
ప్రతీకాత్మక చిత్రం
కర్ణాటక, కృష్ణరాజపురం : కబ్బన్‌పార్కులో రహస్యంగా ప్రేమజంటల వీడియోలు చిత్రీకరిస్తున్నాడనే అనుమానంతో గుర్తు తెలియని వ్యక్తులుఓ వ్యక్తిపై రాళ్లతో దాడికి పాల్పడ్డారు. సుధీర్ అనే వ్యక్తి మంగళవారం మధ్యాహ్నం కబ్బన్‌పార్కు అంతటా కలియతిరుగుతూ ఉన్నాడు. ఇది గమనించిన కొంతమంది వ్యక్తులు పార్కులోని ప్రేమజంటలు, యువతీ యువకులను మొబైల్‌లో రహస్యంగా చిత్రీకరిస్తున్నాడని భావించారు. దీంతో సుధీర్‌పై హఠాత్తుగా రాళ్లతో దాడి చేసి అక్కడి నుంచి పారిపోయారు. సమాచారం అందుకున్న కబ్బన్‌పార్కు పోలీసులు సుధీర్‌ను ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకున్నారు.
గాయపడిన సుధీర్
Comments
Please login to add a commentAdd a comment