ప్రపంచవ్యాప్తంగా చాలామందిని భయపెడుతున్నసమస్య డయాబెటిస్ లేదా మధుమేహం. మారుతున్న జీవనశైలి, ఆహారం తదితర కారణాలరీత్యా వయసుతో సంబంధం లేకుండా తొందరగా షుగర్‌వ్యాధికి గురవుతున్నారు. కేసుల సంఖ్యకూడా వేగంగానే పెరుగు తోంది. మధుమేహం కారణంగా గుండె జబ్బులు, స్ట్రోక్ , శాశ్వత నరాల, కంటి, పాదాల సమస్యలకు దారితీస్తుంది. అయితేఏ వ్యాధినైనా ముందుగా గుర్తించడం కీలకం. అలాగే డయాబెటిస్‌ను వార్నింగ్ దశలోనే గుర్తించి తగిన జాగ్రత్తలు,సరైన చికిత్స తీసుకుంటే, ప్రభావం తీవ్రతనుంచి బయటపడవచ్చు. అయితే దీన్ని గుర్తించడం ఎలా? ముఖ్యంగా కంటి చూపులో ఎలాంటి మార్పులొస్తాయి? తెలుసుకుందాం!
డయాబెటిస్ లేదా ప్రమాదం పొంచి ఉందని మన శరీరం ముందుగానే హెచ్చరిస్తుంది. ముఖ్యంగా ఎక్కువ సార్లు మూత్రానికి వెళ్లాల్సి రావడం, ఆకలి ఎక్కువగా ఉండటం, తొందరగా ఆలసిపోవడం లాంటి లక్షణాలు గమనిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. ముఖ్యంగా కళ్లలో జరిగే కొన్ని మార్పులు డయాబెటిస్‌కు ముందస్తు లక్షణమని వైద్యులు చెబుతున్న మాట. శరీరంలో చక్కెర స్థాయిలు పెరిగితే అది కంటి నరాలపై ప్రభావం పడుతుంది. దీంతో కంటి చూపు మందగిస్తుంది. ఉదయం లేవగానే కళ్లు మసకగా అనిపించడం, దృష్టి మసక బారుతుంది. అంతేకాదు కళ్లలో నొప్పి, అలసట ఒత్తిడిలాంటి లక్షణాలు కనిపిస్తాయి.
కళ్లు ఉబ్బినట్లు కనిపిస్తే షుగర్‌కు ప్రాథమిక లక్షణంగా భావించి అలర్ట్ అవ్వాలి. రక్తంలో చక్కెర స్థాయి పెరిగి కంటి నరాలపై ప్రభావాన్ని చూపిస్తుంది. ఇలాంటి లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యులను సంప్రదించి, సంబంధిత పరీక్షలు చేయించు కోవాలి. చికిత్స చేయించు కోవాలి. లేదంటే డయాబెటిక్ రెటినోపతికి దారికావచ్చు. టైప్ 1, టైప్ 2 డయాబెటిస్ రోగుల్లో ఇది చాలా సాధారణంగా కనిపిస్తుంది.
డయాబెటిక్ రెటినోపతి ప్రారంభ దశ
దృష్టిలో మచ్చలు లాగా, ఏదో తిరుగుతున్నట్టు కనిపిస్తుంది.
అస్పష్టమైన దృష్టి
దృష్టిలో హెచ్చుతగ్గులు
నల్లటి చుక్కల్లాగా, ఖాళీ ప్రదేశం ఉన్నట్టు
చూపు కోల్పోవడం లాంటివి కనిపిస్తాయి. దీన్ని ముందుగానే గుర్తించి, సరైన చికిత్స తీసుకోకపోతే ఒక్కోసారి శాశ్వతంగా కంటి చూపును కోల్పోవచ్చు.
నోట్: లక్షణాలు కనిపించినా, వ్యాధి నిర్ధారణ అయినంత మాత్రాన ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఆందోళన సమస్య తీవ్రతను మరింత పెంచుతుంది. మా లైఫ్‌స్టయిల్ తో సంబంధమున్న వ్యాధులు చాలా జీవనశైలి మార్పులు, కొద్దిపాటి వ్యాయామం, ఆహారమార్పులతో అదుపులో ఉంచుకోవచ్చు. ఏదైనా నిపుణులైన వైద్యుల సలహాల మేరకు ఈ మార్పులు చేసుకోవాలి.
Comments
Please login to add a commentAdd a comment