
హోటల్‌కు తిరిగి వచ్చిన అతడికి అక్కడ పెళ్లితంతు జరగడం కనిపించింది. వెంటనే ఆలస్యం చేయకుండా మండపంలోకి వెళ్లి వధూవరులను..
Sonu Nigam Gives Special Surprise For A Newlywed Couple: సింగర్ సోనూ నిగమ్ పిలవని పేరంటానికి వెళ్లి అక్కడున్న అతిథులందరినీ షాక్‌కు గురి చేశాడు. ఏదో పని మీద ఉజ్జయిని వెళ్లిన ఆయన అక్కడి హోటల్‌లో బస చేశాడు. ఆ ప్రాంతంలోని మహంకాళి, కాలభైరవ ఆలయాలను సందర్శించి హోటల్‌కు తిరిగి వచ్చిన అతడికి అక్కడ పెళ్లితంతు జరగడం కనిపించింది. వెంటనే ఆలస్యం చేయకుండా మండపంలోకి వెళ్లి వధూవరులను ఆశీర్వదించి అందరినీ సర్‌ప్రైజ్ చేశాడు.
నిజానికి సోనూ పెళ్లిపందిట్లోకి వచ్చేటప్పుడు అక్కడ అప్పగింతల కార్యక్రమం జరుగుతోంది. పెళ్లికూతురు, ఆమె తరపు బంధువులు తీవ్ర దుఃఖంలో ఉన్న సమయంలో సోనూ ఎంట్రీ ఇవ్వడంతో అక్కడ సీన్ మారిపోయింది. బాధతో నిండి ఉన్న వారి ముఖాల్లో ఒక్కసారిగా సంతోషపు వెలుగులు విరజిమ్మాయి. సోనూను చూసి అందరూ ఆశ్చర్యపోయారు. మొత్తానికి సోనూ చేసిన పని వల్ల అక్కడున్న అతిథులతో పాటు ఆ కొత్త జంటకు ఈ సంఘటన కలకాలం గుర్తుండిపోతుంది.