Emotional Video: Man Travels All the Way To Bolivia To Meet His Nanny After 45 Years - Sakshi
Sakshi News home page

Viral Video: 45 ఏళ్ల తర్వాత నానమ్మను కలిసిన వ్యక్తి.. వీడియో చూస్తే కన్నీళ్లు ఆగవు!

Published Thu, Sep 29 2022 1:31 PM | Last Updated on Thu, Sep 29 2022 2:17 PM

Emotional Video: Man Travels All the Way To Bolivia To Meet His Nanny After 45 years - Sakshi

ఇతరులను సంతోషంగా ఉండాలంటే డబ్బులు, నగలు, ఆస్తులు ఇవ్వాల్సిన అవసరం లేదు. మనస్పూర్తిగా చేసే చిన్న చిన్న పనులు సైతం ఎదుటి వారిలో కొండంత ఆనందాన్ని తీసుకొస్తాయి. వారితో గడిపే కాస్త సమయం మధుర జ్ఞాపకంగా మిగిలిపోతుంది. అలాంటి ఓ అందమైన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. 

తన నానమ్మను కలిసేందుకు ఓ వ్యక్తి స్పెయిన్‌ నుంచి సౌత్‌ అమెరికాలోని బొలివియాకు ప్రయాణించాడు. నానమ్మను కలవడంలో ఆశ్యర్యపోవాల్సింది ఏముంది అనుకుంటున్నారా.. ఎందుకంటే ఆ వ్యక్తి ఆమెను చూసి 45 ఏళ్లు అవుతోంది. చిన్నతనంలో అన అనే మహిళ అతన్ని తన సొంత కొడుకులా చూసుకుంది. అయితే కొన్నాళ్లకు అతను దూరంగా వెళ్లిపోయాడు. మళ్లీ ఇన్నాళ్ల తరువాత మహిళను కలవాలని నిర్ణయించుకున్నాడు. ఆమెపై ఉన్న ప్రేమ అతన్ని స్పెయిన్‌ నుంచి బొలివియాకు తీసుకువచ్చింది.

ఇన్ని సంవత్సరాల తర్వాత నానమ్మను చూసేందుకు ఏకంగా 8 వేల కిలోమీటర్లకు పైగా ట్రావెల్‌ చేశాడు. బామ్మ దగ్గరకు వెళ్లి తనెవరో చెప్పిన వెంటనే ఆమె పట్టరాణి సంతోషంతో ఉద్వేగానికి లోనైంది. వెంటనే అతన్ని ఆలింగనం చేసుకొని కన్నీరు పెట్టుకుంది. తన జర్నీని వ్యక్తి మెత్తం రికార్డు చేసి సోషల్‌ మీడియాలో పోస్టు చేశాడు. దీనిని చూసిన ఎవరైనా భావోద్వేగానికి గురవ్వకుండా ఉండలేరు. ఈ వీడియోపై నెటిజన్లు ఎమోషనల్‌ అవుతున్నారు. వీడియో ఎంతో అందంగా ఉందని, దీనిని చూస్తుంటే తమ కంట్లో నీళ్లు వస్తున్నాయని కామెంట్‌ చేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement