ప్రఖ్యాత బాలీవుడ్ గాయకుడు సోనూ నిగమ్ తన స్వీట్ అండ్ మెలోడీ వాయస్ తో విమాన ప్రయాణికులను థ్రిల్ చేశాడు.
ముంబై: విమానంలో ప్రయాణించేటపుడు 'సీటు బెల్టు పెట్టుకోండి, మొబైల్ స్విచ్ ఆఫ్ చేయండి లాంటి అనౌన్స్ మెంట్లు ప్రయాణికులకు అలవాటే. టేకాఫ్ తీసుకునేందుకు సిద్ధమైనపుడు విమాన సహాయకురాలు ఇలాంటి సూచనలను మైక్ ద్వారా అందించడం కామనే.. అయితే ఓ గాయకుడు తన మధురమైన కంఠస్వరంతో ప్రయాణికులను పలకరిస్తే ఎలా ఉంటుంది. ప్రముఖ బాలీవుడ్ గాయకుడు సోనూ నిగమ్ తన స్వీట్ అండ్ మెలోడీ వాయస్ తో సరిగ్గా ఇలాగే చేశాడు.
విమానంలోని మైక్రోఫోన్ అందుకుని తాను ఆలపించిన హిట్ సాంగ్స్ ను పాడి ప్రయాణికులను థ్రిల్ చేశాడు. 'వీర్ జారా'లోని దో పల్ రుకో పాటను హమ్ చేశాడు. సోనూ నిగమ్ ను అకస్మాత్తుగా చూసి సంబరపడిపోయిన అభిమానులు కొంతమంది అతడితో పాటు గొంతు కలిపారు. దీంతో మరింత థ్రిల్ అయ్యాడట సోనూ. విమానంలో సోనూ నిగమ్ చేసిన ఈ వెరైటీ కన్సర్ట్ ఇపుడు నెట్ లో హల్ చల్ చేస్తోంది.