Mexico Mother Gave Surprise To Son On His 18th Birthday, Mum Hires Stripper - Sakshi
Sakshi News home page

Mexico Mother Hires Stripper: కొడుకు బర్త్‌డేకి తల్లి సర్‌ప్రైజ్‌.. సిగ్గుతో చచ్చిపోవాలనిపిస్తోందంటూ..

Published Wed, Jul 19 2023 8:56 AM | Last Updated on Wed, Jul 19 2023 9:51 AM

mother gave surprise to son on 18th birthday - Sakshi

ఒక మహిళ తన కుమారుని 18వ బర్త్‌డే నాడు చేసిన పనికి అతను బంధువులందరిముందు సిగ్గుతో చితికిపోయాడు. ఈ ఉదంతానికి సంబంధించిన వీడియోను ఆ మహిళ సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. దీనిని కొందరు ఓపెన్‌ కల్చర్‌ అని అంటుండగా, మరికొందరు ఆమె చేసిన పనికి మద్దతు పలుకుతున్నారు. 

డైలీ స్టార్‌ రిపోర్టును అనుసరించి ఈ ఘటన మెక్సికోలోని నువో లియోన్‌లో చోటుచేసుకుంది. ఈ ప్రాంతానికి చెందిన ఒక మహిళ తన 18 ఏళ్ల కుమారుని పుట్టినరోజున ఒక సర్‌ప్రైజ్‌ గిఫ్ట్‌ ఇచ్చింది. దానిని చూసిన అతను అక్కడున్నవారందరి మధ్య సిగ్గుతో తలవంచుకున్నాడు. ఆమె కుమారుని బర్త్‌డే నాడు అతనిని సర్‌ప్రైజ్‌ చేస్తూ ఒక స్ట్రిప్పర్‌(అడల్డ్‌ డాన్సర్‌)ను ఆహ్వానించింది.

వీడియోలో ఆ మహిళ తన చేతులతో బర్త్‌డే కేక్‌ పట్టుకుని కనిపిస్తుంది. ఆ సమయంలో ఆమె కుమారుడు మరో గదిలో ఉంటాడు. కుమారునికి సర్‌ప్రైజ్‌ ఇచ్చేందుకు ఆమె ఆ గదిలోకి వెళుతుంది. ఆ గదిలోకి వెళ్లగానే.. తల్లి తన కుమారుని కళ్లు మూస్తుంది. ఆ కుర్రాడు కళ్లు తెరవగానే అతని ముందు ఒక స్ట్రిప్పర్‌ షార్ట్‌ డ్రెస్‌ వేసుకుని ఉంటుంది. 

ఆ స్ట్రిప్పర్‌ను చూడగానే ఆ యువకుడు సిగ్గుతో చితికిపోతూ బంధువులవైపు బేల చూపులు చూస్తాడు. తరువాత తన ముఖం దాచుకునేందుకు ప్రయత్నిస్తాడు. ఇంతలో తల్లి ఆ గదిలో నుంచి బయటకు వచ్చేస్తుంది.అప్పుడు ఆ స్ట్రిప్పర్‌ ఆ కుర్రాడి ఒడిలో కూర్చుని, అశ్లీల నృత్యం చేస్తుంది. ఈ వీడియో బహిర్గతమైన నేపధ్యంలో పలు విమర్శలు చుట్టుముట్టడంతో ఆ మహిళ తన అకౌంట్‌ నుంచి ఆ వీడియోను తొలగించింది. ఈ వీడియోకు అప్పటికే 23 మిలియన్లకు మించిన వ్యూస్‌ దక్కాయి. 

ఈ వీడియోను చూసిన పలువురు నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ఒక యూజర్‌.. ‘ఆ మహిళ అనుబంధాల విషయంలో హద్దులను గుర్తెరగాలి’ అని కామెంట్‌ చేయగా, మరొకకు ఇది ఎంతో సిగ్గుమాలిన పని అని పేర్కొన్నారు. ఇంకొక యూజర్‌ కుర్రాడికి 18 ఏళ్లు వస్తే, తల్లిదండ్రులు అతనిని స్నేహితునిగా భావించాలని’ అన్నారు. 
ఇది కూడా చదవండి: ‘సీమా అట్టాంటిట్టాంటిది కాదు’.. యూపీ ఏటీఎస్‌ విచారణలో సంచలన నిజాలు!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement