
మరణించినా జీవిద్దాం
మనం జీవించి లేకపోరుునా మన కళ్లు ఈ లోకాన్ని చూస్తూనే ఉంటాయి. మనం శ్వాసించకపోయినా మన గుండె ‘లబ్‌డబ్’ మంటూ కొట్టుకుంటూనే ఉంటుంది.
యశోద, జీవన్‌దాన్ అవయువ దాన కార్యక్రవూనికి విశేష స్పందన
హామీ పత్రంపై నాగార్జున సహా పలువురు సినీతారల సంతకం
జీవన్‌దాన్ కేంద్రంలో 4,600 మంది నమోదు
మనం జీవించి లేకపోరుునా మన కళ్లు ఈ లోకాన్ని చూస్తూనే ఉంటాయి. మనం శ్వాసించకపోయినా మన గుండె ‘లబ్‌డబ్’ మంటూ కొట్టుకుంటూనే ఉంటుంది. మనం లేకున్నా మన మూత్ర పిండాలు రక్తాన్ని శుద్ధి చేస్తూనే ఉంటాయి. ఇదంతా అవయువ దానంతోనే సాధ్యం. పుట్టుకను ఇచ్చేది దేవుడైతే.. మరుజన్మ నిచ్చిన ఈ దాతలు కూడా ఆయునతో సమానమే. శనివారం ఒక్క రోజే సినీనటుడు అక్కినేని నాగార్జున సహా 4,600 మంది ఈ అవయవ దానం హామీ పత్రంపై సంతకం చేసి రికార్డు సృష్టించారు.
హైదరాబాద్: సినిమాల్లో నటించే కథానాయుకులే కాదు, అవయువ దానం చేసే ప్రతి ఒక్కరూ హీరోలేనని ప్రముఖ నటుడు అక్కినేని నాగార్జున అన్నారు. యశోద గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్, జీవన్‌ధాన్ సంయుక్తంగా శనివారం మాదాపూర్‌లోని శిల్పా కళావేదికలో అవయువ దాన కార్యక్రమాన్ని నిర్వహించారు. జీవన్‌దాన్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న నటుడు నాగార్జునతో పాటు జీహెచ్‌ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్, కలెక్టర్ ముఖేష్‌కుమార్ మీనా, సినీ దర్శకుడు శేఖర్ కమ్ముల, నటి సానియా, బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సింధూతో పాటు 4,600 మంది కార్యక్రవుంలో పాల్గొన్నారు. వీరంతా జీవన్ దాన్ అవయవదాన హామీ పత్రంపై సంతకాలు చేశారు. ఈ సందర్భంగా నటుడు అక్కినేని నాగార్జున మాట్లాడుతూ తన అవయవాలను దానం చేస్తున్నట్లు ప్రకటించారు. అందరితో ప్రమాణం చేయిం చారు. సినిమాల్లో నటించే వారు మాత్రమే హీరోలు కారని, అవయవాలను దానం చేసేం దుకు ముందుకు వచ్చిన ప్రతి ఒక్కరూ హీరోలేనని అన్నారు. తన తండ్రి అక్కినేని నాగేశ్వరరావు మృతి చెందిన సమయంలో అవయవాలను దానం చేయాలని భావించినా, ఆయన ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా అది కుదరలేదని, అయితే ఆయనకు అమర్చిన ఫేస్‌మేకర్‌ను ఇతరులకు దానం చేసినట్లు చెప్పారు. తాను నటించే సినిమాల్లోనూ, పాల్గొనే టీవీ కార్యక్రమాల్లోనూ అవయవదానంపై విస్త్రృత ప్రచారం కల్పిస్తానని హామీ ఇచ్చారు. దర్శకుడు శేఖర్ కమ్ముల మాట్లాడుతూ ప్రాణాపాయంలో ఉన్న వారిని కాపాడేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సింధూ మాట్లాడుతూ తనతో పాటు తల్లిదండ్రులను ఒప్పించి వారి అవయవాలను కూడా దానం చేయిస్తానన్నారు.
ఎదురు చూపుల్లో బాధితులు
దేశవ్యాప్తంగా 1.80 లక్షల మంది కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సల కోసం ఎదురు చూస్తున్నారు. ఇవి దొరక్క ఏటా వేలాది మంది మృత్యువాత పడుతున్నారు. ఒక వ్యక్తి నుంచి సేకరించిన అవయవాలతో కనీసం 20 మందికి పునర్జన్మ ప్రసాదించవచ్చు. -డాక్టర్ ఏజీకే గోఖలే
నిజంగా నాకు పునర్జన్మే
కొంత కాలంగా కిడ్నీ సమస్యతో బాధపడుతున్నాను. వైద్యులను సంప్రదించగా కిడ్నీ పూర్తిగా పాడైపోయిందని చెప్పారు. కిడ్నీ దానం చేసేందుకు ఓ దాత ముందుకు రావడంతో బతికా. ప్రస్తుతం ఎంతో ఆరోగ్యంగా ఉన్నా. నిజంగా ఇది నాకు పునర్జన్మే. నేను కూడా నా అవయవాలను దానం చేస్తున్నా. - భామిని, కిడ్నీ బాధితురాలు
ప్రజలలో అవగాహన అవసరం
దేశంలో అవయవాల కోసం ఎదురుచూస్తూ ఏటా ఐదు లక్షల మందికి పైగా ప్రాణాలను కోల్పోతున్నారు. అవయవదానాలు చేయడానికి ప్రజలలో అవగాహన కల్పించాలి. మనిషి చనిపోయిన తరువాత అవయవాలు మట్టిలో కలిసిపోవడం కంటే మరొకరికి ప్రాణదానం చేయడం చాలా మంచిది. -శ్రీకాంత్ భరద్వాజ్
జీవితానికి సార్థకత
అవయవదానం చేసి ఇతరుల జీవితాలలో వెలుగులు నింపడం వల్ల మన జీవితానికి సార్థకత లభిస్తుంది. పలు అవయువాల మార్పిడి కోసం వేచి చూసే వారి సంఖ్య నానాటికి పెరిగిపోతోంది. ప్రజలలో అవయవదానాలపై అవగాహన కల్పించడంతో కొన్ని ప్రాణాలను కాపాడవచ్చు. ఇది నిజంగా గొప్ప చర్య. -వాసవి ప్రియాంక, విద్యార్థిని
మొదట ఇంట్లో ఒప్పుకోలేదు
అవయవ దానవూ... అమ్మో అంటూ ఇంట్లో మొదట ఒప్పుకోలేదు. అవయవ దానాల వల్ల కలిగే ప్రయోజనాలు, వాటివల్ల లాభాలను వివరించడంతో ఇంట్లో ఒప్పుకున్నారు. అలాగే రక్తదానంపై అవగాహన కల్పించాను. -సుష్మ, విద్యార్థిని
మరిన్ని కార్యక్రమలు ఏర్పాటు చేయూలి
ఇలాంటి కార్యక్రమాలను ఏర్పాటు చేయడం వల్ల ప్రజలలో అవయవదానంపై అవగాహన వస్తుంది. మూఢ నమ్మకాలు ఉన్న వారికి సైతం దీని వల్ల ప్రయోజనం ఏమిటో తెలుస్తుంది. మనిషి చనిపోయిన తరువాత అవయవాలు వుట్టిలో కలిస్తే వ్యర్థాలతో సమానమే. అలాంటి వాటితో మరొకరికి ప్రాణం పోయడం గొప్ప విషయం. -విక్రమ్, రామాంతపూర్