Prabhas Treats Shruti Haasan With Delicious Food on Salaar Sets - Sakshi
Sakshi News home page

Prabhas : వెరైటీ వంటలతో శ్రుతి హాసన్‌కు సర్‌ప్రైజ్‌

Published Sun, Aug 8 2021 5:06 PM | Last Updated on Mon, Aug 9 2021 1:05 PM

Prabhas Surprises Shruti Haasan With A Feast On Salaar Sets - Sakshi

Prabhas surprises Shruti Haasan : పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ చేసే అతిధి మర్యాదలు ఓ రేంజ్‌లో ఉంటాయి. సెట్‌లో ప్రభాస్‌ ఉన్నారంటే ఇక యూనిట్‌ సభ్యులందరికీ పండుగే. వెరైటీ వంట‌కాల రుచి చూపిస్తారాయన. ఆ మధ్య సాహో చిత్రీకరణ సమయంలో శ్ర‌ద్ధా క‌పూర్‌కు ప్రత్యేకంగా వంటలు చేయించిన ప్రభాస్‌..ఈసారి సలార్‌ బ్యూటీ శ్రుతిహాసన్‌ కోసం దాదాపు 20 వెరైటీ వంటకాలతో సర్‌ప్రైజ్‌ ఇచ్చారు. ప్రస్తుతం ప్రభాస్‌, శృతిహాసన్‌ హీరోహీరోయిన్లుగా సలార్‌ మూవీ చిత్రీకరణ జరుగుతున్న సంగతి తెలిసిందే.

ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్‌లో జరుగుతుంది. ఈ సందర్భంగా శ్రుతి హాసన్‌ కోసం స్పెషల్‌గా చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, గోంగూర మాంసం, కబాబ్, రకరకాల పప్పులు, సాంబార్, కర్రీ సహా దాదాపు ఇరవై రకాల వంటకాలను ప్రభాస్‌ వండించి తీసుకొచ్చారట. దీనికి సంబంధించిన లిస్ట్‌ను శ్రుతి తన ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో బయటపెట్టింది. నోరూరించే వంటకాలు చూసి శ్రుతి చాలా థ్రిల్‌కి గురైనట్లు వీడియోలో స్పష్టంగా కనిపిస్తుంది. 

ప్రభాస్‌ ఇచ్చిన స్వీట్‌ సర్‌ప్రైజ్‌కు మురిసిపోయిన శ్రుతి ఈ సందర్భంగా ఆయనకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపింది. దీనికి సంబంధించిన పోస్ట్‌ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. ప్రభాస్‌ మంచి మనసుపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. నిజంగా ఆయన డార్లింగ్‌ అంటూ కొనియాడుతున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement