తొలి సవ్వడి | The first Savvadi | Sakshi
Sakshi News home page

తొలి సవ్వడి

Published Sun, Nov 9 2014 11:12 PM | Last Updated on Sat, Sep 2 2017 4:09 PM

తొలి సవ్వడి

తొలి సవ్వడి

ఫొటో స్టోరీ
 
అమాయకతను ఒలకబోసే కన్నులు ఆశ్చర్యంతో అరమోడ్పు లయ్యాయెందుకు అనిపిస్తోంది కదూ ఈ ఫొటో చూస్తే! ఈ చిన్నారి ముఖంలో కనిపించిన ఈ భావం వెనుక ఓ కథ ఉంది. ఓ ఆశ్చర్యం ఉంది. ఓ ఆనందం ఉంది. ఓ కొత్త అనుభవం ఉంది!

హెరాల్డ్ విటిల్స్ అనే ఈ బుజ్జిగాడికి పుట్టుకతోనే చెవులు వినిపించవు. తండ్రి పిలుపు వినలేడు. తల్లి జోలపాటనూ ఆస్వాదించలేడు. ప్రపంచం లోని ఏ శబ్దమూ అతడిని కదిలించలేదు. అది అతడి తల్లిదండ్రుల్ని చాలా బాధించింది. వాళ్లు ఎలాగైనా తమ కొడుకుని బాగు చేసుకోవాలని తపించారు. వైద్యులకు చూపించారు.

వైద్యులు పరీక్షలు చేసి, హెరాల్డ్ ఎడమ చెవిలో ఓ మిషన్‌ని బిగించారు. దాని పనితీరు తెలుసుకోవడం కోసం ‘హెరాల్డ్’ అని పిలిచారు. తొలిసారి ఒక శబ్దం తన చెవుల గుండా మనసుకు చేరడంతో ఆ చిన్నారి అవాక్కయిపోయాడు. సరిగ్గా అప్పుడే ఫొటోగ్రాఫర్ జాక్ బ్రాడ్‌లీ ఈ ఫొటో తీశాడు. దశాబ్దాల నాటి ఈ చిత్రం... బ్రాడ్‌లీకి ఎన్నో అవార్డులను తెచ్చిపెట్టింది!
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement