- వంద మొక్కలతో ఏర్పాటు కానున్న లాన్
- మనిషి ఆకృతిలో అమర్చనున్న ఔషధ మొక్కలు
- లోటస్‌పాండ్‌లో తామర, కలువ పూలు
- ఆకట్టుకోనున్న గార్డెన్
కెరమెరి : కుమ్రం భీం వర్ధంతి పురస్కరించుకొని ఈనెల 16న మండలంలో జోడేఘాట్‌లో అటవీశాఖ అధికారులు బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఆ గ్రామంలో లాన్, లోటస్‌పాండ్ ఏర్పాటు చేయనున్నారు. భీమ్ స్మారక మ్యూజియం, సృ్మతిచిహ్నం సమీపంలో ఏర్పాటు చేస్తున్నారు. 100 రకాల ఔషధ మొక్కలు సుగంధ ద్రవ్యాలతో గార్డెన్ ఏర్పాటుకు అధికారులు సమాయత్తమయ్యారు. గుండ్రటి ఆకారంలో మనిషి ఆకృతి బొమ్మను ఏర్పాటు చేశారు.
కాళ్లు, చేతులు, గుండె, తల, కిడ్నీ వ్యాధులను నయం చే సే ఔషధ మొక్కలను ఆ ఆకృతిలో అమర్చనున్నారు. ఏ భాగానికి సంబంధించిన ఆ భాగంలోనే, మిగిలిన స్థలంలో సుగంధ ద్రవ్యాల మొక్కలు నాటనున్నారు. భీం వర్ధంతికి, రెండు రోజులు ఉండడంతో అధికారులు పనులు వేగవంతం చేశారు.
సుగంధ ద్రవ్యాలు, ఔషధ మొక్కలు
ఈ గార్డెన్‌లో తులసి, ధతూర, కృష్ణ, తరాత్‌కిరాని, బహినియ, అంజీర్, పత్రి, ఇగ్సోరా, కరిలీద్, జట్రోఫా, నందివర్దనం, లెమిన్, అల్లనే రడి, టట్‌పానెట్, సంపంగిబ్రహ్మి, జాజి, కుఫియా, సరస్వతితోపాటు మరో 80 రకాల మొక్కలు నాటనున్నారు. 14న వీటిని నాటితే 16న అన్ని పూస్తాయని, ఆ ప్రాంతమంతా సుగంధ పరిమళంతో ఉంటుందని బెల్లంపల్లి డీఎఫ్‌వో వెంకటే శ్వర్లు తెలిపారు. దానికి కింది భాగంలోనే లోటస్ పాండ్ నిర్మించనున్నారు. తామర కలువ పూలు, మరో ఐదు రకాల పూలు వేసి చూపరులకు కనువిందు చేయనున్నారు. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.