ప్రపంచంలోనే అత్యంత పెద్దదైన సముద్రగర్భ థీమ్ పార్క్‌ను బహ్రెయిన్ ప్రభుత్వం నిర్మిస్తోంది. అండర్ వాటర్ థీమ్ పార్క్‌కు ఈ విమానానికి ఏం సంబంధం అనేగా మీ ప్రశ్న.. ఈ థీమ్ పార్క్‌లో పగడపు దిబ్బలు వంటివాటితోపాటు అసలైన బోయింగ్ 747 విమానాన్ని కూడా పెట్టనున్నారు.
ఇందుకోసం త్వరలో దీన్ని నీటిలో ముంచేయనున్నారు. ఇలాంటిది ప్రపంచంలో మరెక్కడా లేదట. కొన్ని ప్రైవేటు కంపెనీలతో కలిసి ఈ ప్రాజెక్టును బహ్రెయిన్ ప్రభుత్వమే చేపడుతోంది. మొత్తం లక్ష చదరపు మీటర్ల పరిధిలో ఏర్పాటు చేస్తున్నారు. సముద్రంలోని జీవజాతులకు ఇబ్బంది లేకుండా పర్యావరణ అనుకూల విధానాల్లో దీన్ని నిర్మిస్తున్నారట. మరికొన్ని నెలల్లో ఈ థీమ్ పార్క్ ప్రారంభమవనుంది.
నీటిలో విమానం ఎందుకబ్బా..
Published Fri, Jan 25 2019 1:24 AM | Last Updated on Fri, Jan 25 2019 1:24 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment