Diabetic disease
-
మధుమేహం ముప్పు : ‘కళ్లు’ చెబుతాయి!
ప్రపంచవ్యాప్తంగా చాలామందిని భయపెడుతున్నసమస్య డయాబెటిస్ లేదా మధుమేహం. మారుతున్న జీవనశైలి, ఆహారం తదితర కారణాలరీత్యా వయసుతో సంబంధం లేకుండా తొందరగా షుగర్వ్యాధికి గురవుతున్నారు. కేసుల సంఖ్యకూడా వేగంగానే పెరుగు తోంది. మధుమేహం కారణంగా గుండె జబ్బులు, స్ట్రోక్ , శాశ్వత నరాల, కంటి, పాదాల సమస్యలకు దారితీస్తుంది. అయితేఏ వ్యాధినైనా ముందుగా గుర్తించడం కీలకం. అలాగే డయాబెటిస్‌ను వార్నింగ్ దశలోనే గుర్తించి తగిన జాగ్రత్తలు,సరైన చికిత్స తీసుకుంటే, ప్రభావం తీవ్రతనుంచి బయటపడవచ్చు. అయితే దీన్ని గుర్తించడం ఎలా? ముఖ్యంగా కంటి చూపులో ఎలాంటి మార్పులొస్తాయి? తెలుసుకుందాం!డయాబెటిస్ లేదా ప్రమాదం పొంచి ఉందని మన శరీరం ముందుగానే హెచ్చరిస్తుంది. ముఖ్యంగా ఎక్కువ సార్లు మూత్రానికి వెళ్లాల్సి రావడం, ఆకలి ఎక్కువగా ఉండటం, తొందరగా ఆలసిపోవడం లాంటి లక్షణాలు గమనిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. ముఖ్యంగా కళ్లలో జరిగే కొన్ని మార్పులు డయాబెటిస్‌కు ముందస్తు లక్షణమని వైద్యులు చెబుతున్న మాట. శరీరంలో చక్కెర స్థాయిలు పెరిగితే అది కంటి నరాలపై ప్రభావం పడుతుంది. దీంతో కంటి చూపు మందగిస్తుంది. ఉదయం లేవగానే కళ్లు మసకగా అనిపించడం, దృష్టి మసక బారుతుంది. అంతేకాదు కళ్లలో నొప్పి, అలసట ఒత్తిడిలాంటి లక్షణాలు కనిపిస్తాయి. కళ్లు ఉబ్బినట్లు కనిపిస్తే షుగర్‌కు ప్రాథమిక లక్షణంగా భావించి అలర్ట్ అవ్వాలి. రక్తంలో చక్కెర స్థాయి పెరిగి కంటి నరాలపై ప్రభావాన్ని చూపిస్తుంది. ఇలాంటి లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యులను సంప్రదించి, సంబంధిత పరీక్షలు చేయించు కోవాలి. చికిత్స చేయించు కోవాలి. లేదంటే డయాబెటిక్ రెటినోపతికి దారికావచ్చు. టైప్ 1, టైప్ 2 డయాబెటిస్ రోగుల్లో ఇది చాలా సాధారణంగా కనిపిస్తుంది. డయాబెటిక్ రెటినోపతి ప్రారంభ దశదృష్టిలో మచ్చలు లాగా, ఏదో తిరుగుతున్నట్టు కనిపిస్తుంది. అస్పష్టమైన దృష్టిదృష్టిలో హెచ్చుతగ్గులు నల్లటి చుక్కల్లాగా, ఖాళీ ప్రదేశం ఉన్నట్టుచూపు కోల్పోవడం లాంటివి కనిపిస్తాయి. దీన్ని ముందుగానే గుర్తించి, సరైన చికిత్స తీసుకోకపోతే ఒక్కోసారి శాశ్వతంగా కంటి చూపును కోల్పోవచ్చు. నోట్: లక్షణాలు కనిపించినా, వ్యాధి నిర్ధారణ అయినంత మాత్రాన ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఆందోళన సమస్య తీవ్రతను మరింత పెంచుతుంది. మా లైఫ్‌స్టయిల్ తో సంబంధమున్న వ్యాధులు చాలా జీవనశైలి మార్పులు, కొద్దిపాటి వ్యాయామం, ఆహారమార్పులతో అదుపులో ఉంచుకోవచ్చు. ఏదైనా నిపుణులైన వైద్యుల సలహాల మేరకు ఈ మార్పులు చేసుకోవాలి. -
ప్రతి నలుగురిలో ఒకరికి మధుమేహం.. స్టెరాయిడ్స్ వాడటం వల్లేనా?
ఒకప్పుడు ఫలానా వ్యక్తికి షుగర్ (చక్కెర) వ్యాధి వచ్చిందంట అని చెప్పుకునేవారు. కానీ ఇప్పుడు ఈయనకు కూడా షుగర్ వచ్చిందా అని మాట్లాడుకుంటున్నారు. షుగర్ జబ్బు ఇప్పుడు సాధారణమైంది. ప్రతి నలుగురిలో ఒకరు ఈ వ్యాధి బారిన పడుతున్నారు. ఒకప్పుడు డయాబెటీస్ వ్యాధి (షుగర్) పట్టణ వాసుల్లోనే అధికంగా కనిపించేది. ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాల్లోని వారిలోనూ ఈ వ్యాధి అధికమవుతోంది. మారిన ఆహారపు అలవాట్లు, మానసిక ఒత్తిళ్లు, జీవనశైలిలో మారుల వల్ల ఈ వ్యాధిగ్రస్తుల సంఖ్య పెరుగుతోంది. ఈ నెల 14వ వరల్డ్ డయాబెటీస్ డే సందర్భంగా ప్రత్యేక కథనం. సాక్షి, కర్నూల్: ఇటీవల వైద్య ఆరోగ్య శాఖ నిర్వహించిన ఇంటింటి సర్వేలో పట్టణ ప్రాంతాల్లో 20 శాతం గ్రామీణ ప్రాంతాల్లో 15 శాతం మంది మధుమేహం రోగులున్నట్లు తేలింది. ఈ రోగం ఉందన్న విషయం తెలియని వారు మరో 25 శాతం మంది ఉండే అవకాశం ఉందని వైద్యులు భావిస్తున్నారు. ఏదైనా అనారోగ్య సమస్య వచ్చినప్పుడు చేసిన రక్తపరీక్షల్లో ఎక్కువ శాతం మందికి చక్కెర వ్యాధి బయటపడుతోంది. ఇలా జిల్లాలో ప్రీ డయాబెటీస్‌తో బాధపడుతున్న వారు మరో 15 శాతం మంది ఉన్నట్లు వైద్యులు అంచనా వేస్తున్నారు. కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోని ఎండోక్రైనాలజి విభాగంలో ప్రతి మంగళ, శుక్రవారాలు ఓపీ చికిత్స చేస్తారు. ప్రతి ఓపీకి 200 మంది చికిత్సకు రాగా అందులో వంద మందికి ఇన్సులిన్‌ను ఉచితంగా అందజేస్తున్నారు. మొత్తం ఓపీలో 80 శాతం మంది షుగర్ రోగులే ఉండటం గమనార్హం. ప్రైవేటు ఆసుపత్రుల్లోని ఎండోక్రైనాలజిస్టులు, జనరల్ ఫిజీషియన్ల వద్దకు సైతం ప్రతి యేటా 16 వేల మంది