కళ్ల కింద నల్లటి వలయాలు పోవాలంటే..
బ్యూటిప్స్
* నీటిని మరిగించి అందులో గుప్పెడు తులసి, క్యాబేజీ ఆకులు వేసి మూతపెట్టి ఇరవైనిమిషాల సేపు అలాగే ఉంచాలి. చల్లారిన తర్వాత వడపోసి ఆ నీటిలో కాటన్ బాల్ ముంచి కళ్ల చుట్టూ అప్లై చేయాలి. ఈ మిశ్రమం యాక్నె, పింపుల్స్‌కు బాగా పని చేస్తుంది.
* కీరదోస కాయను చక్రాలుగా కోసి కళ్ల మీద పెట్టుకుని అరగంట సేపు ఉంచుకుంటే క్రమంగా వలయాలు పోతాయి.
* ఒక కప్పులో నీరు పోసి అందులో వాడిన టీ బ్యాగ్‌లను ఉంచి ఫ్రిజ్‌లో పెట్టుకుని, రాత్రి పడుకునే ముందు కాని, బయటకు వెళ్లి వచ్చిన తరువాత కాని పదిహేను నిమిషాల సేపు కళ్ల మీద పెట్టుకుంటుంటే వలయాలు పోతాయి.
* శరీరానికి అవసరమైనంత నీటిని తాగాలి. కనీసం రెండు లీటర్లకు తగ్గకుండా తాగినప్పుడే శరీరంలోని మలినాలు సులభంగా బయటకు పోతాయి. అవసరమైనంత నిద్ర కూడా తప్పని సరి. ఎంత సమయం అనేది కచ్చితంగా ఉండకపోయినప్పటికీ శారీరక, మానసిక అలసటను బట్టి ఏడు నుంచి ఎనిమిది గంటల నిద్ర అవసరం.
* తగినంత విశ్రాంతి పొందినప్పుడు శరీరం రుగ్మతలతో పోరాడే శక్తిని సమకూర్చుకుంటుంది. చర్మం వార్ధక్యానికి దూరంగా నిత్య యవ్వనంతో ఉంటుంది. విశ్రాంతి సమయంలో రక్తంలోని తెల్లరక్త కణాలు ఉత్తేజితమవుతాయి.