నలుపు వెనుక చీకటి
చాలా మంది.. కంటికింద నల్లని వలయాలు కనిపిస్తుంటే ఒత్తిడికి గురవుతున్నామనో నిద్ర సరిగా పోవడం లేదనో అనుకుంటూ ఉంటారు. మార్కెట్లో లభించే క్రీములను రాస్తూ ఉంటారు. కానీ, సరైన పరిష్కారం లభించదు. డార్క్ సర్కిల్స్ ఏర్పడటానికి కారణం అనారోగ్యం అని తెలుసుకుంటే పరిష్కారం కూడా సులువు అవుతుంది.
΄ాతికేళ్ల ఏంజెల్ మెడిసిన్ విద్యార్థిని. కళ్ల కింద ఏర్పడిన నల్లటి వలయాలు తన శరీరంలో ఏదో తీవ్రమైన సమస్యకు సంకేతమని తెలుసుకొని ఆశ్చర్యపోయింది. ఒక ఈవెంట్‌లో ఏంజెల్‌ను కలిసిన డెర్మటాలజిస్ట్ ఆమె కళ్లకింద నల్లటి వలయాలను చూసి, అలెర్జీల సమస్యలను సూచిస్తున్నాయనిచెప్పాడు. అందరిలో ఆ విషయం గురించి ఎక్కువ చర్చించలేక ఇంటికి వెళ్లాక డెర్మటాలజిస్ట్‌కు ఫోన్ చేసింది.
డెర్మటాలజిస్ట్ లారెన్ మాట్లాడుతూ – ‘ఈ సమస్యను పెరియార్బిటల్ హైపర్ పిగ్మెంటేషన్ అని కూడా అంటారు. రక్తనాళాలకు సంబంధించిన సమస్య వల్ల కూడా డార్క్ సర్కిల్స్ ఏర్పడతాయ’ని వివరించారు. ఇన్నాళ్లూ నిద్రలేమి వల్ల కలిగే సాధారణ సమస్య ఇది అనుకుంది. డాక్టర్ చెప్పిన విధంగా తన కుటుంబంలో జన్యుపరంగా ఉబ్బసం, ఎగ్జిమా వంటి సమస్యలు ఉన్నాయని తెలుసుకుంది. ‘మీకున్న అలెర్జీ ఏంటో కనుక్కొని, దానికి తగిన మందులు తీసుకుంటే నల్లని వలయాల సమస్య దూరం అవుతుంది’ అని డాక్టర్ చెప్పడంతో తగిన చికిత్స తీసుకోవడం మొదలుపెట్టింది.
రోగనిరోధక శక్తి తగ్గుదల
కళ్ల కింద వలయాలు మాత్రమే కాదు చర్మం ముడతలు పడటం, ముక్కుకు అడ్డంగా ఉన్న అలెర్జీ మచ్చలు కూడా తగ్గుతుండే రోగనిరోధక శక్తికి సూచికలు అంటున్నారు వైద్యులు. పోషకాహార నిపుణులు, బ్యూటీషియన్స్ కూడా నల్లటి వలయాలు రావడానికి చాలా కారణాలు ఉన్నాయని వివరిస్తున్నారు. వాటిలో... ∙జన్యుపరమైనవి, పోషకాహార లో΄ాలు, ఆటో ఇమ్యూన్ కండిషన్స్, అలసట, జీర్ణకోశ సమస్యలు, ఏదీ తినాలని లేకపోవడం.. వంటివన్నీ కంటికింద భాగాన్ని నల్లగా చేస్తాయి. రకరకాల అలెర్జీలు, సైనస్ సమస్యల వల్ల కూడా డార్క్ సర్కిల్స్ ఏర్పడతాయి. కారణాన్ని గుర్తించి, వాటికి దూరంగా ఉంటే అవే తగ్గిపోతాయి.
క్రీములకన్నా మేలైనవి..
నల్లటి వలయాలు తగ్గడానికి మార్కెట్‌లో రకరకాల క్రీములు లభిస్తుంటాయి. వీటిని వాడినా మార్పు రాలేదంటే సాధారణ సమస్య కాదని గుర్తించాలి. ∙రోగ నిరోధక వ్యవస్థను మెరుగుపరుచుకోవాలి. అందుకు ఆరోగ్యకరమైన ఆహారం, తగినంత ద్రవాహారాలు తీసుకోవడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం.. వంటివి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి.
→ఫేషియల్ ఎక్సర్‌సైజ్‌ల వల్ల చర్మ కణాలు చురుకు అవుతాయి. రక్తప్రసరణ మెరుగై చర్మం ఆరోగ్యంగా ఉంటుంది.
→ అలోవెరా, తేనె .. వంటి వాటిని అప్లై చేస్తూ సాధారణ చర్మ సమస్యలను నివారించుకోవడానికి ఇంటి వద్దే జాగ్రత్తలు తీసుకోవచ్చు.
– నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి
అనర్థాలను నివారించాలంటే..
తీవ్ర అనారోగ్య సమస్యలను గుర్తించడానికి నల్లని వలయాలను ఒక సూచికగా తీసుకోవాలి. ఆస్తమా, బ్రాంకైటిస్, డస్ట్ అలెర్జీల వల్ల నల్లని వలయాలు ఏర్పడుతుంటాయి. చర్మం ΄÷డిబారినా, బి12, ఐరన్ లోపం వల్ల కూడా ఈ సమస్య తలెత్తుతుంది. బరువు పెరగడంతో చర్మం మందం అవడం, బరువు తగ్గినప్పుడు చర్మం పలచబడటం, వయసు పైబడటం వల్ల చర్మంలో వచ్చిన మార్పుల వల్ల కూడా ఈ సమస్య ఉత్పన్నం అవుతుంది. కంటి దగ్గర ఉండే భాగాన్ని అలెర్జీ ఉన్నప్పుడు రుద్దుతూ ఉన్నా, మొబైల్, లాప్‌టాప్.. వంటి స్క్రీన్ టైమ్ ఎక్కువ ఉపయోగించినా, నైట్ షిఫ్ట్స్ వల్ల, సరైన నిద్ర లేకపోవడం వల్ల నల్లటి వలయాలు ఏర్పడతాయి. 6 నుంచి 8 గంటల నిద్ర ఉండాలి. డ్రై స్కిన్ ఉందంటే మాయిశ్చరైజర్ వాడాలి. బరువు పెరుగుతున్నారంటే ఫిట్‌నెస్, పోషకాహారం జాగ్రత్తలు తీసుకోవాలి. అలెర్జీ సమస్యలకు వైద్య చికిత్స తప్పనిసరి.
– డాక్టర్ స్వప్నప్రియ, డెర్మటాలజిస్ట్
Comments
Please login to add a commentAdd a comment