చికిత్స కోసం వస్తున్నట్లు అంచనా. డయాబెటీస్ రకాలు టైప్ 1 డయాబెటీస్ : శరీరం అతి తక్కువ ఇన్సులిన్‌ను తయారు చేస్తుంది. ఈ రకం మధుమేహం గల వ్యక్తులు ఇన్సులిన్‌ను విధిగా తీసుకోవాలి. లేకపోతే ప్రాణాంతకమైన డీకేఏ అనే పరిస్థితిలోకి జారుకుంటారు. ఇది చాలా మందికి పుట్టుకతోనే వస్తుంది. లక్షణాలు ఇందులో అధిక దాహం, ఎక్కువ మూత్ర విసర్జన, ఎక్కువ ఆకలి, హటాత్తుగా బరువు తగ్గిపోవడం, అలసట వంటి లక్షణాలు ఉంటాయి. టైప్ 2 డయాబెటీస్ శరీరానికి తగినంత ఇన్సులిన్ ఉతత్తి కాదు. సాధారణంగా 40 ఏళ్ల వయస్సు దాటిన వారికి ఈ సమస్య ప్రారంభం అవుతుంది. స్థూలకాయం, మానసిక ఒత్తిళ్లు, ఆహారపు అలవాట్లు దీనికి కారణాలు. లక్షణాలు ముందుగా ఎలాంటి లక్షణాలు కనిపించవు. తర్వాత తీవ్ర అలసట, చేతులు,కాళ్లలో తిమ్మిరి, మొద్దుబారడం, తరచూ మూత్రవిసర్జన, లైంగిక అసమర్ధత, గాయాలు త్వరగా మానకపోవడం, అతిగా ఆకలి, అతిగా దాహం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ పరీక్షలు చేయించాలి. ☛ షుగర్ పేషెంట్లు రక్తంలో షుగర్ స్థాయిని తెలుసుకునే పరీక్ష నెలకొకసారి చేయించాలి. ☛ సంవత్సరానికి ఒకసారి మూత్రపిండాల పనితనం (బ్లడ్ యూరియా, క్రియాటినిన్) చేయించాలి. ☛ ఆరు నెలలకోసారి రక్తంలోని కొవ్వుశాతం చేయించుకోవాలి. ☛ మూడు నెలలకోసారి హెచ్‌బీఏ1సీ చేయించుకోవడం మంచిది. తెల్లని పదార్థాలకు దూరంగా ఉండాలి తెల్లగా కనిపించే ఆహార పదార్థాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. చక్కెర, పిండి పదార్థాలు, తెల్లగా కనిపించే నూనెలు, మైదాతో చేసిన పదార్థాలు, జంక్‌ఫుడ్ లాంటివి మానేయాలి. దానికి బదులుగా ఆకుకూరలు, పండ్లను రోజువారీ ఆహారంలో చేర్చుకోవాలి. రోజూ వ్యాయామం తపనిసరి ప్రతిరోజూ అరగంట వాకింగ్‌తో మధుమేహం నియంత్రణలోకి వస్తుందని వైద్యులు చెబుతున్నా రు. దీంతో పాటు యోగా, ప్రాణాయామం, ధ్యానం సైతం ఎంతో మేలు చేస్తాయి.వ్యాయామం వల్ల గుండెపోటు, గుండెకవాటాల వ్యాధుల ముప్పు తగ్గి టైప్–2 మధుమేహంతో బాధపడే వారికి మేలు చేస్తుంది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచితంగా సేవలు జిల్లాలో కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలతో పాటు ఆదోనిలోని ఏరియా ఆసుపత్రి, సీహెచ్‌సీలు, పీహెచ్‌సీలు, అర్బన్‌హెల్త్ సెంటర్లలో షుగర్ వ్యాధికి అవసరమైన షుగర్, లిపిడ్ ప్రొఫైల్, ఆర్ఎఫ్టీ పరీక్షలను రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా చేస్తోంది. ప్రస్తుతం షుగర్ ఉన్న వారికి ఉచితంగా చికిత్స, మందులు అందజేస్తున్నారు. కోవిడ్ తర్వాత పెరిగిన కేసులు కోవిడ్–19 ప్రపంచాన్ని అతలాకుతలం చేయడమే గాక ఇప్పటికీ దాని తాలూకు నష్టం వెంటాడుతూనే ఉంది. ఇందులో ముందుగా షుగర్వ్యాధి మొదటి వరుసలో ఉంది. ఇప్పటికే షుగర్ ఉన్న వారికి కోవిడ్ తర్వాత షుగర్ లెవెల్స్ పెరగగా, కొత్తగా షుగర్ రోగుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. కోవిడ్ సమయంలో స్టెరాయిడ్స్, యాంటిబయాటిక్స్, ఇతర ఔషధాలు అధికంగా వాడటంతో పాటు అధికంగా మాంసాహారం, కొవ్వు పదార్థాలు తీసుకోవడం, వ్యాయామం చేయకపోవడం వంటి కారణాల వల్ల షుగర్ కేసులు పెరిగినట్లు వైద్యులు చెబుతున్నారు. పీ డయాబెటీస్ రోగుల సంఖ్య ఆందోళన కలిగిస్తోంది ఇటీవల ప్రీ డయాబెటీస్ రోగుల సంఖ్య 15 శాతం ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఇది ఆందోళనకర విషయం. పరిస్థితి మారకపోతే భవిష్యత్‌లో దేశ జనాభాలో సగం మంది షుగర్బారిన పడే అవకాశాలు ఉన్నట్లు ఈ గణాంకాలను బట్టి అర్థం అవుతోంది. ఇది అటు దేశ, ఇటు కుటుంబ ఆర్థిక, ఆరోగ్యానికి తీవ్ర నష్టం చేకూరుస్తుంది. ప్రభుత్వం ఈ దిశగా ఆలోచన చేయాల్సి ఉంది. –డాక్టర్ పి. శ్రీనివాసులు, ఎండోక్రైనాలజి హెచ్ఓడీ, కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల డయాలసిస్ రోగుల్లో 60 శాతం షుగర్ రోగులే...! ప్రస్తుతం డయాలసిస్ చేయించుకుంటున్న వారిలో 50 నుంచి 60 శాతం షుగర్ రోగులే ఉంటున్నారు. దీనిని బట్టి కిడ్నీలపై షుగర్ ఎలాంటి ప్రభావం చూపుతుందో అర్థం అవుతుంది. మూత్రంలో ప్రోటీన్ ఎక్కువగా పోతుంటే జాగ్రత్త పడాలి. ఇందుకోసం ఇప్పటికే షుగర్ ఉన్న వారు నెలకోసారి మూత్రపరీక్ష చేయించుకోవాలి. ముందుజాగ్రత్తగా షుగర్, బీపీని నియంత్రణలో ఉంచుకోవాలి. –డాక్టర్ పీఎల్. వెంకట పక్కిరెడ్డి, అసిస్టెంట్ ప్రొఫెసర్, నెఫ్రాలజి విభాగం, కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల -
మాటలతోనే మధుమేహాన్ని పట్టేస్తుంది!
మీరు మధుమేహం బారిన పడ్డారో లేదో తెలుసుకోవాలని అనుకుంటున్నారా? కానీ... దూరంగా ఉండే డయాగ్నస్టిక్ సెంటర్‌కు వెళ్లి రక్త పరీక్షలు చేయించుకోవడం ఇష్టం లేదా? ఇంట్లోకి వచ్చి రక్త నమూనాలు సేకరించినా వద్దని అనుకుంటున్నారా? అయితే ఈ వార్త మీ కోసమే. మీ స్మార్ట్‌ఫోన్‌లో ఓ అప్లికేషన్‌ను డౌన్లోడ్ చేసుకుని ఓ పదిసెకన్లపాటు మాట్లాడితే మీకు డయాబిటీస్ ఉన్నదీ లేనిది స్పష్టమైపోతుంది అంటున్నారు క్లిక్ ల్యాబ్ శాస్త్రవేత్తలు. మన మాటకూ మధుమేహానికీ సంబంధం ఏమిటనేదేనా మీ ప్రశ్న.. అయితే చదివేయండి! మారిన జీవనశైలి, ఆహారపు అలావాట్లు, శారీరక శ్రమ తగ్గడం వంటి అనేక కారణాలతో ప్రపంచంలో ఏటికేడాదీ మధుమేహ బాధితులు పెరిగిపోతున్నారన్నది అందరికీ తెలిసిన విషయమే. మరీ ముఖ్యంగా భారతదేశం టైప్-2 మధుమేహ వ్యాధిగ్రస్తులకు రాజధానిగా మారిపోయిందన్న వార్తలూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ వ్యాధిని వీలైనంత తొందరగా, సులువుగా గుర్తించేందుకు తగిన పరీక్షలు అభివృద్ధి చేసేందుకు ప్రపంచవ్యాప్తంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. అంతర్జాతీయ బయోటెక్ కంపెనీ క్లిక్ ల్యాబ్ వీటిల్లో ఒకటి. ఈ సంస్థ శాస్త్రవేత్తలు కొందరు ఇటీవలే ఒక అధ్యయనం నిర్వహించి కేవలం వాయిస్ రికార్డింగ్ ద్వారా మాత్రమే మధుమేహం సోకిన వారిని గుర్తించవచ్చునని నిర్ధారించారు. అధ్యయనంలో భాగంగా క్లిక్ ల్యాబ్ శాస్త్రవేత్తలు 267 మందిని ఎంచుకున్నారు. వీరిలో 192 మంది వ్యాధి సోకనివారు. మిగిలిన 75 మంది మధుమేహంతో బాధపడుతున్న వారు. వీరందరి స్మార్ట్ఫోన్లలో శాస్త్రవేత్తలు ప్రత్యేకమైన ఒక అప్లికేషన్‌ను ఇన్స్టాల్ చేశారు. అధ్యయనంలో పాల్గొన్న వారు ఈ అప్లికేషన్‌ను ఓపెన్ చేసి కొన్ని నిర్దిష్ట పదాలతో కూడిన వాక్యాన్ని రోజుకు ఆరుసార్లు రికార్డు చేయమని కోరారు. మాట్లాడే వేగాన్ని బట్టి ఈ ఆడియో రికార్డింగ్ ఆరు నుంచి పది సెకన్ల నిడివి మాత్రమే ఉంటుంది. సూక్ష్మస్థాయి తేడాలు... ఈ పద్ధతిలో శాస్త్రవేత్తలకు మొత్తం 18465 రికార్డింగ్‌లు లభించాయి. స్థాయి, తీవ్రత వంటి 14 ధ్వని సంబంధిత అంశాలను విశ్లేషించి చూసినప్పుడు ఆశ్చర్యకరమైన విషయాలు తెలిశాయి. మధుమేహ రోగుల రికార్డింగ్‌లలో సాధారణ పరిస్థితుల్లో మనం అస్సలు వినలేని సూక్ష్మస్థాయి తేడాలున్నట్లు స్పష్టమైంది. ప్రత్యేకమైన సిగ్నల్ ప్రాసెసింగ్ సాఫ్ట్వేర్ మాత్రమే వీటిని గుర్తించగలదన్నమాట. మధుమేహులు, ఇతరుల మధ్య ఉన్న తేడాలు చాలా సుస్పష్టంగా ఉన్నాయని శాస్త్రవేత్తలు తెలిపారు. మధుమేహం బారిన పడ్డ వారి స్వరంలో సూక్ష్మమైన తేడాలు వస్తాయని ఈ అధ్యయనం చెబుతోంది. కృత్రిమ మేధను జోడించారు... క్లిక్ ల్యాబ్ శాస్త్రవేత్తలు తమ అధ్యయనం ద్వారా తెలుసుకున్న విషయాలకు కృత్రిమ మేధను జోడించడంతో ఫలితాలు మరింత కచ్చితత్వంతో రావడం మొదలైంది. వ్యక్తి వయసు, పురుషుడా? మహిళనా? ఎత్తు?, బరువు? వంటి అంశాలన్నింటినీ పరిగణలోకి తీసుకుని స్వరాన్ని విశ్లేషించేందుకు రూపొందించిన కృత్రిమమేధ సాఫ్ట్‌వేర్‌ను పరీక్షించినప్పుడు మహిళల్లో టైప్-2 వ్యాధిని 89 శాతం కచ్చితంగా గుర్తించినట్లు తెలిసింది. పురుషుల విషయంలో ఈ కచ్చితత్వం 86 శాతం మాత్రమే. టెక్నాలజీకి మరింత పదును పెడితే కచ్చితత్వం కూడా పెరుగుతుందని, పైగా ప్రస్తుతం పరగడపున నిర్వహిస్తున్న ఫాస్టింగ్ బ్లడ్ టెస్ట్‌ల కచ్చితత్వం 85 శాతం మాత్రమేనని శాస్త్రవేత్తలు వివరించారు. సంప్రదాయ పద్ధతుల్లో నిర్వహించే గ్లైకేటెడ్ హిమోగ్లోబిన్, ఓరల్ గ్లూకోజ్ టాలరెన్స్ పరీక్షలు కూడా 91 శాతం, 92 శాతం కచ్చితత్వంతో కూడిన ఫలితాలను మాత్రమే ఇస్తున్నట్లు క్లిక్ ల్యాబ్స్ శాస్త్రవేత్త జేసీ కాఫ్మాన్ తెలిపారు. స్వరం ద్వారా మధుమేహాన్ని గుర్తించే పద్ధతిని అందరికీ అందుబాటులోకి తెచ్చేందుకు మరిన్ని పరీక్షలు చేపడుతున్నామని చెప్పారు. ఈ పద్ధతి ద్వారా మధుమేహ పరీక్షలకు ప్రస్తుతం అవుతున్న వ్యయప్రయాసలను గణనీయంగా తగ్గించవచ్చునని అభిప్రాయపడ్డారు. పరిశోధన వివరాలు మేయో క్లినిక్ ప్రొసీడింగ్స్: డిజిటల్ హెల్త్ జర్నల్ తాజా సంచికలో ప్రచురితమయ్యాయి. -
Numbness and Tingling: కాళ్లు, పాదాలు తరచూ మొద్దుబారుతున్నాయా? ఇలా చేయండి..
కాళ్లు, పాదాలు మొద్దుబారడం అనేది ప్రతి ఒక్కరికీ అనుభవంలోకి వస్తూనే ఉంటుంది. ఇది చాలా వరకు తాత్కాలిక నంబ్నెస్ అయి ఉంటుంది. చిన్నపాటి చికిత్సలతో ఈ సమస్య నుంచి బయటపడవచ్చు. తాత్కాలిక తిమ్మిర్లు... కూర్చున్న భంగిమ ప్రధాన కారణమై ఉంటుంది. కాళ్లు మడత పెట్టి ఎక్కువ సేపు అదే భంగిమలో కూర్చున్నప్పుడు నరాలు, రక్తనాళాల మీద ఒత్తిడి కలిగి రక్తప్రసరణ వేగం మందగిస్తుంది. ఒత్తిడికి లోనైన ప్రదేశం నుంచి కింద భాగం తిమ్మిరి పట్టేస్తుంది. ఎక్కువ సేపు మోకాళ్ల మీద కూర్చోవడం, పాదాల మీద కూర్చోవడం వల్ల కూడా తాత్కాలిక తిమ్మిరి వస్తుంది. అలాగే సాక్స్, షూస్ మరీ బిగుతుగా ఉన్నప్పుడు కాళ్లు, పాదాలు తిమ్మిర్లకు లోనవుతాయి. కొన్నిసార్లు డ్రస్ కూడా కారణం కావచ్చు. స్కిన్‌టైట్ డ్రస్ వేసుకున్నప్పుడు తిమ్మిరి వస్తుంటే ఆ దుస్తులను మానేయడమే అసలైన ఔషధం. చదవండి: Health Tips: చిగుళ్లనుంచి తరచూ రక్తం వస్తుందా? ఇవి తిన్నారంటే.. ఇంట్లోనే సాంత్వన... ►కాళ్లను చాచి విశ్రాంతి తీసుకుంటే రక్తప్రసరణ క్రమబద్ధమై కొద్ది నిమిషాల్లోనే ఉపశమనం కలుగుతుంది. ►మొద్దుబారిన చోట చల్లటి నీటిని ధారగా పోయడం వల్ల ఫలితం ఉంటుంది. తిమ్మిరితోపాటు కండరాలు పట్టేసినట్లనిపిస్తే గోరువెచ్చటి నీటిని ధారగా పోయాలి లేదా వేడి నీటిలో ముంచిన టవల్‌తో కాపడం పెట్టాలి. ►బయట ఉన్నప్పుడు పైవేవీ సాధ్యం కాదు. కాబట్టి కాలికి, పాదానికి మృదువుగా వేళ్లతో వలయాకారంగా రుద్దుతూ ఐదు నిమిషాల సేపు మసాజ్ చేయాలి. ►ఓ గ్లాసు నీళ్లు తాగి పది నిమిషాల సేపు నడవాలి. అలాగే కుర్చీలో కూర్చుని కాళ్లను సౌకర్యవంతంగా జారవేసి మడమ దగ్గర కీలు కదిలేటట్లు పాదాన్ని క్లాక్‌వైజ్‌గా పదిసార్లు, యాంటీ క్లాక్‌వైజ్‌గా పదిసార్లు తిప్పాలి. ఇలాగైతే... డాక్టర్‌ను కలవాల్సిందే! ►వెన్ను, హిప్, కాళ్లు, మడమలకు గాయాలైనప్పుడు, డయాబెటిక్ న్యూరోపతి కండిషన్లో కాళ్లు మొద్దుబారడం, తిమ్మిర్లు పట్టడం జరుగుతుంటుంది ►సయాటిక్ నర్వ్ ఇరిటేషన్‌కు లోనయితే నడుము కింది నుంచి పాదం వరకు తిమ్మిరి, మొద్దుబారుతుంటుంది ►పీరియడ్స్ నిడివి పెరిగి రక్తహీనతకు లోనయినప్పుడు తరచు తిమ్మిర్లు రావచ్చు ►యాంటీడిప్రెసెంట్స్, కార్టికోస్టిరాయిడ్స్ వంటి మందులు రక్తప్రసరణ మీద ప్రభావం చూపిస్తాయి. కాబట్టి ఆ మందుల వాడకం తర్వాత తిమ్మిర్లకు లోనవుతుంటే మందుల మార్పు కోసం డాక్టర్‌ను సంప్రదించాలి. చదవండి: పాదాలను బట్టి వారెలాంటివారో అంచనా వేయొచ్చట!!.. ఐతే.. -
కోమా నుంచీ బయటపడవచ్చు!
సినిమాల్లో కోమా కేసులను చూసి చూసి మనలో చాలామందికి ఓ దురభిప్రాయం ఉంది. కోమాలోకి వెళ్తే... అది దాదాపు గా మరణానికి ముందు దశ అనీ... అలా కోమాలోకి వెళ్లినవాళ్లు ఒక పట్టాన వెనక్కు రారని! కానీ... కోమాలోకి వెళ్లిన దాదాపు గా 80 శాతం కేసుల్లో మనుషులు వెనక్కు సురక్షితంగా వస్తుంటారు. ఇక కోమా గురించి మరో అపోహ కూడా ఉంది. అదేదో యాక్సిడెంట్ అయి... తలకూ, మెదడుకు తీవ్రమైన గాయం అయినవారిలోనే చాలామంది కోమాలోకి వెళ్తుంటారని!! కానీ... ఆహారంలో తగినంత ఉప్పు లేకపోవడం మొదలుకొని, ఓ సాయంత్రంవేళ ఆల్కహాల్ ఎక్కువగా తాగేసినా కోమాలోకి వెళ్తుంటారని. ఇలా కోమాపై ఎన్నెన్నో అపోహలు. అలాంటి అపోహలు తొలగిస్తూ... స్పృహతప్పిన స్థితి మరింత గాఢంగా ఉండటమే కోమా అనీ... ఏ 20 శాతం కేసులు మినహా మిగతా వాళ్లంతా బయటపడేందుకు అవకాశముందని చెబుతూ ‘కోమా’పై అవగాహన పెంచే కథనం ఇది. స్పృహ కోల్పోవడం మనందరికీ తెలిసిందే. కోమా అంటే కూడా స్పృహ లేని స్థితే. కాకపోతే మరింత గాఢమైన స్థితి. అంటే ‘ప్రొఫౌండ్ అన్కాన్షియస్’ స్టేజ్ అని చెప్పవచ్చు. వెలుతురుకూ, నొప్పికీ, దెబ్బకూ లేదా మరే ఇతర అంశాలకూ స్పందన లేకుండా నిద్రా, మెలకువలు... ఈ రెండింటికీ అతీతమైన స్థితే... ‘కోమా’. కోమాకు నూరు కారణాలంటూ వైద్యుల మాటల్లో ఓ వాడుక ఉంది. అయితే సాధారణంగా కోమాకు మూడంటే మూడు ప్రధాన కారణాలుంటాయని చెప్పుకోవచ్చు. 1. మెదడుకు సంబంధించిన జబ్బులవల్ల కోమాలోకి జారిపోవడం. 2. శరీరంలోని ఇతర అవయవాల వల్ల కోమాలోకి వెళ్లడం. 3. ఇతర కారణాలు అంటే... ఆల్కహాల్, డ్రగ్స్, విషపదార్థాలు ఓరల్‌గా తీసుకోవడం వల్లగానీ, కార్బన్డయాక్సైడ్, సయనైడ్ వంటి విషవాయువులు పీల్చడం వల్లగానీ లేదా ఒక్కోసారి వడదెబ్బ సింపుల్ వంటి కారణాలతోనూ కోమాలోకి వెళ్లడం. కోమా – కారణాలు: మెదడుకు సంబంధించని కారణాలతో కోమాలోకి వెళ్లడమన్నది సాధారణ వడదెబ్బ నుంచి మొదలుకొని దేహంలోని కీలకమైన అవయవాలకు (వైటల్ ఆర్గాన్స్) వచ్చే రకరకాల సమస్యల వరకు దేని కారణంగానైనా జరగవచ్చు. కార్డియాక్ అరెస్ట్ – సాధారణంగా కార్డియాక్ అరెస్ట్‌తో గుండె ఆగినప్పుడు కార్డియోపల్మునరీ రిససియేషన్ (సీపీఆర్) అనే ప్రక్రియ ద్వారా గుండెపై మసాజ్ చేసినట్లుగా కొంత ఒత్తిడి కలిగిస్తూ దాన్ని తిరిగి పనిచేయించడానికి ప్రయత్నిస్తారు. ఈ సీపీఆర్ చాలాసేపు కొనసాగినప్పుడు వెళ్లే కోమా నుంచి బయటపడేసేందుకు రోగికి ‘హైపోథెర్మియా’ అనే ప్రక్రియతో చికిత్స చేస్తారు. డయాబెటిస్తో – సాధారణంగా డయాబెటిస్ ఉన్నవారు తమ దేహంలో చక్కెర పెరగడం వల్ల కలిగే అనర్థాలు రాకుండా ఉండేందుకంటూ క్రమం తప్పకుండా మందులు వాడుతుంటారు. ఈ క్రమంలో ఒక్కోసారి సరిగ్గా ఆహారం తీసుకోకుండానూ మందులు మాత్రం వేళకు వేసుకుంటూ ఉంటారు. దాంతో అదనపు చక్కెరమీద పనిచేయాల్సిన మందులు... అన్నం తినని కారణంగా ఉన్న కొద్దిపాటి చక్కెరపైనా పనిచేసి, వాటినీ తగ్గించడంతో శరీరంలో చక్కెర పాళ్లు చాలా ఎక్కువగా తగ్గిపోతాయి. అంటే సాధారణంగా 100–140 వరకు ఉండాల్సిన షుగర్ లెవెల్స్ 30–20 కంటే తక్కువకు పడిపోతాయి. అలాంటప్పుడు రోగి కోమాలోకి వెళ్లే ప్రమాదం ఉంటుంది. దీన్ని ‘హైపోగ్లైసీమిక్ కోమా’ అంటారు. అలాంటి పరిస్థితుల్లో చక్కెర రోగులకు డాక్టర్లే చెప్పిమరీ చాక్లెట్ వంటి తీపిపదార్థాలు తినిపిస్తారు. ఇక ‘డయాబెటిక్ కోమా’ అని మరోటి ఉంది. చక్కెర రోగులు వారు తీసుకోవాల్సిన మందుల్ని సరిగ్గా తీసుకోకపోవడం వల్ల అలాగే సరైన చికిత్స తీసుకోకపోవడం వల్ల చక్కెరపాళ్లు విపరీతంగా పెరగడం వల్ల కోమాలోకి వెళ్లే పరిస్థితి ఏర్పడవచ్చు. ఇందులోనూ మళ్లీ రెండు రకాలు... 1. చక్కెర పాళ్లు 500 ఎంజీ/డీఎల్ కంటే ఎక్కువగా పెరగడంతో కోమాలోకి వెళ్లే పరిస్థితి వస్తుంది. దీన్ని హైపర్ ఆస్మోలార్ కోమా అంటారు. 2. దేహంలోని వ్యర్థాలు (కీటోన్స్, యాసిడ్స్) పెరగడం వల్ల కోమాలోకి వెళ్లే పరిస్థితి వస్తుంది. దీన్ని ‘కీటో అసిడోటిక్ కోమా’ అంటారు. ఈ రెండు సందర్భాల్లోనూ ఇన్సులిన్, సెలైన్ ఇచ్చి, దేహంలో చక్కెర పాళ్లు తగ్గించడం వల్ల కోమా స్థితి నుంచి వెనక్కు తీసుకురావచ్చు. హైపో న్యాట్రీమిక్ కోమా: మన శరీరంలో చక్కగా పనిచేయడానికి ఎన్నో లవణాలు అవసరమన్న సంగతి మనకు తెలిసిందే. ఇందులో సోడియం, పొటాషియం, క్యాల్షియం, మెగ్నీషియం వంటివి ముఖ్యమైనవి. ఉదాహరణకు మనం తీసుకునే ఉప్పు ద్వారా మనకు ఒంట్లోకి సోడియం చేరుతుంది. ఇది 140–150 మిల్లీ ఈక్వివాలెంట్స్ పరిమాణంలో ఉండటం అన్నది సాధారణమైన కొలత. ఆ పరిమాణం 110 కంటే తగ్గితే మనిషి కోమాలోకి వెళ్లే అవకాశం ఉంది. బీపీకి చికిత్స తీసుకుంటున్నవారిలో మందుల వల్ల ఈ పరిస్థితి చాలా సాధారణంగా కనిపిస్తుంది. కారణం... బీపీని నియంత్రించడానికి డాక్టర్లు ఉప్పు తగ్గించమంటారు. దాంతో కొందరు ఉప్పు పూర్తిగా మానేస్తారు. ఫలితంగా ఈ పరిస్థితి వచ్చే అవకాశం ఎక్కువ. ఐవీ ఫ్లుయిడ్స్‌తో ఈ సమస్యను అధిగమించవచ్చు. ఒక ఎవరైనా రోగి పొటాషియం లవణాల లోపం వల్ల కోమాలోకి వెళ్లే పరిస్థితి వస్తే ముందే కాసిన్ని కొబ్బరినీళ్లు తాగించడం వల్ల కోమాను నివారించవచ్చు. హైపర్ న్యాట్రీమిక్ కోమా: ఇది దేహంలో సోడియం ఎక్కువ కావడం వల్ల వచ్చే సమస్య. ఉదాహరణకు సోడియం పాళ్లు 165 మిల్లీ ఈక్వివలెంట్స్ కంటే ఎక్కువ కావడం వల్ల కూడా కోమాలోకి వెళ్లే ప్రమాదం ఉంది. లివర్ కోమా: కాలేయం చాలా జబ్బుల వల్ల దెబ్బతింటుంది. ఎక్కువగా కొవ్వుండే ఆహారపదార్థాలు తినేవారి నుంచి మొదలుకొని... హెచ్‌బీసీ, హెచ్‌బీబీ వంటి వైరస్ల వల్ల లివర్ దెబ్బతిన్నప్పుడు కోమాలోకి వెళ్లే పరిస్థితి వస్తుంది. కిడ్నీ కోమా: మూత్రపిండాలు దెబ్బతినడం వల్ల కోమాలోకి వెళ్లే పరిస్థితి. అయితే ఇందులో 99% డయాబెటిస్ కారణంగా కిడ్నీలు దెబ్బతిని, కోమాలోకి వెళ్లే కేసులే ఎక్కువ. ఇలాంటివారికి డయాలసిస్‌తో చికిత్స చేయాల్సి ఉంటుంది. గ్లాస్గో కోమా స్కేల్ కోమా తీవ్రతను కొలిచేందుకు ఉపయోగించే స్కేల్‌ను ‘గ్లాస్గో కోమా స్కేల్’గా చెబుతారు. ఇందులో స్కేల్ అంటూ ఏదీ ఉండదుగానీ.. రోగికి ఇస్తున్న సూచనల ఆధారంగా వారు స్పందించే ఒక్కోరకమైన స్పందనకూ ఒక్కో స్కోర్ ఇస్తారు. ఉదాహరణకు కనురెప్పలు కదిలించమంటూ సూచన ఇస్తే వారు కనబరిచే కంటి కదలికలకూ, నోటిమాటకు స్పందించే తీరుకు, ఇలా... ఒక్కోదానికి కొంత స్కోర్ ఉంటుంది. ఇందులో డాక్టర్ ఇచ్చిన ఏ ఆదేశానికీ స్పందన లేకపోతే కనిష్టంగా స్కోర్ మూడుగా నమోదవుతుంది. అలాగే డాక్టర్ ఆదేశాలకు రోగినుంచి స్పందనలు పెరుగుతున్న కొద్దీ స్కోర్ పెరుగుతుంది. అంటే మూడు స్కోర్ ఉంటే అది రోగి నుంచి ఏ స్పందనా లేని పరిస్థితి. అంటే అది పూర్తిస్థాయి కోమా అన్నమాట. అదే స్కోర్ పెరిగి అన్ని ఆదేశాలకూ స్పందిస్తే అది నార్మల్‌గా 15 ఉంటుంది. అంటే గ్లోస్గో స్కేల్ ఆదేశాలకు రోగి స్పందిస్తున్న కొద్దీ కోమా నుంచి దూరం అవుతున్నాడన్నాడని అర్థం. కోమాలోకి వెళ్లాల్సిన పరిస్థితి వస్తే రోగిని బాగా గాలి వచ్చే ప్రదేశంలో పడుకోబెట్టాలి. అతడిని వెల్లకిలా కాకుండా ఒకవైపునకు తిరిగి ఉండేలా పడుకోబెట్టాలి. నోట్లో గుడ్డలు కుక్కడం వంటివి చేయవద్దు. కోమాలో వెళ్లిన వారిచేత బలవంతంగా నీళ్లు తాగించడం వంటివి సరికాదు. స్పృహలోకి తెప్పించేందుకు చేసే ఈ పనులు రోగులకు ప్రమాదకరంగా పరిణమించవచ్చు. ఓ వ్యక్తికి ప్రమాదంలో మెడకు దెబ్బతగిలిందని భావిస్తే సాధ్యమైనంత వరకు మెడను కదలనివ్వకుండా చూడాలి. ఇలా కోమా చాలా పెద్దకారణాల వల్లనే కాకుండా, చిన్న చిన్న కారణాల వల్ల కూడా కలగవచ్చు. వాటిని చక్కదిద్దితే దాదాపు 80 శాతం రోగుల్లో కోమాను నివారించవచ్చు. కోమాలోకి వెళ్తే చేయాల్సిన ఏబీసీ...కోమాలో రోగికి చేయాల్సిన ప్రథమ చికిత్సను ఏబీసీగా చెప్పవచ్చు. ►ఏ – ఎయిర్ వే... అంటే ఊపిరి తీసుకోడానికి నోట్లో గల్ల వంటిది ఉంటే గుడ్డతో గాని, చేత్తోగాని తొలగించాలి. ►బి – బ్రీతింగ్ ... అంటే గాలి బాగా ఆడేలా, ఊపిరి తీసుకోగలిగేలా చూడాలి. ►సి – సర్క్యులేషన్... అంటే రక్తప్రసరణ వ్యవస్థ సరిగ్గా ఉండేలా చూడటంతో పాటు తల వంటి చోట్ల దెబ్బతగిలి రక్తస్రావం అవుతుంటే దాన్ని ఆపడం వల్ల. ఈ మూడు ప్రాథమిక విషయాలను కాస్తంత విపులీకరించి చూస్తే తీసుకోవాల్సిన జాగ్రత్తలివి. ఈ ప్రథమ చికిత్సల తర్వాత తప్పనిసరిగా రోగిని వీలైనంత త్వరగా డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లాలి. -
ముందు చూపే మందు
సాక్షి,గుంటూరు : కొండపల్లికి చెందిన వెంకటలక్ష్మికి మధుమేహం ఉంది. కొంతకాలంలో మందులు సరిగ్గా వాడటం లేదు. పది రోజుల కిందట అకస్మికంగా స్పృహ కోల్పోవడంతో నగరంలోని ఓ కార్పొరేట్ ఆస్పత్రికి తరలించారు. ఆ సమయంలో శరీరంలో షుగర్ లెవల్స్ 800 ఉండటంతోపాటు, ఊపిరి తిత్తుల ఇన్ఫెక్షన్ సోకింది. వారం రోజులు ఐసీయూలో ఉంచి చికిత్స చేయడంతో ప్రాణాపాయం నుంచి బయట పడింది. పటమటకు చెందిన వెంకటేశ్వర్లు రెండు రోజుల కిందట అకస్మాతుగా ఆయాసంతో పడిపోవడంతో నగరంలోని ఓ ప్రవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. అతనికి ఇసీజీ తీయగా గుండెపోటుగా నిర్ధారణించారు. మధుమేహం కారణంగా ఛాతీ నొప్పి రాలేదని తేల్చారు. అసలు అతనికి అప్పటి వరకూ మధుమేహం ఉన్నట్లు కూడా తెలియకపోవడంతో తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఇలా వీరిద్దరే కాదు..ఇటీవల కాలంలో చాలా మంది మధుమేహం ఉన్నప్పటి తమకు తెలియక పోవడం, తెలిసినా మందులు వాడక పోవడంతో తీవ్రమైన దుష్సలితాలకు దారి తీస్తున్నట్లు చెపుతున్నారు, చిన్న వయస్సులోనే వ్యాధి బారిన ప్రస్తుతం మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్ల కారణంగా 20 ఏళ్లకు మధుమేహం భారిన పడుతున్నారు. జిల్లాలో 2.50 లక్షల మంది మధుమేహులు ఉండగా, మరో 4 లక్షల మంది ఫ్రీ డయాబెటిక్ స్టేజ్‌లో ఉన్నారు. మధుమేహుల్లో 10 శాతం మంది 25 నుంచి 35 సంవత్సరాల మధ్య వయస్సు వారు ఉన్నారు. ఒకప్పుడు వంశపారంపర్యంగా 40 సంవత్సరాలు దాటిన వారిలో వచ్చేదని ఇప్పుడు 20 ఏళ్లకే వస్తుంది. దుష్ఫలితాలు ఇలా.. గుండె జబ్బులకు గురవుతున్న వారిలో 50 శాతం మంది మధుమేహమే కారణంగా నిర్ధారిస్తున్నారు. మధుమేహం ఉన్న వారిలో రక్తనాళాలు బిరుసుగా మారడం, స్పర్శ కోల్పోవడంతో గుండెపోటుకు గురైనప్పటికీ నొప్పి తెలియదని, నిద్రలోనే ప్రాణాలు వదిలే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. మధుమేహం ఉన్న వారిలో మెదడుపోటుకు గురయ్యే వారు సైతం ఎక్కువగా ఉంటున్నారు. కిడ్నీలు పాడయ్యే ప్రమాదం మధుమేహం అదుపులోలేని వారిలో దాని ప్రభా వం కిడ్నీలపై చూపుతున్నారు. కిడ్నీల పనితీరు క్షీణిస్తున్న కొద్దీ క్రియాటిన్ పెరడగం, రక్తపోటు అదుపులో లేకపోవడం జరుగుతుంది. డయాలజిస్ చేయించుకోవాల్సిన పరిస్థితి నెలకొం టుంది. మధుమేహం కారణంగా ఒకసారి కిడ్నీలు దెబ్బతింటే మరలా దానిని తిరిగి యథాస్థితికి రావడం జరగదు. దీంతో డయాలసిస్ చేయించుకుంటూ కాలం వెళ్లదీయాల్సిన దయనీయ స్థితి నెలకొంటుందని వైద్యులు చెపుతున్నారు. మధుమేహులు ప్రతి ఆరు నెలలకు కిడ్నీలు పరీక్షలు చేయించుకుంటే మేలు కంటిచూపు కోల్పోయే ప్రమాదం మధుమేహం ఉన్న వారిలో కంటిలోని రెటీనా(కంటినరం) మూసుకు పోవడం వలన చూపు కోల్పోయే ప్రమాదం ఉంది. మధుమేహం ఎక్కువ కాలం అదుపులో లేని వారిలో కంటి రెటీనా దెబ్బతినే అవకాశం ఉన్నట్లు వైద్యులు చెపుతున్నారు. ఉన్న చూపును కాపాడుకోవడం మినహా, పోయిన చూపును తిరిగి రావడం కుదరదని వైద్యులు చెపుతున్నారు. అవగాహన అవసరం మధుమేహంపై సరైన అవగాహనతో అదుపులో ఉంచుకో వడం మేలు. మధుమేహం ఉన్న వారిలో 50 శాతం మందికి తమకు వ్యాధి ఉన్నట్లు కూడా తెలియదు. ఉన్నట్లు తెలిసిన వారిలో కూడా 50 శాతం మంది మందులు వాడుతుండగా, వారిలో సగం మంది వ్యాధిని అదుపులో ఉంచుకోగలుగుతున్నారంటే..మొత్తంగా 12.5శాతం మందిలో మాత్రమే వ్యాధి నియంత్రణలో ఉంటుంది. కొందరు మధుమేహ లెవల్స్ పెరిగిపోవడంతో కోమాకు చేరుకుని చికిత్సకోసం వచ్చిన వారు ఉన్నారు. అలాంటి వారికి ఇన్సులిన్ థెరఫీద్వారా చికిత్స అందిస్తున్నాం. ఆహార నియమాలు పాటిం చడం, శారీరక వ్యాయామం, ఒత్తిడి లేని జీవన విధానంలో అధిగమించవచ్చు. –డాక్టర్ కె వేణుగోపాలరెడ్డి, మధుమేహ నిపుణులు -
ఇవి తీసుకుంటే మధుమేహానికి దూరం
లండన్ : కొవ్వు అధికంగా ఉండే వెన్న, పెరుగు, మీగడ వంటి డైరీ ఉత్పత్తులను తరచూ తీసుకుంటే టైప్ 2 మధుమేహం ముప్పు తగ్గించుకోవచ్చని తాజా అథ్యయనం వెల్లడించింది. వీటిని తక్కువగా తినేవారితో పోలిస్తే అత్యధికంగా తీసుకునేవారిలో టైప్ 2 మధుమేహం ముప్పు 30 శాతం తక్కువగా ఉన్నట్టు పరిశోధకులు గుర్తించారు. కాగా కొవ్వు తక్కువగా ఉండే డైరీ ఉత్పత్తులను ఎంచుకోవాలని అమెరికన్లకు యూఎస్ డైటరీ గైడ్‌లైన్స్ సూచిస్తున్నాయి. పాలు, ఇతర డైరీ ఉత్పత్తుల్లో కొవ్వు, కేలరీలు అధికంగా ఉంటాయనే ప్రచారం ఊపందుకున్న క్రమంలో తాజా అథ్యయనం ఆసక్తికర అంశాలను ముందుకుతెచ్చింది. డైరీ ఉత్పత్తులను తీసుకోకుండా ప్రజలను ప్రోత్సహించరాదని తమ అథ్యయనంలో వెల్లడైందని బ్రిటన్‌కు చెందిన యూనివర్సిటీ ఆఫ్ కేంబ్రిడ్జి పరిశోధకులు తెలిపారు. డైరీ ఆహారంతో చేకూరే జీవక్రియల ప్రయోజనాలపై పునఃసమీక్ష అవసరమని పేర్కొన్నారు. డైరీ ఉత్పత్తుల్లో గుండె జబ్బులకు దారితీసే ఎల్డీఎల్ కొలెస్ర్టాల్‌ను పెంచే కొవ్వు ఉత్పత్తులు ఉంటాయని గత అథ్యయనాల ఆధారంగా వీటిని పరిమితంగా తీసుకోవాలని సూచిస్తున్న క్రమంలో తాజా అథ్యయనం వెల్లడించిన అంశాలు ఆసక్తికరంగా మారాయి. గత 20 ఏళ్లుగా 63,600 మందికి పైగా హెల్త్ రికార్డులను పరిశీలించిన మీదట తాజా అథ్యయనం ఈ అంచనాలకు వచ్చింది. వీరిలో అత్యధికంగా డైరీ కొవ్వులను తీసుకున్న వారిలో టైప్ 2 మధుమేహం వచ్చిన వారు తక్కువగా ఉన్నట్టు తేలింది. డైరీ ఫ్యాట్ తక్కువగా తీసుకున్న వారిలో టైప్ 2 మధుమేహం బారిన పడిన వారు ఎక్కువ మంది ఉన్నట్టు పరిశోధనలో తేలింది. డైరీ ఫ్యాట్ బయోమార్కర్లకు వారి టైప్ 2 మధుమేహం ముప్పు తక్కువగా ఉండటానికి దగ్గరి సంబంధం ఉన్నట్టు తొలిసారిగా తమ అథ్యయనంలో వెల్లడైందని అథ్యయనానికి నేతృత్వం వహించిన యూనివర్సిటీ ఆఫ్ కేంబ్రిడ్జికి చెందిన డాక్టర్ ఫుమియకి ఇమముర పేర్కొన్నారు. దీనిపై విస్తృత అథ్యయనం అవసరమని తమ పరిశోధనలో గుర్తించామని చెప్పారు. -
ఉమ్మితో మధుమేహ పరీక్ష
మనోహరాబాద్(తూప్రాన్) : టీఆర్ఎస్ పాలన వచ్చిన తర్వాత రాష్ట్రంలో ప్రభుత్వ ఆసుపత్రులు బలోపేతం అయ్యాయని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం ముప్పిరెడ్డిపల్లి పారిశ్రామికవాడలో కొత్తగా నిర్మించిన డయాబెటోమిక్స్ పరిశ్రమను శనివారం మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, టీఐసీసీ డైరెక్టర్ వెంకటనర్సింహారెడ్డి, పారిశ్రామికవేత్త వరప్రసాద్‌రెడ్డి తదితరులతో కలసి మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. అనంతరం పరిశ్రమలో డయాబెటిక్ పరీక్ష పరికరాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ.. వైద్య పరీక్షల ఖర్చులకు భయపడి గ్రామీణులు ఆస్పత్రులకు వెళ్లడం లేదన్నారు. అలాంటి వారి కోసమే వరప్రసాద్‌రెడ్డి ఆధ్వర్యంలో డాక్టర్లు రమేశ్, శ్రీనివాస్ బృందం ఏళ్లపాటు శ్రమించి ఆధునిక పరిజ్ఞానంతో డయాబెటిక్ పరికరాన్ని రూపొందించిందని, ఈ పరికరం ద్వారా ఇంటి వద్దనే ఒక డాలర్ ఖర్చుతో.. షుగర్ పరీక్ష చేసుకోవచ్చని అన్నారు. షుగర్ వ్యాధిగ్రస్తులకు ఈ పరికరం ఓ వరమన్నారు. ప్రపంచంలో ఇప్పటివరకు ఇలాంటి పరికరం లేదని, ఇందుకు డాక్టర్లు అభినందనీయులని కేటీఆర్ కొనియాడారు. శాంతబయోటెక్ సంస్థవ్యవస్థాపకుడు, డయాబెటోమిక్స్ సంస్థ చైర్మన్ వరప్రసాద్‌రెడ్డి మాట్లాడుతూ.. 20 సంవత్సరాల కృషి ఫలితమే ఈ డయాబెటోమిక్స్ పరిశ్రమ అని చెప్పారు. తాము రూపొందించిన పరికరంతో రక్త సేకరణ లేకుండా.. ఇంటి వద్దే ఉమ్మితోనే మధుమేహ పరీక్ష చేసుకోవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ ఎలక్షన్‌రెడ్డి, టెక్నికల్ బోర్డ్ డైరెక్టర్ బిందుదేవి, డిప్యూటీ డ్రగ్ కంట్రోలర్ రామకృష్ణ, డాక్టర్ శ్రీనివాస్ నాగేళ్ల, పీవీఆర్, గాంధీ ఆస్పత్రి గైనకాలజిస్ట్ విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
నిహారిక..నేనున్నా..!
⇒ ఆత్మస్థైర్యంతో ముందుకు సాగు.. ⇒ సర్కార్ తరపున సాయం అందించేందుకు కృషి.. ⇒ భరోసనిచ్చిన సీఎం వ్యక్తిగత కార్యదర్శి స్మితాసబర్వాల్ పెగడపల్లి : ‘నిహారిక బాధపడకు... త్వరలో నీవు సంపూర్ణ ఆరోగ్యం పొందుతావు... నీకు కావాల్సిన సాయాన్ని ప్రభుత్వం తరపునా అందేలా కృషిచేస్తా..’ అని ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యక్తి గత కార్యద ర్శి స్మితాసబర్వాల్ డయాబెటీస్ వ్యాధితో బాధపడుతున్న నిహారికకు భరోసానిచ్చింది. పెగడపల్లి మండల కేంద్రానికి చెందిన సిగిరి కళావతి కూతురు నిహారిక(17) ఇంటర్ చదివింది. ఏడేళ్లుగా డయాబెటీస్‌తో బాధపడుతోంది. వ్యాధి నివారణ కోసం డయాబెటీస్ హోమిక్స్ ఆఫ్ ఇండియా సంస్థ నుంచి చికిత్స పొందుతోంది. హైదరాబాద్‌లోని మేక్ ఏ విష్ ఫౌండేషన్ ఏర్పాటు చేసిన సమావేశంలో నిహారిక పాల్గొంది. స్మితాసబర్వాల్ అంటే తనకు ఇష్టమని, ఆమెతో మాట్లాడాలని ఉందని తన కోరికను వెల్లడించింది. దీంతో ఫౌండేషన్ చొరవతో మంగళవారం స్మితాసబర్వాల్ పెగడపల్లికి వచ్చారు. నిహారికను పరామర్శించి ఆమె కుటుంబసభ్యులతో మాట్లాడారు. సుమారు గంటపాటు వారితో గడిపారు. కుటుంబ నేపథ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. మందులకు నెలకు రూ.5వేలు ఖర్చు అవుతున్నాయని, ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నామని, తమను ఆదుకోవాలని నిహారిక తల్లి కళావతి వేడుకుంది. దీంతో స్మితాసబర్వాల్ ‘వ్యాధి ఉందని బాధపడకుండా ముందుకు సాగితే విజయం సాధిస్తావు’ అని నిహారికకు ఆత్మస్థయిర్యం నింపారు. ఇంటర్, డిగ్రీ పూర్తి చేసి సివిల్స్‌లో తర్ఫీదుపొంది మంచి ఉద్యోగం సాధించాలని ఆకాంక్షిచారు. ఇందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు తాను చేస్తానని భరోసానిచ్చారు. స్వయం ఉపాధి కోసం వృత్తివిద్యలో శిక్షణ పొందాలని, ఏదైనా తాత్కాలిక ఉద్యోగం ఇప్పిస్తానని తల్లి కళావతికి సూచించారు. ఆమె వెంట జగిత్యాల సబ్‌కలెక్టర్ కృష్ణభాస్కర్, మేక్ ఏ విష్ ఫౌండేషన్ డాక్టర్ పుష్పదేవి, జెడ్పీటీసీ సభ్యురాలు వసంత, ఎంపీపీ సత్తయ్య, సర్పంచి రాజు ఉన్నారు. -
మోహన్ సేవలు అభినందనీయం
కొరుక్కుపేట : మదుమేహ వ్యాధిపై ప్రజల్లో అవగాహన పెంచుతూ మెరుగైన వైద్యాన్ని అందిస్తున్న డాక్టర్ మోహన్ డయాబటీస్ ఆస్పత్రి సేవలు అభినందనీయమని చెన్నైలోని యూఎస్ కాన్సులేట్ కౌన్సిల్ జనరల్ ఫిలిప్ ఎ.మిన్ పేర్కొన్నారు. ఈ మేరకు మద్రాసు డయాబటీస్ రీసెర్చీ ఫౌండేషన్ ( ఎండీ ఆర్ ఎఫ్) డాక్టర్ మోహన్ డయాబటీస్ స్పెషాలిటీస్ సెంటర్ (డీఎం డీఎస్సీ) ఆధ్వర్యంలో శుక్రవారం సాయంత్రం 13వ నాన్ కమ్యునికేబుల్ డిసీజస్ నివారణ నియంత్రణ అనే అంశంపై సదస్సు ప్రారంభమైంది. దీనికి స్థానిక గోపాలపురంలోని మద్రాసు డయాబటీస్ రీసెర్చ్ ఫౌండేషన్ ఆడిటోరియం వేదికైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఫిలిప్ ఎ.మిన్, గౌరవ అతిథిగా న్యూ ఢిల్లీ భారత ప్రభుత్వ డిపార్టుమెంట్ ఆఫ్ బయో టెక్నాలజీ సెక్రటరీ ప్రొఫెసర్ కె.విజయ్ రాఘవన్ హాజరయ్యూరు. ఈ సందర్భంగా సైన్స్ బయోటెక్నాలజీ రంగంలో విశేష కృషి చేస్తున్నందుకు గాను ఎండి ఆర్ ఎఫ్, ప్లోరిడా ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ( ఎఫ్ ఐ యూ),యూనివర్సిటీ ఆఫ్ అలభామ బిర్మింగం (యూఏబీ) 10వ గోల్డ్ మెడల్ ఒరేషన్ అవార్డును ప్రశంశాపత్రాన్ని డాక్టర్ కె.విజయ్ రాఘవన్‌కు ముఖ్య అతిథిగా విచ్చేసిన ఫిలిప్ ఎ.మిన్ అందజేశారు. అనంతరం ఫిలిప్ ఈ సందర్భంగా ఫిలిప్ ఎ.మిన్ మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా 50 మిలియన్ ప్రజలు డయాబటీస్‌తో బాధపడుతున్నారని అన్నారు. క్రమం తప్పక వ్యాయామాలు, పోషక విలువతో కూడిన ఆహారం తీసుకోకపోవడం వలన డయాబటీస్కు గురవుతున్నారని అన్నారు. యూఎస్, భారత్ కలిసి వైద్యరంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకుని వస్తున్నామన్నారు. ప్రధానంగా నాన్ - కమ్యూనికేబుల్ వ్యాధులు ప్రజలను ఎంతో బాధిస్తున్నాయన్నారు. డయాబటీస్ పట్ల విశేషంగా వైద్యసేవలు అందిస్తున్న డాక్టర్ మోహన్ డయాబటీస్ ఆసుపత్రి సేవలు అభినందనీయమన్నారు. సైన్స్‌లో విశేష కృషి చేసిన కె.విజయరాఘవన్‌కు ఒరేషన్ అవార్డు అందజేయటం సంతోషంగా ఉందన్నారు. అనంతరం మోహన్ డయాబటీస్, ఎండీ ఆర్ ఎఫ్ నిర్వాహకులు, ప్రెసిడెంట్ డాక్టర్ వీ.మోహన్ మాట్లాడుతూ డయాబటీస్‌తో బాధపడేవారికి అత్యుత్తమ వైద్యం అందిస్తూ వస్తున్నామన్నారు. డయాబటీస్ నియంత్రణ, నివారణకు పరిశోధనలు చేపడుతూ ప్రజలను అప్రమత్తం చేస్తున్నామన్నారు. ఎండీ ఆర్ఎఫ్ ఆర్గనైజేషన్ ద్వారా 9వేల మంది ఉచితంగా డయాబటీస్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారని గుర్తు చేశారు. అంతేకాకుండా బ్రేక్ రైస్ హై పైబర్ రైస్‌తో పాటు డయాబటీస్ రోగులకు ఫుట్‌వేర్‌ను అందుబాటులోకి తెచ్చామన్నారు.