భూపాలపల్లిని జిల్లాలోనే ఆదర్శ నియోజకవర్గం గా తీర్చిదిద్దుతానని శాసన సభాపతి మధుసూదనాచారి అన్నా రు.
► శాసన సభాపతి మధుసూదనాచారి
భూపాలపల్లి: భూపాలపల్లిని జిల్లాలోనే ఆదర్శ నియోజకవర్గం గా తీర్చిదిద్దుతానని శాసన సభాపతి మధుసూదనాచారి అన్నారు. పట్టణంలోని కారల్‌మార్క్స్‌కాలనీ, ఎల్‌బీనగర్ కాలనీల్లో సింగరేణి నిధులతో నిర్మించిన సైడ్ కాలువలు, సీసీరోడ్లను మం గళవారం ప్రారంభించారు. సాయంత్రం మండలంలోని పంది పంపుల శివారులోని కొత్తకుంట, గొల్లబుద్ధారం గ్రామ సరిహద్దులో గల వీరాచారికుంటలో చేపట్టే మిషన్ కాకతీయ రెం డో దశ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ.. పట్టణంలో సెంట్రల్ లైటింగ్, విద్యుత్ ఆధునీకరణ పనులు పూర్తయ్యాయని, పార్కు, 100 పడకల ఆసుపత్రి భవ నం, రోడ్డు విస్తరణ పనులు కొనసాగుతున్నాయన్నారు. సాగు, తాగునీటికి ఇబ్బంది లేకుం డా ఉండేందుకు తగు చర్య లు తీసుకున్నట్లు తెలిపారు. మిషన్ కాకతీయ పథకంతో చెరువులకు జలకళ వస్తుందని, రైతులు, మత్స్యకారులకు ఈ పథకం వరంగా మారిందన్నారు.
బొగ్గును తొలగించాలి..
పట్టణంలోని సింగరేణి పాఠశాల సమీపంలో గల సంస్థ స్థలంలో సింగరేణి యాజమాన్యం ఇటీవల బొగ్గును డంప్ చేయించింది. దీంతో ఈ రహదారి మీదుగా ప్రయాణించే ప్రజలు, మృతదేహాలను దహన సంస్కారాల నిమిత్తం తీసుకెళ్లే వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని శాసన సభాపతి మధుసూదనాచారికి కౌన్సిలర్ రేగుల రాకేష్ తెలిపాడు. ఇందు కు స్పందించిన స్పీకర్ స్థలాన్ని పరిశీలించి వెంటనే బొగ్గును తొల గించాలని జీఎం సత్తయ్యకు సూచించారు. నగర పంచాయతీ చైర్‌పర్సన్ బండారి సంపూర్ణరవి, వైస్‌చెర్మైన్ ఎరుకల గణపతి, ఎంపీపీ కళ్ళెపు రఘుపతిరావు, జెడ్పీటీసీ సభ్యురాలు జర్పుల మీరాబాయి, కౌన్సిలర్లు పిల్లలమర్రి నారాయణ, శిరుప అనిల్, రేగుల రాకేష్, టీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు సిరికొండ ప్రదీప్, స్థానిక నాయకులు మేకల సంపత్‌కుమార్, మందల రవీందర్‌రెడ్డి, పైడిపెల్లి రమేష్, చిరంజీవి తదితరులు పాల్గొన్నారు.