పట్టేసినప్పుడు, జిడ్డు మరీ ఎక్కువగా ఉన్నప్పుడు ఇలా ఉంటుంది. ఈ సమస్య పోయి ముఖం తాజాగా, శుభ్రంగా ఉండాలంటే బొప్పాయి గుజ్జు చక్కని మందు. మామూలుగా ప్యాక్‌కు వాడేకంటే ఎక్కువ మోతాదు గుజ్జు అవసరమవుతుంది. ముందుగా సగం గుజ్జును ముఖానికి, మెడకు పట్టించాలి. పది నిమిషాల తర్వాత తుడిచేసి ముఖానికి ఆవిరి పట్టాలి. ఆవిరి పట్టిన తరువాత మిగిలిన గుజ్జుతో ప్యాక్ వేయాలి. ప్యాక్ ఆరిన తరువాత చన్నీటితో కడగాలి. ♦ స్వచ్ఛమైన బాదం నూనె చర్మానికి చక్కని టానిక్‌లా పని చేస్తుంది. మార్కెట్లో దొరికే రకరకాల క్రీమ్‌లు, లోషన్లకు బదులుగా ఆల్మండ్ ఆయిల్ వాడకం మంచి ఫలితాలనిస్తుంది. చలికాలంలో అన్ని రకాల చర్మతత్త్వాల వాళ్లూ దీనిని వాడవచ్చు. ముఖంతోపాటుగా చేతులు, కాళ్లకు కూడా (చలికి ఎక్స్పోజ్ అయ్యేంత వరకు) రాస్తుంటే మాయిశ్చరైజర్‌గా పని చేస్తుంది, చర్మం మీదున్న మచ్చలు, గీతల వంటివి తొలగిపోతాయి. -
కళ్లకింద వలయాలను వెళ్లగొడదాం...
బ్యూటిప్స్ కొందరికి పనివత్తిడివల్ల లేదా ఇతర కారణాల వల్ల కళ్లకింద నల్లటి వలయాలు ఏర్పడతాయి. అందవికారంగా అనిపించడమే కాకుండా అనారోగ్యాన్ని కూడా సూచిస్తాయి. అలాంటప్పుడు కళ్లచుట్టూ స్వచ్ఛమైన ఆల్మండ్ ఆయిల్ అప్లై చేసి తేలిగ్గా మసాజ్ చేయాలి. ఇందుకు ఉంగరం వేలిని ఉపయోగిస్తూ ఒక్కో కంటికి ఒక్కో నిమిషం చొప్పున చేసి పదిహేను నిమిషాల తర్వాత తడిదూదితో తుడిచేయాలి. ఇలా కొన్నిరోజులపాటు చేయాలి. కీరా రసం, బంగాళదుంప రసం సమపాళ్లలో తీసుకుని కళ్లకింద రాసి 20 నిమిషాలు ఆగి నీటితో కడిగేయాలి. బయటకు వెళ్లేముందు ఒకచుక్క నీటిని అద్ది సన్‌స్క్రీన్‌ను కళ్లకింద అప్లై చేయడం వల్ల కళ్లకింద వలయాలు ఏర్పడకుండా ఉంటాయి. కొందరికి కళ్లకింద సంచుల్లా ఉబ్బెత్తుగా ఉంటుంది. అలాంటివారు వాడేసిన టీ బ్యాగ్స్‌ను ఫ్రిజ్‌లో పెట్టి తీసి, వాటితో కళ్లమీద కాచినట్లు చేయాలి. అలా చేస్తుంటే తొందరలోనే తగ్గిపోతాయి. -
చేతులకూ కొంత టైమివ్వాలి!
