
నాని సినిమాలో అతిథిగా?
దర్శకుడు రాజమౌళి తాను తీసే సినిమాల్లో ఏదో పాత్రలో కనిపించి, ప్రేక్షకులకు చిన్న సర్‌ప్రైజ్ ఇస్తుంటారు.
దర్శకుడు రాజమౌళి తాను తీసే సినిమాల్లో ఏదో పాత్రలో కనిపించి, ప్రేక్షకులకు చిన్న సర్‌ప్రైజ్ ఇస్తుంటారు. గత ఏడాది విడుదలైన ‘బాహుబలి’లో ఐటమ్ సాంగ్‌కి ముందు సీన్లో కాసేపు కనిపించారు. ఇప్పుడు నాని సినిమాలో కనిపించడానికి రెడీ అవుతున్నారన్న వార్త ఫిలింనగర్‌లో హాట్ టాపిక్‌గా మారింది. నాని హీరోగా ‘ఉయ్యాల జంపాల’ ఫేమ్ విరించి వర్మ దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందునున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో నాని ఓ దర్శకుడికి అసిస్టెంట్ డెరైక్టర్ పాత్రలోకనిపించనున్నారు. ఆ దర్శకుడి పాత్రలో కనిపించమని రాజమౌళిని అడిగితే, గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారని సమాచారం.