
విరాట్ కోహ్లి
సాక్షి, స్పోర్ట్స్ : టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి దక్షిణాఫ్రికా పర్యటననంతరం లభించిన విశ్రాంతి సమయాన్ని ఆస్వాదిస్తున్నాడు. తాను ఎంజాయ్ చేయడమే కాకుండా సోషల్ మీడియా వేదికగా తన పోస్ట్‌లతో అభిమానులను అలరిస్తున్నాడు. కొద్దిరోజుల క్రితమే ముంబై వచ్చిన కోహ్లిని ఎయిర్‌పోర్టులో అతని సతీమణి, బాలీవుడ్ నటి అనుష్క శర్మ స్వాగతం పలికారు. అనంతరం ఈ జంట సన్నిహితుల పెళ్లికి హాజరైంది. ఈ పెళ్లిలో కోహ్లి చేసిన డ్యాన్స్ సోషల్ మీడియాలో ఇప్పటికే ట్రెండ్ అయింది.
తాజాగా కోహ్లి ట్విటర్‌లో అభిమానులకు ఓ సర్‌ప్రైజ్ ఇచ్చాడు. ముంబైలో కొత్తగా నిర్మించిన తన ఇంటి బాల్కనీలో దిగిన ఫొటోకు‘ ఇంటి నుంచి ఇంత అద్భుమైన వీక్షణం ఎక్కడైనా..ఎప్పుడైనా ఉండాలని కోరుకోకుండా ఉండగలరా? అని ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ అయింది. శ్రీలంకలో జరుగుతున్న నిదహాస్ ట్రోఫీకి కోహ్లితో పాటు పలువురు సీనియర్ క్రికెటర్లకు విశ్రాంతినిచ్చిన విషయం తెలిసిందే.
Where else would you wanna be when you have such a stunning view from home! 😇♥️ pic.twitter.com/u4LfeXmQ11
— Virat Kohli (@imVkohli) 8 March 2018
Comments
Please login to add a commentAdd a comment