గవర్నర్ చొరవతో పార్కుకు మోక్షం | with governor orders officials made venkataramana colony park clean | Sakshi
Sakshi News home page

గవర్నర్ చొరవతో పార్కుకు మోక్షం

Published Tue, May 19 2015 1:08 AM | Last Updated on Sun, Sep 3 2017 2:17 AM

గవర్నర్ చొరవతో పార్కుకు మోక్షం

గవర్నర్ చొరవతో పార్కుకు మోక్షం

హైదరాబాద్: స్వచ్ఛ హైదరాబాద్ లో భాగంగా గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ ఆదివారం ఇచ్చిన ఆదేశాలతో హైదరాబాద్‌లోని వెంకటరమణకాలనీ పార్కుకు మోక్షం లభించింది. సుమారు 1,600 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న పార్కు స్థలం కబ్జా కాకుండా  ఫెన్సింగ్ వేశారు.

పార్కులో ఎర్రమట్టిని నింపడంతోపాటు పార్కులో కొంతకాలంగా స్థానికులు పడవేస్తున్న గుట్టలుగా పోగుపడిన వ్యర్థాలను 30 లారీల్లో తరలించడంతో దుర్గందం, అపరిశుభ్రత నుంచి ఈ పార్కుకు మోక్షం లభించిందని స్థానికులు ఆనందం వ్యక్తంచేశారు. గవర్నర్ చొరవతో ఆనంద్‌నగర్ కాలనీలోని మసీదు వద్దనున్న పాత ఇంటిలో పోసిన చెత్తను సైతం బల్దియా సిబ్బంది తొలగించారు. గవర్నర్ ఆదేశాలతో స్థానికంగా ఉన్న పద్మానగర్ పార్కు అభివద్ధికి చర్యలు తీసుకోవాలని జీహెచ్‌ఎంసీ నిర్ణయించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement