డిసౌజాకోసం సర్ ప్రైజ్ ఫ్లాష్ మాబ్! | Surprise flash mob for Remo D'souza | Sakshi
Sakshi News home page

డిసౌజాకోసం సర్ ప్రైజ్ ఫ్లాష్ మాబ్!

Published Fri, Aug 5 2016 8:01 PM | Last Updated on Mon, Sep 4 2017 7:59 AM

డిసౌజాకోసం సర్ ప్రైజ్ ఫ్లాష్ మాబ్!

డిసౌజాకోసం సర్ ప్రైజ్ ఫ్లాష్ మాబ్!

ముంబైః ఉత్తమ నృత్య దర్శకుడు, ఫిల్మ్ మేకర్ రెమో డిసౌజా కు ఫ్లాష్ మాబ్ తో సర్ ప్రైజ్ ఇచ్చారు. యాక్టర్  ఫైసల్ ఖాన్, డ్యాన్సర్స్ కున్వర్ అమర్, సిద్ధేష్ పాయ్ లతో కలిసి డ్యాన్స్ రియాలిటీ షో..  'డ్యాన్స్ ప్లస్' సీజన్ టు సెట్ లో ఆర్టిస్టులకు సైతం ప్రత్యేక అనుభూతిని పంచారు.

డ్యాన్స్ ప్లస్ రియాలిటీ షో.. సీజన్ టు సెట్ కు వచ్చిన ప్రముఖ కొరియోగ్రాఫర్ రెమో డిసౌజాను సహ నృత్యకారులు ఫ్లాష్ మాబ్ ప్రదర్శనతో సర్ ప్రైజ్ చేశారు.   మెంటర్స్ శక్తి మోహన్, పునిత్ జె పాఠక్, ధర్మేష్ యలండే కూడా ఫ్లాష్ మాబ్ లో చేరి ఉత్సాహంగా నృత్యం చేశారు. అంతేకాదు పోటీల్లో పాల్గొనే కంటెస్టెంట్స్ తోపాటు, ఆర్టిస్టులు, హోస్ట్.. రాఘవ్ జూయల్ సైతం  ఫ్లాష్ మాబ్ లో  పాల్గొని రెమో పాపులర్ సాంగ్స్.. 'బడ్తమీజ్ దిల్', 'దిల్లీవాలీ గర్ట్ ఫ్రెండ్'  కు హుషారెత్తించేట్టు  స్టెప్పులేస్తూ ఫ్లాష్ మాబ్ నిర్వహించారు. డ్యాన్స్ ప్లస్ నిర్వాహకులు నన్ను పిలిచి రెమో గారి ఫ్లాష్ మాబ్ గురించి చర్చించారని, ఆమాట అనడమే అదృష్టంగా భావించిన తాను వెంటనే సరేనని చెప్పేశానని డ్యాన్సర్ అమర్ తెలిపారు. దేశవ్యాప్తంగా ఎంతోమంది డ్యాన్సర్లను, కొరియోగ్రాఫర్లను  తయారు చేసిన రెమో డిసౌజా కు తమ గుండెల్లో ప్రత్యేక స్థానం ఉందని, అందుకే ఆయనకోసం ఫ్లాష్ మాబ్ అంటే మరోమాట లేకుండా ఒప్పేసుకున్నానని అమర్ ఓ ప్రకటనలో చెప్పారు. స్పెషల్ పెర్ఫామెన్స్  గురించీ ఏమీ తెలియకపోయినా..  గొప్ప నృత్యకారుడైన రెమో, సూపర్ జడ్జి.. డ్యాన్స్ ప్లస్ సీజన్ 2 లో ఉండటం కంటెస్టెంట్లకు అదే గొప్ప వరం అంటూ అమర్ అభివర్ణించారు.

అయితే తనకోసం డ్యాన్సర్లు ప్రత్యేకంగా ఇచ్చిన ఈ సర్ ప్రైజ్ ఎప్పటికీ గుర్తుండిపోతుందని, ఎంతో ఆనందాన్నిస్తుందంటూ ఈ సందర్భంలో రెమో తెలిపారు.  విద్యార్థులంతా తనకు కేవలం స్టూడెంట్స్ గా మాత్రమే కాదని, వారంతా తన పిల్లల్లాంటివారని, తన జీవితంలో ఓ భాగమని రెమో అన్నారు. తనవల్లే ఇక్కడవరకూ వచ్చామని విద్యార్థులు చెప్పినా.... వారివల్లే నేనిక్కడున్నానని నేనంటాను అంటూ చెప్పడం.. ఆయన నిరాడంబరతను వ్యక్తం చేస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement