హైదరాబాద్ బ్రాండ్ ఇమేజీ బాగుండాలంటే మహిళలకు భద్రత ఉండాలె. ఆడపిల్లలకు రక్షణ లేదంటే తెలంగాణ సర్కారు ఇజ్జత్ పోయినట్టే.
హైదరాబాద్ : హైదరాబాద్ బ్రాండ్ ఇమేజీ బాగుండాలంటే మహిళలకు భద్రత ఉండాలె. ఆడపిల్లలకు రక్షణ లేదంటే తెలంగాణ సర్కారు ఇజ్జత్ పోయినట్టే. ఆడపిల్లల వైపు కన్నెత్తి చూడాలంటే లాగులు తడిసే విధంగా చట్టాలను కఠినతరం చేస్తాం. ఆడపిల్లలపై అఘాయిత్యాలకు హైదరాబాద్ కూడా ఢిల్లీలా తయారైంది. నేరగాళ్లకు ముందే సంకేతాలు ఇస్తున్నా. ఆడపిల్లలపై అఘాయిత్యాలను, వేధింపులను తెలంగాణ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ సహించదు. కఠిన చర్యలుంటాయి.
ఆడపిల్లలను వేధిస్తే కళ్లు పీకేయిస్తం. అది ఎంత వివాదమైనా ఫర్యాలేదు. నేను హిట్లర్నన్నరు. అవును. చెడు పనులు చేసినోళ్లకు చెడు, మంచికి మంచి చేయడానికి నేను హిట్లర్కు తాతనే. ఆత్మహత్యలకు కారణమవుతున్నాయని పేకాట క్లబ్బులు మూయిస్తే అదికూడా వివాదం చేస్తున్నరు అని కేసీఆర్ పార్టీ ప్లీనరీ సన్నాహక సమావేశంలో అన్నారు.