komaram bheem
-
పులి పంజాకు మహిళ బలి
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల/ కాగజ్‌నగర్ రూరల్: పులి పంజాకు ఓ యువతి బలైంది. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ మండలం గన్నారం గ్రామానికి చెందిన మోర్లె లక్ష్మి (21) శుక్రవారం నజ్రుల్ నగర్ విలేజ్ నంబర్ 13–11 మధ్య తన సొంత పత్తి చేలో పత్తి తీస్తుండగా.. ఉదయం 7 గంటల సమయంలో అడవి నుంచి వచ్చిన పులి ఆమెపై దాడి చేసింది. తీవ్రంగా గాయపడిన లక్ష్మిని స్థానికులు దవాఖానకు తరలిస్తుండగా మృతిచెందింది. లక్ష్మిపై పులి దాడి చేయటాన్ని గుర్తించిన తోటి కూలీలు.. గట్టిగా కేకలు వేసి సమీప గ్రామస్తులకు సమాచారం అందించారు. దీంతో కొందరు వ్యక్తులు కర్రలతో వచ్చి పులిని బెదిరించటంతో లక్ష్మిని వదిలి అది అడవిలోకి పారిపోయింది. లక్ష్మికి గన్నారం గ్రామానికి చెందిన వాసుదేవ్‌తో ఏడాది క్రితమే వివాహం అయ్యింది. లక్ష్మి మృతితో ఆగ్రహించిన ఆమె బంధువులు కాగజ్‌నగర్ అటవీశాఖ కార్యాలయం ముందు నాలుగు గంటలపాటు ఆందోళనకు దిగారు. లక్ష్మి కుటుంబానికి రూ.పది లక్షల పరిహారం, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కలి ్పస్తామని కవ్వాల్ టైగర్ రిజర్వ్ ప్రాజెక్ట్ టైగర్ ఫీల్డ్ డైరెక్టర్ శాంతారామ్ హామీ ఇవ్వటంతోఆందోళన విరమించారు. లక్ష్మిపై దాడిచేయటానికి ముందే విలేజ్ నం.9 ప్రాంతంలో బిజన్ బర్మెన్కు చెందిన ఆవును పులి హతమార్చింది. గ్రామాలకు సమీపంలో పెద్దపులి సంచరిస్తుండటంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. నాలుగేళ్లలో నలుగురు మృతి మహారాష్ట్ర అడవుల నుంచి వస్తున్న పెద్ద పులులు మనుషులపై దాడులుచేస్తూ చంపేస్తున్నాయి. గత నాలుగేళ్లలో పులుల దాడిలో నలుగురు మరణించారు. మృతులంతా కూలీలు, రైతులే కావటం గమనార్హం. అదికూడా పత్తి చేలు కోతకొచి్చన సమయంలోనే పులులు దాడులు చేస్తున్నాయి. 2020 నవంబర్ 11న ఓ మగపులి దహెగాం మండలం దిగిడకు చెందిన సిడాం విగ్నేశ్ (21)పై దాడిచేసి చంపేసింది. ఈ ఘటన జరిగిన 18 రోజులకే అదే నెల 29న పెంచికల్పేట్ మండలం కొండపల్లికి చెందిన పసుల నిర్మల (18) పత్తి చేలో పత్తి తీస్తుండగా పులి దాడి చేసింది. తీవ్రంగా గాయపడిన ఆమె అక్కడికక్కడే చనిపోయింది. ఈ ఇద్దరిని చంపిన పులిని బంధించే ప్రయత్నం చేసినా చిక్కలేదు. మరో పులి 2022 నవంబర్ 15న వాంకిడి మండలం ఖానాపూర్‌కు చెందిన సిడాం భీము (69)పై దాడి చేసి ప్రాణాలు తీసింది. తాజాగా మోర్లె లక్ష్మి (21)పైనా నవంబర్ నెలలోనే దాడి జరిగింది. లక్ష్మిపై దాడిచేసిన పులి ఇటీవలే మహారాష్ట్ర అడవుల నుంచి ఇక్కడికి వచి్చనట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు.పత్తి కూలీలపైనే అధిక దాడులు పత్తి చేలకు ఉదయం పూటే కూలీలు వెళ్తుంటారు. కూలీలుఒకే చోట గుంపుగా కాకుండా ఎక్కువగా పత్తి ఉన్న చోట్లకు వేరుపడి పత్తి తీస్తుంటారు. ఏపుగా పెరిగిన మొక్కల మధ్య కూలీలు వంగి పని చేస్తారు కాబట్టి.. పులి సమీపానికి వచ్చేవరకు గుర్తించలేకపోతున్నారు. గతంలో జరిగిన దాడులన్నీ వెనకవైపు నుంచి జరిగినవే. పులి వెనుకనుంచి వచ్చి పంజాతో బలంగా కొట్టడంతో ఎవరూ ప్రాణాలతో బయటపడడం లేదు. ఈ ప్రమాదాలను అరికట్టేందుకు గతంలో కూలీలకు తల వెనకభాగంలోనూ మనిషి తల మాదిరి ఉండే మాస్కులు ఇచ్చారు. డప్పు చప్పుళ్లతో శబ్దాలు చేసేవారు. ‘వామ్మో.. పులి చంపిందే’ పత్తి తీయడానికి 12 మందిమి వెళ్లాం. ఉదయం 7గంటల సమయంలో పత్తి తీస్తుండగానే చప్పుడు లేకుండా పులి ఒక్కసారిగా లక్ష్మిపై దాడి చేసింది. లక్ష్మి ఒక్కసారిగా ‘వామ్మో.. పులి చంపిందే’అంటూ అరిచింది. మేము అటువైపు చూస్తుండగానే పంజా విసిరి లక్ష్మి మెడను కొరికింది. రక్తాన్ని పేల్చివేసింది. మేం పక్కనే ఉన్న విలేజ్ నం.11కు వెళ్లి విషయం చెప్పటంతో కొందరు కర్రలు తీసుకుని వచ్చి పులిని తరిమేశారు. – వడాయి లక్ష్మి, ప్రత్యక్ష సాక్షి, గన్నారంగందరగోళంతోనే చేన్ల వైపు...సాధారణంగా పులులు మనుషులపై దాడులు చేయవు. కొన్ని పరిస్థితుల్లోనే దాడి చేస్తాయి. మహిళపై దాడి చేసింది కొత్త పులి. రెండు రోజులుగా ఇక్కడే తిరుగుతోంది. దీనిపై స్థానికులను అప్రమత్తం చేశాం. కానీ కొందరు పులిని ఫొటోలు, వీడియోలు తీశారు. గందరగోళంలోనే చేన్ల వైపు వెళ్లి దాడి చేసి ఉండొచ్చని అనుకుంటున్నాం. బాధిత కుటుంబానికి రూ.పది లక్షల పరిహారం, ఉద్యోగం కల్పస్తాం. –శాంతారామ్, ఫీల్డ్ డైరెక్టర్, ప్రాజెక్టు టైగర్, కవ్వాల్ టైగర్ రిజర్వు -
ఆస్పత్రి దరిచేర్చని రోడ్డు.. లోకం చూడకుండానే కన్నుమూసిన పసిగుడ్డు
కాగజ్‌నగర్ రూరల్/పెంచికల్పేట్: రోడ్డంతా బురద.. అడుగుతీసి అడుగు వేయలేని దారిలో సకాలంలో ఆస్పత్రికి చేరుకోలేని పరిస్థితుల్లో లోకం చూడకుండానే ఓ పసిగుడ్డు తల్లి గర్భంలో కన్నుమూసింది. ఈ విషాదకర ఘటన సోమవారం కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. పెంచికల్పేట్ మండలం ఎల్లూర్ గ్రామ పంచాయతీ పరిధి మేరగూడ గ్రామానికి చెందిన దుర్గం పోచన్న భార్య పంచపూల నిండు గర్భిణి. సోమవారం వేకువజామున ఆమెకు పురిటినొప్పులు మొదలయ్యాయి. కుటుంబసభ్యులు 108కు సమాచారమిచ్చారు. మేరగూడకు వెళ్లే దారి పూర్తిగా బురదగా మారడంతో సిబ్బంది ఎల్లూర్ వరకు రావాలని సూచించారు. దీంతో తెల్లవారుజామున 4 గంటలకు కుటుంబసభ్యులు పంచపూలను ఎడ్లబండిలో ఎక్కించారు. మేరగూడ నుంచి ఎల్లూర్ వరకు ఐదుకిలోమీటర్ల దూరం వెళ్లడానికి ఆ బురద మార్గంలో రెండు గంటలకుపైగా పట్టింది. అక్కడి నుంచి గర్భిణిని 108లో కాగజ్‌నగర్‌లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆలస్యం కావడంతో గర్భంలోనే శిశువు మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఆపరేషన్ చేసి ఆడ మృతశిశువును బయటకు తీశారు. ప్రస్తుతం పంచపూలకు చికిత్స అందిస్తున్నామని వైద్యులు తెలిపారు. తమ గ్రామానికి సరైన రోడ్డు లేకపోవడం వల్లే బిడ్డ మృతిచెందిందని పోచన్న కన్నీటిపర్యంతమయ్యాడు. -
కుమురం భీం: టైగర్ డెత్ కేసులో నలుగురు అరెస్ట్
-
ఆసిఫాబాద్ ఆస్పత్రిలో రోగుల ఇబ్బందులు..!
-
క్షణక్షణం పెరుగుతోన్న ప్రాణహిత నది నీటి మట్టం!
-
కొమురంభీమ్ జిల్లాలో ఎనిమిది పులుల సంచారం
-
నేను తీసిన సినిమాలలో నా ఫేవరెట్ సీను అదే : రాజమౌళి
-
గిరిజనుల సమస్యల పరిష్కారానికి కృషి
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: గిరిజనుల సమస్యలకు ప్రభుత్వం పరిష్కారం చూపుతుందని మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి పేర్కొన్నారు. కుమురంభీమ్ ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలం జోడేఘాట్‌లో ఆదివారం నిర్వహించిన కుమురంభీమ్ 82వ వర్ధంతి కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ముందుగా కుమురం సూరు, భీమ్ స్మారక విగ్రహాలకు, సమాధి వద్ద ప్రజాప్రతినిధులు, అధికారులతో కలసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం స్థానిక ఎమ్మెల్యే ఆత్రం సక్కు అధ్యక్షతన నిర్వహించిన గిరిజన దర్బార్‌లో మాట్లాడారు. అటవీ భూములు సాగు చేస్తున్నవారిలో అర్హులను గుర్తించి పట్టాలు ఇచ్చే ప్రక్రియ కొనసాగుతోందన్నారు. సుప్రీంకోర్టు కొట్టివేసిన జీవో 3ను న్యాయపరంగా పరిష్కరిస్తామని తెలిపారు. గిరిజనులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగుపరుస్తామన్నారు. జిల్లాలోని కుమురంభీమ్, వట్టివాగు, చలిమెల తదితర ప్రాజెక్టుల నీటిని పంటచేలకు మళ్లిస్తామని హామీనిచ్చారు. వంద గిరిజన దేవాలయాలు నిర్మిస్తామని వెల్లడించారు. జోడేఘాట్ వరకు రోడ్డు సౌకర్యం, స్థానికులకు డబుల్ బెడ్రూం ఇళ్లు, ఆశ్రమ పాఠశాలలు ఏర్పాటు చేశామన్నారు. స్థానిక ఆదివాసీలు వలస వచ్చిన వారితో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కోల్పోతున్నారని, జీవో 3ను సుప్రీంకోర్టు కొట్టి వేయడంతో ఆదివాసీలకు ఉద్యోగ అవకాశాలు లేకుండా పోతున్నాయని ఎమ్మెల్యే ఆత్రం సక్కు ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఆసిఫాబాద్, ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్లు రాహుల్‌రాజ్, సిక్తా పట్నాయక్, ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, ఎమ్మెల్సీ దండే విఠల్, పద్మశ్రీ అవార్డు గ్రహీత గుస్సాడీ కనకరాజు, కుమురంభీమ్ మనవడు సోనేరావు, పాల్గొన్నారు. రద్దైన కేటీఆర్ పర్యటన షెడ్యూల్ ప్రకారం జోడేఘాట్‌కు మంత్రి కేటీఆర్ వస్తారని భారీ ఏర్పాట్లు చేశారు. అయితే చివరి నిమిషంలో ఆయన పర్యటన రద్దవడంతో అక్కడున్నవారంతా నిరుత్సాహపడ్డారు. రూ.15 కోట్లతో ఆసిఫాబాద్ పట్టణ అభివృద్ధి శిలాఫలకం, కలెక్టర్ రాహుల్‌రాజ్ కుమురం భీమ్‌పై రాసిన పాట ఆల్బం సీడీని మంత్రి ఆవిష్కరించారు. -
కొమరంభీం జిల్లాలో భారీ బియ్యం కుంభకోణం
-
కలెక్టర్ పేరుతో వాట్సాప్ మెసెజ్‌లు.. అమెజాన్ గిఫ్ట్ కార్డులంటూ..
సాక్షి, కుమురం భీం జిల్లా: ఉమ్మడి ఆదిలాబాద్‌లో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ పేరుతో సైబర్ నేరగాళ్లు డబ్బులు వసూలు చేసిన ఘటన మరుకవముందే మరో సంఘటన చోటుచేసుకుంది. కుమురం భీం జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ డీపీతో డబ్బుల కోసం అదికారులకు వాట్సాప్ మెసెజ్‌లు పంపుతున్నారు. డబ్బులు, అమెజాన్ గిఫ్ట్ కార్డుల పేరుతో మోసం చేసేందుకు యత్నిస్తున్నారు. జిల్లా ఉన్నాతాదికారులకు, ఎమ్మార్వో, ఎంపీడీఓలకు మెసెలు పంపుతున్నారు. సైబర్ నేరగాళ్ల మెసెజ్‌లతో అధికారులు భయపడిపోతున్నారు. అదేవిధంగా కలెక్టర్ అదికారులను అప్రమత్తం చేయడంతో పోలీసులకు పిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. చదవండి: ‘మామూలు’ ఇస్తే.. ఆ ఒక్కటీ సరైపోతుందని హింట్ -
ఆదివాసీల ఆశాజ్యోతి... హైమండార్ఫ్
ఎడతెగని చొరబాట్లు, అన్యాక్రాంతమైన అటవీ సాగు భూములు, ఆంక్షలు, దోపిడీ, హేళన – ఇది 19వ శతాబ్దం నుండి మొదలై కొనసాగుతున్న మన దేశపు ఆదివాసుల కష్ట గాథ. అటవీ, ఖనిజ సంపదలను కొల్లగొట్టడా నికి బ్రిటిష్ పాలకులు ప్రవేశపెట్టిన నిషేధ విధానాలతో మొదలైన ఈ సంక్షోభం మరెన్నో హంగులు దిద్దుకొని నేటికీ కొనసాగుతూ ఉంది. ఆదివాసీల ప్రాచీన జీవన విధానం, సంస్కృ తుల్లోనే ప్రశాంతత, నెమ్మదితనం ఉన్నాయి. వారు అలాగే జీవించడంలో ఎంతో మక్కువను చూపి స్తారు. అటువంటి ఈ మొండి ప్రజలను ‘ప్రగతి శీల’ జీవన స్రవంతిలోనికి ఎట్లా తేవాలా అనే ఆలోచనలు 20వ శతాబ్ది తొలి భాగం నుండే మొదలైనాయి. బయటివారి రాజకీయ వ్యవస్థలు, పాలనా విధానాలను వారిపై రుద్దకుండా... ఆది వాసీల తత్త్వానికి సరిపడే రీతిలో మనమే ఒదిగి, బయటి వారి అతిక్రమణల ఛాయల నుండి వారిని రక్షిస్తూ... వారి సహజ ఆవరణంలోనే ఉండనిస్తూ ఆధునిక ప్రపంచపు విద్య, అవగాహనలు అందించే గొప్ప ప్రయత్నం హైదరాబాద్ సంస్థానంలో 1940ల్లో జరిగింది. ‘‘చదువుకోవటం వల్ల లౌకిక ప్రయోజనాలు న్నాయన్న సంగతి మూలవాసికి తెలిసినా అతని మనస్సులో, ఆత్మలో తనదైన సంస్కృతి పట్ల అసంకల్పితంగా, అతి లోతుగా ఇంకిపోయి ఉన్న అభిమానాన్నీ దాని పట్ల అతనికున్న గర్వభావ ననూ ఉద్ఘాటించటం ద్వారానే అతన్ని ఉత్తేజపరచ గలం,’’ అని హైదరాబాదు సంస్థానంలోని మూల వాసుల జీవనగతులను అప్పటికే పరిశీలిస్తూ నిర్ధారణకు వచ్చిన బ్రిటిష్ మానవ శాస్త్రవేత్త క్రిస్టోఫ్ వాన్ ఫ్యూరర్ హైమండార్ఫ్ పేర్కొన్నారు. అటు వంటి హైమండార్ఫ్‌ను ఆదిలాబాద్ గోండుల కోసం ఒక ప్రాథమిక విద్యా విధానాన్ని రూపొం దించమని కోరింది నైజాం ప్రభుత్వం. తొలి గోండి భాషా వాచకాలను వాళ్ల జీవన వాతావరణం, పురాణాలు, కథలు, నమ్మకాలకు సంబంధించిన అంశాలతోనే ఆయన రూపొందించారు. ఈ ప్రయోగం ఫలించిన తర్వాత ఆదిలాబాద్ మూల వాసుల కోసం ఒక సమగ్ర పునరావాస, అభివృద్ధి పథకాన్ని కూడా రూపొందించి అమలు చేయమని, గిరిజన తెగలు, వెనుకబడిన తరగతుల విషయాల సలహాదారుగా అధికార పదవిలో ఆయనను నియమించింది నైజాం ప్రభుత్వం. ఒక మానవ శాస్త్రవేత్తకు ఇటువంటి బాధ్యతను అప్ప గించిన అరుదైన సందర్భం ఇది. కొమురం భీం తిరుగుబాటు అణచివేత తరువాత నిస్పృహలో కూరుకుపోయి ఉన్న ఆదిలాబాద్ మూలవాసుల జీవితంలో మళ్లీ ఉల్లాసాన్ని, నమ్మకాన్ని తీసుకువచ్చిన ఈ గొప్ప ప్రయత్నం గురించి కళ్లకుగట్టినట్టు వివరించే 1944, 1946 సంవత్సరాల్లో హైమండార్ఫ్ రాసిన నివేదికలు నేటికీ చదువదగినవి. 80 శాతం మూలవాసీ కుటుంబాలకు 150,000 ఎకరాల భూమిని ప్రభుత్వ పట్టాలతో అందజేసి వారికి అత్యవసరమైన జీవనభద్రతను అప్పుడు కల్పించగలిగారు. అయితే తరువాతి దశకాల్లో వచ్చిన పరిణామాలతో ఈ అభివృద్ధి లాభాలను చాలా వరకు కోల్పోయి, నక్సల్ ఉద్యమం, దాని అణచివేత, మళ్లీ ప్రభుత్వం చొరవతో అమలుపరచిన అభివృద్ధి పథకాలు, వాటి లోపాలు – ఇట్లా ఎన్నో ఒడుదొడుకులకు వారు గురవుతూ వస్తూ ఉన్నారు. తమ చివరి రోజుల వరకూ తరచూ భారతదేశం, ఆంధ్రప్రదేశ్, మరీ ముఖ్యంగా ఆదిలాబాద్‌ను సందర్శిస్తూ ఆదివాసీ జీవితాల్లో వస్తూ ఉన్న ఈ పరిణామాలను తెలుసుకుంటూ, సూచనలు సలహాలు ఇస్తూ తమ అనుబంధాన్ని కొనసాగించారు హైమండార్ఫ్ దంపతులు. వారి వలె ఆదివాసుల ఆప్యాయతను, ఆరాధనను పొందుతున్న మానవ శాస్త్రవేత్తలు అరుదు. ‘‘ఇక్కడ ఈ మూలవాసుల్లో వర్గభేదం లేని, లింగ అసమానతలు లేని, అంటరానితనం వంటి సామాజిక రుగ్మతలు లేని, విధవా వివాహాన్ని నిరోధించని ఒక ఆదర్శ సమాజం చక్కగా నిలిచి ఉన్నది... ఇటువంటి స్థితిలో మిగతా భారతీయ గ్రామీణ సమాజంలో ఇంకా కొనసాగుతున్న సామాజిక రుగ్మతలేవీ మూలవాసులకు వ్యాపించకుండా రక్షించటం దేశంలోని ప్రగతివాదుల గురుతరమైన బాధ్యత’’ అని హైమండార్ఫ్ ప్రభుత్వాధికారులకు, విధాన నిర్ణేతలకు దిశానిర్దేశం చేశారు. ఆదివాసులపై ఆయన వెలువరించిన వివిధ పుస్తకాలు, రచనల్లో వారి సంస్కృతుల గురించే కాకుండా వారికి అనువైన విద్య, తప్పనిసరిగా ఉండవలసిన సాగుభూమి భద్రత, వీటితో పాటు వారి జీవన దృష్టి గురించి చేసిన ప్రతిపాదనలు హైదరాబాద్ సంస్థానంలో, తరువాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఆదివాసుల సంక్షేమం గురించి పరి తపించే అధికారులు, సామాజిక కార్యకర్తలు, నాయ కులకు స్ఫూర్తిగా, మార్గదర్శకంగా నిలిచాయి. - సుమనస్పతి రెడ్డి ఆకాశవాణి విశ్రాంత అధికారి (మూలవాసుల విద్య, అభివృద్ధుల గురించి 1944, 1946ల్లో హైమండార్ఫ్ రాసిన నివేదికల తెలుగు అనువాదం హైమండార్ఫ్ దంపతుల స్మృతి దినంగా జరుపుకొనే జనవరి 11న, ఆయన చాలా కాలం నివసించిన మార్లవాయి గ్రామంలో (ఇప్పుడు కుమురం భీం జిల్లా) విడుదల కానుంది) -
ఆ కుటుంబంలో వరుస ఘటనలు.. మృత్యువులోనూ వీడని స్నేహం
సాక్షి,రామకృష్ణాపూర్(చెన్నూర్): ఓ రోడ్డు ప్రమాదం ఇద్ద రు స్నేహితులను కానరాని లోకాలకు తీసుకెళ్లింది. చెట్టెత్తు కొడుకులు అందనంత ఎత్తు ఎదుగుతారని కలలు కన్న తల్లిదండ్రులకు కన్నీళ్లే మిగిలాయి. అంతులేని విషాదం నింపిన ఈ దుర్ఘటన వివరాలు ఇ లా ఉన్నాయి. కరీంనగర్ జిల్లా కేంద్రంలో బుధవా రం తెల్లవారుజామున సంభవించిన రోడ్డు ప్రమాదంలో రామకృష్ణాపూర్‌కు చెందిన ఇద్దరు యువకు లు దుర్మరణం చెందారు. స్థానిక భగత్‌సింగ్‌నగర్‌కు చెందిన డిగ్రీ విద్యార్థి తుమ్మేటి మేఘనాథ్(19), డిప్లొమో పూర్తిచేసిన మరో విద్యార్థి పసునూటి మదన్మోహన్(20) ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. మేఘనాథ్ తండ్రి శ్రీనివాస్ ఆటోడ్రైవర్‌గా పనిచేస్తుండగా.. మదన్మోహన్ తండ్రి రాము బజ్జీకొట్టు నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. బర్త్‌డే వేడుకలకని వెళ్లి.. పట్టణంలోని భగత్‌సింగ్‌నగర్ ఏరియాకు చెందిన ఇద్దరు స్నేహితులు మేఘనాథ్, మదన్మోహన్లు స్నేహితుడి బర్త్‌డే వేడుకలకు వెళ్తున్నామని మంగళవారం రాత్రి ఇంట్లో నుంచి బయటకెళ్లారు. ఎక్కడికి వెళ్తున్నామనేది ఎవరికీ స్పష్టతనివ్వకుండానే ఇంట్లో నుంచి బైక్‌పై బయలుదేరారు. మరుసటిరోజు ఉదయం కరీంనగర్ వద్ద ఆగి ఉన్న డీసీఎంను వీరి బైక్ ఢీకొని మేఘనాథ్, మదన్మోహన్లు చనిపోయినట్లుగా కబురు వచ్చింది. మృతులు ఇద్దరు కూడా ఇంట్లో చిన్నవారు కావడంతో అల్లారుముద్దుగా పెరిగారు. కళ్ల ముందున్న కొడుకులు ఒక్కరోజు గడువులోనే విగత జీవులు కావడం ఇరు కుటుంబాలను కోలుకోలేకుండా చేసింది. ఆ కుటుంబంలో వరుస ఘటనలు.. రామకృష్ణాపూర్‌కు చెందిన బజ్జీల కొట్టు నిర్వాహకుడు రాము ఇంట్లో వరుస ఘట నలు కుదిపేస్తున్నాయి. కొద్దిరోజుల క్రిత మే రాము సోదరుడు, యువత బుక్‌స్టాల్ నిర్వాహకుడు రవి భగత్‌సింగ్‌నగర్‌లో రోడ్డు పక్కనే బైక్‌పై ఆగి ఉండగా ఓ ఎద్దు పొడవటంతో తీవ్రంగా గాయపడ్డాడు. ఆస్పత్రిలో చికిత్సపొందుతూ ఆయన మృతిచెందాడు. రవి చనిపోయి నెలరోజులు కూడా గడవకముందే రాము చిన్నకుమారుడు మదన్మోహన్ రోడ్డు ప్రమాదంలో మృత్యువాతపడటంతో కుటుంబమంతా గుండెలవిసేలా విలపిస్తున్నారు. చదవండి: ఏడాది సహజీవనం.. మోజు తీరాక.. ప్లేటు ఫిరాయించి.. -
హడలెత్తించిన పులి
దహెగాం(సిర్పూర్): కార్తీక స్నానాలు, దేవర మొక్కులకు వెళ్లిన గ్రామస్తులను పెద్దపులి వెంబడించింది. వారికి సమీపంలోనే తిరుగుతూ హడలెత్తించింది. దీంతో పులి ఎక్కడ దాడి చేస్తుందోననే భయంతో వారు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని నాలుగు గంటలపాటు బిక్కుబిక్కుమంటూ గడపాల్సి వచి్చంది. తర్వాత పోలీసులు, స్థానికుల సహకారంతో ఎట్టకేలకు 30 మంది క్షేమంగా ఇంటికి చేరుకున్నారు. కుమురంభీం జిల్లా దహెగాం మండలం లోహా సమీపంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. గురువారం మధ్యాహ్నం తర్వాత చిన్నరాస్పెల్లి గ్రామానికి చెందిన 30 మంది కార్తీక స్నానాలు, దేవర మొక్కుల కోసం ఎడ్లబండ్లపై ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్న మూడు వాగుల గడ్డ వద్దకు వెళ్లారు. ఎర్రవాగు, పెద్దవాగు, మరోవాగు కలిసే చోట కార్తీక స్నానాలు చేయాలని భావించి, అనువైన చోటుకోసం చూస్తుండగా అదే ప్రాంతంలో వారికి పెద్దపులి కనిపించింది. దీంతో భయపడిన గ్రామస్తులు ఒక్కచోట చేరి డప్పు చప్పుళ్లు చేయడంతోపాటు కేకలు వేశారు. అయినా పులి అక్కడి నుంచి కదల్లేదు. అక్కడే ఉంటూ గ్రామస్తుల కదలికలను గమనించసాగింది. సాయంత్రం అయినా పులి అక్కడి నుంచి వెళ్లిపోలేదు. వారికి సమీపంలోనే తిరుగుతూ కనిపించింది. దీంతో భయాందోళనకు గురైన గ్రామస్తులు మండల రైతు సమన్వయ సమితి కనీ్వనర్ సంతోగౌడ్కు ఫోన్ ద్వారా సమాచారం అందించారు. ఆయన ఇచి్చన వివరాల మేరకు అటవీ అధికారులు, దహెగాం ఎస్సై రఘుపతి, పోలీసు సిబ్బంది, చిన్నరాస్పెల్లి నుంచి వచ్చిన గ్రామస్తులు డప్పు చప్పుళ్లు చేసుకుంటూ.. కాగడాలు పట్టుకుని వాగు వద్దకు వెళ్లారు. పోలీసులు, అటవీ సిబ్బంది వచ్చే సమయానికి పులి దూరంగా వెళ్లిపోయినా.. అది మళ్లీ ఏ దిక్కునుంచి వచ్చి దాడి చేస్తుందోనని వారంతా బిక్కుబిక్కుమంటూ గడిపారు. చివరికి రాత్రి 8.30 గంటల ప్రాంతంలో అధికారులు వాగువద్ద చిక్కుకున్నవారిని క్షేమంగా గ్రామానికి తీసుకు రావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. గత సంవత్సరం నవంబర్‌లో పెద్దపులి ఇద్దరిపై దాడి చేసి చంపిన విషయం తెలిసిందే. తాజా ఘటనతో పత్తి తీయడానికి వెళ్లే వారు సైతం భయాందోళన చెందుతున్నారు. పులి బెదరలేదు.. దేవరను తీసుకొని చిన్నరాస్పెల్లి నుంచి లోహా సమీపంలోని మూడు వాగుల గడ్డ వద్దకు కార్తీక స్నానానికి వెళ్లినం. ఒడ్డు వద్ద పెద్దపులి ఉంది. ముందుగా కుక్క అనుకొని దగ్గరకు వెళ్లి చూస్తే పులి.. ఒక్కసారిగా భయమైంది. మెల్లగా వెనుదిరిగి వచ్చి అందరికి చెప్పిన. డప్పు చప్పుళ్లు, కేకలు వేసినా అది బెదరకుండా అక్కడే ఉంది. అఖండ దీపం పెట్టిన చోటుకు వచి్చంది. అతి దగ్గర నుంచి అందరం పెద్దపులిని చూసినం. – ప్రత్యక్ష సాక్షి వెంకటేశ్ -
కొమురం భీం ఆశయసాధనకు ప్రభుత్వం కట్టుబడి ఉంది
సాక్షి, హైదరాబాద్: ఆదివాసీ పోరాట యోధుడు కొమురం భీం ఆశయ సాధనకు తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని, మా గూడెం–మా తాండాలో మా రాజ్యం అనే ఆదివాసీల తరతరాల ఆకాంక్షను తెలంగాణ ప్రభుత్వమే నిజం చేసిందని సీఎం కేసీఆర్ తెలిపారు. ఆదివాసీ ఆరాధ్య దైవం కొమురం భీం జయంతి సందర్భంగా భీం సేవలను స్మరిస్తూ కేసీఆర్ శుక్రవారం ఒక ప్రకటనలో ఘన నివాళి అర్పించారు. ఆదివాసీల అభివృద్ధి, సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తోందని, భీం జయంతిని రాష్ట్ర ప్రభుత్వమే అధికారికంగా నిర్వహిస్తోందని వెల్లడించారు. భీం పోరాట ప్రదేశమైన జోడేఘాట్‌ను అన్ని హంగులతో అభివృద్ధి చేశామని, భవిష్యత్ తరాలకు ఆయన పోరాట పటిమను తెలియజేసే విధంగా స్మారక చిహ్నం, స్మృతివనంతో పాటు గిరిజన మ్యూజియాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు. హైదరాబాద్ నడిబొడ్డున ఆదివాసీ భవన్ నిర్మాణం చేపట్టామని, త్వరలోనే ప్రారంభిస్తామని వెల్లడించారు. కొమురం భీం జల్, జంగల్, జమీన్ నినాద స్ఫూర్తి తెలంగాణ రాష్ట్ర సాధనలోనూ, స్వరాష్ట్ర అభివృద్ధి పథంలోనూ ఉందన్నారు. అడవులు, ప్రకృతి పట్ల ఆదివాసీ బిడ్డలకు ఉండే ప్రేమ గొప్పదని, వారి స్ఫూర్తిని ప్రతి ఒక్కరు కలిగి ఉండాలని సీఎం కేసీఆర్ ఆ ప్రకటనలో ఆకాంక్షించారు. -
Jodeghat Museum: జోడెన్‌ఘాట్ వీరభూమి
‘కుమ్రుం భీము గిరిజన సంగ్రహాలయం’ ఇది ట్రైబల్ మ్యూజియం. ఆదివాసీల జీవనశైలితోపాటు కుమ్రుం భీము జీవితాన్ని బొమ్మల్లో చూపించే ప్రయత్నం. కొండ అద్దంలో ఇముడుతుందేమో కానీ కుమ్రుం భీము పోరాటం, జీవితాశయ సాధనలను ప్రతిబింబించడానికి ఒక మ్యూజియం సరిపోదు, ఇలాంటి పది మ్యూజియాలు కావాలి. ఈ మ్యూజియం కుమ్రుంభీమ్ ఆసిఫాబాద్ జిల్లా, కెరిమెర మండలం, జోడెన్‌ఘాట్ గ్రామంలో ఉంది. జోడెన్‌ఘాట్‌లో కుమ్రుం భీము సమాధి, సమాధి పక్కనే భీము చేత్తో తుపాకీ పట్టుకున్న విగ్రహం ఉన్నాయి. విగ్రహం ఎదురుగా మ్యూజియం ఉంది. ఇందులో ఆదివాసీలు ఉపయోగించే వస్తువులు, పాత్రలు, ఆహారపు అలవాట్లు, వస్త్రధారణ, ఆభరణాల అలంకరణ, పెళ్లి వేడుక చిత్రాలు, వేడుకలు, దేవతాపూజ సన్నివేశాలను కళ్లకు కట్టారు. వీటన్నింటిలో మేటిగా కుమ్రుం భీము జీవితావిష్కరణ కనిపిస్తుంది. మ్యూజియంలోకి ప్రవేశించగానే ఎడమ వైపు ఒక నాయకుడు, పది మంది అనుచరుల శిల్పాలు మన దృష్టిని ఆకర్షిస్తాయి. మధ్యలో ఉన్నది భీము. ద్వారానికి కుడివైపు భీము ఫొటో, విగ్రహంతోపాటు భీము భార్య సోమ్బాయి ఫొటో ఉంది. ఆ పక్కనే భీముతో కలిసి పని చేసిన కుమ్రుం సూరు ఫొటో, వేడమ రాము ఫొటో కూడా. భీము ఆచూకీ కోసం నిజాం మనుషులు గాలిస్తున్న సమయంలో ప్రమాదం ముంచుకు వస్తోందని హెచ్చరించడానికి రాము కాలికొం అనే వాద్యాన్ని ఊది భీమును, భీము బృందాన్ని అప్రమత్తం చేసేవాడు. ఈ మ్యూజియానికి పక్కనే ఉన్న ఆశ్రమ పాఠశాలలో భీము మనుమరాలు సోమ్బాయి ఉంది. ఆ స్కూల్లో చదువుకుంటూ కాదు, పాఠాలు చెప్తూ కూడా కాదు. స్కూలు పిల్లలకు భోజనం వండి పెట్టే ఉద్యోగంలో ఉందామె. భీము గౌరవార్థం సభలకు ప్రభుత్వం భారీగా ఖర్చు చేస్తోంది. జిల్లాకు పేరు కూడా పెట్టింది. కానీ అతడి వారసుల ఉపాధి గురించి పెద్దగా పట్టించుకున్నట్లు కనిపించలేదు. అంతేకాదు... భీముకు ఇస్తున్న గౌరవం అతడి పోరాటానికి ఇవ్వడం లేదని తెలిసినప్పుడు కూడా ఆశ్చర్యమేస్తుంది. భూమి కోసం పోరాటం కుమ్రుం భీము పుట్టింది ఆసిఫాబాద్ జిల్లా సంకేపల్లిలో. నిజాం పాలన కాలంలో రెవెన్యూ శాఖ వేధింపులు ఎక్కువగా ఉండేవి. పంటను ఐదు వంతులుగా విభజించి మూడు వంతులు ప్రభుత్వానికి కట్టాల్సి వచ్చేది. పండించిన వాళ్లకు రెండు వంతులు మాత్రమే మిగిలేది. ‘ఇదేం న్యాయం’ అని ప్రశ్నించిన భీము కుటుంబాన్ని స్థానిక పటేదారు వేధించడం మొదలుపెట్టాడు. భీము కుటుంబం ఊరు వదిలి సుర్దాపూర్కి పారిపోయింది. పటేదారు మనుషులు అక్కడికీ వచ్చారు. భీము ఆవేశం పట్టలేక పటేదారును కొట్టడంతో అతడు చనిపోతాడు. అప్పుడు భీము అడవుల్లోకి పారిపోతాడు. అడవుల నుంచి అస్సాంకు వెళ్లి ఆరేడేళ్ల పాటు అక్కడే ఉండి చదవడం, రాయడం నేర్చుకుని తిరిగి సుర్దాపూర్కొస్తాడు. అప్పటి నుంచి ఆదివాసీలకు సాగు చేసుకుంటున్న భూమి మీద సంపూర్ణ హక్కుల కోసం మరింత పటిష్టంగా పోరాడడం మొదలు పెట్టాడు. అనేక దరఖాస్తులు పెట్టాడు. నిజాంను స్వయంగా కలిసి విన్నవించుకోవడానికి పదిహేను మంది ఆదివాసీలతో హైదరాబాద్‌కు వెళ్లాడు. నిజామ్ అనుమతి ఇవ్వకపోవడంతో తన స్వస్థలంలోనే పోరాడాలని నిర్ణయించుకుని వెనక్కి వచ్చేశాడు భీము. అప్పటి నుంచి శిస్తు కట్టమని అడిగిన పటేదార్లను, రెవెన్యూ అధికారులను ధిక్కరించడమే ధ్యేయంగా పోరాటం తీవ్రతరం చేశాడు. వీరి స్థావరం కొండ మీద జోడెన్‌ఘాట్‌కు సమీపంలో ఉన్న భాభేఝరి. ఇక్కడి నుంచి ఉద్యమాన్ని నడిపాడు భీము. చుట్టు పక్కల 14 గ్రామాలను ప్రభావితం చేశాడు. భీము పోరాటాన్ని అణచివేయడానికి నిజాం సైన్యాలు ప్రత్యేక దృష్టి పెట్టాయి. రెండు వందల మందితో కూడిన భీము సైన్యం రెండు నెలల పాటు నిజాం సైన్యాన్ని విజయవంతంగా నిలువరించగలిగింది. భీము అనుచరుల్లో ‘కొద్దు’ అనే వ్యక్తి రోజూ కొండ కిందకు వెళ్లి భీము బృందానికి అవసరమైన ఆయుధాలు, ఆహారాన్ని కొండమీదకు తెచ్చేవాడు. అతడిని వేధించి, ప్రలోభ పెట్టిన నిజాం సేనలు ఎట్టకేలకు భీము కదలికలను పసిగట్టాయి. భీము ఉన్న కొండకు వెనుక వైపు మోవాడ్ ప్రాంతం నుంచి నిజాం సేనలు వచ్చి జోడెన్‌ఘాట్‌లో ఉన్న భీమును తుపాకీతో కాల్చి చంపేశాయి. భీము అక్కడికక్కడే తుది శ్వాస వదిలాడు. ఇది జరిగింది 1940, ఆశ్వయుజ పౌర్ణమి రోజున. అప్పటికి అతడి వయసు 39. నిజాం పాలకులు తుపాకీ తూటాతో భీము ఆశయానికి గండికొట్టారు. తర్వాత వచ్చిన ప్రభుత్వాలు కూడా నిశ్శబ్దంగా అదే పంథాను కొనసాగిస్తున్నాయి. భీము ఏ ఆశయం కోసం పోరాడాడో ఆ ఆశయం ఇప్పటికీ నెరవేరనే లేదు. స్థానిక ఆదివాసీలు ఇప్పటికీ పోడు భూముల మీద హక్కుల కోసం పోరాడుతూనే ఉన్నారు. ఆదివాసీలు భీము జీవిత కథను వివరిస్తూ... మా చేతిలో తుపాకీ లేదు, కానీ తుపాకీ పట్టిన భీము స్ఫూర్తి మాలో ఉందని చెబుతున్నారు. ఈ పర్యటనలో తరాలకు కూడా తరగని స్ఫూర్తినిచ్చిన కుమ్రుం భీము జీవితం కళ్ల ముందు మెదలుతుంది. చదవండి: కురువపురం దీవి; కృష్ణమ్మ సిగలో చేమంతి అండర్‌వాటర్‌లో మ్యూజియం.. అదెక్కడంటే? -
కొమరంభీం ఆసిఫాబాద్: రోడ్డు ప్రమాదం
-
అది ఫేక్ వీడియో: కేసులు పెడతాం!
ఆసిఫాబాద్ జిల్లా : నిన్న బెజ్జూర్ మండలంలోని అంబగట్ట అటవి ప్రాంతంలో రైతులకు కనపడిన పెద్ద పులి అంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది ఫేక్ వీడియో అని ఎఫ్డీఓ విజయ్ కుమార్ తెలిపారు. ఆ వీడియో మహారాష్ట్రకు చెందిన యవాత్మల్ జిల్లా, అంజనీ వాడకు సంబంధించినదని పేర్కొన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ దహెగాం మండలం, దిగిడ గ్రామంలో దాడి చేసిన పులి మహారాష్ట్రకు వెళ్లినట్లు గుర్తించాం. ఎక్కడా కెమెరాలకు పులి చిక్కలేదు. ( అదిగో పెద్దపులి.. చచ్చాంరా దేవుడో! ) ప్రస్తుతం ఉన్న 30 మంది టీంతో సెర్చ్ ఆపరేషన్ మరోవారం పొడిగించాము. యువత తప్పుడు వీడియో తప్పుడు సమాచారం ఇచ్చినట్లు దృష్టికి వస్తే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తాము. పులిని బంధించడానికి రెండు బోనులు ఏర్పాటు చేశాం. 30 కెమెరాలతో బెజ్జూర్ పెంచికల్ పేట్ దహెగాం మండలాల్లో గట్టి నిఘా కొనసాగుతుంది. -
జస్ట్ మిస్.. పులికి బలయ్యేవారు..!
సాక్షి, ఆదిలాబాద్: కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా, బెజ్జూర్ మండలంలోని ఏటిగూడ వద్ద నడి రోడ్డుపై పెద్ద పులి హల్చల్ చేసింది. ప్రయాణికులను, పాదచారులను వెంటాడింది. పులి వెంబడించడంతో ఇద్దరు యువకులు పరుగు తీసి కింద పడిపోయి మళ్ళీ పరిగెత్తి సమీపంలో ఉన్న చెట్టు ఎక్కారు. ప్రమాదం తప్పడంతో బతుకుజీవుడా అని ఊపిరి పీల్చుకున్నారు. మరో ఇద్దరు యువకులు బైకులపై తప్పించుకున్నారు. ఆరుగురు వ్యక్తులు కమ్మర్గాం గుండె పల్లి గ్రామాల నుంచి బెజ్జూర్ మండల కేంద్రానికి వస్తోన్న క్రమంలో ఈ ఘటన చోటు చేసుకుంది. పులి సంచారంతో అటవీ ప్రాంతంలో ప్రయాణం చేయాలంటేనే స్థానికులు, గిరిజనులు జంకుతున్నారు. (చదవండి: ఐదు రోజులాయే.. పెద్దపులి చిక్కేనా..?) వారం రోజుల క్రితం పులి ఓ యువకుడిపై దాడి చేసి హతమార్చిన సంగతి తెలిసిందే. ఇప్పటికి ఇంకా ఆ పులి ఆచూకీ చిక్కలేదు. తాజాగా మరోసారి పులి హల్చల్ చేయడంతో స్థానికులు, గిరిజనులు భయాందోళనకు గురవుతున్నారు. ఈ నెల 11న ఆసిఫాబాద్ జిల్లా దహెగాం మండలం దిగిడ గ్రామానికి చెందిన విఘ్నేష్ (22)పై పులి దాడి చేసి హతమార్చింది. పులిని పట్టుకునేందుకు 12 బృందాలు రంగంలోకి దిగిన సంగతి తెలిసిందే. -
తెలంగాణలో పెద్దపులి కలకలం: యువకుడ్ని చంపి..
-
తెలంగాణలో పెద్దపులి కలకలం: యువకుడ్ని చంపి..
కొమరం భీం: జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఓ పెద్దపులి యువకుడిని పొట్టన పెట్టుకుంది. ఈ సంఘటన అసిఫాబాద్‌లోని దహెగాం మండలం దిగిడా గ్రామంలో జరిగింది. మంగళవారం పొలంలో పనిచేసుకుంటున్న విఘ్నేష్ అనే యువకుడిపై పులి హఠాత్తుగా దాడి చేసింది. అనంతరం అతడ్ని చంపి మృతదేహాన్ని అడవిలోకి లాక్కెళ్లిపోయింది. విషయం తెలుసుకున్న అటవీ శాఖ అధికారులు విఘ్నేష్ మృతుదేహం కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కాగా, పులి దాడితో చుట్టు ప్రక్కలి గ్రామాల్లోని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. గత నెల 12వ తేదీన ఏటూరునాగారం వైల్డ్ లైఫ్ పరిధి కన్నాయిగూడెం మండలంలోని అటవీ ప్రాంతాల్లో పులి సంచరించినట్లుగా అటవీ శాఖ అధికారులు గుర్తించారు. అనంతరం 20 రోజుల సమయంలో ఏటూరునాగారం అడవుల్లో పులి జాడ ఎక్కడా కనిపించలేదు. అయితే వారం పది రోజుల క్రితం మహబూబాబాద్ జిల్లా గూడురు, కొత్తగూడ అడవుల్లో పులి సంచరిస్తున్నట్లు అధికారులు గుర్తించగా.. తాజాగా ఈ నెల 6న వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గం ఖానాపురం మండలంలోని బండమీది మామిడితండా అడవుల్లో పులి సంచరించినట్లు అడుగు జాడలు కనిపించాయి. ( దుబ్బాక ఫలితం.. గందళగోళంలో కాంగ్రెస్ ) కాగా ఏటూరునాగారం అభయారణ్యానికి కొత్తగూడ, పాకాల అభయారణ్యాలకు కనెక్టివిటీ ఉండడంతో ఒకే పులి ఆయా అడవుల్లో సంచరిస్తుందా లేదా మరోటి ఉందా అనే అనుమానంలో అధికారులు ఉన్నారు. ఈ మేరకు స్థానికంగా ఉన్న గిరిజనులు, గొత్తికోయ గూడేల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. ఇదిలా ఉండగా గోదావరి సరిహద్దు ప్రాంతాల్లో నాలుగు పులులు సంచరిస్తున్నట్లుగా రెండు నెలలుగా వార్తలు వినిపిస్తుండడంతో పులుల సంఖ్య అంశం సమస్యగా మారింది. -
‘ఆర్ఆర్ఆర్’లో ఆ సీన్ తొలగించాల్సిందే
సాక్షి, కొమురం భీమ్ : ఆర్ఆర్ఆర్ సినిమాలో కొమురం భీమ్ వేషాధారణలో ఎన్టీఆర్ ఓ మతానికి సంబంధించిన టోపీ పెట్టుకోవడం ఆదివాసీయులను కించపర్చడమేనని బీజేపీ ఎంపీ సోయం బాపురావు అన్నారు. అలాంటి సన్నివేశాలను తొలగించాలని, లేదంటే సినిమా థియేటర్లు తగలబెడుతామని హెచ్చరించారు. శనివారం ఆయన కెరమెరి మండలం జోడేఘాట్‌లో నిర్వహించిన కొమురం భీమ్ 80వ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి గిరిజనులు భారీగా తరలివచ్చి ఇందులో పాల్గొన్నారు. జల్ జంగల్ జమీన్ కోసం నిజాం సర్కార్ తో పోరాడి అసువులు బాసిన కొమురం భీమ్ వర్ధంతిని ఏటా ప్రభుత్వమే అధికారికంగా నిర్వహిస్తుంది. ఈసారి కూడా జోడేఘాట్ కు ఉమ్మడి జిల్లా లోని గిరిజనులతో పాటు మహారాష్ట్ర, ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రల నుంచి భారీ గిరిజనులు తరలి వచ్చారు. మొదట గిరిజన సంప్రదాయ బద్దంగా పూజలు చేసిన అనంతరం భీమ్ సమాధి వద్ద నివాళులర్పించారు. (చదవండి : రాజశేఖర్ ఆరోగ్యంపై కూతురు శివాత్మిక ట్వీట్) ఈ సందర్భంగా ఎంపీ బాపురావు మట్లాడుతూ.. ఆర్ఆర్ఆర్ సినిమాలో కొమురం భీమ్ చరిత్రను వక్రీకరిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. సినిమా ట్రైలర్లో భీమ్ వేషాధారణలో ఎన్టీఆర్ ఓ మతానికి సంబంధించిన టోపి పెట్టుకోవడం ఆదివాసీయులను కించపర్చడమేనని, అలాంటి సన్నివేశాలను తొలగించాలని, లేదంటే సినిమా థియేటర్లు తగలబెడుతామని హెచ్చరించారు. పొడు భూములకు పట్టాలివ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లంబాడులను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలన్నారు. ఈసారి కరోనా కారణంగా దర్బార్ రద్దు కావడం పట్ల గిరిజనులు నాయకులు స్థానికులు అసంతృప్తి వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డాక ముఖ్యమంత్రి కేసీఆర్ మొదటి సారిగా వచ్చి ఇచ్చిన హామీల్లో 25 కోట్లతో మ్యూజియం భీం విగ్రహం సమాధి పూర్తి అయ్యాయి. ఇంకా బీమ్, పోరు గ్రామాలను మరింత అభివృద్ది చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ సోయం బాపురావుతో పాటు జడ్పీ చైర్మన్ కోవా లక్ష్మీ, ఎమ్మెల్యేలు ఆత్రం సక్కు, కోనేరు కొనప్ప, జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, కోమురం భీమ్ మనవడు సోనే రావు, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
ఆదివాసి వీరుడా వందనం
సాక్షి, మంచిర్యాల: ఆదివాసీల ఆరాధ్య దైవం కుమురం భీం 80వ వర్ధంతి వేడుకలు శనివారం జరగనున్నాయి. ఈ మేరకు కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలం జోడేఘాట్లోని భీం స్మారకం వద్ద ఉత్సవ కమిటీ, స్థానిక అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఉదయం నుంచే ఆదివాసీలు తమ సంప్రదాయాల ప్రకారం పూజలు నిర్వహించనున్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు భీం సమాధి వద్ద శ్రద్ధాంజలి ఘటించిన అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఏటా వర్ధంతికి స్థానిక గిరిజనులతోపాటు మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, ఉత్తర్‌ప్రదేశ్ నుంచి పెద్ద ఎత్తున గిరిజనులు తరలివస్తారు. ఆదివాసీల సమస్యలను అధికారులకు తెలియజేసే ‘గిరిజన దర్బార్‌ను ఈసారి కోవిడ్ నేపథ్యంలో రద్దు చేశారు. కేవలం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ప్రజాప్రతినిధులు, అధికారులు మాత్రమే హాజరుకానున్నారు. రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి కుమురం భీం వర్ధంతిని ప్రభుత్వం ఏటా అధికారికంగా నిర్వహిస్తోంది. ఇందుకు అవసరమైన నిధులు కేటాయిస్తోంది. ఈ ఏడాది ఉత్సవాల కోసం రూ.25 లక్షలు కేటాయించింది. అప్పుడే ధిక్కార స్వరం ప్రతిధ్వనించింది ఉమ్మడి ఆదిలాబాదు జిల్లా ఆసిఫాబాద్ మండలం జోడేఘాడ్ సంకెనపల్లి గ్రామంలో కొమురం భీం జన్మించినాడు. భీంకి 15 ఏండ్లు ఉన్నప్పుడే అతని తండ్రిని అటవీ అధికారులు చంపివేశారు. భీం కుటుంబం సాగుచేస్తున్న భూమిని ‘‘సిద్దిభి’’ అనే జాగిర్దార్ తనకు వదిలి పెట్టాల్సిందిగా బెదిరించాడు. ఎక్కడికి పారిపోయి బ్రతకాలి ఎందుకు భయపడాలి. ప్రళయ ఘర్జనలో భీంలో ధిక్కారస్వరం ప్రతిధ్వనించింది. సిద్దిభి తలౖపై కట్టెతో గట్టిగా కొట్టాడు. సిద్దిభి అక్కడే చనిపోయాడు. పోలీసులు భీంనీ వేటాడారు. దీంతో అస్సాంలో ఏళ్ల పాటు అజ్ఞాత జీవితం గడిపాడు. బాభి ఝారి చుట్టు పక్కల తన నాయకత్వంలో ఉన్న 12 గ్రామాల్లో మా గ్రామం మా స్వరాజ్యం అనే నినాదాన్ని అబ్దుల్ సత్తార్ అనే తాలుక్ దారుతో ఒప్పించడానికి చేసిన ప్రయత్నం విఫలమైంది. అక్కడ నుంచి సుర్దాపూర్కి తిరిగి వచ్చి పెత్తందారి వ్యవస్థ కింద నలుగుతున్న తన జాతి విముక్తి కోసం ‘జల్ జంగల్ జమీన్’ తమదే అంటూ గర్జించాడు. స్వయం పాలన 12 గ్రామాలతో స్వతంత్ర గోండు రాజ్యం కావాలని ఆసిఫాబాద్ కలెక్టర్‌తో చర్చలు జరి పాడు. పరిష్కారం దొరకలేదు. దీంతో నిజాం రాజును కలవడానికి హైదరాబాద్ వెళ్ళాడు కానీ నిజాం నుంచి అనుమతి దొరకలేదు ఇక గెరిల్లా పోరాటంతోనే నిజాం సైన్యాన్ని ఎదుర్కోవాలి అని నిర్ణయించుకున్నాడు. దట్టమైన అడవుల్లో ఉన్న ‘జోడే ఘాట్’ గుట్టల్లో గెరిల్లా అర్మీని తయారు చేశాడు. భీంతో చర్చలు జరిపినప్పటికీ ఫలించకపోవడంతో భీంని అంతం చేస్తే తప్ప తిరుగుబాటు ఆగదని నిజాం సర్కార్ భావించింది. భీం దగ్గర హవల్దార్‌గా పనిచేసే కుర్దు పటేల్‌ని లోబరుచుకుని భీం స్థావరాన్ని బ్రిటిష్ ఆర్మీ సహాయంతో అర్ధరాత్రి సమయంలో చుట్టుముట్టింది. 3 రోజుల సుదీర్ఘ పోరాటంలో అలసిన భీం గెరిల్లాలపై నిజాం సైన్యం ఒకసారి గుంపుగా విరుచుకపడి కొమురం భీం గుండెల్లో బుల్లెట్ దింపారు. ఆదివాసీల ఆశయాల సాధనే భీంకి ఇచ్చే ఘన నివాళి. (పెనుక ప్రభాకర్, ఆదివాసీ రచయితల సంఘం(తెలంగాణ) గతంలో సాక్షి కోసం రాసిన వ్యాసం) -
ఆర్ఆర్ఆర్ టీజర్‌పై సీతక్క ట్వీట్
తెలుగు ప్రేక్షకులతో పాటు దేశ వ్యాప్తంగా సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం ఆర్ఆర్ఆర్. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై ఎన్నో అంచనాలు ఉన్నాయి. బాహుబలి వరుస హిట్స్ అనంతరం రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం కోసం అభిమానలు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ప్రముఖ స్వాతంత్ర్య పోరాట యోధుడు, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్ చరణ్ నటిస్తుండగా.. మన్యంపులి కొమురం భీం పాత్రలో జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్నాడు. ఈ క్రమంలోనే కొమురం భీం జయంతి సందర్భంగా చిత్ర యూనిట్ ఎన్టీఆర్‌పై ఓ టీజర్‌ను విడుదల చేసింది. రామ్ చరణ్ వాయిస్ ఇచ్చిన ఈ టీజర్లో ఎన్టీఆర్ కొమురం భీం పాత్రలో ఒదిగిపోయాడు. [ చదవండి : ఆర్ఆర్ఆర్ టీజర్: ఇవన్నీ ఇప్పటికే చూసేశాం, ఆ అగ్నిపర్వతం ఆ ఛానల్‌లోదే ] అభిమానుల భారీ అంచనాల నడుము విడుదలైన ఈ టీజర్‌పై పెద్ద ఎత్తున ప్రశంసలు వస్తున్నాయి. సినీ ప్రముఖులతో పాటు రాజకీయ నేతలు సైతం చిత్ర యూనిట్‌ను అభినందిస్తున్నారు. దీనిలో భాగంగానే ములుగు ఎమ్మెల్యే, కాంగ్రెస్ నాయకురాలు సీతక్క సైతం ట్విటర్ వేదికగా స్పందించారు. కొమురం భీం పాత్రపై విడుదల చేసిన టీజర్‌ను జోడిస్తూ ఆర్ఆర్ఆర్ మూవీ టీంకు అభినందనలు తెలిపారు.‘మన్యం ముద్దుబిడ్డ. మా అన్న, మా ఆదర్శం కొమరం భీమ్ గారి జయంతిన నా ఘన నివాళులు. మా వీరుడు మన్యం పులి కొమరం భీమ్ గారి స్పూర్తితో తీస్తున్న చిత్ర యూనిట్ కి నా అభినందనలు’ అని ట్వీట్ చేశారు. 🔸మన్యం ముద్దుబిడ్డ 🔸మా అన్న, మా ఆదర్శం కొమరం భీమ్ గారి జయంతిన నా ఘన నివాళులు. 🔸మా వీరుడు మన్యం పులి కొమరం భీమ్ గారి స్పూర్తితో తీస్తున్న చిత్ర యూనిట్ కి నా అభినందనలు @ssrajamouli @AlwaysRamCharan @tarak9999 #seethakka #ntr #ramcharan #rajamouli #RRRMovie pic.twitter.com/tUqsK34dyW — Danasari Anasuya (Seethakka) (@seethakkaMLA) October 22, 2020 -
పెద్దలు పెళ్లికి అంగీకరించకపోవడంతో..
సాక్షి, కొమురం భీం ఆసిఫాబాద్: పెద్దలు పెళ్లికి అంగీకరించకపోవడంతో ఓ ప్రేమ జంట ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ ఘటన జిల్లాలోని జిల్లా లింగాపూర్ మండలం పిక్ల తాండ అటవీ ప్రాంతంలో వెలుగుచూసింది.ప్రేమికులిద్దరూ పురుగుల మందు తాగారు. యువతి అక్కడికక్కడే మృతి చెందగా, యువకుడు ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నాడు. అతన్ని హుటాహుటిన సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ప్రేమ పెళ్లికి పెద్దలు ఒప్పుకోకపోవడంతోనే మనస్తాపం చెందిన యువతీయువకులు ఈ అఘాయిత్యానికి పాల్పగడినట్టుగా తెలుస్తోంది. అమ్మాయి మాడవి లక్ష్మీ (20) మామిడిపల్లి గ్రామస్తురాలు, అబ్బాయి ఆత్రం భీంరావు(22) జైనూర్ మండల రాసిమట్ట వాసిగా తెలిసింది. యువకుడి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. (కోడలిపై అత్తా,మామల పైశాచికం) -
క్వారంటైన్లో యువకుడు ఆత్మహత్యాయత్నం
సాక్షి, కుమురం భీం : క్వారంటైన్లో ఉన్న యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో చోటు చేసుకుంది. తాను ఉన్న వార్డులో ఒక వ్యక్తి కరోనా పాజిటివ్ రావడంతో భయపడిన యువకుడు.. తనను వేరే చోటికి తరలించాలని అధికారులను కోరాడు. అయితే అధికారులు సరిగా స్పందించకపోవడంతో ఆ యువకుడు వార్డులోనే ఉరి వేసుకొని ఆత్మహత్యాయత్నం చేశాడు. అధికారులు, వైద్య సిబ్బంది అతన్ని అడ్డుకొని మరో చోటికి తరలించారు. (చదవండి : తెలంగాణలో మరో 43 మందికి కరోనా) కాగా, ఆసిఫాబాద్ జిల్లాలో కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తోంది. జిల్లా వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య ఐదుకి చేరింది. తాజాగా ఆరేళ్ల బాలుడికి కూడా కరోనా పాటిజివ్ అని తేలింది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా కరోనా బాధితుల సంఖ్య 800 దాటింది. శనివారం రాత్రి నాటికి రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 809కి చేరిందని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ వెల్లడించింది. వీరిలో ఇప్పటివరకు 186 మంది కోలుకుని డిశ్చార్చి అయ్యారు. ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 605గా ఉండగా, మొత్తం 18మంది మృత్యువాతపడ్డారు. -
వేరే వార్డుకు తరలించకపోతే...
-
కలెక్టర్ దూకుడు.. అధికారుల హడల్..
సాక్షి, ఆసిఫాబాద్: జిల్లాకు నూతంగా వచ్చిన కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా తన మార్క్ పాలన చూపుతున్నారు. ఇటీవలే బాధ్యతలు స్వీకరించిన కలెక్టర్ జిల్లా అధికార యంత్రాంగాన్ని ఉరుకులు, పరుగులు పెట్టిస్తున్నారు. విధి నిర్వహణలో ముక్కుసూటిగా వ్యవహరిస్తూ ముందుకెళ్తున్నారు. ఈనెల 3 నుంచి విధుల్లో చేరిన నుంచి తనదైన శైలిలో అధికార, రోజువారి పాలనలో వినూత్నంగా వ్యవహరిస్తూ దూకుడు ప్రదర్శిస్తున్నారు. గడిచిన ఇరవై రోజుల్లోనే తన మార్కును చూపించారు. ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదుల తక్షణ పరిష్కారం కోసం అధికారులకు ఎప్పటికప్పుడు ఆదేశాలు ఇవ్వడంతో పాటు రాష్ట్రస్థాయిలో ఉన్నతాధికారుల నుంచి వచ్చిన ఆదేశాలను పక్కాగా అమలు చేస్తున్నారు. తహసీల్దార్ల బదిలీలు.. అధికారులు ఒకవేళ ఎవరైనా అలసత్వం ప్రదర్శిస్తే చర్యలు తప్పవని గట్టిగా హెచ్చరిస్తున్నారు. ఇందుకు తాజా ఉదాహారణ.. ఆదివారం జిల్లాలో ఆరుగురు తహసీల్దార్లను ఒక్కసారిగా బదిలీ చేసి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. ఈ బదిలీల వెనక అసలు కారణం తహసీల్దార్లు ఎవరూ ఆయా మండలాల హెడ్ క్వార్టర్స్‌లలో లేకపోవడంతోనే ఆగ్రహంతో బదిలీ చేసినట్లు తెలుస్తోంది. ఈ బదిలీలతో విధుల పట్ల ఆలసత్వం వహించే వారికి గట్టి హెచ్చరికలు జారీ చేసినట్లు అయింది. దీంతో ఇతర విభాగాల అ«ధికార యంత్రాంగం కూడా జాగ్రత్తగా వ్యవహరించాలి్సన ఆవశ్యకం ఏర్పడుతుంది. ప్రక్షాళన షురూ.. దేశంలోనే వెనకబడిన జిల్లాగా ఉన్న గిరిజన ప్రాంతమైన కుమురం భీం జిల్లాలో అధికార యంత్రాంగం మైదాన ప్రాంతాల్లో విధులు నిర్వహించే ఉద్యోగులతో పోల్చితే కాస్తా భిన్నంగా ఉంటుంది. వేరే ప్రాంతం వారు ఇక్కడ వచ్చి పనిచేసేందుకు పెద్దగా ఆసక్తిచూపని సందర్భాలు ఉన్నాయి. జిల్లాలో పనిచేస్తున్న వాళ్లు సైతం ఇతర ప్రాంతాల నుంచి రాకపోకలు సాగిస్తూ ఉంటారు. దీంతో అనేక ఫైళ్లు, కార్యక్రమాలు, ప్రభుత్వ పథకాల అమలులో తీవ్ర జాప్యం ఏర్పడుతోంది. వీటన్నింటిని నివారించేందుకు జిల్లా యంత్రాంగం అంతా తనకు ముందస్తు సమాచారం ఇవ్వకుండా మండలాధికారులు, జిల్లా అధికారులు ఎవరూ కూడా హెడ్‌క్వార్టర్ దాటి ఇతర ప్రాంతాలకు వెళ్లకూడదని ఆదేశాలు ఇచ్చారు. అలాగే పాలనలో ప్రక్షాళన ప్రారంభించారు. జిల్లాలో ఈ– ఆఫీస్ విధానాన్ని అమలు చేయబోతున్నారు. ఈ విధానంలో మొత్తం సమాచారం అంతా అన్లైన్లోనే సాగనుంది. ఇందులో భాగంగా ప్రతి ఆఫీస్‌కు ప్రత్యేకమైన మెయిల్‌కు, ప్రత్యేకమైన లాగిన్‌తో కూడిన వ్యవస్థను ఏర్పాటు చేసి ప్రతిశాఖలో ప్రతిస్థాయిలో ఏదైనా ఒక ఫైల్ పరిస్థితి ఎప్పటికప్పుడు తెలుసుకునే విధంగా ఓ సర్వర్‌ను ఏర్పాటు చేస్తున్నారు. ఈ– ఆఫీస్ అమలు అయితే కిందిస్థాయి అధికారి నుంచి పై స్థాయి అధికారి వరకూ వివిధ దశలలో ఫైళ్లు ఎక్కడ పెండింగ్ ఉన్నాయో ఇట్టే తెలిసిపోతుంది. దీంతో ఎవరూ విధుల్లో అలసత్వం వహిస్తారో సులువుగా గుర్తించవచ్చు. అలాగే ప్రతివారం వచ్చే ప్రజా ఫిర్యాదుల్లో ఆలసత్వం వహించద్దని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. విద్య, వైద్యంపై ప్రత్యేక దృష్టి.. గిరిజన ప్రాంతంలో మౌలిక వసతులైనా విద్య, వైద్యంపైనే ప్రధానంగా కలెక్టర్ ప్రత్యేక దృష్టి సారించారు. ఇప్పటికీ అనేక గిరిజన గ్రామాలు సరైన వైద్యం అందని స్థితిలో ఉన్నాయి. ఈ సమస్యలను అధిగవిుంచేలా జిల్లా వైద్య వ్యవస్థను మెరుగుపర్చేందుకు ప్రత్యేక కార్యక్రమాలు రూపొందిస్తున్నారు. అలాగే గిరిజన ప్రాంతాల్లో సర్కార్ బడులు, ఆశ్రమ, ప్రభుత్వ వసతి గృహాలలో నాణ్యమైన విద్యను అందించేలా కొత్త కార్యక్రమాలను అమలు చేయనున్నారు. ఇప్పటికే విద్య, వైద్య పరిధిలో సంబంధిత సమచారాన్ని సేకరించినట్లు తెలుస్తోంది. ఈ రెండు శాఖలే కాకుండా జిల్లాలో ఇతర ప్రభుత్వ శాఖలపైన కూడా ఎప్పటికప్పుడు సమీక్షలు, సమావేశాలు నిర్వహిస్తూ జిల్లా స్థితి గతులను తెలుసుకుంటున్నారు. ఏ శాఖ ఎక్కడ వెనకబడి ఉందో గుర్తించి అందుకు తగినట్లుగా ప్రత్యేక కార్యచరణ రూపొందిస్తున్నారు. గతంలో పనిచేసిన ముగ్గురు కలెక్టర్ల కంటే కొత్త కలెక్టర్ నిక్కచ్చిగా వ్యవహరించడంతో అధికారులు హడలెత్తిపోతున్నారు. ఎక్కడైనా ఏమైనా పోరపాటు జరిగితే ఎలా స్పందిస్తారో అని అధికార యంత్రాంగం అంతా ముందు జాగ్రత్తలు పడుతున్నారు. -
దారుణం: వివాహితపై అత్యాచారం, ఆపై హత్య
సాక్షి, కొమురం భీం (ఆసిఫాబాద్) : జిల్లాలో దారుణం జరిగింది. గ్రామ గ్రామానా తిరుగుతూ బుగ్గలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్న ఓ వివాహితపై అత్యాచారానికి పాల్పడి, అనంతరం దారుణంగా హత్య చేశారు గుర్తుతెలియని దుండగులు. ఈ ఘటన లింగాపూర్ మండలం ఎల్లాపటార్ గ్రామ శివారులో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖానాపూర్ మండలం గొసంపెల్లి గ్రామానికి చెందిన లక్ష్మి గ్రామ గ్రామానికి తిరుగుతూ బుగ్గలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తోంది. సోమవారం ఎల్లాపటార్‌కు వెళ్లిన లక్ష్మిని కొంతమంది గుర్తుతెలియన దుండగులు అపహరించి అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం అత్యంత దారుణంగా హత్య చేసి అక్కడి నుంచి పరారయ్యారు. స్థానికుల సమాచారంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. -
ప్రమాద మృతులకు కన్నీటి వీడ్కోలు
వరంగల్ క్రైం/భీమారం/జనగామ: జనగామ జిల్లా లింగాలఘనపురం మండలం చిటూరు వద్ద శనివారం రాత్రి మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు కాన్వాయ్‌లోని వాహనానికి జరిగిన ప్రమాదంలో మృతి చెందిన కారు డ్రైవర్ (ఏఆర్ కానిస్టేబుల్) చిలకమర్రి పార్థసారథి(40), మంత్రి సోషల్ మీడియా ఇన్చార్జి తంగర్లపల్లి పూర్ణేందర్ (38) అంత్యక్రియలు ఆదివారం బంధువులు, మిత్రుల అశ్రునయనాల మధ్య జరిగాయి. అంతకు ముందు జనగామ ఆస్పత్రిలో పోస్ట్‌మార్టం అనంతరం మృతదేహాలను వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రంలోని స్వగృహాలకు తరలించారు. వారి భౌతిక కాయాలపై పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులర్పించిన మంత్రి దయాకర్‌రావు కన్నీటిపర్యంతమయ్యారు. మంత్రి స్వయంగా వారి పాడె మోశారు. మృతుల కుటుంబీకులను దగ్గరకు తీసుకుని నేనున్నానంటూ ఓదార్చారు. రూ. 25 లక్షల పరిహారం ఇవ్వాలి తమ సామాజికవర్గానికి చెందిన తంగర్లపల్లి పూర్ణేందర్ మృతి పట్ల తెలంగాణ నాయీబ్రాహ్మణ ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు మద్దికుంట లింగం సంతాపం వ్యక్తం చేశారు. పూర్ణేందర్ కుటుంబాన్ని రాష్ట్ర ప్రభుత్వం అన్నివిధాల ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. అతడి కుటుంబానికి 25 లక్షల రూపాయల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. తమ సంఘం తరపున పూర్ణేందర్ కుటుంబానికి బాసటగా ఉంటామని భరోసా యిచ్చారు. -
ఆసిఫాబాద్ జిల్లా ఏర్పాటుతో తగ్గిన దూరభారం
సాక్షి, ఆసిఫాబాద్: దేశంలోనే అత్యంత వెనకబడిన ప్రాంతంగా ఉన్న ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంగా ఆవిర్భావించి ఈ దసరాతో మూడేళ్లు కావస్తోంది. ఉమ్మడి ఆదిలాబాద్ నుంచి ఆసిఫాబాద్, సిర్పూర్ నియోజకవర్గాలను వేరు చేస్తూ పోరాటయోధుడు కుమురం భీం పేరు మీదుగా కొత్త జిలాను ఏర్పాటు చేశారు. అప్పటి వరకూ ఆదిలాబాద్ జిల్లా కేంద్రంగా ఉన్న ఈ ప్రాంతవాసులకు కొత్త జిల్లా ఏర్పాటుతో పాలన మరింత చేరువైంది. ప్రభుత్వ కార్యాలయాలు ఇంకా పూర్తిస్థాయిలో అందుబాటులోకి రాకపోయినా మౌలిక వసతుల కల్పన, అభివృద్ధిలో మాత్రం బీజం పడింది. కుమురం భీం జిల్లా ఆవిర్భావించడంతో ప్ర ధానంగా దూర భా రం సమస్య తీరినట్లయింది. మారుమూల ప్రాంతమైన బెజ్జూరు నుంచి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి వెళ్లేందుకు ఒక రోజు ముందు వెళ్లాల్సిన పరిస్థితి ఉండేది. జిల్లా ఏర్పాటుతో ఈ తిప్పలు తప్పాయి. గతంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి చిట్టచివరి ప్రాంతాలపై ఉన్నతాధికారుల పర్యవేక్షణ తక్కువగా ఉండేది. ప్రస్తుతం రెండు నియోజవర్గాలతో కలెక్టర్, ఎస్పీ నేరుగా మారుమూల ప్రాంతాలకు వెళ్లడంతో పాటు పర్యవేక్షణ పెరిగింది. ఉద్యోగాల్లో స్థానికులకే ప్రాధాన్యం.. కొత్త జిల్లాల ఏర్పాటుతో స్థానికులకే ఉద్యోగాల్లో 90 శాతం అవకాశం దక్కింది. గత మూడేళ్లుగా జిల్లాలో జరిగిన కానిస్టేబుల్, జూనియర్ పంచాయతీ కార్యదర్శి, ఇతర వివిధ శాఖల్లో తాత్కాలిక పోస్టుల్లోనూ జిల్లాలో స్థానిక నిరుద్యోగ యువతకే అవకాశం కలిగింది. ఇక జిల్లా ఏర్పాటుతో భవిష్యత్‌లోనూ స్థానిక నిరుద్యోగులకు ఈ రిజర్వేషన్ పద్ధతి కొనసాగనుంది. అభివృద్ధికి అడుగులు.. కొత్త జిల్లా ఏర్పాటుతో అభివృద్ధికి ఆస్కారం ఏర్పడింది. జిల్లా ఏర్పాటు చేసిన తర్వాత కొత్తగా లింగాపూర్, చింతలమానెపల్లి, పెంచికల్‌పేట మూడు మండలాలు ఏర్పడ్డాయి. చిన్న మండలాలతో పాలన మరింత సులభమవుతోంది. అలాగే కొత్తగా తహసీల్, ఎంపీడీవో, పోలీసు స్టేషన్, తదితర మండల కార్యాలయాలన్నీ రావడంతో పాలనలో ఫోకస్ పెరిగింది. ఇప్పటికే జిల్లా కేంద్రంలో కలెక్టరేట్ సమీకృత భవనాల నిర్మాణాలు, పోలీసు కార్యాలయాల నిర్మాణాలు మొదలయ్యాయి. జిల్లా కేంద్రం కావడంతో ప్రతి శాఖకు సంబందించిన కార్యాలయాలు ఏర్పాటయ్యాయి. వైద్య సేవల్లో సామాజిక ఆసుపత్రిని అప్‌గ్రేడ్ చేయడం, మహిళల భద్రత కోస సఖీ కేంద్రం తదితర శాఖల కార్యాలయాలు ఏర్పాటయ్యాయి. పరిపాలనపై మరింత పట్టు పెరిగింది. సొంత జిల్లాల్లోనే బదిలీలకు ఆస్కారమేర్పడింది. కేంద్రం కొత్త జిల్లాల ప్రతిపాదికనే ఇటీవల నిధులు మంజూరుకు సుముఖం తెలపడంతో ఇక నుంచి మరింత ప్రగతి ఆశించవచ్చు. అరకొర వసతులు.. గ్రామ పంచాయతీగా ఉన్న ఆసిఫాబాద్‌ను జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయడంతో ఉద్యోగులు, కార్యాలయాలకు సరైన వసతులు లేక ఇబ్బందులు పడుతున్నారు. గిరిజన ప్రాంతం కావడంతో అధికారులకు సరైన మౌలిక వసతులు లేక ఇక్కట్లకు గురికావాల్సి వస్తోంది. జిల్లా ఏర్పడిన నుంచి అరకొర సిబ్బందితోనే పాలన సాగుతోంది. ఇప్పటికీ అన్ని శాఖల్లోనూ సిబ్బంది కొరత తీవ్రంగా వేధిస్తోంది. ఉన్నతాధికారులకు జిల్లా కేంద్రంలో ఆవాస యోగ్యం లేకపోవడంతో కాగజ్‌నగర్, మంచిర్యాల తదితర ప్రాంతాల నుంచి నిత్యం రాకపోకలు సాగిస్తున్నారు. మిగతా ప్రాంతాలతో పోల్చితే ఇక్కడ హెచ్ఆర్ఏ తక్కువగా ఉండడంతో కొందరు ఉద్యోగులు ఇక్కడి నుంచి బదిలీ చేయించుకుని వెళ్తున్నారు. ప్రధానంగా గడిచిన మూడేళ్లలో కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయాలు అందుబాటులోకి రాలేదు. డీఎంహెచ్‌వో కార్యాలయంతో పాటు చాలా వరకూ కార్యాలయాలు ఇరుకు గదుల్లో, అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. జిల్లా కేంద్రంలో రోడ్డు డివైడర్లు నిర్మించారు. ఏజెన్సీలో నేటికీ అనేక గ్రామాలకు సరైన రోడ్డు వసతి లేదు. పలు సమస్యలు ఉన్నప్పటికీ జిల్లా ఏర్పాటుతో ఎంతో మేలు జరిగినట్లయిందని ప్రజలు తెలుపుతున్నారు. విద్యా వ్యవస్థ మెరుగుపడాలి కొత్త జిల్లా ఏర్పాటుతో జిల్లాకు కొన్ని గురుకులాలు మంజూరయ్యాయి. ఇది స్వాగతించాల్సిన విషయమే అయినా జిల్లాలో ప్రభుత్వ విద్యావ్యవస్థ మరింత మెరుగుపడాల్సి ఉంది. జిల్లా కేంద్రంలో ప్ర భుత్వ పాలిటెక్నిక్, డిగ్రీ కళాశాలలు ఏర్పా టు చేయాలి. గిరిజన విద్యార్థులు ప్రభుత్వ ఉన్నత విద్యకు దూరమవుతున్నారు. – దుర్గం రవీందర్, ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆశించిన స్థాయిలో ఫలితాలు లేవు నూతన జిల్లాగా ఏర్పడినా ఆశించిన స్థాయిలో ఫలితాలు లేవు. ఆదిలాబాద్ జిల్లా ఉన్నప్పుడు దూరభారంతో ఇబ్బందులు పడేవాళ్లం. ప్రస్తుతం దూరభారం తగ్గినా చాలా వరకూ పనులు జరగడం లేదు. కాగజ్‌నగర్‌ను డివిజన్‌గా ఏర్పాటు చేసినా గతంలో ఉన్న పరిస్థితి మాత్రమే కనిపిస్తోంది. అనేక సమస్యలు పరిష్కారానికి నోచడం లేదు. – సిందం శ్రీనివాస్, కాగజ్‌నగర్ పరిపాలన సౌలభ్యం పెరిగింది కుమురం భీం జిల్లా ఏర్పాటుతో పరిపాలన సౌలభ్యం పెరిగింది. ప్రభుత్వ శాఖలు, అధికారులు అందుబాటులోకి వచ్చారు. గతంలో ఆదిలాబాద్‌కు వెళ్లాలంటే సుమారు 150 కిలోమీటర్ల వెళ్లాల్సి వచ్చేది. దీంతో చాలా వ్యయప్రయాసలకు గురికావాల్సి వచ్చేంది. కాని కుమురం భీం జిల్లా ఏర్పాటుతో చాలా వరకూ పరిస్థితి మారింది. శాఖల పనితీరుపై అధికారుల పర్యవేక్షణ సైతం పెరిగింది. గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. – బొమ్మినేని శ్రీధర్, రెబ్బెన అభివృద్ధికి బాటలు పడ్డాయి.. నూతనంగా జిల్లా, మండలాల ఏర్పాటుతో అభివృద్ధికి బాటలు పడ్డాయి. గతంలో జిల్లా కేంద్రం దూరంగా ఉండడంతో ఇబ్బందులకు గురయ్యాం. నూతన మండలాల ఏర్పాటుతో రవాణా ఇబ్బందులు తీరాయి. పరిపాలన సౌలభ్యంగా మారింది. ప్రభుత్వపరమైన పథకాలు, కార్యక్రమాల సమాచారం తెలుసుకుకోవడం నూతన మండలాలతో అందుబాటులోకి వచ్చింది. – సయ్యద్ అజీమ్, చింతలమానెపల్లి సేవలు అందుబాటులోకి చింతలమానెపల్లి మండలంగా ఏర్పడక ముందు గూడెం, డబ్బా, ఖర్జెల్లి, దిందా, అడెపల్లి, కేతిని, రుద్రాపూర్ గ్రామాలకు వెళ్లాలంటే సుమారు 30 కిలోమీటర్లు వెళ్లాల్సి వచ్చేంది. చింతలమానెపల్లి కొత్త మండలంగా ఏర్పాటు కావడంతో చాలా వరకూ సేవలు అందుబాటులోకి వచ్చాయి. ప్రభుత్వ కార్యాలయాలు దగ్గరనే ఉన్నాయి. నూతన పంచాయతీలతో సౌలభ్యంగా ఉంది. మండల కేంద్రంలో అన్ని కార్యాలయాలను వీలైనంత త్వరగా అందుబాటులోకి తీసుకురావాలి. ప్రజలకు మెరుగైన సేవలందించాలి. – కుమ్మరి హరీశ్, చింతలమానెపల్లి -
వామ్మో.. పులి
ఆసిఫాబాద్ జిల్లా పెంచికల్పేట్ బెజ్జూర్ ప్రధాన రహదారిలో కొండపల్లి అటవీ ప్రాంతంలో శుక్రవారం పులి రోడ్డు మీదకు రావడంతో ప్రయాణికులు హడలిపోయారు. బెజ్జూర్ నుంచి వస్తున్న ఆర్టీసీ బస్సుకు పులి అడ్డురావడంతో అందులో ఉన్న విద్యార్థులు సెల్ఫోన్లో ఫొటోలను తీశారు. పులి సంచరిస్తుండటంతో పెంచికల్పేట్ నుంచి సలుగుపల్లి, బెజ్జూర్వెళ్లే ప్రయాణికులు భయాందోళన చెందుతున్నారు. – పెంచికల్పేట్ (సిర్పూర్) -
సెవెన్.. హెవెన్
మనసు దోచే జలపాతాలు, హృదయం పులకరించే ప్రకృతి సోయగాలు చూడాలంటే ఇకపై మనం ఎక్కడికో వెళ్లక్కర్లేదు. దర్జాగా మన గడ్డపైనే వాటిని చూస్తూ తన్మయత్వంతో మైమరచిపోవచ్చు. మదిని కట్టిపడేస్తూ కనువిందు చేస్తున్న ఈ అందాలు.. మన కుమురంభీం జిల్లాలోనే ఉన్నాయి. లింగాపూర్ మండల సమీపంలో ఈ జలపాతాలు హయలొలికిస్తున్నాయి. ఒకటి కాదు.. రెండు కాదు.. సప్తగుండాలుగా పిలిచే ఏడు జలపాతాలు మదిని పులకరింపజేస్తున్నాయి. ఇక్కడి దట్టమైన అటవీ ప్రాంతంలో ఉన్న రామ గుండం, సీత గుండం, లక్ష్మణ గుండం, భీమ గుండం, సవితి గుండం, చిరుతల గుండం, సప్తగుండం అనే ఏడు గుండాలను కలిపి మిట్టె జలపాతం అని పిలుస్తారు. ఇటీవల కురిసిన వర్షాలకు వరద చేరడంతో ఎత్తైన కొండల నుంచి జలపాతం పరవళ్లు తొక్కుతూ చూపరులను కట్టిపడేస్తోంది. కుమురంభీం జిల్లా కేంద్రానికి 90 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ జలపాతాన్ని గతంలో పనిచేసిన కలెక్టర్ చంపాలాల్ సందర్శించడంతో మరింత వెలుగులోకి వచ్చింది. అద్భుతమైన పర్యాటక కేంద్రంగా విరజిల్లాల్సిన ఈ ప్రదేశం.. సరైన రోడ్డు మార్గం లేకపోవడంవల్ల ప్రాచుర్యం సంతరించుకోలేకపోతోంది. ఇవే కాకుండా ఈ జిల్లాలో దట్టమైన అటవీ ప్రాంతాల్లో అనేక జలపాతాలు ఉన్నా ఇన్నాళ్లూ అవి బాహ్య ప్రపంచానికి పరిచయం కాలేదు. – ఆకుల రాజు, సాక్షి, ఆసిఫాబాద్ -
ఆయువు తీసిన బావి
కౌటాల (సిర్పూర్): బోరు మోటార్ మరమ్మతు కోసం బావిలోకి దిగి ఊపిరాడక ముగ్గురు యువకులు మృతి చెందారు. ఒకరిని కాపాడేందుకు మరొకరు దిగి మృతి చెందడం విషాదాన్ని నింపింది. ఈ ఘటన బుధవారం కుమురం భీం జిల్లా కౌటాల మండలం ముత్తంపేటలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన కారెం మహేష్(18) ఇంట్లోని చేదబావిలో బోరు వేయించారు. కొద్ది రోజుల నుంచి బోరు మోటార్ పనిచేయడం లేదు. బుధవారం మరమ్మతు కోసం మొదట మహేష్ బావిలోకి దిగాడు. కొద్ది సేపటికి ఊపిరాడక సొమ్మసిల్లి పడిపోయాడు. అతడిని కాపాడేందుకు మహేష్ బావ చొక్కల శ్రీనివాస్ (35) దిగాడు. శ్రీనివాస్ కూడా ఊపిరాడక పడిపోయాడు. లోనికి దిగిన ఇద్దరు బయటకు రాకపోవడంతో మహేష్ మేన బావమర్ది గాదిరెడ్డి రాకేశ్ (23) కూడా దిగాడు. రాకేశ్ కూడా ఊపిరాడక పడిపోయాడు. బయటపడ్డ పోశం: బావిలో ఊపిరాడక పడిపోయారని కుటుంబీకులు గ్రామస్తులకు తెలిపారు. దీంతో పంజల పోశం అనే వ్యక్తి తాళ్లు కట్టుకుని లోనికి దిగే ప్రయత్నం చేశాడు. కొద్ది దూరం వెళ్లిన అనంతరం పోశంకు కూడా ఊపిరాడకపోవడంతో బయటకు తీశారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో కౌటాల సీఐ డి.మోహన్, ఎస్సై ఆంజనేయులు అక్కడకు చేరుకున్నారు. పరిస్థితిని తెలుసుకునేందుకు కోడికి తాడుకట్టి లోనికి దించారు. శ్వాస అందక కోడి కూడా మృతి చెందింది. దీంతో ఆ ముగ్గురు కూడా ఊపిరాడక మృతిచెంది ఉంటారని పోలీసులు నిర్ధారించుకున్నారు. జేసీబీ ద్వారా బావి చుట్టూ తవ్విన అనంతరం పోలీసులు సింగరేణి రెస్క్యూ టీంను రప్పించి మృతదేహాలను బయటకు తీశారు. బావి లోతు 30 అడుగుల వరకూ ఉంది. ముగ్గురిదీ ఒకే కుటుంబం ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు యువకులు మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి. మృతుడు మహేష్ కౌటాల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియెట్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. గాదిరెడ్డి రాకేశ్ ఎలక్ట్రికల్ పనులు చేస్తున్నాడు. మంచిర్యాల జిల్లా కాసిపేట మండలం సకినాం గ్రామానికి చెందిన చొక్కల శ్రీనివాస్ వ్యవసాయం చేస్తున్నాడు. శ్రీనివాస్‌కు భార్య శైలజ, కుమారుడు నవదీప్, కూతురు ప్రవళిక ఉన్నారు. -
కుమురం భీం జిల్లాలో ఆయిల్ నిక్షేపాలు!
సిర్పూర్(టి): కుమురంభీం, మంచిర్యాల జిల్లాల పరిసరప్రాంతాల్లో ఆయిల్, గ్యాస్ నిక్షేపాలు ఉన్నట్లు ప్రాథమిక పరీక్షల్లో తేలడంతో నిపుణులు సర్వే చేస్తున్నారు. ఓఎన్జీసీఆధ్వర్యంలో చేపట్టిన ఈసర్వేలో కుమురంభీం జిల్లా పరిధిలో నికాగజ్నగర్, సిర్పూర్(టీ), దహెగాం, పెంచికల్ పేటమండలాల్లో ఈ నిక్షేపాలు ఉన్నట్లుగుర్తించారు. గత నాలుగు రోజులుగా ఇక్కడ నిపుణుల ఆధ్వర్యంలో సర్వేపనులు కొనసాగుతున్నాయి. గ్రామాల్లో కేబుల్ కనెక్షన్లు వేసి అధునాతన పరికరాలతో చేస్తున్న సర్వే మొదటిదశపూర్తికావస్తోంది. ప్రస్తుతం అందుతున్న వివరాల ప్రకారంఎనిమిదినెలలపాటుపరీక్షలునిర్వహించినిక్షేపాలుకచ్చితంగా లభ్యమయ్యేప్రాంతాలనుగుర్తిస్తామనిఓఎన్జీసీఅధికారులుచెబుతున్నారు. శుక్రవారంసిర్పూర్(టీ) మండలకేంద్రంలోనిదుబ్బగూడకాలనీప్రాంతంలోసర్వేనిర్వహించడంతోపాటుఎంపికచేసినస్థలాల్లోడ్రిల్లింగ్చేసిపరీక్షలు నిర్వహించారు. అలాగేశనివారంసిర్పూర్(టీ), నవేగాం, హుడ్కిలిగ్రామాల్లోకేబుళ్లనుఅమర్చికంప్యూటర్లలో పరిశీలిస్తూ, డ్రిల్లింగ్‌చేశారు. దీనికిముందుగాకాగజ్నగర్మండలంలోనిఅనుకోడ, చుంచుపల్లి, గన్నారం, చింతకుంటగ్రామాలమీదుగాకేబుల్లైన్లువేస్తూసర్వేనిర్వహించారు. డ్రిల్లింగ్చేయగావచ్చేధ్వనితరంగాలద్వారానిక్షేపాలనుపసిగడుతున్నట్లు తెలుస్తోంది. కుమురంభీం– మంచిర్యాల– భద్రాచలంమీదుగా.. రెండవదశ సర్వేకాగజ్నగర్ మండలంలోని పెద్దవాగునుంచి కుమురంభీం జిల్లాతోపాటు మంచిర్యాలజిల్లా మీదుగా భద్రాచలం జిల్లాల్లో ప్రాథమిక సర్వేలునిర్వహిస్తామని సంస్థ అధికారులు తెలిపారు. ఈ జిల్లాల్లోని అన్ని మండలాల్లో ప్రాథమిక పరీక్షలు నిర్వహించి 8 నెలలపాటు సర్వే చేయనున్నట్లువెల్లడించారు. నిక్షేపాలున్న స్థలాలను గుర్తించి పూర్తిస్థాయి సర్వేలుచేపడతామని తెలిపారు. కుమురంభీంజిల్లాతోపాటు మంచిర్యాల పరిసరప్రాంతాల్లోని భీమిని మండలంనందుగులగూడ గ్రామ పరిసరాల్లో ఆయిల్, గ్యాస్ నిక్షేపాలున్నట్లు పేర్కొన్నారు. పూర్తిస్థాయిసర్వేలు చేపడతాం కుమురం భీంజిల్లాలోనిపలుగ్రామాల్లోఓఎన్జీసీఆధ్వర్యంలో ఆయిల్, గ్యాస్ నిక్షేపాల కోసంప్రాథమికసర్వేలు చేపడుతున్నాం. సర్వేల రిపోర్టు లు, డ్రిల్లింగ్‌లో వెల్లడైన ఫలితాల ఆధారంగా 8 నెలలపాటు పూర్తిస్థాయి సర్వేలు చేపడతాం. నిక్షేపాల తీరునుబట్టి స్థానికంగా వెలికితీత ప్రారం భమవుతుంది. – సత్తిబాబు, ఓఎన్జీసీ, పీఆర్వో -
బ్యాడ్మింటన్ ఆడతా..
ఆయన జిల్లాకు బాస్. ప్రతిరోజు అధికారిక విధుల్లో బిజిబిజీగా గడుపుతుంటారు. అయినా ఇంటికొచ్చాక మాత్రం ముద్దుల కూతురుతో కాసేపు గడపనిదే నిద్రపోరు. రోజువారీ కార్యక్రమాల్లో క్షణం తీరిక లేకుండా గడిపే జీవితం నుంచి కాసేపు అలా కుటుంబంతో సేద తీరుతారు. ఎప్పుడూ సాదాసీదా వ్యక్తిలా కనిపించే ఆయన.. నిత్యం వివిధ శాఖల అధికారులకు పాలనపరంగా ఆదేశిలిస్తుంటారు. పాలనలో తనదైన ముద్ర వేస్తున్న ఆయనే కుమురం భీం జిల్లా కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతు. రోజంతా జిల్లా అధి కారులతో సమీక్షలు, సమావేశాలు, పర్యటనలతో బిజిబిజీగా ఉం డే ఆయనను ‘సాక్షి పర్సనల్ టైం’ లో కాసేపు గడిపి ఆయ న వ్యక్తిగత విషయాలను పంచుకున్నారు. వివరాలు ఆయన మాటల్లోనే.. సాక్షి, ఆసిఫాబాద్ : మాది శ్రీకాకుళం జిల్లా కాశిబుగ్గ. అమ్మ వనజాక్షి స్కూల్ టీచర్. నాన్న క్రిష్ణారావు రిటైర్డ్ అసిస్టెంట్ బీసీ వెల్ఫేర్ అధికారి. మా సోదరి రజని. ప్రస్తుతం యూఎస్‌లో న్యూరాలజీ చేస్తున్నారు. నా విద్యాభాస్యం విషయానికి వస్తే పొలాకిలో ఎనిమిదో తరగతి వరకు, పలాసలో ఇంటర్మీడియెట్, వైజాగ్ ఆంధ్రా యూనివర్సిటీలో బీటెక్ (కంప్యూటర్ సైన్స్) పూర్తిచేశా. క్యాంపస్ ఇంటరŠూయ్వలో ఉద్యోగం వచ్చినా చేరకుండా.. సివిల్ సర్వీసెస్ పరీక్షలకు సన్నద్ధమయ్యాను. అలా మొదటిసారి 2010లో ఐఆర్‌టీఎస్‌కు ఎంపికయ్యా. 2012లో ఐఏఎస్‌కు ఎంపికయ్యా. ఇంట్లో అమ్మనాన్నలిద్దరూ కూడా విద్యావంతులే. ఉద్యోగస్తులు కావడంతో చిన్నప్పటి నుంచి నాకు అన్నింటా ప్రోత్సాహాం ఉండేది. నాకు ఇష్టమైన రంగంలో రాణించేందుకు నన్ను ఎంతో ప్రోత్సహించారు. ఇక నాపేరు విషయానికి వస్తే మా తాతకు గాంధీ కుంటుంబంపై అభిమానం ఎక్కువ. అందుకే నాకు రాజీవ్‌గాంధీ అని పేరు పెట్టారు. హన్మంతు మా ఇంటి పేరు. విజయలక్ష్మీతో వివాహం.. నేను ఐఆర్‌టీఎస్‌కు ఎంపికైన మరుసటి ఏడాది 2011లో విజయలక్ష్మీతో నా వివాహం జరిగింది. మాది పెద్దలు కుదిర్చిన పెళ్లి. తను ఎల్ఎల్బీ పూర్తిచేశారు. ఆమెకు దైవభక్తి ఎక్కువ. మా కూతురు ప్రేరణదేవి. ప్రస్తుతం ఫస్ట్‌క్లాస్ చదువుతోంది. అధికారిక విధుల్లో రోజులో ఎక్కువ టైం గడిచిపోతోంది. మా పాపతో ఎక్కువగా గడపలేకపోతుంటాను. ఈ లోటును మా ఆవిడ భర్తీ చేస్తారు. మా కూతురు పెంపకం బాధ్యత మొత్తం ఆమె చూసుకుంటారు. కాసేపు మా పాపతో.. నిత్యం విధి నిర్వహణలో బిజిబిజీగా రోజంతా గడిచిపోతోంది. ఇంటికి వెళ్లాక మాత్రం కాసేపు తప్పకుండా మాపాప ప్రేరణతో గడుపుతుంటాను. దీంతో పనిఒత్తిడి నుంచి కాస్తా రిలాక్స్‌గా అనిపిస్తుంది. బుక్స్ చదువుతా.. ఐఏఎస్ ట్రైనింగ్‌లో ఉన్నప్పుడు బ్యాడ్మింటన్ బాగే ఆడేవాడిని. కొత్తగూడెం కలెక్టర్‌గా ఉన్నప్పు డు కూడా తీరిక సమయంలో ఆడేవాడిని. ఇక్కడ బ్యాడ్మింటన్ కోర్టు లేకపోవడంతో కుదరడం లేదు. తీరిక సమయాల్లో పుస్తకాలు చదువుతా. చేపలు, రొయ్యలు ఇష్టంగా తింటా. చిన్నప్పటి నుంచి కోస్తా తీరంలోని సముద్ర తీరం ప్రాంతంలో పెరగడంతో సీ ఫుడ్ బాగా అలవాటు అయింది. నాన్‌వెజ్‌లో చేపలు, రొయ్యలు ఇష్టంగా తింటా. అక్క నా మార్గదర్శి.. చిన్నప్పటి నుంచి మా అక్క రజని అంటే నాకు ఎంతో ఇష్టం. నాకు అన్ని విషయాల్లో మార్గదర్శంగా ఉండేది. వైజాగ్‌లో నేను ఆంధ్రా యూనివర్సిటీలో బీటెక్ చేస్తున్న సమయంలో తను అదే యూనివర్సిటీలో ఎంబీబీఎస్ చేసేది. నా సివిల్స్ ప్రిపరేషన్ సమయంలోనూ ఎంతగానో తోడ్పాటునందించింది. అయితే ప్రస్తుతం ఆమె యూఎస్‌లో ఉంటుంది. అక్క మాకు దూరంగా ఉంటుందనే బెంగ ఉంటుంది. పీహెచ్డీ చేయాలి... నేను బీటెక్ వరకే చదివి సివిల్స్‌కు ఎంపికవడంతో అక్కడికే నా చదువు ఆగిపోయింది. ఐఏఎస్‌లకు విదేశాల్లో చదువుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి అవకాశం వస్తే విదేశాల్లో ఉన్నత చదువులు చదివి పీహెచ్డీ పూర్తి చేయాలని ఉంది. ఆ రెండు సంతృప్తినిచ్చాయి.. నేను భద్రాద్రి కొత్తగూడెంలో కలెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న సమయంలో ప్రతిష్టాత్మక సీతారామ ప్రాజెక్టు (దుమ్ముగూడెం ఎత్తిపోతల పథకం) భూ సేకరణ విజయవంతంగా పూర్తి చేశాను. అది నాకు ఎంతోగానో సంతృప్తినిచ్చింది. అంతకు ముందు అసిస్టెంట్ కలెక్టర్‌గా ఉన్నప్పుడు వరంగల్‌లో ఆడపిల్లల అమ్మకంపై మీడియాలో వచ్చిన ఆ కేసును నేనే డీల్ చేశా. ఆ ఆసుపత్రిని సీజ్ చేశా. కారకులను పట్టుకుని శిక్షించాం. ఇక్కడి వాతావరణం నచ్చింది.. ఇక్కడి వాతావరణం నాకు బాగా నచ్చింది. చిన్నప్పటి నుంచి గ్రామీణ ప్రాంతాల్లో పెరిగినందున నాకు పెద్దపెద్ద మెట్రో నగరాల కంటే భద్రాచలం, ఆసిఫాబాద్ లాంటి ప్రాంతాలంటేనే ఇష్టం. ఇక్కడ విధులు నిర్వహించడం నాకో ఎంతో సంతృప్తినిస్తోంది. -
డార్ఫ్ కొడుకు లచ్చుపటేల్.. తండ్రి చెప్పినట్టే చేశారు!
సాక్షి, ఆసిఫాబాద్ : అడవి బిడ్డల ఆచార సంప్రదాయాలు, వారి జీవన విధానంతో పాటు మారుతున్న కాలంలో ఉనికి కోసం వారు చేస్తున్న పోరాటాలను ప్రపంచానికి పరిచయం చేసిన మహనీయులు లండన్ ఆంత్రోపాలజీ ప్రొఫెసర్ క్రిస్టోఫర్ వోన్ ఫ్యూరర్ హైమన్ డార్ఫ్, ఆయన భార్య బెట్టి ఎలిజబెత్. ఈ దంపతులు భౌతికంగా దూరమైనా గిరిజనులకు వారు చేసిన సేవలకు గుర్తుగా ఏటా జనవరి 11న వారివురి వర్ధంతిని ఏజెన్సీలో ఉత్సవంలా నిర్వహిస్తున్నారు. ఈసారి వేడుకల కోసం కుమురం భీం జిల్లా జైనూర్ మండలం మార్లవాయిలో అన్ని ఏర్పాట్లు చేశారు. ఆదివాసీలపై అధ్యయనం ఆస్ట్రియా రాజధాని వియన్నాలో 1909లో జన్మించిన హైమన్ డార్ఫ్, లండన్‌లోని లండన్ స్కూల్ ఆఫ్ ఎకానమిక్స్‌లో విద్య నభ్యసించారు. తనకు ఇష్టమైన ఆంత్రోపాలజీలో (మానవ వనరుల శాస్త్రం) డాక్టరేట్ చేశారు. భారత్‌లోని నాగా, గోండు, కోయ, కొండ రెడ్లు, చెంచు తదితర తెగల జీవన విధానంపై అధ్యయనం చేసేందుకు భారతదేశంలో పర్యటించారు. 1942 నుంచి 1945 మధ్య హైదరాబాద్ సంస్థానంలోని ఆదిలాబాద్‌లోని గిరిజన తెగలపై అధ్యయనం చేయడం కోసం జైనూర్ మండలం మార్లవాయిలో తన భార్యతో కలిసి నివాసం ఏర్పరుచుకున్నారు. గిరిజనులతో మమేకం డార్ఫ్ దంపతులు గిరిజనులతో మమేకమై వారి ఆచార వ్యవహారాలు, వారి సమస్యలను ప్రపంచానికి తెలియజేశాడు. గిరిజనులపై పరిశోధనకు ఆయన భార్య ఎలిజబెత్ కూడా ఎంతగానో సాయపడేవారని స్థానిక గిరిజనులు చెబుతుంటారు. గిరిజనుల ఆహార అలవాట్లు, ఆరోగ్యం, పండగలు, నృత్యాలు, కర్మ కాండలు, పెళ్లిళ్లు, విడాకులు, వ్యవసాయం, భాష, యాస, నడవడి, సాగుచేసే విధానాలపై హైమన్‌డార్ఫ్ రాసిన పుస్తకాలు ప్రపంచ ఖ్యాతి గడించాయి. 1979లో రెండోసారి భారత్‌కు వచ్చినప్పుడు లండన్‌కు చెందిన మైఖేల్ యార్క్‌తో ఆదివాసీల జీవినం గురించి పలు డాక్యుమెంటరీలు తెరకెక్కించారు. డార్ఫ్ అప్పట్లో తీసిన ఫొటోలు ఇప్పటికీ గిరిజనులపై పరిశోధన చేసే వారికి ఉపయోగపడుతున్నాయి. నిజాంను ఒప్పించి భూ పట్టాలు పంపిణీ ఆదివాసీలు భూమిపై హక్కులేక ఇబ్బందులు పడుతున్నారని గుర్తించిన హైమన్ డార్ఫ్ వారికి భూములపై యాజమాన్య హక్కులు కల్పించేందుకు నిజాంతో చర్చలు జరిపారు. అప్పటికే అటవీ భూములను సాగు చేసుకుంటున్న స్థానికులకు ఒక్కొక్కరికి దాదాపు 15 ఎకరాలు ఇప్పించేందుకు కృషి చేశారు. ఆయన కృషి ఫలితంగానే సుమారు 12వేల గిరిజన కుటుంబాలకు భూ పట్టాలు వచ్చాయి. ఈ క్రమంలో నిజాం ప్రభుత్వం ఆయనను కొంత కాలం గిరిజన అభివృద్ధి సలహాదారుగా నియమించింది. ఆదివాసీల హక్కుల రక్షణ కోసం హైమన్ అనేక సూచనలు చేశారు. ఆయన నివాసం ఉన్న మార్లవాయిలో ఉపాధ్యాయ శిక్షణ కేంద్రాన్ని నెలకొల్పి అనేక మంది గిరిజనులను చదువు వైపు నడిచేలా ప్రొత్సహించారు. కొడుకు పేరు లచ్చుపటేల్ హైమన్ డార్ఫ్ దంపతులు మార్లవాయిలో ఉన్నప్పుడు ఆ గ్రామ పెద్ద లచ్చుపటేల్ మరణించాడు. ఆ మరుసటి రోజే డార్ఫ్ భార్య ఎలిజబెత్ ఓ బాబుకు జన్మనిచ్చింది. ఆదివాసీల సంప్రదాయం ప్రకారం ఊరిలో ఎవరైనా చనిపోయిన మరుసటి రోజులోనే ఎవరైనా పుడితే, వారే మళ్లీ పుట్టారని నమ్ముతారు. ఇందుకు గుర్తుగా చనిపోయిన వారి పేరు పెడతారు. ఆ సాంప్రదాయం ప్రకారం డార్ఫ్ దంపతులు తమ కొడుకు పేరు లచ్చుపటేల్ అని నామకరణం చేశారు. ఇక్కడే సమాధి కట్టండి మరణానంతరం దంపతులిద్దరి సమాధులు ఇక్కడే ఏర్పాటు చేయాలని డార్ఫ్ స్థానికులను కోరారు. డార్ఫ్ భార్య ఎలిజబెత్ 1987లో మరణించారు. ఆమె చనిపోయిన తర్వాత డార్ఫ్, ఆయన కొడుకు లచ్చుపటేల్ (నికోలస్) ఎలిజబెత్ చితాభస్మాన్ని లండన్ నుంచి మార్లవాయికి తీసుకొచ్చి సమాధి కట్టించారు. 1995లో హైమన్‌డార్ఫ్ కూడా చనిపోగా.. 2012లో లండన్ నుంచి ఆయన చితాభస్మాన్ని కూడా మార్లవాయికి తీసుకువచ్చి ఎలిజబెత్ సమాధి పక్కనే మరో సమాధి కట్టించారు. అప్పటి నుంచి ప్రతి ఏటా జనవరి 11న డార్ఫ్ దంపతుల వర్ధంతిని ఆదివాసీలు ఘనంగా నిర్వహిస్తున్నారు. డార్ఫ్ రచనలు –ద చెంచుస్ (1943) – ద రెడ్డీస్ ఆఫ్ బైసన్ హిల్స్ (1945) – ద రాజ్ గోండ్స్ ఆఫ్ ఆదిలాబాద్ (1945) – ద షెర్పాస్ ఆఫ్ నేపాల్ (1964) – ద కొన్యాక్ నాగస్ (1969) – ద ట్రైబ్స్ ఆఫ్ ఇండియా: స్ట్రగుల్ ఫర్ సర్వైవర్ (1982) -
ఆదివాసీ యోధుడు కొమురం భీం
ఉమ్మడి ఆదిలాబాదు జిల్లా ఆసిఫాబాద్ మండలం జోడేఘాడ్ సంకెనపల్లి గ్రామంలో 1900లో కొమురం భీం జన్మించినాడు. భీంకి 15 ఏండ్లు ఉన్నప్పుడే అతని తండ్రిని అటవీ అధికారులు చంపివేశారు. భీం కుటుంబం సాగుచేస్తున్న భూమిని ‘‘సిద్దిభి’’ అనే జాగిర్దార్ తనకు వదిలి పెట్టాల్సిందిగా బెదిరించాడు. ఎక్కడికి పారిపోయి బ్రతకాలి ఎందుకు భయపడాలి. ప్రళయ ఘర్జనలో భీంలో ధిక్కారస్వరం ప్రతిధ్వనించింది. సిద్దిభి తలౖపై కట్టెతో గట్టిగా కొట్టాడు. సిద్దిభి అక్కడే చనిపోయాడు. పోలీసులు భీంనీ వేటాడారు. దీంతో అస్సాంలో ఏళ్ల పాటు అజ్ఞాత జీవితం గడిపాడు. బాభి ఝారి చుట్టు పక్కల తన నాయకత్వంలో ఉన్న 12 గ్రామాల్లో మా గ్రామం మా స్వరాజ్యం అనే నినాదాన్ని అబ్దుల్ సత్తార్ అనే తాలుక్ దారుతో ఒప్పించడానికి చేసిన ప్రయత్నం విఫలమైంది. అక్కడ నుంచి సుర్దాపూర్కి తిరిగి వచ్చి పెత్తందారి వ్యవస్థ కింద నలుగుతున్న తన జాతి విముక్తి కోసం ‘జల్ జంగల్ జమీన్’ తమదే అంటూ గర్జించాడు. స్వయం పాలన 12 గ్రామాలతో స్వతంత్ర గోండు రాజ్యం కావాలని ఆసిఫాబాద్ కలెక్టర్‌తో చర్చలు జరి పాడు. పరిష్కారం దొరకలేదు. దీంతో నిజాం రాజును కలవడానికి హైదరాబాద్ వెళ్ళాడు కానీ నిజాం నుంచి అనుమతి దొరకలేదు ఇక గెరిల్లా పోరాటంతోనే నిజాం సైన్యాన్ని ఎదుర్కోవాలి అని నిర్ణయించుకున్నాడు. దట్టమైన అడవుల్లో ఉన్న ‘జోడే ఘాట్’ గుట్టల్లో గెరిల్లా అర్మీని తయారు చేశాడు. భీంతో చర్చలు జరిపినప్పటికీ ఫలించకపోవడంతో భీంని అంతం చేస్తే తప్ప తిరుగుబాటు ఆగదని నిజాం సర్కార్ భావించింది. భీం దగ్గర హవల్దార్‌గా పనిచేసే కుర్దు పటేల్‌ని లోబరుచుకుని భీం స్థావరాన్ని బ్రిటిష్ ఆర్మీ సహాయంతో అర్ధరాత్రి సమయంలో చుట్టుముట్టింది. 3 రోజుల సుదీర్ఘ పోరాటంలో అలసిన భీం గెరిల్లాలపై నిజాం సైన్యం ఒకసారి గుంపుగా విరుచుకపడి కొమురం భీం గుండెల్లో బుల్లెట్ దింపారు. ఆదివాసీల ఆశయాల సాధనే భీంకి ఇచ్చే ఘన నివాళి. వ్యాసకర్త: పెనుక ప్రభాకర్, ఆదివాసీ రచయితల సంఘం(తెలంగాణ). -
‘కల్యాణలక్ష్మి’కి దళారులు
సాక్షి, ఆసిఫాబాద్ కొమరంభీం : పేదింటి ఆడ బిడ్డ పెళ్లి చేసుకునే సమయంలో ఆ కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవాలనే ఉద్దేశంతో ప్రవేశపెట్టిన కల్యాణలక్ష్మి పథకంలో దళారుల తాకిడి ఎక్కువైంది. దరఖాస్తు చేసుకునేప్పుడు అందినకాడికి లబ్ధిదా రుల నుంచి దండుకుంటున్నారు. వివిధ సర్టిఫికెట్ల కోసం ఒక్కో దానికి ఓక్కో రేటు ఫిక్స్ చేసి లబ్ధి దారుల నుంచి అందిన కాడికి దోచుకుంటున్నా రు. ఈ పథకానికి దరఖాస్తు విధానం, అవసరమైన సర్టిఫికెట్లు తదితరవన్ని చాలా మందికి తెలియకపోవడంతో దళారులకు వరంగా మారింది. ఎవరైనా జిల్లా కేంద్రంలోని రిజిస్ట్రేషన్ ఆఫీసు వద్ద కల్యాణలక్ష్మి లేదా షాదీముబారక్ కోసం వచ్చిందంటే ఆ లబ్ధిదారుల చుట్టు మధ్యవర్తులు చేరి వారికి కావాల్సిన వివరాలు తీసుకుంటూ రంగంలోకి దిగి ఒక్కో సర్టిఫికెట్‌కు ఇంత ఖర్చు అవుతుందని చెప్పి పనులు చేస్తున్నారు. ఎక్కడ తిరిగే ఒపిక లేక లబ్ధిదారుల అవకాశాన్ని క్యాష్ చేసుకుంటున్నారు. అయితే ఒక్కోసారి అధికంగా వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అమాయకత్వాన్ని ఆసరగా చేసుకొని.. జిల్లా కేంద్రంలోని సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీసుకు వివి ధ మండలాల నుంచి గ్రామీణులు, నిర క్షరాస్యులు నిత్యం వస్తుంటారు. వీరిలో కల్యాణలక్ష్మి కో సం కనీసం రోజుకు ఐదు నుంచి పది మంది వర కు లబ్ధిదారులు మ్యారేజి సర్టిఫికెట్ కోసం వ స్తుంటారు. ఇలా వచ్చిన వారిలో ఎలా దరఖాస్తు చేయాలో.. సర్టిఫికెట్ ఎలా పొందాలో చాలా మం దికి తెలియదు. దీంతో ఇలా అమాయకంగా కని పించే వారి వద్దకు మధ్యవర్తులు వెళ్లి అన్ని పనులు మేం చేసి పెడతాం.. దానికి కొంత ఖర్చు అవుతుందని చెబుతూ రంగంలోకి దిగుతున్నారు. ఉదాహరణకు కల్యాణలక్ష్మికి పెళ్లి కూతురు, పెళ్లి కొడుకుల వయస్సు నిర్ధారణ తప్పనిసరి. దీనికి ఆ ధార్కార్డు లేదా చదువుకున్న వాళ్లకు పదో తరగతి మార్కుల మెమోను ఆధారంగా తీసుకుంటున్నారు. చదువుకోని వాళ్లకు వయస్సు నిర్ధారణ సర్టిఫికెట్ జత చేయాల్సి ఉంటుంది. ఇందుకు సివిల్‌సర్జన్ స్థాయి డాక్టర్‌తో వయస్సు నిర్ధారణ సర్టిఫికెట్ తీసుకురావాలి. ఈ సర్టిఫికెట్లు పొందేందుకు నేరుగా లబ్ధిదారులు అధికారుల వద్దకు వెళ్తే పనులు కావడం లేదు. అదే దళారుల ద్వారా చాలా సులువుగా అయిపోతోంది. ఒక్కో సర్టిఫికెట్‌కు రూ.200 వరకు వీరి నుంచి వసూలు చేస్తూ డాక్టర్ల నుంచి సర్టిఫికెట్ తీసుకొస్తున్నారు. మరో కీలక మైనది ఫస్ట్ మ్యారేజి సర్టిఫికెట్. ఇది లబ్ధిదారులు నేరుగా సబ్రిస్ట్రేషన్ ఆఫీసుకు దరఖాస్తు చేసి పంపిస్తే అధికారులు ఆ దరఖాస్తును అక్కడే నిలిపి వేస్తున్నారు. అదే మధ్యవర్తుల ద్వారా ఆఫీసుకు దరఖాస్తు వెళ్తే క్షణాల్లో సంతకం పెట్టి దరఖాస్తును ఆమోదిస్తున్నారు. దీంతో చదువుకున్న వారు సైతం మధ్యవర్తులను ఆశ్రయించక తప్పని పరిస్థితి నెలకొంది. ఈ మ్యారేజి సర్టిఫికెట్ ప్రభుత్వ ఫీజు రూ.220 వరకు ఉంటే లబ్ధిదారుల నుంచి దళారులు రూ.2 నుంచి 3వేల వరకు గుంజుతున్నారు. గెజిటెడ్ సంతకాలు, లాయర్లతో అఫిడవిట్ ఫాంలు, ఆధార్‌కార్డులో వయస్సు, ఇంటిపేరు తప్పులు, కుల, ఆదాయ, పెళ్లి కూతురి తల్లి బ్యాంకు అకౌంట్ వివరాలు తదితర వన్ని ఒక్కో సర్టిఫికెట్ ఒక్కో రేటు చొప్పున మొత్తంగా పెళ్లి కానుకు అందుకోవాలంటే కనీసం రూ.5వేల వరకు ఖర్చు చేసుకోవాల్సిన పరిస్థితి. ఈ దళారులు సంపాదించే వాటాలో అధికారులకు కూడా వాటా ఉండడంతో వాళ్లు కూడా వచ్చే సంపాదన కాదనక లేకపోతున్నారు. ‘ఎక్కడ ఏ సర్టిఫికెట్ దొరుకుతుందో ఖచ్చితంగా తెలియక లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఒక వేళా తెలిసినా.. సంబంధిత ఆఫీసుల చుట్టు తిరగలేక విసిగిపోతున్నారు. దీంతో మధ్యవర్తులకు ఎంతో కొంత ముట్టచెబుతూ పనులు చేసుకుంటున్నారని’ రెవెన్యూ శాఖలో పని చేసే ఓ అధికారి పేర్కొన్నారు. అయితే గతంలో ఇంత అధిక మొత్తంలో మధ్యవర్తులు వచ్చేవారు కాదని, గత మార్చిలో ప్రభుత్వం రూ.75 వేల నుంచి పెళ్లి కానుక లక్ష నూట పదహారు రూపాయలకు పెంచడంతో ఈ దళారుల బెడద ఎక్కువ అయిందని చెప్పుకొచ్చాడు. కొంతమంది అధికారులు పూర్తిగా మధ్యవర్తులకు పనులు చేయడంతో లబ్ధిదారులకు తిప్పలు తప్పడం లేదు. దళారులను నమ్మొద్దు లబ్ధిదారులు మ్యారేజి సర్టిఫికెట్ కోసం ఎక్కడా అధికంగా డబ్బులు చెల్లించవద్దు. ప్రభుత్వ ఫీజు రూ.210 మాత్రమే చెల్లించాలి. దీనిపై గతంలో ఆఫీసులో సమీపంలో ఓ బోర్డు కూడా ఏర్పాటు చేశాం. లబ్ధిదారులు స్థానికంగా పంచాయతీ ఈవో, మున్సిపాలిటీ కమిషనర్‌లో మ్యారేజి సర్టిఫికెట్ పొందితే చాలు. మళ్లీ రిజిస్ట్రేషన్ ఆఫీసులో సర్టిఫికెట్ అవసరం లేదు. అక్కడ చేసుకోలేని వారు మా వద్దకు రావాలి. – విజయకాంత్, సబ్‌రిజిస్ట్రార్ ఆసిఫాబాద్ -
ఘనంగా ‘మహలనోబిస్’ జయంతి
ఆసిఫాబాద్‌అర్బన్: ప్రముఖ గణాంక శాస్త్రవేత్త ప్రశాంత్ చంద్ర మహలనోబిస్ 125వ జయంతి వేడుకలను పురస్కరించుకుని గణాంక దినోత్సవాన్ని శుక్రవారం జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా పి.సి. మహలనోబిస్ చిత్రపటానికి కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం కలెక్టర్ ప్రశాంత్ పాటిల్ మాట్లాడుతూ మహలనోబిస్ గణాంకాలు కేంద్ర, రాష్ట్ర ఆదాయ వ్యయాలను లెక్కించడానికి, జాతీయ ఆదాయం లెక్కించడానికి, రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రణాళికా రచనకు ఎంతో తోడ్పడతాయన్నారు. జిల్లా అభివృద్ధి కోసం జిల్లా స్థాయి అధికారులంతా తమ తమ శాఖలకు సంబంధించిన ప్రగతి నివేదికలను ఖచ్చితమైన గణాంకాలతో సమర్పించాలన్నారు. అనంతరం సీపీవో కృష్ణయ్య మాట్లాడుతూ దేశ ప్రణాళికల రూపకల్పనకు నెహ్రూ ఎంత ప్రాముఖ్యాన్నిచ్చారో ఈ గణాంక శాఖకు అంతటి పేరు రావడానికి, భారత ఆర్థిక వ్యవస్థ పటిష్టతకు పి.సి. మహలనోబిస్ కూడా అంతే ప్రాముఖ పాత్రను వహించారన్నారు. ఆయన పుట్టిన రోజు సందర్భంగా ఈ గణాంక దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నామన్నారు. ఈ గణాంకాల దినోత్సవాన్ని 2007 నుంచి జరుపుకుంటున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర విపత్తుల నిర్వాహణశాఖ వారి ‘ఆకాశంలో నల్లని మబ్బులు, మెరుపులను చూసారా, ఉరుములను విన్నారా, అయితే ‘పిడుగులు పడవచ్చు జాగ్రత్త’ అనే పోస్టర్లను విడుదల చేశారు. -
మూడు జిల్లాల్లో ‘కృషి కళ్యాణ్’
సాక్షి, హైదరాబాద్: వ్యవసాయ, అనుబంధరంగాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించి తగిన సబ్సిడీలు ఇస్తూ రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసేలా కేంద్రం ఈ నెల ఒకటో తేదీ నుంచి కృషి కళ్యాణ్ అభియాన్ పథకాన్ని ప్రారంభించింది. దేశవ్యాప్తంగా పైలెట్ ప్రాజెక్టు కింద 111 జిల్లాలను ఎంపిక చేసింది. రాష్ట్రంలో జయశంకర్ భూపాలపల్లి, ఖమ్మం, కొమురం భీం జిల్లాల్లో అమలు చేయనుంది. నీతి ఆయోగ్ సిఫార్సు మేరకు ఆ 3 జిల్లాల్లో 75 గ్రామాల్లో పైలట్ ప్రాజెక్టుగా అమలు చేస్తారు. జూన్ మొదటి తేదీ నుంచి జూలై 31 వరకు ముందుగా సిద్ధం చేసుకున్న ప్రణాళిక ప్రకారం ఆ గ్రామాల్లో ప్రణాళిక అమలు చేస్తారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యవసాయ శాఖకు లేఖ రాసింది. భూసార కార్డుల పంపిణీ.. ఈ పథకంలో భాగంగా గ్రామంలో పూర్తిగా భూసార పరీక్ష కార్డులను పంపిణీ చేస్తారు. పప్పులు, నూనెగింజలకు సంబంధించి రైతులందరికీ మినీకిట్స్ ఇస్తారు. రైతు కుటుంబంలోని ఐదుగురికి ఉద్యాన, వెదురు మొక్కలను పంపిణీ చేస్తారు. పశువులకు వచ్చే బోవైన్ వ్యాధి వ్యాక్సినేషన్ నూటికి నూరు శాతం ఇస్తారు. భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి, కృషి విజ్ఞాన కేంద్రాలతో రైతులకు అవగాహన శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం వంటివి కృషి కళ్యాణ్ అభియాన్ పథకంలో ఉన్నాయి. యంత్రాల కొనుగోలుకు కేంద్రం 60 శాతం, రాష్ట్రం 40 శాతం నిధులు భరిస్తాయి. మొత్తం సబ్సిడీ రూ.2.5 కోట్లు మించరాని కేంద్రం స్పష్టం చేసింది. -
కుమురం భీం జిల్లాలో రోడ్డు ప్రమాదం:నలుగురు మృతి
-
బొలెరో వాహనం బోల్తా.. నలుగురు మృతి
సాక్షి, కుమురం భీం : జిల్లాలోని రెబ్బెన మండలం సోనాపూర్ వద్ద శనివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వంతెన పై నుంచి బొలెరో వాహనం అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు. గోలేటి నుంచి కైరిగుడ వెళ్తుండగా ఈ దారుణం జరిగినట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
నాణ్యతకు తిలోదకాలు.!
తాండూర్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ పథకం తాండూర్ మండలంలో అభాసుపాలవుతుంది. ఇష్టారీతిన, నిబంధనలు పాటించకుండా ట్యాంక్‌ల నిర్మాణం చేపడుతుండడంతో ప్రభుత్వ చేరేలా కనిపించడం లేదు. ఓవర్ హెడ్ ట్యాంకుల నిర్మాణంలో నాణ్యతలేమి కొట్టొచ్చినట్లు కనిపిస్తుండడంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మండలంలోని ఏడు పంచాయతీల పరిధిలో ప్రభుత్వం మిషన్ భగీరథ పనులు చేపట్టింది. మొత్తం 49 ఓవర్‌హెడ్ ట్యాంకుల నిర్మాణంతో పాటు పైప్‌లైన్ నిర్మాణ పనులను ప్రారంభించింది. 49 నీటి ట్యాంకులలో ఇప్పటికీ 15 ట్యాంకుల నిర్మాణాలు మాత్రమే ప్రారంభమయ్యాయి. ఈ 15లో ఏ ఒక్కటి కూడా పూర్తి కాలేదు. పనుల్లో కనిపించని నాణ్యత... ట్యాంకుల నిర్మాణ పనులు నాణ్యత లేకుండా సాగుతున్నాయని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నాసిరకం ఇసుక వాడకం, క్యూరింగ్ సరిగా చేపట్టడం లేదు. దీంతో నాణ్యతలేమి కొట్టొచ్చినట్లు కనబడుతుంది. నిర్మాణ పనులకు కాం ట్రాక్టర్లు ముందుకు రావడం లేదనే సాకుతో అధికారులు సైతం చూసిచూడనట్లు వ్యవహరిస్తున్నారని పలువురు బాహటంగా విమర్శిస్తున్నారు. పనుల్లో నాణ్య త పాటించక పోవడం, క్యూరింగ్ చేపట్టక పోవడంపై స్థానికులు అధికారులకు ఫిర్యాదులు చేసిన సంఘటనలు ఉన్నా యి. అయినా పరిస్థితిలో ఎలాంటి మార్పు రావడం లేదు. అధికారులు నిర్లిప్త ధోరణిని అవలంబిస్తుండడంతో ప నులు అస్తవ్యస్తంగా కొనసాగుతున్నాయి. ఎమ్మెల్యేకు ఫిర్యాదు.. మిషన్ భగీరథ పథకంలో జరుగుతున్న పనుల్లో నాణ్యత పాటించడం లేదని పేర్కొంటూ కొందరు నాయకులు ఎమ్మెల్యే దృష్టికి సైతం తీసుకువెళ్లారని సమాచారం. ఈ విషయంపై ఎమ్మెల్యే ఆర్డబ్ల్యూఎస్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. పూర్తిస్థాయిలో నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ త్వరితగతిన పనులు పూర్తి చేయాలని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించినట్లు తెలిసింది. మండల పరిధిలో రూ.13.81 కోట్లతో మిషన్ భగీరథ పనులు చేపడుతున్నారు. ఇందులో రూ.8.36 కోట్లతో ట్యాంక్‌ల నిర్మాణం, రూ. 6.95 కోట్లతో అంతర్గత పైప్లైన్లు, నల్లా కనెక్షన్ల పనులు చేపడుతున్నారు. ఇంత భారీగా నిధులు వెచ్చించి చేపడుతున్న పనుల్లో నాణ్యత కనిపించ డం లేదు. చివరకు నిధులు దుర్వినియోగమయ్యే అవకాశముందని ప్రజలు చర్చించుకుంటున్నారు. అధికారులు పర్యవేక్షణ జరిపి నాణ్యత ప్రమాణాలు పాటించేలా చూడాలని కోరుతున్నారు. నిరంతరం పర్యవేక్షిస్తున్నాం మిషన్ భగీరథ ట్యాంక్‌ల నిర్మాణాల్లో నాణ్యత ప్రమాణాలు తీసుకోవడంలో అప్రమత్తంగా వ్యవహరిస్తున్నాం. పనుల నాణ్యతపై నిరంతరం పర్యవేక్షణ చేస్తున్నాం. క్యూరింగ్‌పై ప్రత్యేక దృష్టి సారించాం. నాసిరకంగా పనులు చేపతితే కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకుంటాం. – దివ్య, ఏఈ, ఆర్డబ్ల్యూఎస్, తాండూర్ -
ఈ కాలనీ నాది!
దహెగాం(సిర్పూర్): మండల కేంద్రంలోని 240 సర్వే నంబర్లో 13 ఎకరాల భూమి వివాదస్పదమైంది. 58 ఏళ్ల క్రితం ఇళ్ల కోసం స్థలాలు కొనుగోలు చేసి 120 కు టుంబాలు నివాసం ఉంటున్నాయి. కానీ ఓ వ్యక్తి ఈ స్థలమంతా తమదేనని హైకోర్టులో కేసు వేయడంతో వివాదం తలెత్తింది. దీంతో రెవెన్యూ అధికారులు అందరికీ నోటీసులు జారీ చేయగా బుధవారం గ్రామస్తులు ఆధారాలను తహసీల్ కార్యాలయంలో అందజేశారు. ఇవీ వివాదం.. దహెగాం మండల కేంద్రంలోని 240 సర్వే నంబర్లో 13 ఎకరాల భూమి తమ తండ్రి దుమ్మెన బాపు పేరున ఉందని, ఈ భూమిని రెవెన్యూ అధికారులు తనకు విరాసత్ చేయడం లేదని కౌటాల మండలానికి చెందిన దుమ్మెన ఇస్తారి హైకోర్టులో కేసు వేశాడు. దీంతో రెవెన్యూ అధికారులు ఆ భూమిలో ఇళ్లు నిర్మించుకున్న వారందరికీ నాలుగురోజుల క్రితం నోటీసులు జారీ చేశారు. బుధవారం ఇళ్లకు సంబం«ధించిన పత్రాలతో హాజరు కావాలని అందులో పేర్కొన్నారు. దీంతో 240 సర్వే నంబర్లో ఇళ్లు నిర్మించికున్న వారంతా బుధవారం తహసీల్ కార్యాలయంలో హాజరయ్యారు. ఇళ్ల పత్రాలు, డాక్యూమెం ట్లను అధికారులకు అందజేశారు. తమకు న్యాయం చేయాలని బాధితులు జూనియర్ అసిస్టెంట్ రామన్నకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా బాధితులు మాట్లాడారు. పెద్దవాగు ఒడ్డున పాత దహెగాం ఊరు ఉండగా 1956లో వచ్చిన భారీ వరదలకు కొట్టుకపోయింది. దీంతో 1960 సంవత్సరంలో దుమ్మెన బాపు వద్ద 240 సర్వే నంబర్లోని 13 ఎకరాల భూమిని చిలువేరు రత్నయ్య, పుప్పాల చిన్నన్న, కొమురవెల్లి శ్రీశైలం కొనుగోలు చేశారు. సాదాబైనామా కూడా రాసి ఇచ్చారు. కొనుగోలు చేసి న వారి పేరు మీద సాదాబైనామా చేయాలని అప్ప టి సిర్పూర్(టి)లోని రెవెన్యూ కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నాం. కానీ దూరభారం ఉండగా అంతగా పట్టించుకోలేదు. దహెగాం రెవెన్యూ కార్యాలయంలో «సాదాబైనామా కింద పేరు మార్పిడి కో సం దరఖాస్తు చేసుకోగా 2003లో తహసీల్ కార్యాలయంలోని రికార్డులను మావోయిస్టులు కాలబెట్టడంతో రికార్డులన్నీ కాలిపోయాయి. దీంతో పాత రికార్డులను పునరుద్ధరించడంతో ఆ భూమి కౌటాల మండలానికి చెందిన దుమ్మెన బాపు పేరు మీద ఉందన్నారు. గత 58 సంవత్సరాల నుంచి ఇళ్లు నిర్మించుకొని 120 కుటుంబాలు నివసిస్తున్నాయని తెలిపారు. ఇళ్లకు సంబంధించిన టాక్స్‌లు ప్రతీ సంవత్సరం గ్రామపంచాయతీకి చెల్లిస్తున్నామని, ఈ స్థలాల్లో ఇళ్లు నిర్మించుకొని నివసిస్తున్న మాకు పట్టాలు ఇచ్చి న్యాయం చేయాలని బాధితులు కోరారు. -
కుమ్రంభీమ్ స్ఫూర్తితో సాగుదాం
సందర్భం తెలంగాణ రాష్ట్ర ఉద్యమానికి కుమ్రంభీమ్ పోరాట స్ఫూర్తి ఎంతో సహకరించింది. భీమ్ అమరుడై నేటికి 77 ఏళ్లయిన సందర్భంలో బంగారు తెలంగాణలో భాగంగా ప్రభుత్వం గిరిజనుల జీవితాల్లో వెలుగు నింపాలి. వాస్తవ పరిస్థితుల ఆధారంగా అట్టడుగు వర్గాల– చరిత్ర, జీవన విధానం, సంస్కృతులను తెరకెక్కించిన సందర్భాలు మహా అరుదుగా కనిపిస్తాయి. తెలుగు చలన చిత్రరంగంలో అలాంటి సాంప్రదాయం ఏ దశలోనూ వేళ్లూనుకోలేదనే చెప్పాలి. ఎవరైనా ఔత్సాహికులు వ్యయప్రయాసల కోర్చి అలాంటి చిత్రాల నిర్మాణానికి పూనుకుంటే, అటు చిత్ర పరిశ్రమ నుంచి, ఇటు ప్రభుత్వపరంగా ఎలాంటి ‘సహాయ సహకారాలు’లభిస్తాయో ‘కొమరంభీమ్’సినిమా ఎదుర్కొన్న అడ్డంకులు కళ్లకు కట్టినట్టు స్పష్టం చేస్తాయి. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డితోపాటు హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన ఐఏఎస్ అధికారి పీ సుబ్రమణ్యం చొరవతో గోండు వీరుడు కుమ్రంభీమ్ పోరాట చరిత్ర సినిమాగా రూపొందింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని గోండు తెగ గిరిజనుల సంస్కృతి, సాంప్రదాయాలను ఆవిష్కరిస్తూ, అడవిబిడ్డల హక్కులైన ‘జల్– జంగల్–జమీన్’ కోసం ప్రాణాలర్పించిన ఆదివాసీ పోరాటయోధుడు కుమ్రంభీమ్ పోరాటగా«థను తెరకెక్కించే బాధ్యతను ఉట్నూరులోని సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ ప్రాజెక్టు అధికారిగా పనిచేసిన పీ సుబ్రమణ్యంకు 1990లో అప్పటి ప్రభుత్వం అప్పగించింది. ఐటీడీఏ సంస్థ కేటాయించిన కేవలం రూ. 20 లక్షలతోనే అల్లాణి శ్రీధర్ దర్శకత్వంలో ఆ చిత్రాన్ని నిర్మించారు. విడుదలకు నోచుకోకపోయినప్పటికీ 1991 ‘నంది అవార్డు’ల పురస్కారంలో ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు అవార్డులను అది గెలుచుకుంది. నంది అవార్డులకు ఎంపికైన ఆ చారిత్రాత్మక చిత్రం 20 సంవత్సరాలకు గానీ విడుదల కాకపోవడం విషాదంగా మిగిలింది. ఒక గిరిజన సినిమా వివక్షకు గురై, 20 ఏళ్లు అజ్ఞాతంలో మగ్గిందంటే... ఇక బ్రిటిష్, నైజాం పాలనలో ఆదివాసీలు ఎదుర్కొన్న దుర్భర జీవితాలు ఎంతటి విషాదకరమైనవో తేలిగ్గానే ఊహించుకోవచ్చు. ఏదేమైనా, పోరాటయోధుడు కుమ్రంభీమ్ స్ఫూర్తిగా పట్టు వీడకుండా చేసిన కృషితో ఎట్టకేలకు 2010, జూలై 2న చిత్రం విడుదల కావడం అభినందనీయమే! అదీ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే జరిగింది. కానీ, చిత్ర ప్రదర్శనకు పంపిణీదారులెవ్వరూ ముందుకురాకపోవడం మరో దురదృష్టకర అంశం. అందుకే తెలంగాణలో చాలా తక్కువ చోట్లనే ఆ సినిమా ప్రదర్శనకు నోచుకుంది. విశాఖ జిల్లా మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు బ్రిటిష్ పాలకులను గడగడలాడించగా, ఆయన పేరుతో తీసిన సినిమా చారిత్రక ఘట్టంగా నిలిచింది. ఇదే నేపథ్యంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఏజెన్సీ గోండు వీరుడు కుమ్రంభీమ్ నిజాం నవాబులను ముప్పుతిప్పలు పెట్టాడు. నిజాం నవాబులకు వ్యతిరేకంగా, ఆదివాసీల స్వయంపాలన, జల్–జంగల్– జమీన్ నినాదంతో పదేళ్లకు పైగా 1931 నుంచి 1940, అక్టోబర్ దాకా ఆయన నేతృత్వంలో సాగిన జోడేఘాట్ తిరుగుబాటు మహోజ్వల చరిత్రగా నిలిచింది. తెలంగాణలో నైజామ్ నవాబులను ఎదిరించిన కుమ్రంభీమ్ ఏకైక ఆదివాసీ లెజెండ్, సినిమా విడుదల 20 ఏళ్లు వాయిదా పడినా, గోండుల జీవితాలు, ఆచార వ్యవహారాలు, సంస్కృతీ సాంప్రదాయాలు, భాష, వ్యవహారశైలి ఏమాత్రం మారకపోవడం చూసినవారికి ఆశ్చర్యమనిపించకపోదు. ఇంగ్లండ్ నుంచి హైదరాబాద్ వచ్చిన ఆంత్రోపాలజిస్టు ప్రొఫెసర్ హైమండార్ఫ్ ఆదిలాబాద్ ఏజెన్సీ ప్రాంతాల్లో నివసిస్తున్న గోండు, కోలం, కోయ, పర్థాన్, నాయకపోడు తెగల గిరిజనులతో మమేకమై, పరిశోధన చేసిన ఫలితంగానే వారు బాహ్య ప్రపంచానికి తెలిశారు. కాని వారి స్వయం పాలనా కాంక్ష, భూపోరాటాల ఉధృతి మాత్రం తగ్గలేదు. కారణం ఏజెన్సీ గూడేల్లో పెత్తందార్ల దోపిడీ, రజాకార్ల అకృత్యాలు మితిమీరటమే. ఈ పరిస్థితులను ‘కొమ్రంభీం’చిత్రంలో యథాతథంగా చూపించారు. చిత్రంలో కుమ్రంభీమ్ దాదాగా భూపాల్‌రెడ్డి (కేంద్ర సాహిత్య అవార్డు గ్రహీత –2014), భార్య సోంబాయిగా తమిళనటి మౌనిక నటించారు. దర్శకుడు అల్లాణి శ్రీధర్ 2016లో ప్రభుత్వ ‘కుమ్రంభీమ్ సేవా పురస్కారం’ అందుకున్నారు. కుమ్రంభీమ్ తన ఉద్యమ ఘట్టంలోనే చదువు నేర్చుకున్నాడు. భీమ్ వద్ద హవల్ధార్గా చేసిన కుమ్రంసూరు భీమ్‌కు అక్షరాలు నేర్పిస్తూ, ఉద్యమ వ్యూహాలను రచించేవాడు. ఆసిఫాబాద్ పరిసర ప్రాంతాలైన జోడేఘాట్, బాబేఝరీ, పట్నాపూర్, టోకెన్నావాడ, చల్‌బరిడి, శివగూడ, భీమన్‌గొంది, కల్లేగావ్, అంకుశాపూర్, నర్సాపూర్, కోశగూడ, లైన్‌పటల్ అనే 12 గూడేలకు స్వయంపాలన కావాలని భీమ్ పట్టుపట్టాడు. తన డిమాండ్లను నిజాం నవాబు మీర్ ఉస్మాన్ అలీఖాన్ బహదూర్‌కు విన్నవించడానికి హైదరాబాద్ వెళ్తే అధికారులు భీమ్‌కు అనుమతి నిరాకరించారు. దీంతో ఉద్యమ కేంద్రంగా ‘జోడేఘాట్ గుట్టలు’సరైనవిగా సూచించాడు కుమ్రంసూరు, ఒక సన్నివేశంలో భీమ్ భార్య మాట్లాడుతూ – నిజాం నవాబుల అరాచకాల నుంచి ఇక పారిపోదామని ప్రాధేయపడినప్పుడు– ‘‘ఉద్యమంలో గెలిస్తే మనం బతుకుతాం వచ్చేతరాలు బతుకుతాయి ఉద్యమం నశిస్తే పోరాట స్ఫూర్తయినా మిగులుతుంది వెన్నుచూపడం తగదు. వెనుతిరుగేదిలేదు.’’ అని భీమ్ చెప్పడం ఒక గొప్ప సందేశాన్ని భావితరాలకు గుర్తు చేసినట్టయింది. చివరకు కుర్ధుపటేల్ అనే ద్రోహి సమాచారంతో జోడేఘాట్ గుట్టల్లో రాత్రి జరిగిన కాల్పుల్లో 1940, అక్టోబర్ 8న (జీవో ఎంఎస్ నం.87/2014) కుమ్రంభీమ్ వీర మరణం పొందారు. ఏదేమైనా త్యాగానికి, సంకల్పబలానికి, సాహసానికి ఉండే శాశ్వత గౌరవాన్ని ‘భీమ్’ సినిమా చాటి చెప్పింది. తెలంగాణ రాష్ట్ర ఉద్యమానికి కుమ్రంభీమ్ పోరాట స్ఫూర్తి ఎంతో సహకరించింది. భీమ్ అమరుడై నేటికి 77 ఏళ్లయిన సందర్భంలో బంగారు తెలంగాణలో భాగంగా ప్రభుత్వం గిరిజనుల జీవితాల్లో వెలుగు నింపాలి. కుమ్రంభీమ్ ఉద్యమకాలం నుంచి నేటి దాకా వాస్తవ పరిస్థితులను అనుగుణంగా సవరించి ఆ గొప్ప నినాదం– జల్–జంగల్–జమీన్ (నీరు, అడవి, భూమి) నేపథ్యంలో మరో చిత్రాన్ని నిర్మించాల్సిన అవసరముంది. (ఆశ్వయుజ శుద్ధ పౌర్ణమి అక్టోబర్ 5న కుమ్రంభీమ్ 77వ వర్ధంతి) వ్యాసకర్త ఆదివాసీ రచయితల సంఘం వ్యవస్థాపక కార్యదర్శి, సెల్: 94913 18409 గుమ్మడి లక్ష్మీనారాయణ -
నేడు కొమరం భీం 76వ వర్థంతి
-
ఆసిఫాబాద్ లోనే కొనసాగించాలి
తాండూర్: తాండూర్ మండలాన్ని ఆసిఫాబాద్ కొమురంభీమ్ జిల్లాలో ఉంచితేనే మండల యువతకు భవిత ఉంటుందని మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ పెండ్యాల గోపికృష్ణ అన్నారు. తాండూర్ మండలాన్ని ఆసిఫాబాద్ జిల్లాలో కలి పేందుకు చేపట్టిన రిలే నిరాహారదీక్షలు మూడో రోజుకు చేరుకున్నాయి. దీక్షలో పెండ్యాల గోపికృష్ణ, పుట్ట సంతోష్, కాసిపేట కృష్ణ, మల్లయ్య, జ్యోతి, ఇందారపు పద్మ, రాజేశ్వరి, పె ద్దబోయిన లక్ష్మితో పాటు పలువురు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పెండ్యాల గోపికృష్ణ మాట్లాడుతూ తాండూర్ మండలాన్ని ఆసిఫాబాద్ జిల్లాలో ఉంచాలని డిమాండ్ చేసిన, మ ద్దతుగా ఉంటామన్న కొందరు ప్రజాప్రతినిధులు నేడు వారి స్వార్థం కోసం తమ ఆందోళనకు వ్యతిరేకంగా వ్యవహరించ డం ప్రజలను మోసగించడమే అన్నారు. స్థానిక ఎమ్మెల్యే మె ప్పు కోసం తాండూర్ మండలాన్ని మంచిర్యాల జిల్లాలో ఉ ంచేలా వ్యవహరించడం సరికాదన్నారు. తాండూర్ మండలా న్ని ఆసిఫాబాద్ జిల్లాలో కలిపేంత వరకు ఆందోళన కొనసాగిస్తామన్నారు. ఈ దీక్షలకు పలువురు సంఘీభావం వ్యక్తం చేశారు. -
ఏర్పాట్లు ముమ్మరం
ఆసిఫాబాద్/కెరమెరి : గిరిజన ఆరాధ్యదైవం కుమ్రం భీం 76 వర్ధంతిని భీం పురిటిగడ్డ జోడేఘాట్‌లో ఈ నెల 16న అధికారికంగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం ముమ్మర ఏర్పాట్లు చేస్తోంది. వర్ధంతి సభకు సీఎం కేసీఆర్ వచ్చే అవకాశం ఉండడంతో అధికారులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. సమైక్య పాలనలో భద్రతా కారణాల దృష్ట్యా పోలీసులు ప్రజాప్రతినిధులు, అధికారులను జోడేఘాట్‌కు అనుమతించకపోవడంతో అధికారులు హట్టిబేస్ క్యాంప్ వద్దనే నివాళులర్పించేవారు. ప్రత్యేక తెలంగాణలో సీఎం కేసీఆర్ రెండేళ్ల క్రితం తొలిసారివర్ధంతి సభకు హాజరై నివాళులర్పించారు. జోడేఘాట్ అభివృద్ధికి వరాల జల్లు ప్రకటించారు. రూ.25 కోట్లతో జోడేఘాట్‌లో స్మృతి చిహ్నం ఏర్పాటు చేసి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దనున్నట్లు ప్రకటించారు. ఈ క్రమంలో రెండేళ్లుగా పనులు చురుకుగా సాగుతున్నాయి. పర్యాటక నిర్మాణ పనులు దాదాపు పూర్తయ్యాయి. జల్‌జంగల్ జమీన్‌కు గుర్తుగా ముఖద్వారాలు నిర్మించారు. ఆదివాసీ గిరిజన సంస్కృతిని తలపించే మ్యూజియూనికి ఆకర్శణీయ రంగులు వేశారు. వర్దంతి ఏర్పాట్లలో భాగంగా భీమ్ స్మారక స్తూపం వద్ద గ్రానైట్ రాయితో శిలాఫలకాలు ఏర్పాటు చేస్తున్నారు. ఏర్పాట్ల పరిశీలన జోడేఘాట్‌లో వర్ధంతి ఏర్పాట్లను శుక్రవారం రాష్ట్ర అటవీశాఖ మంత్రి జోగు రామన్న, ఎమ్మెల్సీ పురాణం సతీశ్‌కుమార్, ఎమ్మెల్యే కోవ లక్ష్మి, కుమ్రంభీం, మంచిర్యాల జిల్లా కలెక్టర్లు చంపాలాల్, కర్ణన్, ఎస్పీ సన్‌ప్రీత్ సింగ్ పరిశీలించారు. భీం స్మారక పనులను పరిశీలించారు. భీం విగ్రహానికి రామన్న పూల మాల వేసి నివాళి అర్పించారు. తర్వాత భీం సృ్మతివనం, మ్యూజీయం, హంపీథియోటర్ల నిర్మాణాలను పరిశీలించారు. మ్యూజియంలో అలంకరించనున్న గుస్సాడీ ప్రతిమలు, వాయిద్యాలు వాయిస్తున్న కళాకారులు, కుమ్రం భీంతో సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు ప్రజల ప్రతిమలను పరిశీలించారు. గిరిజనుల సంస్కృతి, ఆచార వ్యవహారాలను చూసి ఆనందపడ్డారు. హంపీథియేటర్ పనులను చూశారు. గతంలో సీఎం పర్యటన సందర్భంగా ఇచ్చిన హామీల్లో మ్యూజియం పనులు పూర్తయ్యే దశలో ఉండగా, డబుల్ బెడ్ రూం పనులు పూర్తి కాలేదు. మంత్రి జోగు రామన్న, ఎమ్మెల్సీ పురాణం సతీశ్‌కుమార్, ఎమ్మెల్యే కోవ లక్ష్మి వ ర్ధంతి సభకు సీఎం కేసీఆర్‌ను ఆహ్వానిస్తున్నట్లు, సీఎం పర్యటనకు సన్నాహాలు చేస్తున్నా సీఎం పర్యటనపై అనుమానాలు ఉన్నాయి. వర్ధంతిని పురస్కరించుకొని మూడు రోజులుగా పోలీసు బలగాలు జోడేఘాట్ అడవులను జల్లెడ పడుతున్నాయి. ఎస్పీ సన్‌ప్రీత్ సింగ్ ఆధ్వర్యంలో ఆసిఫాబాద్ నుంచి జోడేఘాట్ వరకు అడుగడుగునా పోలీసు బందో బస్తు ఏర్పాటు చేస్తున్నారు. -
నేడు అవ్వల్‌పేన్ పూజ
ఏర్పాట్లు చేసిన ఐటీడీఏ తరలివెల్లిన భీం వారసులు కెరమెరి : పోరాట యోధుడు కుమ్రం భీంకు శనివారం సాయంత్రం భీం వారసులు గిరిజన సంప్రదాయం ప్రకారం అవ్వాల్(పోచమ్మ) పూజ నిర్వహించనున్నారు. అనాధిగా వస్తున్న ఈ ఆచారాన్ని కొనసాగిస్తూ నేడు పోచమ్మతల్లికి పూజలు చేస్తారు. పోరాటం కంటే ముందు మిటలరీ సర్కారును గడగడలాడించడంలో ఎంతో కారుణ్యం చూపిన పోచమ్మ దైవానికి వారి సంస్కృతి, ఆచార వ్యవహారాలతో పూజ చేస్తారు. ఏటా వర్ధంతికి ఒక రోజు ముందు ఈ కార్యక్రమం నిర్వహించడం ఆనవాయితీ. తేనెటీగలే అస్త్రాలుగా.. నైజాం మిలటరీపై భీం ఎన్నో ఏళ్లుగా నిరాటంకంగా పోరాటం సాగించడానికి కారణం పోచమ్మతల్లి మంత్ర దండమేనని చరిత్ర చెబుతోంది. వేల సంఖ్యలో పోలీసులు భీంపై కాల్పులు జరిపినా తూటాలు మాత్రం ఆయనకు తాకేవి కావు. పోలీసులు దగ్గరికి చేరగానే మంత్రదండం శక్తి ద్వారా తేనెటీగలు తయారు చేసి వాటిని అస్త్రాలుగా ఉపయోగించి పోలీసులపై వదిలేవాడు. అలాగే ఆముదం విత్తనాలను మంత్ర శక్తి ద్వారా ఉపయోగించి స్వీయ రక్షణ పొందేవాడు. ఇన్ని విధాలుగా ఆ మంత్ర దండ శక్తి భీంకు ఉపకరించడంతో భీం వారసులు పోచ్మతల్లికి ఘనంగా పూజలు చేస్తుంటారు. జోడేఘాట్లోని భీం సమాధికి నివాళిలర్పించి ముందున్న జెండాలను ఎగురవేస్తారు. గొర్రెను బలిచ్చి మొక్కు తీర్చుకుంటారు. ఇందుకోసం ఐటీడీఏ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భీం వారసులతోపాటు, ఆరాధికులు పెద్ద ఎత్తున తరలివెళ్లి పూజలు చేస్తారు. భీంతోపాటే సూరు వ ర్ధంతి.. కుమ్రంభీంతో పాటు ఆయన సహచరుడు కుమ్రం సూరు వర్ధంతిని కూడా నేడు కొలాం ఆదివాసీలు ఘనంగా నిర్వహించేందుకు సన్నహాలు చేశారు. గతంలో వారికి వేదిక లేకపోవడంతో కొన్ని సార్లు ఉట్నూర్‌లో, మరి కొన్ని సార్లు ఆసిఫాబాద్‌లో వర్ధంతి జరిపారు. కాని ఈ ఏడాది భీంతో పాటే సూరు వర్ధంతి జరిపేందుకు ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి ఆర్వీ కర్ణణ్‌తోపాటు కుమ్రం భీం ఉత్సవ కమిటీ సభ్యులను కోరిన నేపథ్యంలో వారి అనుమతితో నేడు సాయంత్రం సంప్రదాయ పూజలు నిర్వహించనున్నారు. -
జోడేఘాట్‌లో భీం స్మారక పనులు పరిశీలన
భీం వర్ధంతి సభకు సీఎం కేసీఆర్‌ను ఆహ్వానిస్తాం రాష్ట్ర అటవీ శాఖ మంత్రి జోగు రామన్న కెరమెరి : కుమ్రం భీం 76వ వర్ధంతి సభ ఆదివారం మండలంలో జోడేఘాట్‌లో నిర్వహిస్తున్నట్లు అటవీ పర్యావరణ, బీసీ సంక్షేమ శాఖా మంత్రి జోగు రామన్న తెలిపారు. శుక్రవారం మండలంలోని జోడేఘాట్‌లో కొనసాగుతున్న భీం స్మారక పనులను మంత్రి పరిశీలించారు. అంతకు ముందు ఆదివాసీలు డోలు సన్యాయిలతో మంత్రికి సన్మానించారు. భీం విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం భీం సృ్మతివనం, మ్యూజియం, హంపీథియోటర్ల నిర్మాణాలను పరిశీలించారు. మ్యూజియంలో అలంకంరించనున్న గుస్సాడీ, ప్రతిమలు, వాయిద్యా కళాకారులు, కుమ్రం భీంతో సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు ప్రజల ప్రతిమలను పరిశీలించారు. అనంతరం భీం వర్ధంతి గిరిజన ఉత్సవాల పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. భీం వర్ధంతి సభకు సీఎం కేసీఆర్ ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. రూ. 25 కోట్లతో జోడేఘాట్‌లో మ్యూజియం, సృ్మతివనం, హంపీథియోటర్ నిర్మాణం చేపట్టామన్నారు. 2014లో జోడేఘాట్‌కు సీఎం కేసీఆర్ వచ్చినపుపడు కొత్త జిల్లాకు కుమ్రం భీం పేరు పెడతానని హామీని నెరవేర్చారు. ఎంపీ నగేశ్, ఎమ్మెల్యే కోవ లక్ష్మి మాట్లాడుతూ భీం వర్ధంతి రోజున పండుగ వాతావరణం సృష్టించాలన్నారు. ఈ కార్యక్రమంలో కుమ్రం భీం, మంచిర్యాల కలెక్టర్లు చంపాలాల్, ఆర్వీ కర్ణణ్, కుమ్రం భీం జిల్లా డీఆర్వో అధ్వైత్ కుమార్ సింగ్, ఎస్పీ సన్ ప్రీత్‌సింగ్, ఎమ్మెల్సీ పురాణం సతీశ్‌కుమార్, డీసీసీబీ చైర్మన్ దామోధర్ రెడ్డి, వాంకిడి జెడ్పీటీసీ నాగేశ్వరరావు, భీం ఉత్సవ కమిటీ చైర్మన్ మడావి రఘునాథ్, కన్వీనర్ మోహన్‌రావు, ఎంపీపీ గణేశ్, ఏఎంసీ చైర్మన్ శ్రీనివాస్, మైనార్టీ నాయకుడు మమ్మద్, ఏపీవో నాగోరావు, డీఎఫ్‌వో వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. -
ఇక జనరంజకంగా జోడేఘాట్
కొనసాగుతున్న భీం స్మారక పనులు వర్ధంతి నాటికి పూర్తికానున్న మేజర్ పనులు కెరమెరి : చారిత్రాత్మక నిర్మాణాలతో అమర వీరుడి పురిటిగడ్డకు కొత్త శోభ సంతరించనుంది. నూతన నిర్మాణాలతో జోడేఘాట్ కొత్త పుంతలు తొక్కనుంది. ఇప్పటికే వివిధ శాఖల అధికారులు జోడేఘాట్‌లోనే బసజేసి పనులు పర్యవేక్షిస్తున్నారు. 16న నిర్వహించనున్న కుమ్రం భీం 76 వర్ధంతికి ఎలాగైన నిర్మాణాలు పూర్తి చేయాలని కృత నిశ్చయంతో అధికారులు మకాం వేసి పనులు పర్యవేక్షిస్తున్నారు. 2014 వ సంవత్సరం సీఎం కేసీఆర్ జోడేఘాట్‌లో నిర్వహించిన 74 కుంమ్రం భీం వర్ధంతికి హాజరై కుమ్రం భీం మ్యూజీయం, జల్, జంగల్, జమీన్ ఆర్చీలు, కుమ్రం భీం సృ్మతి చిహ్నం, బొటానికల్ గార్డెన్, హంపీథియేటర్ నిర్మాణాల కోసం రూ. 25 కోట్లను మంజూరు చేశారు. అందులో రూ. 16 కోట్లతో మ్యూజియం, కుమ్రం భీం సృ్మతి చిహ్నం, హంపీథియేటర్ పనులు వెనువెంటనే ప్రారంభించారు. కొనసాగుతున్న పనులు గడిచిన ఏడాదిన్నరగా పనులు కొనాగుతున్నాయి. ఇప్పటికి 90 శాతం పనులు పూర్తయ్యాయి. కేవలం శనివారం ఒకే రోజు గడువు ఉండడంతో ఆయా శాఖలకు చెందిన అధికారులు రాత్రి పగలు అక్కడే ఉండి పనులు చేస్తున్నారు. స్మృతి చిహ్ననికి సంబంధించిన సెంట్రింగ్ వర్క్ పూర్తి అయ్యింది. సమాధి, 8 ఫీట్ల నిలువెత్తు కుమ్రం భీం విగ్రహం అమర్చడమే తరువాయి. అలాగే నాలుగు మాసాల క్రితమే జల్, జంగల్, జమీన్ ఆర్చీలు పూర్తి అయ్యాయి. మ్యూజియానికి సంబంధించిన మేజర్ పనులు సమాప్తమవగా చిన్నచిన్న పనులు మిగిలి ఉన్నాయి. మ్యూజియంలో గుస్సాడీలు నృత్యాలు చేస్తున్నట్లు, కళాకారులు వాయిద్యాలను వాయిస్తున్నట్లు ఉన్న ప్రతిమలు ఆకట్టుకుంటున్నాయి. మరో వైపు కుమ్రం భీం తన తోటి వారితో సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడుతున్నట్లు ఉన్న ప్రతిమలు అచ్చం మనిషిలాగానే పోలి ఉన్నాయి. మ్యూజీయం గోడలకు రకరకాల గిరిజన సంసృ్కతికి సంబంధించిన చిత్రాలు అమర్చారు. గిరిజన సంస్కృతి ఉట్టి పడేలా.. గిరిజన సంసృ్కతి ఉట్టి పడేలా కళలు, కళాకారులతో అలంకరిస్తున్నారు. కొన్ని ప్రతిమలను గ్లాస్‌తో తయారు చేసిన పరికరాల్లో అమర్చనున్నారు. గిరిజన సంసృ్కతీ, పురాతన సామగ్రితో మ్యూజియాన్ని అలంకరించనున్నారు. ఆదివాసీ దేవలు బల్లి, భీమ దేవరా, జంగుబాయి, నాగోబా, పెర్సాపేన్ దేవలను ఏర్పాటు చేయనున్నారు. బీహార్, జెఎన్టీయు లకు చెందిన కళాకారులచే అలంకరణ కొనసాగుతుంది. మునుపెన్నడు లేని విధంగా జోడేఘాట్‌కు కళకళాలాడనుంది. -
దీనావస్థలో భీం వారసులు
వీరి కుటుంబాల పరిస్థితి దయనీయం వెలుగులోకి భీం మనుమరాళ్లు.. కూలీ పనితో కుటుంబాల పోషణ ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించాలని వేడుకోలు కెరమెరి : నిజాం సర్కార్‌తో పోరాటం సాగించిన గిరిజన యోధుడు కుమ్రం భీం తెలియని వారు ఉన్నారంటే అతిశయోక్తి కాదు. ఏ ఆశయం కోసం పోరాడిన యోధుడిని ఎందరో స్మరించుకుంటున్నారు. కుమ్రం భీం త్యాగాలను ప్రభుత్వం గుర్తించి జోడేఘాట్‌లో రూ. 25 కోట్లతో స్మారకపనులు చేపడుతోంది. కానీ ఆయన వారసులు మాత్రం దీనవస్థలో ఉన్నారు. నిన్నటివరకు భీం మనుమడు సోనేరావు, మనుమరాలు సోంబాయిలే తెలుసు. కానీ మరో మనుమడు, ఇద్దరు మనుమరాళ్లు ఉన్నారనే విషయం తెలియదు. వీరు దుర్భర జీవితం గడుపుతున్నారు. ఉండడానికి ఇల్లు లేదు. చేతిలో పనిలేదు. వారికున్న సాగుభూమిలో పంటదిగుబడి లేకపోవడంతో పూటగడవడం కష్టంగా మారింది. వారి జీవన స్థితిగతులపై సాక్షి ప్రత్యేక కథనం. వారసత్వం పై అలసత్వం ‘కుమ్రం భీం’కు ఇద్దరు సంతానం. కుమారుడు మాధవరావు, కూతురు రత్తుబాయి. మాధవరావుకు ముగ్గురు పిల్లలు. సోనేరావు, భీమ్రావు వీరు సిర్పూర్(యు) మండలంలోని దోబే గ్రామంలో నివసిస్తున్నారు. రాధాబాయిది ఆసిఫాబాద్ మండలం మోవాడ్ గ్రామం. భీం కుమారుల పరిస్థితి బాగు ఉన్నా.. చహకటి రత్తుబాయి నలుగురు పిల్లల పరిస్థితి దయనీయంగా ఉంది. ఈమెకు ముగ్గురు కూతుర్లు. ఒకరు సోంబాయి జోడేఘాట్‌లో, మరొకరు ఆడ జంగుబాయి, చహకటి ఎల్లు కొఠారిలో, ఇంకొకరు కుమ్రం కాసుబాయి సాకడ గ్రామంలో ఉంటున్నారు. స్ఫూర్తిదాతగా నిలిచారు భీం గొప్పవ్యక్తి..ఆదివాసీలకు స్ఫూర్తిదాతగా నిలిచారు. తెలంగాణ ప్రభుత్వం ఆయన్ను గు ర్తించింది. దాంతో జోడేఘాట్ కొత్త పుంతలు తొ క్కనుంది. ఆయన త్యాగానికి గుర్తించిన సర్కార్.. జోడేఘాట్‌ను అభివృద్ధి బాటలో నిలిపేందుకు కృషిచేస్తోంది. కానీ, ఆయన వారసుల జీవితాల్లో మాత్రం ఎలాంటి మార్పులేదు. ఇకనైన మా బతుకులు బాగుపడతాయంటే అధికారులు మమ్మల్ని గుర్తించడం లేదంటు భీం మనమరాళ్లు ఆడ జంగుబాయి, కుంరం కాసుబాయి, చహకటి ఎల్లు ఆవేదన చెందుతున్నారు. జంగుబాయి గృహం పునాదులకే పరిమితం మండలంలోని కొఠారి గ్రామంలో కొన్నేళ్లుగా కు మ్రం జంగుబాయి నివసిస్తోంది. వీరికి పెంకుటి ల్లు దిక్కు. పదేళ్ల కిందట మంజూరైన ఇంది ర మ్మ గృహం పునాదులకే పరిమితమైంది. పాలక ప్రభుత్వాలు మారుతున్న వీరి బతుకుల్లో వెలు గు లేకుండాపోయింది. వీరిని పట్టించకున్న నా థుడే లేడు. ఇంటి నిర్మాణాన్ని పూర్తిచేసి ఆదుకోవాల్సిన పాలక ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేశాయి. దీంతో వారు ఆ ఇంట్లోనే కాలం వెళ్లదీస్తున్నారు. మరోసారి ఇల్లు కోసం దరఖాస్తు చేసుకున్నా ఫలితం లేదు. ఎలాంటి సాగుభూమి కూడా లేకపోవడంతో కూలీ చేసి కుటుంబాన్ని పోషిస్తుంది. కాగా, ఐటీడీఏ ఆశ్రమ పాఠశాలలో రోజుకు రూ. 100తో వంట మనిషిగా పనిచేస్తోంది. భీం వారసురాలైన ఈమెకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆర్థికసహాయం అందలేదు. ఈమె, భర్త జంగు, కళ్లు కనిపించవు. వీరికి ఐదుగురు కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఒక కుమార్తె పెళ్లి అయింది. కనిపించని ఆర్థిక సహాయం మండలంలోని సాకడ గ్రామంలో నివసిస్తున్న భీం చిన్న మనుమరాలు కుమ్రం కాసుబాయి ఆర్థిక ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతోంది. గతంలో ఇల్లు మంజూరైన బిల్లు మాత్రం అందకపోవడంతో అప్పులు చేసి రేకుల ఇల్లు నిర్మించింది. ఉన్నా మూడెకరాల సాగుభూమిలో పంట దిగుబడి రాలేదు. దీంతో కుటుంబపోషణ భారమైంది. ఇప్పటికి శావుకారుల వద్ద నుంచి చేసిన అప్పులు తీర్చేదెలాగని ఆమె ఆందోళన చెందుతోంది. భీంతో సంబంధం ఉన్నట్లు కూడా అధికారులకు తెలియదు. అసలు ఆ దిశగా ఇప్పటి వరకు ఎవరూ ప్రయత్నించలేదు. భర్త భీం, ఇద్దరు కొడుకులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఎల్లుది కూడా అదే గతి మండలంలోని కొఠారిలో ఉంటున్న మనుమడు చహకటి ఎల్లు పరిస్థితి కూడా ఇదే. మూడెకరాల సాగుభూమి ఉన్నప్పటికి రాళ్లురప్పలతో కూడుకుంది. ప్రతీ సంవత్సరం అప్పు చేసి వేలకువేలు వెచ్చిస్తున్నప్పటికి దిగుబడి రావడం లేదు. ఖరీఫ్‌లో వ్యవసాయం చేస్తుండగా మిగిలిన రోజుల్లో కూలీ పని దిక్కు. భార్య చిత్తుబాయి, కొడుకు వినోద్, సంజు ఉన్నారు. పట్టించుకోని అధికారులు ఇప్పటివరకు చాలా సందర్భాల్లో ఉన్నతాధికారులకు కలిసి నివేదనలు సమర్పించిన స్పందించిన దాఖలాలు లేవు. ఐటీడీఏ నుంచి రుణం అందలేదు. ఎడ్డు జతలు కావాలని గతంలో దరఖాస్తులు చేసిన ప్రయోజనం లేకుండా పోయింది. ఇళ్లు లేవు, వ్యవసాయ భూములు లేవు, ఓ వైపు రాష్ట్ర ప్రభుత్వం కుమ్రం భీం చేసిన త్యాగాలను గుర్తించి జోడేఘాట్‌లో రూ. 25 కోట్లతో స్మారక పనులు చేపడుతున్నప్పటికి భీం వారసుల పరిస్థితి మాత్రం కడు దయనీయంగా మారింది. ప్రభుత్వం ఆదుకోవాలి తమను ప్రభుత్వం ఆదుకోవాలి. తాత కుమ్రం భీం పేరిట వేల రూపాయలు ఖర్చు చేస్తున్న ప్రభుత్వం మా కుటుంబాల గురించి పట్టించుకోవాలి. మమ్మల్ని కూడా గుర్తించి తగిన ఆర్థిక సహాయం అందించాలి. ఐటీడీఏ నుంచి రుణం ఇవ్వాలి. - ఆడ జంగుబాయి. కొఠారి ఎడ్ల జతలివ్వాలి వ్యవసాయం చేసేందుకు కనీసం ఎడ్ల జతలన్న ఇవ్వాలి. ఎలాంటి సహకారం లేకపోవడంతో అష్టకష్టాల్లో ఉన్నాం. ప్రభుత్వం సాగుభూమి అందించాలి. సోనేరావుకు ఇచ్చిన ట్లే ఆర్థిక సహాయం ఇవ్వాలి. - చహకటి ఎల్లు, కొఠారి భూమి పంచివ్వాలి మ తల్లి గారి భూమి దోబే గ్రామంలో ఉంది. ఒక్క మనుమడే లాభం తీసుకుంటున్నాడు. అది అందరికి దక్కేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ప్రతి ఒక్కరికి నాలుగు ఎకరాల భూమిని పంచి ఇవ్వాలి. మా పరిస్థితులను బాగు చేయాలి. - కుంరం కాసుబాయి, సాకడ -
జోడేఘాట్‌లో సుగంధ పరిమళం
వంద మొక్కలతో ఏర్పాటు కానున్న లాన్ మనిషి ఆకృతిలో అమర్చనున్న ఔషధ మొక్కలు లోటస్‌పాండ్‌లో తామర, కలువ పూలు ఆకట్టుకోనున్న గార్డెన్ కెరమెరి : కుమ్రం భీం వర్ధంతి పురస్కరించుకొని ఈనెల 16న మండలంలో జోడేఘాట్‌లో అటవీశాఖ అధికారులు బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఆ గ్రామంలో లాన్, లోటస్‌పాండ్ ఏర్పాటు చేయనున్నారు. భీమ్ స్మారక మ్యూజియం, సృ్మతిచిహ్నం సమీపంలో ఏర్పాటు చేస్తున్నారు. 100 రకాల ఔషధ మొక్కలు సుగంధ ద్రవ్యాలతో గార్డెన్ ఏర్పాటుకు అధికారులు సమాయత్తమయ్యారు. గుండ్రటి ఆకారంలో మనిషి ఆకృతి బొమ్మను ఏర్పాటు చేశారు. కాళ్లు, చేతులు, గుండె, తల, కిడ్నీ వ్యాధులను నయం చే సే ఔషధ మొక్కలను ఆ ఆకృతిలో అమర్చనున్నారు. ఏ భాగానికి సంబంధించిన ఆ భాగంలోనే, మిగిలిన స్థలంలో సుగంధ ద్రవ్యాల మొక్కలు నాటనున్నారు. భీం వర్ధంతికి, రెండు రోజులు ఉండడంతో అధికారులు పనులు వేగవంతం చేశారు. సుగంధ ద్రవ్యాలు, ఔషధ మొక్కలు ఈ గార్డెన్లో తులసి, ధతూర, కృష్ణ, తరాత్‌కిరాని, బహినియ, అంజీర్, పత్రి, ఇగ్సోరా, కరిలీద్, జట్రోఫా, నందివర్దనం, లెమిన్, అల్లనే రడి, టట్‌పానెట్, సంపంగిబ్రహ్మి, జాజి, కుఫియా, సరస్వతితోపాటు మరో 80 రకాల మొక్కలు నాటనున్నారు. 14న వీటిని నాటితే 16న అన్ని పూస్తాయని, ఆ ప్రాంతమంతా సుగంధ పరిమళంతో ఉంటుందని బెల్లంపల్లి డీఎఫ్‌వో వెంకటే శ్వర్లు తెలిపారు. దానికి కింది భాగంలోనే లోటస్ పాండ్ నిర్మించనున్నారు. తామర కలువ పూలు, మరో ఐదు రకాల పూలు వేసి చూపరులకు కనువిందు చేయనున్నారు. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. -
శిథిలావస్థలో అర్లి వంతెన
కూలితేదూరభారం రాకపోకలకు ఇబ్బందులు లోకేశ్వరం : మండలంలోని అర్లి-లోకేశ్వరం మార్గంలోని సుద్దవాగు వంతెన శిథిలావస్థకు చేరింది. ఎస్సారెస్పీ నిధులతో వంతెన నిర్మించి పాతికేళ్లు కాకుండానే కూలడానికి సిద్ధంగా ఉంది. వంతెన ప్రారంభంలోని ఇరువైపులా ఉన్న గోడలు పగుళ్లు చూపాయి. వర్షాకాలంలో కురిసె వర్షం నీరు వంతెనలో నిలుస్తోంది. ఈ వంతెన రహదారి పూర్తిగా ఆధ్వానంగా తయారైంది. అర్లి వంతెన నుంచి లోకేశ్వరం మీదుగా అబ్ధుల్లాపూర్ వరకు తారు రోడ్డును వేశారు. కానీ, ఈ వంతెన కూలినట్లయితే తాత్కాలికంగా ఏర్పాటు చేయడానికి ఎలాంటి మార్గం లేదు. ఈ వంతెన నుంచి ప్రయాణం చేయడానికి వాహనదారులు జంకుతున్నారు. వంతెన ఎప్పుడు కూలుతుందోనని భయాందోళనకు గురవుతున్నారు. కూలితే తప్పని దూరబారం మండలం నుంచి ప్రతినిత్యం వందల సంఖ్యలో అర్లి వంతెనపై వాహనాలు ప్రయాణిస్తాయి. ఈ వంతెన ద్వారా నిర్మల్‌కు చేరుకోవడానికి 45 కిలోమీటర్లు ప్రయాణించాలి. వంతెన కూలితే భైంసా మీదుగా వెళ్లాలంటే 85 కిలోమీటర్ల దూరభారం అవుతోంది. వంతెన కూలకముందే అధికారులు స్పందించి మరమ్మతులు చేట్టాలని మండల వాసులు కోరుతున్నారు. మరమ్మతులు చేపట్టండి అర్లి వంతెనకు మరమ్మతు చేపట్టాలి. వంతెనపై నుంచి ప్రయాణించాలంటే భయాందోళనకు గురవుతున్నాం. వెంటనే ప్రభుత్వం నిధలు మంజూరు చేసి మరమ్మతు పనులు చేపట్టాలి. - భూమన్న, పంచగుడి కూలితే ఇబ్బందులే వంతెన కూలితే నిర్మల్ ప్రాంతాలకు వెళ్లాలంటే దూరభారం అవుతుంది.వెంటనే వంతెనకు మరమ్మతు చేపడితే ప్రయాణికులకు ప్రయాణం సులభతరమవుతుంది. - నారాయణ, రాజూరా ప్రతిపాదనలు పంపాం అర్లి వంతెన శిథిలావస్థలో ఉందన్న మాట వాస్తవమే. ఈ వంతెనపై భారీ లోడ్ వాహనాలు ప్రయాణం చేయకుండా నిషేధించాం. వంతెన విషయమై ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపిచాం. నిధులు మంజూరు కాగానే మరమ్మతు పనులు చేపడతాం. - స్వతంత్ర తీవారి, పీఆర్‌జేఈ, లోకేశ్వరం -
దూరం.. భారం..
► కొత్త జిల్లా ఏర్పాటవుతున్నా పలువురికి ప్రయోజనం శూన్యం ► జిల్లా కేంద్రానికైనా.. రాజధానికైనా దాదాపు అంతే దూరం.. ‘పరిపాలన సౌలభ్యం.. ప్రజలకు సౌకర్యం.. లక్ష్యంగా కొత్త జిల్లాల ఏర్పాటు ఉండాలి.. దూరభారం తగ్గించాలి.. 65 కి.మీల లోపు జిల్లా కేంద్రం ఉండేలా కొత్త జిల్లాల ఏర్పాటు ఉండాలి..’ ఇవీ జిల్లా కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఇచ్చిన మార్గదర్శకాలు. సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : కొత్తగా కొమురంభీం(మంచిర్యాల) జిల్లా ఏర్పాటు చేస్తున్నా.. సీఎం లక్ష్యం నెరవేరడం లేదు. ఆచరణకు వచ్చే సరికి పలు మండలాలకు అది సాధ్యం కావడంలేదు. కొత్త జిల్లా ఏర్పాటుతో కూడా జిల్లాలో పలు మండలాల ప్రజలకు దూరభారంలో మార్పు లేకుండా పోయింది. వీరు జిల్లా కేంద్రానికి చేరుకోవాలంటే ఏకంగా సుమారు 170 కిలో మీటర్లు ప్రయాణం చేయాల్సిన పరిస్థితి రానున్న రోజుల్లో కూడా కొనసాగనుంది. వీరు జిల్లా కేంద్రానికి వెళ్లినా.. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌కు వెళ్లినా దాదాపు సమాన దూరం ప్రయాణించాల్సిన పరిస్థితి నెలకొందంటే ఆదిలాబాద్ జిల్లాలో భౌగోళిక పరిస్థితులను అర్థం చేసుకోవచ్చు. ఇది ఏ ఒక్క సరిహద్దు చివరి గ్రామానికో పరిమితం కాలేదు. దాదాపు నియోజకవర్గం గ్రామాలన్నింటికీ కొత్త జిల్లా దూరభారం తగ్గడం లేదు. హైదరాబాద్‌కు తొందరగా వెళ్లవచ్చు.. దేశంలోనే ప్రముఖ పుణ్యక్షేత్రం జ్ఞాన సరస్వతీ అమ్మవారు కొలువై ఉన్న బాసర గ్రామ ప్రజలు జిల్లా కేంద్రానికి చేరుకోవాలంటే 155 కి.మీలు ప్రయాణించాల్సి ఉంటుంది. ఇదే బాసర నుంచి హైదరాబాద్ చేరుకోవాలంటే కూడా 180 కి.మీలు మాత్రమే. ఆదిలాబాద్ కంటే హైదరాబాద్‌కు త్వరగా చేరుకోగలుగుతారు. అయితే.. కొత్త జిల్లా ఏర్పాటు చేసినప్పటికీ ఈ దూరభారంలో ఎలాంటి మార్పులు లేకపోవడం గమనార్హం. అలాగే కుభీర్ మండలం సరిహద్దు గ్రామాలైన దొడర్న, నిగ్వా, సావ్లీ వంటి గ్రామాల ప్రజలు కూడా ఆదిలాబాద్‌కు చేరుకోవాలన్నా.. దాదాపు 150 కి.మీలు ప్రయాణం చేయాల్సి వస్తోంది. ఇలా నియోజకవర్గంలో ముథోల్, కుభీర్ వంటి మండలాల పరిధిలో పలు గ్రామాల ప్రజలకు దూరభారం తగ్గడం లేదు. దీంతో ఈ ప్రాంత ప్రజలు వివిధ పనుల నిమిత్తం జిల్లాకేంద్రానికి చేరుకోవాలంటే అనేక ఇబ్బందులు పడాల్సిందే. వెళ్లి రావాలంటే మూడు వందల కిలో మీటర్లు ప్రయాణించాల్సి వస్తోంది. ఇదిలా ఉండగా నిర్మల్‌ను జిల్లా చేయని పక్షంలో తమను నిజామాబాద్ జిల్లాలోనైనా కలపాలని కుభీర్ మండలం చాత గ్రామస్తులు ఇటీవల తీర్మానం చేశారు. అయితే నిజామాబాద్ జిల్లాలో విలీనం చేయడానికి జోన్ల సమస్య ఎదురవుతుందనే అభిప్రాయం అధికార వర్గాల్లో వ్యక్తమవుతోంది. సగానికి తగ్గినా దూరమే.. మంచిర్యాలను జిల్లా చేయడంతో కాగజ్‌నగర్ ప్రాంతంలోని పలు మండలాల వాసులకు దూరభారం చాలామట్టుకు తగ్గుతుంది. అయినప్పటికీ కొన్ని గ్రామాల వాసులకు జిల్లా కేంద్రం 140 కిలో మీటర్లు ప్రయాణించాల్సిన పరిస్థితే నెలకొంటుంది. ఉదాహరణకు బెజ్జూరు మండల కేంద్రం నుంచి మంచిర్యాలకు రావాలంటే కనీసం 130 కిలో మీటర్లు ప్రయాణించాల్సిందే. ఈ మండలంలోని సరిహద్దు గ్రామాల వాసులకైతే అదనంగా మరో పది కిలో మీటర్ల దూరం ఉంటుంది. ప్రభుత్వం మంచిర్యాల జిల్లాను ఏర్పాటు చేయకపోతే ఈ మండలాల వాసులు ఏకంగా 200 కిలో మీటర్లకు పైగా దూరం ప్రయాణంచి జిల్లా కేంద్రమైన ఆదిలాబాద్ చేరుకుంటున్నారు. ఈ ప్రాంత వాసులకు మాత్రం కొంత ఊరట లభిస్తోంది. -
ఘనంగా కొమురం భీం వర్థంతి
ఆదిలాబాద్: తెలంగాణ పోరాట యోధుడు కొమురం భీం 75వ వర్థంతి వేడుకలు స్వగ్రామంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆదిలాబాద్ జిల్లా కెరమెరి మండలం జోడేఘాట్లోని భీం సమాధి వద్ద ఆయన వంశీకులు ప్రత్యేక పూజలు చేసి నాలుగు రకాల జెండాలను ఎగురవేశారు. ప్రభుత్వం తరఫున ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి ఆర్.ఇ.కరుణన్ పూజలు నిర్వహించి కొమురం భీంకు ఘనంగా నివాళులర్పించారు. -
కొమరం భీం విగ్రహం ధ్వంసం
కరీంనగర్: గోండు వీరుడు కొమరం భీం విగ్రహాన్నిగుర్తుతెలియని వ్యక్తులు మంగళవారం రాత్రి ధ్వంసం చేశారు. ఈ సంఘటన జిల్లాలోని మహాముత్తారం మండలం యామన్‌పల్లిలో చోటుచేసుకుంది. ఈ ఘటనలో కొమరం భీం విగ్రహం చేయి ధ్వంసమైంది. గుర్తు తెలియని వ్యక్తులు 15 రోజుల క్రితం విగ్రహాన్నిధ్వంసం చేస్తే కాంగ్రెస్ నాయకులు విగ్రహానికి మరమ్మతులు చేయించారు. మళ్లీ మంగళవారం దుండగులు మరోసారి విగ్రహాన్నిధ్వంసం చేశారు. -
కొమురం భీం వారసుడికి రూ.10 లక్షలు
హైదరాబాద్: ఆదిలాబాద్ గిరిజన ఉద్యమకారుడు కొమురం భీం వారసుడు సోనేరావు కుటుంబానికి ప్రభుత్వం రూ.10 లక్షల ఆర్థిక సాయాన్ని మంజూరు చేసింది. గతేడాది అక్టోబరులో ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు ఆదిలాబాద్ జిల్లా జోడేఘాట్‌లో కొమురం భీం వర్ధంతి కార్యక్రమానికి హజరై ఈ మేరకు హామీ ఇచ్చారు. అక్కడ ఆ గిరిజన వీరుడి స్మారక మ్యూజియంతోపాటు ఇతర నిర్మాణాలు చేపట్టేందుకు రూ.25 కోట్ల మేర ప్రత్యేక ప్రాజెక్టును కూడా ప్రకటించారు. ఈ నిర్మాణానికి సంబంధించి రూ.18.75 కోట్లను కూడా ప్రభుత్వం విడుదల చేసింది. ఆ నిధుల నుంచి సోనేరావు కుటుంబానికి రూ.10 లక్షలు అందజేయాల్సిందిగా ప్రభుత్వం పర్యాటకాభివృద్ధి సంస్థను ఆదేశిస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. -
'కొమరం భీంను నిజాం చంపలేదు'
-
కొమరం భీమ్‌ని చంపింది నిజాం కాదు!
-
దీనావస్థలో భీమ్ వారసులు
వెలుగులోకి వచ్చిన భీమ్ మనుమరాళ్లు కనీస సౌకర్యాలకు నోచుకోని కుటుంబాలు కూలీ పని చేస్తే తప్ప పూట గడవని దుస్థితి ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకోలు రాష్ట్ర చరిత్ర పుటల్లోకెక్కిన గిరిజన యోధుడు కొమురం భీమ్ ఏ ఆశయం కోసమైతే నిజాం సర్కారుతో పోరాటం సాగించాడో ఆ ఆశయం.. వాటి ఫలాలు.. ఆ అమరవీరుడి వారసులకే దక్కడం లేదు. దీంతో నేటికీ వారు దీనావస్థలో కాలం వెల్లదీస్తున్నారు. దుర్భర జీవితాన్ని గడుపుతున్నారు. భీమ్ వారసులకు ఉండడానికి సరైన ఇల్లు లేదు. చేయడానికి చేతిలో పనిలేదు. ఉన్న కొంత సాగుభూమిలో పంట దిగుబడి రాలేదు. ఫలితంగా కూలే వారికి జీవనాధారమైంది. కూలీ చేస్తేనే వారి కడుపు నిండుతుంది. నిన్నటి వరకు కొమురం భీమ్‌కు మనుమడు కొమురం సోనేరావు, మనుమరాలు కొమురం సోంబాయిలే ఉన్నారని అందరికీ తెలుసు. మరో మనుమడు, ఇద్దరు మనుమరాళ్లు ఉన్నారనే విషయం ఇటీవల వెలుగులోకి వ చ్చింది. వారి జీవన స్థితిగతులపై కథనం. జంగుబాయి ఇల్లు పునాదులకే పరిమితం కెరమెరి మండలంలోని కొఠారి గ్రామంలో కొన్నేళ్లుగా కొమురం జంగుబాయి నివసిస్తోంది. వీరికి ఉండేందుకు పెంకుటిల్లె దిక్కవుతోంది. ఎనిమిదేళ్ల క్రితం ముంజూరైన ఇందిరమ్మ గృహం పునాదులకే పరిమితమైంది. ఇప్పటికీ ఎన్నో ప్రభుత్వాలు మారుతున్నా వీరి ఇంటిని పూర్తి చేసే నాథుడే కరువయ్యాడు. మరోసారి గృహం కోసం దరఖాస్తు పెట్టుకున్నా ప్రయోజనం లేకుండాపోయింది. మూడెకరాలు సాగు భూమి ఉంది. వర్షాధారంపై ఆధారపడి వేసిన పంట నట్టేట ముంచింది. పంటల్లో దిగుబడి రాలేదు. దీంతో కూలీ చేసి తన కుటుంబాన్ని పోషిస్తోంది. ఇంతవరకు ఆమెకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆర్థిక సహాయం అందలేదు. జంగుబాయికి భర్త జంగు, ఐదుగురు కుమార్తెలు, ఇద్దరు కుమారులున్నారు. ప్రభుత్వం ఆదుకోవాలి మమ్ములను ప్రభుత్వం ఆదుకోవాలి. తాత కొమురంభీమ్ పేరిట వేల రూపాయలు ఖర్చు చేస్తున్న ప్రభుత్వం మా కుటుంబాల గురించి పట్టించుకోవాలి. మమ్మల్ని కూడా గుర్తించి తగిన సహాయం అందించాలి. ఐటీడీఏ నుంచి ఆర్థిక సహాయం చేయాలి. - ఆడ జంగుబాయి, కొఠారి కాసుబాయికి కనిపించని ఆర్థిక ఆధారం కెరమెరి మండలంలోని సాకడ గ్రామంలో నివసిస్తున్న కొమురం భీమ్ చిన్న మనుమరాలు కొమురం కాసుబాయి ఆర్థిక ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతోంది. గతంలో ఇల్లు మంజూరైనా బిల్లు మాత్రం అందకపోవడంతో అప్పులు చేసి రేకుల ఇల్లు నిర్మించింది. ఉన్న మూడెకరాల సాగు భూమిలో పంట దిగుబడి రాలేదు. దీంతో కుటుంబ పోషణ భారమైంది. ఇప్పటికి షావుకారుల వద్ద నుంచి చేసిన అప్పులు తీర్చేదెలాగని ఆమె ఆందోళన చెందుతోంది. భీమ్ పేరు ఘనమైనా వారికి మాత్రం ఎలాంటి ప్రయోజనం కలగడంలేదు. భీమ్ వారసులన్నట్లు కూడా అధికారులకు తెలియదు. అసలు ఆ దిశగా ఇప్పటి వరకు ఎవరూ ప్రయత్నం సాగించలేదు. కాసుబాయికి భర్త కొమురం భీమ్, ఇద్దరు కొడుకులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. భూమి పంచివ్వాలి మ తల్లి గారి భూమి దోబే గ్రామంలో ఉంది. ఒక్క మనుమడే లాభం తీసుకుంటున్నడు. అది అందరికీ దక్కేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ప్రతీ ఒక్కరికి 4 ఎకరాలు భూమిని పంచి ఇవ్వాలి. మా పరిస్థితులను బాగు చేయాలి. - కొమురం కాసుబాయి, సాకడ ఎల్లుది కూడా అదే దుస్థితి కెరమెరి మండలంలోని కొఠారి గ్రామంలో ఉంటున్న భీ మ్ మనుమడు చహకటి ఎల్లు పరిస్థితి కూడా ఇంచుమిం చు అలాగే ఉంది. మూడెకరాల సాగు భూమి ఉన్నా రాళ్లురప్పలతో కూడుకుంది. ముప్పై వేలు వెచ్చించి వేసిన పత్తి పంటలో దిగుబడి రాలేదు. దీంతో ప్రస్తుతం ఆయన కూ లీ పని చేస్తూ తన కుటుంబాన్ని పోసిస్తున్నాడు. ఉదయం లేచిన దగ్గర్నుంచి సాయంకాలం వరకు ఎక్కడికో వెళ్లి కూలీ చేస్తేనే సాయంత్రం ఆయన కుటుంబానికి బువ్వ దొరుకుతుంది. పొలం పనులు చేసేందుకు ఎడ్లు కూడా లేకపోవడంతో వ్యవసాయ పనులకు ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయి. దీంతో బతుకు భారమవుతోంది. భార్య చిత్తుబాయి, కొడుకు వినోద్, సంజు ఉన్నారు. ఎడ్ల జతలివ్వాలి వ్యవసాయం చేసేందుకు కనీసం ఎడ్ల జతలన్న ఇవ్వాలి. ఎలాంటి సహకారం లేకపోవడంతో అష్టకష్టాల్లో ఉన్నాం. సాగుభూమి ప్రభుత్వ పరంగా అందించాలి. కొమురం సోనేరావుకు ఇచ్చిన ట్లే మాకూ ఆర్థిక సహాయం అందించాలి. - చహకటి ఎల్లు, కొఠారి వారసత్వంపై అలసత్వం కొమురం భీమ్‌కు ఇద్దరు పిల్లలు. కొడుకు మాధవరావు, కూతురు రత్తుబాయి. కొడుకు మాధవరావుకు ముగ్గురు పిల్లలు. సోనేరావు, భీమ్రావు. వీరు సిర్పూర్(యు) మండలంలోని దోబే గ్రామంలో నివసిస్తున్నారు. కూతురు రాధాబాయిది ఆసిఫాబాద్ మండలం మోవాడ్. భీమ్ కొడుకు పిల్లల పరిస్థితి ఒకింత బాగానే ఉన్నా.. కూతురు చహకటి రత్తుబాయి నలుగురు పిల్లల్లో ముగ్గురి పరిస్థితి దయనీయంగా ఉంది. రత్తుబాయికి ముగ్గురు కూతుళ్లు ఒక కొడుకు. ఓ కూతరు కొమురం సోంబాయి జోడేఘాట్‌లో నివసిస్తోంది. ఈమె పరిస్థితి కాక మిగితా ముగ్గురు దీనస్థితిలో ఉన్నారు. అందులో ఆడ జంగుబాయి, చహకటి ఎల్లు కొఠారి గ్రామంలో ఉండగా.. చిన్న కూతురు కొమురం కాసుబాయి సాకడలో బతుకుతోంది. తాత ఎంతో గొప్పవ్యక్తి. అనేక మంది ఆదివాసీలకు స్ఫూర్తిదాతగా నిలిచారు. తెలంగాణ ప్రభుత్వం కూడా ఆయన్ను గుర్తించింది. దాంతో జోడేఘాట్ కొత్త పుంతలు తొక్కనుంది. ఆయన చేసి త్యాగానికి సూచిగా రాష్ట్ర సర్కారు కూడా అడుగులేస్తోంది. కానీ ఆయన వారసుల జీవితాల్లో మాత్రం ఎలాంటి మార్పులేదు. ఇకనైనా తమ బతుకులు బాగుపడతాయనుకుంటే అధికారులు గుర్తించడం లేదంటూ భీమ్ మనమరాళ్లు ఆడ జంగుబాయి, కుంరం కాసుబాయి, చహకటి ఎల్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
అభ్యుదయానికి వేదికలు కావాలి: కేసీఆర్
బంజారా, ఆదివాసీ భవన్లకు శంకుస్థాపన చేసిన సీఎం కేసీఆర్ గిరిజనుల సమస్యలపై వీటిల్లో చర్చలు జరగాలి 12 శాతం రిజర్వేషన్లను కచ్చితంగా అమలుచేస్తాం రాష్ట్రంలోని తండాలన్నింటినీ పంచాయతీలుగా మారుస్తాం పరిధిలోకి లంబాడాలు, వాల్మీకి బోయలను చేరుస్తామని వెల్లడి సాక్షి, హైదరాబాద్: త్వరలో సిద్ధమయ్యే బంజా రా, ఆదివాసీ భవనాలు గిరిజనుల అభ్యుదయానికి వేదికలు కావాలని తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఆకాంక్షించారు. గిరిజనుల సమస్యల పరిష్కారా నికి ఈ వేదికలపై మేధావులతో చర్చలు జరగాలని, వాటి ఫలితాలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని ఆయన సూచించారు. గురువారం హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ రోడ్ నంబరు-1లో బంజారా భవన్, కొమురం భీం ఆది వాసీ భవన్‌కు సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశా రు. అనంతరం బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ‘‘బంజారాలు, ఆదివాసీలు, గోండు లు తదితర గిరిజనవర్గాలు హైదరాబాద్‌లో తమకు కమ్యూనిటీ హాల్లు కావాలని ఎన్నో ఏళ్లుగా ప్రయత్నించాయి. సమైక్య పాలనలో వారడిగిన పనికాలేదు. తెలంగాణ వచ్చాక బంజారాహిల్స్‌లోనే బంజారా భవన్ నిర్మిస్తానని ఉద్యమ సమయంలోనే చెప్పిన. బంజా రాభవన్కు శంకుస్థాపన కూడా చేసుకున్నాం.. ’’ అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. వరాల జల్లు..: ఐదు వందలకు పైగా జనాభా ఉన్న గిరిజన తండాలన్నింటినీ గ్రామ పంచాయతీలుగా మారుస్తామని సీఎం ఈ సందర్భంగా మరోసారి హామీ ఇచ్చారు. గిరిజనులకు కూడా త్వరలోనే మూడెకరాల భూమి ఇస్తామని... దానితోపాటు విద్యుత్, బోరు, మోటారు, ఒక ఏడాది వ్యవసాయానికి అవసరమయ్యే పెట్టుబడిని కూడా సమకూరుస్తామని చెప్పారు. అంటువ్యాధులతో అల్లాడుతున్న గిరిజన తండాలకు 400 వైద్య బృందాలను పంపాలని నిర్ణయించామన్నారు. సమతుల పోషకాహారం తీసుకోవడం, వ్యాధులకు మందులు వాడడం, మూఢ నమ్మకాలకు దూరంగా ఉండడం తదితర అంశాలపై ఆ బృందాలు అవగాహన కల్పిస్తాయని కేసీఆర్ తెలిపారు. కేబినెట్ విస్తరణలో గిరిజన సంక్షేమ విభాగానికి గిరిజనుడినే మంత్రిగా నియమిస్తామన్నారు. గిరిజనుల ఇళ్లలో ఆడపిల్ల పెళ్లికి కల్యాణ లక్ష్మి పథకం కింద రూ. 51 వేలు అందజేయనున్నట్లు సీఎం పేర్కొన్నారు. బంజారాల కులదైవం సేవాలాల్ జయంతి ఉత్సవాలకు, జంగూభాయ్ జయంతి నిర్వహణ కోసం ఒక్కో జిల్లాకు వేర్వేరుగా రూ. 10 లక్షల చొప్పున కేటాయిస్తామని సీఎం చెప్పారు. వచ్చే ఎన్నికల్లోగా ప్రతి లంబాడీ తండా, గిరిజన, కోయ గూడాలకు, చెంచుపేటల్లోని ప్రతి ఇంటికి మంచినీటి నల్లా కనెక్షన్ ఇస్తానని.. లేకపోతే ఓట్లు అడగబోమన్నారు. అయితే ఈ సదుపాయం ప్రజలందరికీ చేరేలా తండాలు, గూడేల పెద్దలు బాధ్యత తీసుకోవాలన్నారు. 12 శాతం రిజర్వేషన్‌లోకి లంబాడాలు, వాల్మీకి బోయలు.. ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్నట్లుగా గిరిజనులకు 12 శాతం రిజర్వేషన్ ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం స్పష్టం చేశారు. 9 శాతం గిరిజనులుంటే 12 శాతం రిజర్వేషన్ ఎలా ఇస్తారని ఓ పెద్దమనిషి తనను ప్రశ్నించారని.. గిరిజ నులతో పాటు కాగిత, లంబ లం బాడీ, వాల్మీకి బోయలనూ ఈ జాబితాలో చేర్చబోతున్నట్లు తాను చెప్పానన్నారు. రిజర్వేషన్ల విషయమై త్వరలోనే హైకోర్టు రిటైర్డ్ జడ్జితో కమిటీ వేయనున్నట్లు సీఎం తెలిపారు. ఈ సందర్భంలో ‘రజకులను కూడా గుర్తించాల’ం టూ ఒక వ్యక్తి బ్యానర్‌తో సభా ప్రాంగణంలో హల్చల్ చేశా డు. ఇది సందర్భం కాదని సీఎం వారించినా వినకపోయే సరికి పోలీసులు అత న్ని పక్కకు తీసుకెళ్లారు. కార్యక్రమంలో వివిధ జిల్లాల నుంచి వచ్చిన గిరిజనులు ప్రదర్శించి న.. బంజారా, గుస్సాటి, థింసా, కొమ్ము, కో య, డప్పు నృత్యాలు ఆకట్టుకున్నాయి. సభలో బంజారా నేతలు సీతారాం నాయక్, రాములు నాయక్, శంకర్‌నాయక్, కిషన్‌సింగ్, డిప్యూటీ సీఎం రాజయ్య, మంత్రులు ఈటెల రాజేందర్, నాయిని నర్సింహారెడ్డి, జోగు రామన్న, పోచా రం శ్రీనివాసరెడ్డితో పాటు పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారులు పాల్గొ న్నారు. కాగా బంజారా, ఆదివాసీ భవన్లతో పాటు దళితుల కోసం జగ్జీవన్‌రామ్ భవన్‌ను కూడా ప్రారంభిస్తామని ప్రభుత్వం ప్రకటిం చినా.. పలు కారణాల వల్ల వాయిదా వేసింది. -
కొమురం భీం పేరు పెట్టాలి: వైఎస్ఆర్ సీపీ
హైదరాబాద్ : శంషాబాద్ విమానాశ్రయానికి కొమురం భీం పేరు పెట్టాలని వైఎస్ఆర్ సీపీ ఫ్లోర్ లీడర్ తాటి వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. అసెంబ్లీ పది నిమిషాలు వాయిదా అనంతరం ఆయన మీడియా పాయింట్ వద్ద విలేకర్లతో మాట్లాడుతూ రాజకీయాలకు అతీతంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ప్రజలంతా గిరిజన నేత కొమురం భీంను అభిమానిస్తారని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా అసెంబ్లీలో విమానాశ్రయానికి కొమురం భీం పేరు పెట్టే అంశాన్ని ప్రస్తావించారని తాటి వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. కొమురం భీం పేరును ఏకగ్రీవ తీర్మానం చేసేందుకు పార్టీలన్నీ సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. -
‘కొమరం భీమ్ జాతీయ అవార్డు’ని అందుకున్న సుద్దాల అశోక్‌తేజ
-
కొమరం భీమ్‌నే ఇంటికి తీసుకెళ్తున్నంత సంబరంగా ఉంది
‘‘గిరిజన పోరాట యోధుడు, ఆదివాసీల ఆరాధ్యదైవం కొమరం భీమ్. ఆ మహనీయుని పేరిట స్థాపించిన జాతీయ పురస్కారాన్ని నాకందించడం గర్వంగా ఉంది. కొమరం భీమ్‌నే నా ఇంటికి తీసుకెళ్తున్నంత సంబరంగా ఉంది’’ అని రచయిత సుద్దాల అశోక్ తేజ అన్నారు. భారత్ కల్చరల్ అకాడమీ, కొమరం భీమ్ స్మారక పరిషత్, ఆదివాసి సంస్కృతి పరిరక్షణ సమితి, ఓం సాయితేజ ఆర్ట్స్ సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘కొమరం భీమ్ జాతీయ అవార్డు’ని ఈ ఏడాది సుద్దాల అశోక్‌తేజకు అందించారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన వేడుకలో 50 వేల 101 రూపాయల నగదు, దుశ్శాలువా, జ్ఞాపికతో సుద్దాలను సన్మానించారు. ఈ సందర్భంగా సుద్దాల స్పందిస్తూ -‘‘సినిమా రంగంలో ఇప్పటివరకూ 30 అవార్డులు వచ్చాయి. ఈ అవార్డులన్నీ ఓ ఎత్తు... ఈ పురస్కారం ఓ ఎత్తు. దాసరి నారాయణరావు, కేవీ రమణాచారిగార్ల ప్రోత్సాహం వల్లే సినీ పరిశ్రమలో రచయితగా ఈ స్థాయికి రాగలిగాను. దాసరి గారి ‘పరమవీర చక్ర’ సినిమాకోసం కొమరంభీమ్పై పాట రాసే అదృష్టం కూడా నాకు కలిగింది. ఆనాటి కృషి ఈ విధంగా ఫలించిందనుకుంటున్నాను’’ అన్నారు. ఈ కార్యక్రమంలో కొమరం భీమ్ మనవడు కొమరం సోనేరావు, పరుచూరి గోపాలకృష్ణ, బాబూమోహన్, రమణాచారి, సముద్రాల వేణుగోపాలాచారి, వెనిగళ్ల రాంబాబు, శాసనసభ్యులు రసమయి బాలకిషన్, కర్నె ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. -
నెలనెలా పండుగలే..
భాష, వేషధారణలోనూ విభిన్నం అడవులే వారికి ఆయువుపట్టు ఇదీ జిల్లా ఆదివాసీ గిరిజనుల సంస్కృతి, సంప్రదాయాల తీరు కొండా కోనల్లో జీవనం.. నిండైన అమాయకత్వం.. రాజకీయాలు తెలియని మనస్తత్వం.. ప్రతి నెలా పండుగలు.. పండుగలకు అనుగుణం గా ప్రత్యేక పూజలు.. అందుకు తగ్గట్టుగా వేషధారణ.. ఇదీ ఆదివాసీ గిరిజనుల ప్రత్యేకత. ఆదిలాబాద్ జిల్లా అంటేనే ఆదివాసీల కు పెట్టింది పేరు. వివిధ తెగల రూపంలో జీవిస్తున్న వారి ప్రత్యేకతలు అన్నీ ఇన్నీ కావు. వారి సంస్కృతి సంప్రదాయాలూ అందరికీ ఆశ్చర్యం కలిగించేవే. జిల్లా గిరిజన జీవనంపై నేటి సండే స్పెషల్. జిల్లావ్యాప్తంగా 2011 జనాభా లెక్కల ప్రకారం సుమారు 4 లక్షల 95 వేల 794 మంది ఆదివాసీ గిరిజనులు జీవనం సాగిస్తున్నారు. అయితే లంబాడా(బంజార)లను ప్రభుత్వం 1977 సంవత్సరంలో గిరిజనులుగా గుర్తించడంతో ఆనాటి నుంచి వీరు గిరిజనులుగా గుర్తింపు పొందారు. గోండులు, కొలాంలు, మన్నెవార్, తోటి, ప్రధాన్‌లు, నాయక్‌పోడ్, ఆంద్, కోయా, ఇతర జాతులను ఆదివాసీలుగా వ్యవహరిస్తుండగా వీరిలో కొలాం, మన్నెవార్, తోటి తెగలను పీటీజీ(ఆదిమ గిరిజన తెగలు)గా వ్యవహరిస్తారు. గోండులు గోండుల ప్రధాన వృత్తి పోడు వ్యవసాయం. ఆదిమ జాతి గిరిజనులైన గోండులు గోండి భాషలో మాట్లాడుతారు. కుస్రం హన్మంతరావు గోండు లిపిని రూపొందించారని చరిత్రకారులు పేర్కొన్నారు. అయితే ఇటీవల నార్నూర్ మండలం గుంజాలలో గోండుల లిపి వెలుగులోకి వచ్చింది. దీంతో లిపిపై పరిశోధనలు జరుగుతున్నాయి. గోండు గూడాల్లో జీవించేవారు మర్యాదకు, క్రమశిక్షణకు మారు పేరు. ఆచార వ్యవహారాలు పాటించడంలో వారికి వారే సాటి. కొమురం భీమ్ కాలం నుంచి గోండులది పోరాటతత్వం. మారుముల ప్రాంతాల అడవుల్లో జీవిస్తున్న వీరు ఎవరైనా కొత్తవారు గూడెంలోకి వస్తే ‘రాం...రాం’(నమస్కారం) అని ఆహ్వానిస్తారు. వీరు తమ గూడెం పటేల్ మాట కాదనరు. గోండులు కాలికి చెప్పులు వేసుకుని ఇంట్లోకి అడుగుపెట్టరు. ఇతరులను అనుమతించరు. గూడాల్లో ఏ చిన్న పండుగైన అంతా కలిసి సంస్కృతి సంప్రదాయాలకు పెద్ద పీట వేస్తారు. గోండులు పెర్సాపెన్, ఆకిపెన్, జంగుబాయి తదితర దేవుళ్లను నమ్ముతారు. దీపావళీ సమయంలో గోండులు దండారీ పండుగను అత్యంత నియమనిష్టలతో జరుపుకుంటారు. గిరిజన సంస్కృతి నుంచి పుట్టిన రాయిసెంటర్ల (న్యాయస్థానం) తీర్పును గోండులు శిరసావహిస్తారు. కొలాంలు అభివృద్ధిలో వెనుకబడిన ఆదివాసీ తెగల్లో కొలాం గిరిజనులు అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్నారు. వీరు కొలామీ భాషలో మాట్లాడుతారు. మారుమూల అటవీ ప్రాంతాల్లో జీవిస్తారు. వ్యవసాయం, వెదురు బుట్టలు, తడకలు అల్లడం వీరి ప్రధాన వృత్తులు. వీరు ముఖ్యంగా భీమల్ పేన్ దేవతను కొలుస్తారు. థింసా నృత్యం చేస్తారు. కొలాం జాతుల్లో తెలుగు మాట్లాడే వారిని మన్నెవార్ అంటారు. గోండుల ఆచార వ్యవహారాలకు వీరి ఆచార వ్యవహారాలకు పెద్దగా తేడా లేనప్పటికీ కొన్ని పద్ధతులు ప్రత్యేకంగా ఉంటాయి. ప్రధాన్, తోటి రాజ్‌గోండుల కాలంలో ప్రధాన్, తోటి తెగలకు చెందినవారు కవులుగా ఉండేవారని చరిత్రకారులంటారు. ప్రధాన్‌లు అధికంగా మరాఠీ మాట్లాడుతారు. వ్యవసాయం ప్రధాన వృత్తి. తోటి తెగవారు అత్యంత వెనుకబడి ఉన్నారు. ప్రధానంగా గోండి భాష మాట్లాడుతారు. తోటిలలో అధిక శాతం ఇతర ప్రాంతాలకు వలసలు సాగిస్తూ జీవనం కొనసాగిస్తారు. కిక్రీ వాయిద్యాలు వాయించటం, చుక్కబొట్టులు వేయడంలో వీరు సిద్ధహస్తులు. ఆంద్, నాయిక్‌పోడ్ ఆంద్ తెగ వారు మహారాష్ట్ర ప్రాంతానికి చెందినవారు కాగా.. మరాఠీ భాషలో మాట్లాడుతారు. వీరి జనాభా అంతంతే. వ్యవసాయం జీవనాధారం. పోడు వ్యవసాయం ఎక్కువగా చేస్తుంటారు. లంబాడీ రాష్ట్రంలో లంబాడీలను రాష్ట్ర ప్రభుత్వం 1977లో గిరిజన తెగల్లో చేర్చింది. జిల్లాలో ఉన్న లంబాడీలు ఆదిమజాతి గిరిజనుల కంటే అభివృద్ధి చెందిన వారు. గోండు జనాభా తరువాత వీరు రెండో స్థానంలో ఉన్నారు. వీరు వ్యవసాయమే కాకుండా వ్యాపారం, సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాల్లో అభివృద్ధి సాధిస్తున్నారు. వీరు నిర్వహించే తీజ్ ఉత్సవాలు ఎంతగానే ఆకట్టుకుంటాయి. అడవి బిడ్డల జాతరలు ఆదివాసీ గిరిజన ప్రాంతాల్లో నిర్వహించే వివిధ జాతర ఉత్సవాలు వారి సంస్కృతి సంప్రాదాయాలు, ఆచార వ్యవహరాలే ప్రధానంగా సాగుతాయి. ఆదివాసీలకు నాగోబా జాతర అత్యంత పవిత్రమైనది. నాగోబాతో పాటు ఖాందేవ్, బుడుందేవ్, మహాదేవ్, జంగుబాయి ఇలా.. ప్రతీ జాతర వారికి ప్రత్యేకమైనదే. నాగోబా జాతర ఆదివాసీల ఆరాధ్య దైవం నాగోబా. ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ గ్రామంలో కొలువై ఉంది. ఏటా పుష్య మాసంలో అమావాస్య అర్ధరాత్రి మెస్రం వంశీయులు పవిత్ర గంగజలాలతో ప్రత్యేక పూజలు నిర్వహించడంతో జాతర ప్రారంభిస్తారు. ఈ పూజలకంటే ముందు ఇంద్రాయిదేవీకి ప్రత్యేక పూజలు నిర్వహించడం ఆనవాయితీ. మెస్రం వంశీయులలో ఏడు దైవతలను ప్రత్యేకంగా పూజిస్తుంటారు. మెస్రం వంశంలో ఉన్న 22 తెగలవారు అత్యంత నియమనిష్టలతో నాగోబాను కొలుస్తారు. నాగోబా పూజలకు ముందు మెస్రం వంశీయులు పవిత్ర గంగజలం కోసం కాలినడకన జన్నారం మండలంలోని కలమడుగు గోదావరి రేవు అత్తల మడుగు వద్దకు వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించి గంగజలం తీసుకొచ్చి పుష్యమి అమావాస్య అర్ధరాత్రి నాగోబాకు అభిషేకించి జాతర ప్రారంభిస్తారు. దక్కన్ పీఠభూమిలోనే ఆదివాసీలకు ముఖ్యమైనది కావడంతో రాష్ట్ర ప్రభుత్వం గతేడాది రాష్ట్ర పండుగగా గుర్తింపునిచ్చింది. ఖాందేవ్ జాతర నాగోబా జాతర ప్రారంభానికి ముందు నార్నూర్ మండల కేంద్రంలో ఖాందేవ్ జాతర జరుగుతుంది. పుష్య పౌర్ణమికి ఖాందేవ్‌ను తొడసం వంశీయులు కొలువడం ద్వారా జాతర ప్రారంభమవుతుంది. 15 రోజుల పాటు జరుగుతుంది. పూర్వ కాలంలో తోడసం వంశాస్థుడైన ఖమ్ము పటేల్‌కు రాత్రి వేళ కలలో ఖాందేవుడు ప్రత్యక్షమై గ్రామమంత సుఖసంతోషాలతో ఉండాలంటే నీ వ్యవసాయ భూమిలో నేను కొలువయ్యాయని తనను కొలవాలని పేర్కొన్నాడని.. నాటి నుంచి ఏటా పుష్య పౌర్ణమితో ఖాందేవును తొడసం వంశీయులు కొలుస్తున్నారు. ఈ జాతర ముగింపుతో ఇక్కడికి వచ్చిన ఆదివాసీలు నాగోబా జాతర కేస్లాపూర్‌కు తరలివెళ్తారు. బుడుందేవ్ జాతర నాగోబా జాతర ముగింపు మరుసటి రోజు ఉట్నూర్ మండలం శ్యాంపూర్‌లో బుడుందేవ్ జాతరను మెస్రం వంశీయులు ప్రత్యేక పూజలతో ప్రారంభిస్తారు. పది రోజుల పాటు నిర్వహిస్తారు. పూర్వకాలంలో గౌరాపూర్ అనే గ్రామంలో ఉన్న ఆవుల మందలో ఉన్న ఆంబోతు(ఎద్దు) పశువుల మంద నుంచి తప్పించుకొని శ్యాంపూర్ ప్రాంతంలో ఉన్న పంట చేలల్లో పడి పంట నాశనం చేయడంతో ఆగ్రహించిన కొత్వాల్‌లు వారి వద్ద ఉన్న ఆయుధంతో ఆంబోతును సంహరించారని మృతి చెందిన ఆంబోతును దూర ప్రాంతంలో పారేయడానికి వెళ్తుండగా అక్కడే బండరాయిగా మారి బుడుందేవ్‌గా అవతరించిందని పూర్వీకుల కథనం. మహాదేవ్ జాతర శ్యాంపూర్‌లో బుడుందూవ్ జాతర ముగింపుతో సిర్పూర్(యు) మండల కేంద్రంలో మహాదేవ్ జాతర ప్రారంభమవుతోంది. ఆత్రం వంశీయులు ప్రత్యేక పూజలతో మహాదేవ్‌ను కొలిచి ప్రారంభించే జాతర పదిహేను రోజులపాటు సాగుతుంది. అంతేకాకుండా మండలంలోని లింగాపూర్‌లో జగదాంబ జాతరను బంజారాలు అత్యంత నియమ నిష్టలతో నిర్వహిస్తారు. జంగుబాయి జాతర శార్దూల వాహిని దుర్గమాత ప్రతి రూపమే జంగుబాయి అని ఆదివాసీల నమ్మకం. ఏటా పుష్య మాసంలో నెల రోజుల పాటు ఆదివాసీలు అత్యంత నియమనిష్టలతో జంగుబాయిని కొలుస్తారు. ఆంధ్ర, మహారాష్ట్ర సరిహద్దు కెరమెరి మండలం పరందోళి గ్రామం సమీపంలో గల శంకర్‌లొద్ది అటవీ ప్రాంతంలో జంగుబాయి కొలువై ఉన్న ఈ ప్రదేశమంతా పదుల సంఖ్యలో దేవతలున్నాయని పూర్వకాలం నుంచి ప్రచారంలో ఉంది. జంగుబాయి దేవతను ఆదివాసీలోని ఆరు తెగలకు చెందిన వంశస్థులు ప్రత్యేక పూజలు నిర్వహించి పూజలు చేస్తారు. నెల రోజుల పాటు జరిగే ఈ పూజలకు జిల్లా, ఏజెన్సీ నుంచే కాకుండా ఇతర జిల్లాలు, రాష్ట్రాల నుంచి భారీగా ఆదివాసీలు, ఇతరులు తరలివెళ్తారు. నెలనెలా పండుగలే ఆదివాసీ గిరిజనులు సంవత్సర కాలంలో నిర్వహించుకునే పండుగలు ప్రత్యేకంగా ఉంటాయి. చైత్రమాసం(ఏప్రిల్)లో చెంచు భీమన్న మెర్మి పండుగతో వ్యవసాయ పనులు ప్రారంభిస్తారు. వైశాఖ(మే)లో పెర్సాపెన్ పూజలు చేస్తారు. జ్యేష్ఠ మాసం(జూన్)లో విదిరి మొహుతుక్ పండుగతో ఆకి దేవర వద్ద జొన్నలతో నైవేద్యం సమర్పిస్తారు. ఆషాడం(జులై)లో ఆకిపెన్ పండుగతో పంట చేలల్లో కలుపుతీత పనులు ప్రారంభించడంతో పాటు పంటల దిగుబడులు పెరగాలని పచ్చదనం సంతరించుకున్న అడవి తల్లి చల్లంగా చూడాలని వేడుకుంటారు. శ్రావణం(ఆగస్టు)లో బంజారాలు తీజ్ పండుగ, ఆదివాసీలు శ్రావణమాసం చివరలో పొలాల పండుగ, జాగేయ్ మాతరీ జాగేయ్ పండుగలు నిర్వహిస్తారు. భాద్రపద(సెప్టెంబర్)లో పెత్రమాస(పెద్దల పండుగ), అశ్వీయుజ(అక్టోబర్)లో దండారీ, మృ గశిర(డిసెంబర్)లో కొత్త పంటలు ఇంటికి వచ్చే సందర్భంగా సెట్టి పండుగ జరుపుకుంటారు. ఇవే కాకుండా కాలాన్ని బట్టి దురాడి, మరుగోళ్ల ఉత్సవం, దాటుడి పండుగలతో పాటు దసరా, దీపావళీ, ఉగాది, హోలీ తదితర పండుగలను ఘనంగా చేస్తారు. దండారీ సంబురం గోండులు దీపావళీ సందర్భంగా జరుపుకునే దండారీ పండుగ అతి ప్రధానమైనది. అకాడి నుంచి మొదలై దీపావళీ తరువాత రెండు రోజులకు బొడుగ పండుగతో దండారీ ఉత్సవాలు ముగిస్తారు. దండారీ ఉత్సవాల్లో భాగంగా గోండులు ఆషాడ మాసం లేదా దసరా తర్వాతి రోజుల్లో అకాడి పెన్ దేవతకు పూజలు నిర్వహించి దండారీ ఉత్సవాలు ప్రారంభిస్తారు. దండారీలో ఆటపాటలకు ఉపయోగించే పర్రా, వెట్టె, తుడుం, డప్పు, పెప్ప్రి తదితర సంగీత పరికరాలను, నెమలి ఈకలతో కుంచెం కట్టిన గుస్సాడీ కిరీటాలను, ఇతర వస్తు సామగ్రిని గూడెం గ్రామ పటేల్ ఇంటి ముందు పేర్చి సంప్రదాయ రీతిలో పూజలు జరుపుతారు. ఈ నృత్యాల్లో గుస్సాడీ, చచ్చొయి-చాహోయి, థింసా, గుమ్మెలాట ప్రధానమైనవి. గుస్సాడీ అలంకరణ చేసుకునే వారు అత్యంత నియమ నిష్టలతో ఉంటారు. బంజారాల బతుకమ్మ తీజ్ లంబాడీలు(బంజారాలు) నిర్వహించే ఉత్సవాల్లో తీజ్ అతి ముఖ్యమైనది. రాఖీపౌర్ణమి నుంచి శ్రీకృష్ణాష్టమి వరకు గిరిజన తండాల్లో పెళ్లి కాని యువతులు నిర్వహించే తీజ్‌ను బంజారాల బతుకమ్మ పండుగ అనవచ్చు. రాఖీపౌర్ణమి రోజు నుంచి శ్రీకృష్ణాష్టమి వరకు తీజ్ ఉత్సవాలను పెళ్లికాని యువతులు, చిన్నారులు తొమ్మిది రోజులపాటు జరుపుకుంటారు. ముందుగా తండాల్లో పెద్దలు ప్రతీ ఇంటి నుంచి గోధుమలు సేకరిస్తారు. చిన్న చిన్న వెదురు బుట్టలు కొనుగోలు చేస్తారు. యువతులు తండాలకు సమీపంలో చీమల పుట్టమన్ను(మకొడ ధూడ్) తీసుకువచ్చి వెదురు బుట్టల్లో నింపుతారు. రాఖీపౌర్ణమి రోజున ఆ బుట్టల్లో ప్రత్యేక పూజలతో గోధుమలు చల్లుతారు. రోజూ పూజలు నిర్వహిస్తారు. తొమ్మిదో రోజు నీటి వనరుల్లో నిమజ్జనం చేస్తారు. పూర్వ కాలంలో తీవ్ర కరువు కాటకాలు వచ్చినప్పుడు గిరిజన పెద్దలు(నాయక్)లు తమ ఆరాధ్య దైవమైన జగదాంబ మాతను వేడుకోగా ఏటా శ్రావణ మాసంలో తీజ్ ఉత్సవాలు నిర్వహించాలని సూచించిందని చెప్తారు. కాగా, తీజ్ అంటే పచ్చదనం. -
ఎస్టీలకు 12% రిజర్వేషన్ అమలు చేయాలి
కొమురం భీం వర్ధంతి సభలో టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి అధికారంలోకి వస్తే గిరిజనులకు 12 శాతం రిజర్వేషన్లు కల్పిస్తానని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ తక్షణమే ఆ హామీని నిలబెట్టుకోవాలని టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య డిమాండ్ చేశారు. గిరిజన యోధుడు కొమురం భీం 74వ వర్ధంతిని పురస్కరించుకొని బుధవారం ట్యాంక్‌బండ్‌పై ఉన్న కొమురం భీం విగ్రహం వద్ద నాయకులు ఘనంగా నివాళులర్పించారు. గిరిజన ఐక్య వేదిక ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పొన్నాల లక్ష్మయ్య మాట్లాడారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ గిరిజన విభాగం అధ్యక్షుడు జగన్ ఆధ్వర్యంలో కొమురం భీం విగ్రహం వద్ద అర్ధగంట పాటు మౌన దీక్ష జరిగింది. ఈ కార్యక్రమంలో సికింద్రాబాద్ ఎంపీ బండారు దత్తాత్రేయ, ఎమ్మెల్యే డాక్టర్ కె.లక్ష్మణ్, మాజీ మంత్రులు షబ్బీర్ అలీ, బలరాంనాయక్, రవీంద్రనాయక్, గిరిజన ఐక్య వేదిక అధ్యక్షుడు వి.వి.వినాయక్, లంబాడా హక్కుల పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు బెల్లయ్య నాయక్, టీఆర్ఎస్ నేతలు శ్యాంసుందర్ పాల్గొన్నారు. టీటీడీపీ కార్యాలయంలో కొమురం భీం వర్ధంతి... తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కొమురంభీం వర్ధంతి కార్యక్రమాన్ని ఆపార్టీ నేతలు నిర్వహించారు. పార్టీ తెలంగాణ శాఖ అధ్యక్షుడు ఎల్. రమణ నేతృత్వంలో పార్టీ నేతలు పెద్దిరెడ్డి, సీతక్క తదితరులు కొమురం భీం చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రవీంద్ర భారతిలో... తెలంగాణ సాయుధ పోరాట యోధుడు కొమురం భీం వర్ధంతి వేడుకలు బుధవారం హైదరాబాద్ రవీంద్ర భారతిలో ఘనంగా జరిగాయి. తెలంగాణ గిరిజన ఐక్యవేదిక సంస్థ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి గోవా గవర్నర్ మృదుల సిన్హా ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. గిరిజన ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ నాగు, ఎంపీ బండారు దత్తాత్రేయ, ఐఏఎస్ అధికారి కె.నరసింహ పాల్గొన్నారు. -
కొమురం భీం స్ఫూర్తితో ముందుకెళ్దాం
*తెలంగాణలో వైఎస్సార్సీపీని పటిష్టపరచాలి *పార్టీ రాష్ట్ర తొలి సర్వసభ్య భేటీలో వైఎస్ జగన్ దిశానిర్దేశం *రాష్ట్రం కానివారు, భాష తెలియని వారు పట్టుకోసం ప్రయత్నం చేస్తున్నారు *ఇక్కడే పుట్టి, ఇక్కడి సమస్యలు తెలిసిన మనం ఎందుకు ముందుకు రాకూడదు? *దమ్మూ, ధైర్యం, విశ్వసనీయత ఉంటే దేవుడు, ప్రజలే ఆశీర్వదిస్తారు *నాలుగేళ్లలో టీఆర్ఎస్, టీడీపీలు ప్రజా వ్యతిరేకతలో కొట్టుకుపోవడం ఖాయం *రాష్ట్రంలో వైఎస్ మృతిని తట్టుకోలేక మరణించినవారి కుటుంబాలను షర్మిల పరామర్శిస్తారు సాక్షి, హైదరాబాద్: గిరిజన పోరాట యోధుడు కొమురం భీమ్ పోరాట స్ఫూర్తితో పార్టీని ముందుకు తీసుకెళ్లాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలంగాణ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. జల్, జంగిల్, జమీన్ నినాదంతో బ్రిటిష్, నిజాం సామ్రాజ్యాలకు ఎదురొడ్డిన స్ఫూర్తిని నేతలు, కార్యకర్తలు ఆదర్శంగా తీసుకొని పార్టీని పటిష్టపరచాలని సూచించారు. రాష్ట్రం కానివారు, భాష తెలియని నేతలే రాష్ట్రంలో పట్టు కోసం ప్రయత్నం చేస్తుంటే... ఇక్కడే పుట్టి, ఇక్కడి సమస్యలు తెలిసిన వైఎస్సార్సీపీ వంటి ఓ తెలుగు పార్టీ ఇక్కడి ప్రజలకు మంచి చేయడానికి ఎందుకు ముందుకు రాకూడదని ప్రశ్నించారు. రానున్న నాలుగేళ్లలో టీఆర్ఎస్, టీడీపీలు ప్రజా వ్యతిరేకతలో కొట్టుకుపోవడం ఖాయమని, అప్పుడు రాష్ట్రంలో బీజేపీ, కాంగ్రెస్, వైఎస్ఆర్ కాంగ్రెస్‌లే మిగిలి ఉంటాయన్నారు. ప్రస్తుతం తమ బలం తక్కువగా ఉన్నా, రానున్న రోజుల్లో దమ్మూ, ధైర్యం, ప్రజా అండ, విశ్వసనీయత తో ముందుకు వెళ్తే ఆ దేవుడే ఆశీర్వదిస్తాడని పేర్కొన్నారు. తెలంగాణ పోరాట యోధుడు కొమురం భీం వర్ధంతి రోజైన బుధవారం మెహదీపట్నంలోని క్రిస్టల్ గార్డెన్లో... వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర తొలి సర్వసభ్య సమావేశం నిర్వహించారు. తెలంగాణలోని పది జిల్లాల నుంచి తరలివచ్చిన వేలాది మంది పార్టీ నేతలు, కార్యకర్తలను ఉద్దేశించి జగన్ మాట్లాడారు. జగన్ ఏమన్నారో ఆయన మాట ల్లోనే.. ‘‘కొమురం భీం స్ఫూర్తిని మన పార్టీలోకి తెచ్చుకొని ముందడుగు వేసేందుకు ఈ సమావేశం ఓ నిదర్శనం. రాష్ట్రంలో పార్టీ, ఉంటుందా, ఉండదా? అని కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి తప్పుడు సంకేతాలు ఇస్తున్న వ్యక్తులకు ఒక్కటే చెబుతున్నా. యుద్ధం చేయాలంటే గుండెల్లో ధైర్యం ఉండాలి. సోనియాది మన రాష్ట్రం కాదు. ఆమెకు మన భాష రాదు. అయినా కాంగ్రెస్ ఉండాలని అంటున్నారు. ప్రధాన మోడీకి సైతం ఇక్కడి భాష రాకపోయినా బీజేపీ బలపడటానికి ప్రయత్నం చేస్తోంది. తెలుగు భాష రాని వాళ్లే ఇక్కడ పరిపాలన చే యాలని ప్రయత్నిస్తుంటే, ఇక్కడే పుట్టి, ఇక్కడి సమస్యలు తెలిసి, ఇక్కడి ప్రజలకు మంచి చేయాలనుకునే తెలుగు పార్టీ ఎందుకు ముందుకు రాకూడదు? ఆ పార్టీలు ప్రజా వ్యతిరేకతలో కొట్టుకుపోవడం ఖాయం.. మరో నాలుగేళ్లలో టీఆర్ఎస్, టీడీపీలు ప్రజా వ్యతిరేకతలో కొట్టుకుపోయే రోజు వస్తుంది. కేసీఆర్‌కు ప్రజా వ్యతిరేకత రావడానికి ఏడాది పట్టొచ్చు. కానీ చంద్రబాబుకు మాత్రం నాలుగు నె లలు మాత్రమే పట్టింది. రోజుకో అబద్ధం, పూటకో మోసం చేస్తున్న బాబుకు ఏపీలో పట్టిన గతే తెలంగాణలోనూ పడుతుంది. ఎవరిని మోసం చేయడానికి వచ్చావని ప్రజలు నిలదీసే రోజు వస్తుంది. ప్రజా వ్యతిరేకతలో టీడీపీ, టీఆర్ఎస్లు కొట్టుకుపోవడం ఖాయం. తెలంగాణలో బీజేపీ, కాంగ్రెస్, వైఎస్సార్ కాంగ్రెస్‌లు మాత్రమే మిగులుతాయి. ఈరోజు మన బలం తక్కువగా ఉందని, మన పార్టీ నేతలను గాలం వేసి లాక్కుంటున్నారు. వైరా ఎమ్మెల్యే మదన్‌లాల్‌ను టీఆర్ఎస్ అలాగే లాక్కుంది. పార్టీ నుంచి వెళ్లే నాయకులకు ఒక్కటే చెబుతున్నా. నాలుగేళ్ల తర్వాత టీఆర్ఎస్ కొట్టుకుపోతే ఎటు పోవాలో నేతలు గుండెల మీద చేయివేసి తేల్చుకోవాలి. ఖలేజా, విశ్వసనీయత ఉంటే ప్రజలే ఆశీర్వదిస్తారు.. నాయకుడు ఎదగాలన్నా, పార్టీ అధికారంలోకి రావాలన్నా ప్రజలు మనవైపు ఉన్నారా.. లేరా? అన్నదే ముఖ్యం. నాలుగేళ్ల కిందటే సోనియాను వ్యతిరేకించి కాంగ్రెస్ నుంచి బయటికొచ్చిన సమయంలో నేను, అమ్మ విజయమ్మ మాత్రమే ఉన్నాం. మా వెంట ఎంపీ, ఎమ్మెల్యేలు ఎవరూ లేరు. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ప్రజలు, దేవుడే మమ్మల్ని నడిపించారు. మనలో ఖలేజా, విశ్వసనీయత ఉంటే ప్రజలు, దేవుడు ఆశీర్వదిస్తారు. మనం సినిమాకు వెళ్తే అందులో 14వ రీల్ వరకు హీరోను విలన్లు అన్ని రకాల ఇబ్బందులు పెడతారు. 14వ రీల్ దాకా విలన్ విజయం సాధించినా, 15వ రీల్లో హీరో ఒక్కడే అడ్డంగా కథ మార్చేస్తారు. దమ్మూ, ధైర్యం ఉంటే మనమూ అది సాధించవచ్చు. సంక్షేమ పథకాలను కత్తిరిస్తున్నాయి.. తెలంగాణ, ఏపీలో టీఆర్ఎస్, టీడీపీ ప్రభుత్వాలు బడ్జెట్ కత్తిరింపుల పేరుతో పింఛన్లు, ఇళ్లు, ఫీజులకు కోత పెట్టే ఆలోచనలు చేస్తున్నాయి. కానీ వైఎస్ హయాంలో ప్రతి పేదవానికీ, ఇంటింటికీ సేవ చేశారు. ఆయన వారసత్వాన్ని అందిపుచ్చుకున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ.. సువర్ణపాలన వైపు అడుగులు వేయిస్తుంది. రాష్ట్ర ఖజానాలో డబ్బు ఎంతున్నది లెక్కచేయకుండా సంక్షేమ ఫలాలను అమలు చేద్దాం. పార్టీ జెండా రెపరెపలాడించేందుకు గ్రామస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయాలి. జనంలోకి షర్మిల... వైఎస్ మరణాన్ని తట్టుకోలేక చనిపోయిన కుటుంబాలను పరామర్శిస్తానని మాటిచ్చా. ఆ మాటే నన్ను చాలా మార్చింది. ఎవరూ వెళ్లని గ్రామాలు, తిరగని పూరి గుడిసెలు తిరిగా, పేదల కష్టనష్టాలు తెలుసుకుంటే బుర్రలో ఆలోచనలు రావడం ఖాయం. మంచి నాయకుడు కావడం ఖాయం. ఖమ్మంలో ఓదార్పు పూర్తి చేసినా మిగతా జిల్లాల్లో వీలుకాలేదు. ఐదేళ్ల తర్వాత ఇప్పుడు ఓదార్పు అంటే బాగుండదు కనుక.. పరామర్శ పేరుతో నా సోదరి షర్మిల ఆ కుటుంబాలను కలుస్తారు. వారు ఎలా జీవిస్తున్నారో తెలుసుకునే బాధ్యతను షర్మిలపై పెడుతున్నా. వారికి తోడుగా, వారి బతుకులు మార్చే కార్యక్రమాన్ని చూసుకోవాలి. రానున్న రోజుల్లోనూ షర్మిల పార్టీ కార్యకర్తలకు పూర్తిగా అందుబాటులో ఉంటుంది. వేరే ఏవైనా సమస్యలు ఉంటే నేనొస్తా.. ధర్నాకు దిగుతా. మీకు అండగా ఉంటా’’ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీర్మానాలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ సర్వ సభ్య సమావేశంలో పలువురు నేతలు తీర్మానాలు చేశారు. మొదటగా ఇటీవల మరణించిన పార్టీ సీనియర్ నేతలు శోభానాగిరెడ్డి, వడ్డేపల్లి నర్సింగరావు సహా పలువురు నేతలకు సంతాపం తెలుపుతూ తీర్మానాలు చేశారు. అనంతరం మరికొన్ని తీర్మానాలను పార్టీ నేతలు కె.శివకుమార్, జనక్‌ప్రసాద్, ఎ.విజయకుమార్, జి.నాగిరెడ్డి, బి.రవీందర్, సత్యం శ్రీరంగం, ఎం.జయరాజు చదివి వినిపించారు. తీర్మానాలు ఇవీ.. దుమ్ముగూడెం-నాగార్జునసాగర్ టెయిల్ పాండ్ ప్రాజెక్టు, ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలి 24 గంటల విద్యుత్ అమలు జాబితాలో తెలంగాణ రాష్ట్రాన్ని చేర్చాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇచ్చిన మాదిరే తెలంగాణకు ప్రత్యేక హోదా ఇవ్వాలి గిరిజనులకు పోడు భూములకు సంబంధించిన పట్టాలు వెంటనే ఇవ్వాలి అర్హులైన పేద విద్యార్థులందరికీ ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను అమలు చేయాలి ఎన్టీపీసీ ద్వారా 4 వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తిని వెంటనే ప్రారంభించాలి రైతు రుణమాఫీని తక్షణమే అమలు చేయాలి రూ.5 కోట్ల వరకు ఎలాంటి పూచీకత్తు లేకుండా రుణం అందించి దళితులను పారిశ్రామిక వేత్తలుగా చేయాలి దళితులకు ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ను అమలు చేయాలి కరెంట్ కోతల వల్ల జరుగుతున్న రైతుల ఆత్మహత్యల నిరోధానికి కేంద్రం యుద్ధ ప్రాతిపదికన రాష్ట్రానికి విద్యుత్‌ను ఇచ్చి ఆదుకోవాలి -