బ్యూటిప్స్ మృదువైన ముఖం మీద నుంచి దృష్టి తామరతూడుల్లా ఉండాల్సిన చేతుల మీదకు మళ్లుతుంది. కానీ చాలామంది చేతుల మీద శ్రద్ధ పెట్టరు. దాంతో చేతులు గరుకుదేలి మొరటుగా తయారవుతాయి. ముఖం కోసం కేటాయించిన సమయంతోపాటు చేతులకూ టైమివ్వాల్సిందే. కొద్దిగా నీళ్ళు, టీ స్పూన్ ఆల్మండ్ ఆయిల్ కలిపి చేతులకు పట్టించాలి. ఈ మిశ్రమం చేతులపై ఉండే మృత కణాలను, పొడి చర్మాన్ని తొలగించి చేతులను సున్నితంగా తయారు చేస్తుంది. గిన్నెడు నీటిలో కొద్దిగా ఉప్పు, నిమ్మరసం కలిపి ఈ మిశ్రమాన్ని ముంజేతి నుంచి భుజాల వరకు రాయాలి. ఇలా వారానికి రెండుసార్లు చే స్తే చేతులు సున్నితంగా తయారవుతాయి. గోరువెచ్చని నీటితో చేతులు శుభ్రంగా కడుక్కొని కాటన్ క్లాత్‌తో గబగబారుద్దాలి. ఇలా చేస్తే మృతకణాలు రాలిపోతాయి. తర్వాత ఒక టీ స్పూన్ తేనెకి ఒక టీ స్పూన్ ఆలివ్ ఆయిల్ కలిపి చేతులకు రాయాలి. తరువాత చేతులకు ప్లాస్టిక్ బ్యాగ్స్ తొడుక్కొని అరగంట అలాగే ఉంచుకోవాలి. చేతులపై చర్మం మృదువుగా తయారవుతుంది. అరచేతులు పొడిబారినట్లయితే రాత్రి పడుకోబోయే ముందు రెండు చుక్కల కొబ్బరి నూనె అరచేతుల్లో వేసుకుని మర్దన చేసుకోవాలి. -
మెరిసే మోము కోసం
బ్యూటిప్స్ ఎండలో తిరగడం వల్ల అందమైన ముఖం కాస్త నల్లగా వాడిపోతుంది. అప్పుడు ఇంటికి వచ్చిన వెంటనే చెక్కు తీసిన కీరాను మిక్సీలో వేసి పేస్ట్‌లా చేసుకోవాలి. అందులో కొన్ని పచ్చిపాలు పోసి కలపాలి. మొదట ముఖాన్ని కడుక్కొని ఆ మిశ్రమాన్ని అప్లై చేసుకోవాలి. ఓ అరగంట తర్వాత ముఖాన్ని చల్లటి నీటితో కడుక్కుంటే పోయిన ముఖకాంతి తిరిగి వస్తుంది. చాలామంది కంటిరెప్పలు తరచూ ఊడిపోతుంటాయి. దాంతో కళ్ల అందం తగ్గుతుంది. అలా కాకుండా ఉండాలంటే రోజూ వాటికి ఆల్మండ్ ఆయిల్ రాస్తే రెప్పలు ఊడిపోకుండా ఉంటాయి. అంతే కాదు కనుబొమ్మలకు కూడా ఈ ఆల్మండ్ ఆయిల్ రాసుకుంటే అవి ఒత్తుగా పెరుగుతాయి. స్లీవ్ లెస్ డ్రెస్సులు వేసుకోవాలనుకున్నప్పుడు చేయి మొత్తం ఒకే రంగులో లేదని బాధగా ఉందా? అయితే ప్రతిరోజూ రాత్రి నిద్రపోయే ముందు చేతులకు మీగడ, గ్లిజరిన్ కలిపిన మిశ్రమాన్ని రాసుకోవాలి. అలా ఒక రెండు వారాలు క్రమం తప్పకుండా చేస్తే ముఖం లాగే చేతులు కూడా కాంతివంతంగా మెరుస్తుంటాయి. -
కురులను పొడిబారనివ్వకండి
జుట్టు పొడిబారడానికి కారణం మాడు ఎక్కువ తేమను కోల్పోవడం. అందుకని గోరువెచ్చని ఆలివ్ ఆయిల్‌ను మాడుకు పట్టించి, మసాజ్ చేసుకోవాలి. గంట తర్వాత షాంపూతో తలస్నానం చేయాలి. వారానికి ఒకసారి పెరుగును మాడుకు పట్టించి, తర్వాత శుభ్రపరుచుకోవాలి. పెరుగు శిరోజాలకు మంచి కండిషనర్‌గా ఉపయోగపడుతుంది. బాదంనూనెలో విటమిన్ ‘ఇ’ ఉండటం వల్ల మాడు త్వరగా పొడిబారదు. అందుకని బాదంనూనెతో మాడుకు మసాజ్ చేసుకోవచ్చు. మృదుత్వం కోసం కండిషనర్‌ని వాడేవారు మాడుకు తగలకుండా జాగ్రత్తపడాలి. అలాగే వెడల్పాటి పళ్లు ఉన్న దువ్వెనతో మాడుకు తగిలేలా దువ్వాలి. దీని వల్ల రక్తప్రసరణ మెరుగై శిరోజాల కండిషనింగ్ బాగుంటుంది. సుమ కోమలం టేబుల్ స్పూన్ తేనె, 2 టేబుల్ స్పూన్ల బాదంపప్పు పొడి, 3 టేబుల్ స్పూన్ల ఆరెంజ్ జ్యూస్, 2 టేబుల్ స్పూన్ల ఆలివ్ ఆయిల్ కలపాలి. ఈ మిశ్రమాన్ని ఒంటికి పట్టిస్తూ, మెల్లగా రబ్ చేస్తూ రుద్దాలి. తర్వాత గోరువెచ్చని నీటితో స్నానం చేయాలి. వారానికి ఒక్కసారైనా ఇలా చేడయం వల్ల చర్మానికి పువ్వులాంటి మృదుత్వం లభిస్తుంది. మరింత ఎర్రగా...మెహెందీ! నిమ్మరసంలో చక్కెర కలిపి, వేడిచేయాలి. గోరువెచ్చగా ఉన్నప్పుడు దూది ముంచి మెహెందీ డిజైన్ పెట్టిన చేతులపై అద్దాలి. ఆరిన తర్వాత మరోసారి ఇలాగే చేయాలి. మెహెందీ పెట్టిన 24 గంటల తర్వాత డిజైన్ మరింత ఎరుపుదనం నింపుకుంటుంది.