మొసలిని చూస్తే ఎవరైనా భయపడతారు. ఇక అదే మొసలి నీటిలో ఉంటే.. దానికి వెయ్యి ఏనుగుల బలం ఉన్నట్లేనని ప్రతీ ఒక్కరికీ తెలిసిన విషయమే. ఆ ప్రాంతంలో ఏ జంతువు అయినా దానికి ఆహారం కావాల్సిందే. అంతెందుకు ఆకారంలో పెద్దగా ఉండే ఏనుగు కూడా నీళ్లలో మొసలికి చిక్కితే దాని పరిస్థితి దబిడిదిబిడే మరి. కానీ నాకివన్నీ తెలియదు భయానికి మీనింగ్ తెలియని బ్లడ్ నాది అన్నట్లు ప్రవర్తించింది ఓ కొంగ. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారి హల్ చల్ చేస్తోంది.
ఓ కొంగ మొసలిని చూసి భయపడటం కాదు కదా ఏకంగా దాని మీద ఎక్కి మరీ సవారీ చేసింది. అంతేనా, ఆ కొంగ ఎంచక్కా రైడ్ చేస్తున్నట్లు ఫోజులిస్తూ మనకు కనిపిస్తుంది. ఇంతలో అనుకోకుండా అక్కడికి మరో రెండు మొసళ్ళు వచ్చాయి. అవి ఈ కొంగ పని పడతాయని అనుకున్నారు ఈ వీడియో చూసిన వాళ్లంతా కానీ, ఆ మొసళ్ళు కూడా కొంగను చూసి సైలెంట్‌గా వెళ్లిపోయాయి. అలానే కొంగ నిల్చున్న మొసలి కూడా ఏమీ ఆ పక్షిని గాయపరచకుండా జాగ్రత్తగా ఒడ్డుకు తీసుకువెళ్లడం మరో వింత. మామూలుగా అయితే ఇలాంటి సంఘటనలు జరగడం అరుదు. అందుకే ఈ వీడియో చూసిన నెటిజన్లు నోరెళ్లబెడుతున్నారు. కొందరు ఆ కొంగ ధైర్యాన్ని మెచ్చుకోగా, మరికొందరు ఆ మొసలి, కొంగ స్నేహితులేమో అని కామెంట్స్ పెడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment