సాక్షి, బెంగళూరు: ఫిబ్రవరి 14ను ప్రేమికుల రోజుగా యావత్తు ప్రపంచం సెలబ్రేట్ చేస్తోంది. ఈ వాలంటైన్స్ డేకు కర్ణాటక రక్షణ వేదిక ఆశ్చర్యకరమైన పద్ధతితో మద్దతు తెలిపింది. ప్రేమకు మద్దతుగా కమిటీ వారు రెండు గొర్రెలకు వివాహం చేశారు. ఈ సందర్భంగా రక్షణ వేదిక సభ్యుడు నాగరాజు మాట్లాడుతూ.. ప్రేమకు ఎటువంటి కులం, మతం, వర్గం అని భేదం లేదని అన్నారు. అలాంటిది మనం వాలంటైన్స్ డేకి అభ్యంతరం చెప్పకూడదని ఆయన తెలిపారు.
కేంద్ర ప్రభుత్వం ప్రేమ కోసం ఒక రోజును సెలవుగా ప్రకటించాలని ఆయన కోరారు. అంతేకాక రాష్ట్రం ప్రభుత్వం కూడా ప్రేమ వివాహం చేసుకున్న జంటలకు సహాయం చేయాలన్నారు. ఆ జంటకు రాష్ట్ర ప్రభుత్వం రూ. 50వేల నుంచి లక్ష రూపాయాలు ఆర్థికంగా అదుకోవాలని వారు కోరారు.
Comments
Please login to add a commentAdd a comment