ఆదివాసీలకు అండ
కొమురం భీం వర్ధంతి సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ * జోడేఘాట్‌లో గిరిజన పోరాట యోధుడికి ఘన నివాళి * గోండు గూడేల్లో అంటువ్యాధుల అడ్డుకట్టకు చర్యలు * కార్పొరేట్ ఆసుపత్రుల ద్వారా అవగాహన కార్యక్రమాలు * గ్రామ పంచాయతీలు, స్థానిక సంస్థలకు ప్రత్యేక అధికారాలు * కొమురం భీం పేరుతో కొత్త జిల్లా, 25 కోట్లతో స్మారక వనం * బంజారాహిల్స్‌లో ఆదివాసీ భవన్, బంజారా భవన్ * ఆదివాసీల చెంతకు ఆధునిక వ్యవసాయ పద్ధతులు * భీం వారసులకు ప్రభుత్వ ఉద్యోగాలు, 10 లక్షల ఆర్థిక సాయం కొమురం భీం కీర్తి అంతర్జాతీయ స్థాయికి చేరేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. తెలంగాణ కాశ్మీరం వంటి జోడేఘాట్‌ను పర్యాటక సిటీగా మారుస్తాం. రూ. 25 కోట్లతో జోడేఘాట్ చుట్టూ ఉన్న వంద ఎకరాల్లో భీం స్మారక వనం నిర్మిస్తాం. - కేసీఆర్ జోడేఘాట్ నుంచి సాక్షి ప్రతినిధి: గిరిజన గూడేల్లో అంటువ్యాధులను అరికట్టడానికి తగిన చర్యలు తీసుకుంటామని, ఆరోగ్య పరిరక్షణపై ఆదివాసీలకు హైదరాబాద్‌లోని కార్పొరేట్ ఆసుపత్రుల ద్వారా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. అడవి బిడ్డల్లో చైతన్యం కలిగించడం ద్వారా అకాల మరణాలను అరికట్టవచ్చునని పేర్కొన్నారు. కొమురం భీం 74వ వర్ధంతిని పురస్కరించుకుని బుధవారం ఆదిలాబాద్ జిల్లా కెరమెరి మండలంలోని మారుమూల అటవీ ప్రాంతమైన జోడేఘాట్‌కు వచ్చిన కేసీఆర్.. ఆదివాసీ పోరాట యోధుడికి ఘన నివాళులర్పించారు. భీం సమాధి వద్ద ఆదివాసీ సంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహించారు. ఇక్కడ కొత్తగా ఏర్పాటు చేసిన కొమురం భీం విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆ యోధుడి మనుమడు సొనేరావు ప్రారంభించిన గిరిజన దర్బార్‌లో సీఎం పాల్గొన్నారు. ఆదివాసీ, గిరిజన సంఘాల నేతల నుంచి వినతిపత్రాలు స్వీకరించారు. ఈ సందర్భంగా వేలాదిగా తరలివచ్చిన ఆదివాసీలను ఉద్దేశించి కేసీఆర్ ప్రసంగించారు. ‘సందీర్కు రాం..రాం.. మావనాటే.. మావరాజ్ (అందరికీ నమస్కారం, మా ఊరు.. మా రాజ్యం..)’ అంటూ గోండు భాషలో ప్రసంగాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి.. ఆదివాసీల ఆరోగ్యస్థితిని మెరుగుపరిచేందుకు అంటువ్యాధులపై దాడులు చేస్తామని ప్రకటించారు. ‘రాష్ట్రవ్యాప్తంగా 500 కళాజాత బృందాలను నియమించి ఆరోగ్య సూత్రాలపై చైతన్యం నింపుతాం. గోండు భాషలోనే ఈ బృందాలు చైతన్యపరుస్తాయి. గోండు గూడేల్లో అంటువ్యాధులను అరికట్టేందుకు గ్రామ పంచాయతీలు, స్థానిక సంస్థలకు ప్రత్యేక అధికారాలు కల్పిస్తాం’ అని సీఎం కేసీఆర్ తెలిపారు. గిరిజన మరణాల విషయంలో నాయకుల తీరు.. దున్నపోతు ఈనిందంటే దూడను కట్టేయమన్నట్లుగా తయారైందని ఎద్దేవా చేశారు. మరణాలకు అసలు కారణాలను కనుగొని చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. తెలంగాణ కాశ్మీరం జోడేఘాట్ జోడేఘాట్‌ను తెలంగాణ కాశ్మీరంగా అభివర్ణించిన కేసీఆర్.. ఈ ప్రాంతాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. ‘కొమురం భీం కీర్తి అంతర్జాతీయ స్థాయికి చేరేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. తెలంగాణ కాశ్మీరం వంటి జోడేఘాట్‌ను పర్యాటక సిటీగా మారుస్తాం. రూ. 25 కోట్లతో జోడేఘాట్ చుట్టూ ఉన్న వంద ఎకరాల్లో భీం స్మారక వనం నిర్మిస్తాం. ప్రత్యేక ఆర్కిటెక్చర్లతో స్మృతి చిహ్నం ఏర్పాటు చేస్తాం. ఆదివాసీల విద్యాభివృద్ధి కోసం గిరిజన విశ్వ విద్యాలయం మంజూరు చేస్తాం’ అని కేసీఆర్ వరాల జల్లు కురిపించారు. కొత్తగా ఏర్పాటు చేయనున్న జిల్లాకు కొమురం భీం పేరు పెడతామని ప్రకటించారు. ఆధునిక వ్యవసాయ పద్ధతులపై ఆదివాసీలకు అవగాహన కల్పిస్తామని చెప్పారు. అలాగే హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ ప్రాంతంలో ఆదివాసీ, బంజారా భవన్లను నిర్మిస్తామని కూడా తెలిపారు. వాటర్ గ్రిడ్ ద్వారా సురక్షిత నీరు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వాటర్‌గ్రిడ్ పథకం ద్వారా ప్రతి గోండు గూడేనికి తాగునీటి వసతి కల్పిస్తామని ముఖ్యమంత్రి చెప్పారు. ప్రతి ఆదివాసీకి సురక్షిత నీరు అందేలా ప్రతి ఇంటికీ నల్లాను బిగిస్తామన్నారు. ఏజెన్సీ ఏరియా అభివద్ధికి ఐటీడీఏ, జిల్లా అధికార యంత్రాంగంతో చర్చించి ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తామన్నారు. కొద్ది రోజుల్లోనే తిరిగి జిల్లాలో పర్యటిస్తానని హామీ ఇచ్చారు. ఆదిలాబాద్ జిల్లా సాగు, తాగు నీటి అవసరాలు తీరాకే ‘ప్రాణహిత-చేవెళ్ల’ ప్రాజెక్టు నీటిని ఇతర జిల్లాలకు తరలిస్తామన్నారు. కొమురం భీం కుటుంబానికి రూ. 10 లక్షల ఆర్థిక సహాయంతోపాటు, సోనేరావు కుమారుడు, కుమార్తెకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వనున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. ఈ గిరిజన దర్భార్‌లో రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి జోగు రామన్న, సీఎం ఓఎస్డీ, కవి, గాయకుడు దేశపతి శ్రీనివాస్, స్థానిక ఎమ్మెల్యే కోవ లక్ష్మి కూడా ప్రసంగించారు. ఎంపీలు గొడం నగేష్, సీతారాంనాయక్, జిల్లా కలెక్టర్ ఎం.జగన్మోహన్, ఐటీడీఏ ఇన్చార్జి పీవో ప్రశాంత్‌పాటిల్, జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇందులో పాల్గొన్నారు. ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని అధికారికంగా నిర్వహించడం, తొలిసారిగా ముఖ్యమంత్రి రావడంపై ఆదివాసీల్లో హర్షం వ్యక్తమైంది. ఇక మావోయిస్టుల అత్యంత ప్రాబల్య ప్రాంతమైన జోడేఘాట్‌లో ముఖ్యమంత్రి పర్యటన ప్రశాంతంగా ముగియడంపై జిల్లా అధికార, పోలీసు యంత్రాంగం ఊపిరిపీల్చుకుంది. -
ఆదిలాబాద్‌ను తెలంగాణా కాశ్మీర్‌గా చేస్తాం
-
భీమ్..సలామ్
నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా సమరభేరి మోగించిన ధైర్యశాలి కొమురం భీమ్. నిరక్షరాస్యుడు అయినా నిజాం అరాచకాలు, పోకడలను గ్రహించి ఆగ్రహించిన మేధాశాలి. అడుగడుగునా గిరిజనులకు జరుగుతున్న అన్యాయాలను గుర్తించాడు. జల్.. జంగల్.. జమీన్.. (నీరు, అడవి, భూమి)పై హక్కుల కోసం పోరాటం చేశాడు. తానొక్కడే కాక దట్టమైన అడవిలో సొంత దళాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. గిరిజనులను ఏకం చేశాడు. ఆయుధాలు సమకూర్చుకుని గెరిల్లా దాడులతో పోరాటం చేశాడు. చివరకు కెరమెరి మండలం జోడేఘాట్ గుట్టల్లో నిజాం సర్కారు తుపాకీ తూటాలకు నేలకొరిగాడు. అయినా ఇప్పటికీ గిరిజనుల గుండెల్లో కొలువై ఉన్నాడు. వారి ఆరాధ్య దైవమయ్యాడు. నేడు కొమురం భీమ్ వర్ధంతి సందర్భంగా ప్రత్యేక కథనం. చిన్నతనం నుంచే తిరుగుబాటు భీమ్ స్వగ్రామం ఆసిఫాబాద్ మండలం సంకెపల్లి. తన చిన్నతనంలో భీమ్ సోదరులు అటవీ శాఖ సిబ్బందితో పడుతున్న గొడవలకు కారణాలను తెలుసుకున్నాడు. ఇదే క్రమంలో అక్కడి సమకాలీక సమస్యలు, కారణాలపై అవగాహన పెంపొందించుకున్నాడు. భీమ్ మరణించే నాటికి ఉన్న తీరును బట్టి 1910-15 మధ్య జన్మించి ఉంటాడని ఆయన బంధువులు పేర్కొంటున్నారు. శతాబ్దాలుగా తాము అనుభవిస్తున్న కష్టాలను, అటవీ, సహజ సంపదలపై నిజాం సర్కారు పన్నులు వసూలు చేయడం, ఈ నెపంతో చౌకీదార్లు, పట్వారీలు గోండు గూడాలను దోచుకోవడం, మహిళలతో అసభ్యకరంగా ప్రవర్తించడం భీమ్‌ను బాగా కలచివేశాయి. దీంతో ఆయన స్థానికంగా ఉన్న జమీందార్లు, చౌకీదార్లపై నిజాం ప్రభుత్వానికి ఫిర్యాదు చేయడానికి హైదరాబాద్ వెళ్లాడు. కానీ నిజాం ప్రభువు భీమ్‌ను కలవకపోవడంతో నిరాశకు గురయ్యాడు. అన్యాయాలపై పోరాడేందుకు నిశ్చయించుకున్నాడు. గెరిల్లా సైన్యం ఏర్పాటు జల్.. జంగల్.. జమీన్.. హక్కుల కోసం పోరాడటానికి ఒక్కొక్క కుటుంబం నుంచి ఒక్కొక్క గిరిజన యువకుడుని చేరదీసి సైన్యం ఏర్పాటు చేశాడు. వెదురు కొట్టడం, విల్లంబులు, బాణాలు తయారు చేయడం వారికి నేర్పించాడు. ఉచ్చులు పెట్టడం, గెరిల్లా దాడులపై శిక్షణ ఇచ్చాడు. అంతే కాకుండా బర్మారా(ఒక రకమైన నాటు తుపాకులు) ఇంటికొకటి ఉండాలని చెప్పేవాడు. గెరిల్లా దాడులకు కత్తులు, గొడ్డల్లను ఉపయోగించేవారు. కొమురం సూరుఅనే వ్యక్తి భీమ్‌కు ప్రధాన కార్యదర్శిగా వ్యవహరించేవాడని చరిత్రకారులు చెప్తున్నారు. అరక (నాగలి), పొరక, మేకలు, కంచె, మంచెలపై నిజాం ప్రభుత్వం తరఫున పట్వారీలు, చౌకీదార్లు పట్టీలు (పన్నులు) వసూలు చేయడాన్ని వ్యతిరేకిస్తూ వారిపై కొమురం భీమ్ దళం దాడులు చేసేవారు. మడావి కొద్దు సమాచారంతో..అశ్వీయుజ మాసం శుద్ధ పౌర్ణమి రోజున(1-09-1940) కొమురం భీమ్ సైన్యంలో పనిచేసే మడావి కొద్దు అనే వ్యక్తి ఇచ్చిన సమాచారంతో నిజాం సైన్యం ఆయనను కెరమెరి గుట్టల్లోని జోడేఘాట్ వద్ద తుపాకులతో భీమ్‌ను కాల్చి చంపింది. అంతకుముందే భీమ్ పోరాటాన్ని అణచివేయడానికి నిజాం ప్రభుత్వం, అటవీ, రెవెన్యూ శాఖల అధికారుల సహకారంతో పెద్ద ఎత్తున సైనికులను మోహరించి భీమ్ సైన్యం కోసం గాలింపులు చేపట్టింది. భీమ్ నిజాం సైన్యం కాల్పుల్లో మరణించడంతో ఆయన అనుచరులు చెల్లాచెదురయ్యారు. అనంతరం తెలంగాణ సాయుధ పోరాటంలో భాగంగా గోపాల్‌రావు దళం చేతిలో మడావి కొద్దు చనిపోయినట్లు చె ప్తుంటారు. ఆనాడు జల్.. జంగల్.. జమీ న్.. కోసం కొమురం భీమ్ రగిలించిన పోరాట స్పూర్తి గిరిజనుల్లో ఇంకా రగులుతూనే ఉంది. మూడు దశాబ్దాలుగా ఏటా అశ్వీయుజ శుద్ధ పౌర్ణమి రోజునే భీమ్ వర్ధంతి ఘనంగా నిర్వహిస్తారు. కేసులు నమోదు గిరిజన మహిళలపై దౌర్జన్యాలకు పాల్పడే పట్టేదారులపై భీమ్ దాడులు చేసేవాడు. సిద్ధిక్ అనే ఆసిఫాబాద్ పట్టేదారును హతమార్చాడు. దీంతో నిజాం ప్రభుత్వం కొమురం భీమ్‌పై కేసులు నమోదు చేసింది. గిరిరత్న అవార్డు గిరిజన హక్కుల కోసం భీమ్ చేసిన ఏళ్లనాటి పోరాట ఫలితంగా మూడేళ్ల క్రితం ప్రపంచ ఆదివాసీ దినోత్సవం రోజున ప్రభుత్వం భీమ్‌కు గిరిరత్న అవార్డు ప్రదానం చేసింది. విజయనగరం జిల్లా పార్వతీపురంలో అప్పటి రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ, స్పీకర్ నాదెండ్ల మనోహర్ చేతుల మీదుగా అక్కడి ఐటీడీఏలో ఏపీవోగా పనిచేసే జిల్లాకు చెందిన వసంతరావు అవార్డును అందుకున్నారు. దీంతో పాటు హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్‌పై భీమ్ విగ్రహాన్ని ఏర్పాటు చే యడం జిల్లాకే అరుదైన గౌరవం దక్కింది. -
భీమ్ ఆశయాలు నెరవేర్చుతాం..
కెరమెరి : కొమురం భీమ్ ఆశయాలను తప్పకుండా నెరవేర్చుతామని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి జోగు రామన్న అన్నారు. మంగళవారం మండలంలోని జోడేఘాట్‌లో భీమ్ వర్ధంతి సభా ఏర్పాట్లను పరిశీలించారు. హెలిప్యాడ్ స్థలాన్ని చూశారు. వివిధ రకాల స్టాల్స్ ఏర్పాటు చేసే స్థలం, మ్యూజియం, భీమ్ విగ్రహం, బొటానికల్ పార్కు, భీమ్ స్మారక చిహ్నం, తదితరాలను పరిశీలించారు. మెదటిసారిగా సీఎం కేసీఆర్ వస్తున్నారని.. ఎలాంటి ఆటుపోట్లు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎందరో నాయకులు వచ్చి పోయినా భీమ్ ఆశయాలు నెరవేరలేదన్నారు. ఆదివాసీల బాధలు తెలుసుకునేందుకు, వివిధ రకాల సంక్షేమ ఫలాలు అందించేందుకు సీఎం కేసీఆర్ వస్తున్నారని తెలిపారు. దైవసన్నిధి అయిన భీమ్ వర్ధంతికి రావడం అందరి అదృష్టమన్నారు. ఈ సందర్భంగా హట్టి బేస్ క్యాంప్‌లో భీమ్ వర్ధంతి, గిరిజన దర్బార్ పోస్టర్ విడుదల చేశారు. ఎంపీ నగేష్ మాట్లాడుతూ.. విద్య, వైద్యం, ఉద్యోగ, ఉపాధి తదితర రంగాలతోపాటు అన్నింటా ఆదివాసీలు వెనుకబడి ఉన్నారని అన్నారు. సీఎం కేసీఆర్‌తోనే అందరి అభివృద్ధి సాధ్యమన్నారు. సీఎం కోసం భారీ పోలీసు బందోబస్తు నిర్వహిస్తున్నట్లు ఎస్పీ గజరావు భూపాల్ తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు కోవ లక్ష్మి, ఇంద్రకరణ్‌రెడ్డి, రాథోడ్ బాపూరావ్, డీఎస్పీ సురేశ్‌బాబు, మంచిర్యాల, ఆదిలాబాద్, ఉట్నూర్ ఆర్డీవోలు ఆయేశా నమ్రతా, సుధాకర్‌రెడ్డి, రామచంద్రయ్య తదితర శాఖలకు చెందిన అధికారులున్నారు. -
కేసీఆర్ తొలిసారి జిల్లాలో పర్యటన
సీఎం హోదాలో కేసీఆర్ తొలిసారి జిల్లాలో పర్యటన సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : గిరిజన మరణాలు.. అన్నదాతల ఆత్మహత్యలు.. విద్యుత్ కోతలు.. కళ్ల ఎదుటే ఎండిపోతున్న పంటలు.. పంట రుణాల మంజూరులో బ్యాంకర్ల నిర్లక్ష్యం.. పడకేసిన ప్రభుత్వ వైద్యం.. ప్రభుత్వ కార్యాలయాల్లో వెక్కిరిస్తున్న ఖాళీలు.. వెరసి జిల్లా వాసులు కష్టాల కడలిని ఈదుతున్నారు. ముఖ్యమంత్రి హోదాలో తొలిసారిగా జిల్లాకు వస్తున్న కె.చంద్రశేఖర్‌రావుకు జిల్లాలోని ప్రధాన సమస్యలు స్వాగతం పలుకుతున్నాయి. ఆదివాసీల హక్కుల కోసం నిజాంపై అలుపెరుగని పోరు సాగించిన కొమురం భీమ్‌కు నివాళి అర్పించేందుకు సీఎం బుధవారం కెరమెరి మండలం జోడేఘాట్‌కు వస్తున్నారు. కేసీఆర్ పర్యటనకు జిల్లా అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లూ పూర్తి చేసింది. మరోవైపు తమ అధినేతకు ఘన స్వాగతం పలికేందుకు టీఆర్ఎస్ శ్రేణులు కూడా సిద్ధమయ్యాయి. ఏటా భీమ్‌కు నివాళులర్పించే కార్యక్రమం మొక్కుబడిగా జరిగేది. కేవలం హట్టిలోనే ఈ కార్యక్రమాన్ని ముగించేవారు. కానీ.. ఈసారి ఏకంగా సీఎం జోడేఘాట్‌కు వస్తుండటంతో ఆదివాసీల్లో హర్షం వ్యక్తమవుతోంది. అయితే.. ముఖ్యమంత్రి పర్యటనపై జిల్లా వాసులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఇప్పటికే గిరిజన యూనివర్సిటీని ఏర్పాటు చేస్తామని ప్రకటించిన కేసీఆర్ ఆదివాసీల అభ్యున్నతికి వరాల జల్లు కురిపిస్తారని ఆశాభావంతో ఉన్నారు. జిల్లా వాసులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను పరిశీలిస్తే.. జమీన్.. పాలకుల నిర్లక్ష్యం కారణంగా 1/70 భూ బదలాయింపు చట్టం జిల్లాలో సరిగ్గా అమలుకు నోచుకోవడం లేదు. దీంతో ఏజెన్సీ ఏరియాలో గిరిజనుల భూములు అక్రమార్కుల కబంధ హస్తాల్లో చిక్కుకున్నాయి. ఈ చట్టాన్ని తుంగలో తొక్కి బడాబాబులు బినామీ పేర్లతో ఆదివాసీ భూములను అనుభవిస్తున్నారు. ఉట్నూర్ ఏజెన్సీలో సుమారు 7,800 ఎకరాల గిరిజనుల భూములకు సంబంధించిన ఎల్టీఆర్ కేసులు ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్ విచారణలో ఉన్నాయంటే, ఆదివాసీల భూములు ఏ స్థాయిలో అక్రమార్కుల పరమయ్యాయో అర్థం చేసుకోవచ్చు. మహారాష్ట్ర నుంచి ఇక్కడకు వలస వచ్చి గిరిజనులుగా చెలామణి అవుతూ తమ సంక్షేమ పథకాలతో లబ్ధిపొందుతున్నారని ఆదివాసీ సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. అటవీ భూములను సాగు చేసుకుంటున్న గిరిజనులకు 2005 అటవీ హక్కుల చట్టం కింద హక్కు పత్రాలు కల్పించారు. ఇందులో కూడా సుమారు 250 ఎకరాలు అటవీ భూములను బినామీ పేర్లతో గిరిజనేతరులు అనుభవిస్తున్నారని ఆదివాసీ సంఘాలు ఆరోపిస్తున్నాయి. జంగల్.. : అడవినే నమ్ముకుని జీవనం కొసాగిస్తున్న ఆదివాసీల జీవనోపాధిని సర్కారు గాలికొదిలేసింది. గిరిజనులు అడవిలో సేకరించే తేనె, ఇప్పపువ్వు, బం క, పలుకులు వంటి ఉత్పత్తులను కొనుగోలు చేయడంలో జీసీసీ (గిరిజన కోఆపరేటివ్ సొసైటీ) చేతులెత్తేసింది. దీంతో గిరిజనులు దళారులకు విక్రయించాల్సి వస్తోంది. అలాగే ఏజెన్సీలో అ క్రమ మైనింగ్ యథేచ్ఛగా కొనసాగుతోంది. లాట రైట్, లైమ్‌స్టోన్ వంటి సహజ వనరుల దోపిడీకి పాల్పడుతున్నారు. జల్.. : ఆదివాసీలు ఇప్పటికీ సురక్షిత మంచినీటికి నోచుకోవడం లేదు. తాగునీటి కోసం ప్రభుత్వాలు ఏటా రూ.కోట్లలో నిధులు ఖర్చు చేస్తున్నప్పటికీ గిరిజనులకు మాత్రం గుక్కెడు తాగునీరు ఇవ్వలేకపోతోంది. ఏజెన్సీలో సుమారు 100కు పైగా గ్రామ పంచాయతీల పరిధిలో ఉన్న గిరిజన గూడేలాల వాసులు తాగునీటి అవసరాల కోసం ఇప్పటికీ వాగులు, చెలిమెలనే ఆశ్రయించాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ కలుషిత నీటిని సేవించడంతో డయేరియా, అతిసార వంటి రోగాల బారిన పడి గిరిజన గూడాలు మంచం పడుతున్నాయి. ఇలా జ్వరాల బారిన పడిన గిరిజనులకు సరైన వైద్య సేవలు అందించడంలో కూడా సర్కారు విఫలమవుతోంది. దీంతో అమాయక ఆదివాసీలు మరణాల పాలవుతున్నారు. ఈ జూన్ నుంచి ఇప్పటివరకు నాలుగు నెలల కాలంలో సుమారు 103 మంది గిరిజనులు జ్వరాల బారిన పడి మరణించినట్లు అనధికారిక అంచనా. సాగునీటి విషయంలోనూ ఆదివాసీలకు అన్యాయమే జరుగుతోందని ఆ సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. విద్యుత్ కోతలు.. జిల్లా వాసులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను పరిశీలిస్తే.. ఖరీఫ్ ఆరంభంలో వర్షాభావ పరిస్థితులు దెబ్బతీస్తే.. పంటలు చేతికందే సమయంలో కరెంట్ కోతలు అన్నదాతలను నిండా ముంచుతున్నాయి. కనీసం నాలుగు గంటలు కూడా వ్యవసాయానికి విద్యుత్ సక్రమంగా సరఫరా కావడం లేదు. దీంతో కళ్ల ముందే పంటలు ఎండిపోయి రైతులు ఆందోళన బాట పట్టారు. సబ్స్టేషన్లను ముట్టడిస్తున్నారు. వరి, సోయా, పత్తి వంటి పంటలు పక్షం రోజుల్లో చేతికందుతాయి. ఈ తరుణంలో కోతలు అన్నదాతలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. వెక్కిరిస్తున్న ఖాళీలు.. జిల్లాలో దాదాపు అన్ని ప్రభుత్వ శాఖల్లో కీలక పో స్టుల ఖాళీలు ఉన్నాయి. వివిధ పనుల కోసం ఆయా కార్యాలయాలకు వెళుతున్న జిల్లా వాసులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం జాయింట్ కలెక్టర్‌తో పాటు, ఐటిడీఏ పీఓ వంటి ఉన్నతాధికారులతో పాటు, క్షేత్ర స్థాయిలో పనిచేసే అధికారుల పోస్టులు గత కొన్ని నెలలుగా భర్తీకి నోచుకోవడం లేదు. వైద్య ఆరోగ్య శాఖలో సుమారు 40కిపైగా వైద్యాధికారుల పోస్టులు ఖాళీగా ఉండటంతో క్షేత్ర స్థాయిలో వైద్యం అందడం ఇబ్బందిగా మారింది. అరకొరగా పంట రుణం.. రుణమాఫీ చేసి తీరుతున్నామని ప్రభుత్వం ప్రకటిస్తున్నా బ్యాంకర్లు మాత్రం అన్నదాతలకు పంట రుణాలు మంజూరు చేయడం లేదు. మాఫీ అయిన రుణాల్లో 25 శాతం మొత్తాన్ని ప్రభుత్వం బ్యాంకులకు విడుదల చేసినా.. బ్యాంకర్లు మాత్రం కేవలం గతేడాది ఇచ్చిన రుణంలో 25 శాతం మొత్తాన్ని మాత్రమే రుణంగా ఇస్తున్నారు. ఖరీఫ్ సీజను ముగిసినా నిర్దేశిత లక్ష్యంలో పది శాతం రైతులకు కూడా రుణాలివ్వలేదు. ఆత్మహత్యలు.. ఖరీఫ్ ఆరంభంలో తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా పంటలు ఎండిపోయాయి. రెండు, మూడు పర్యాయాలు విత్తనాలు వేసుకున్నా ప్రయోజనం లేకుండా పోయింది. దీనికి తోడు అప్పుల భారం పెరిగిపోవడంతో మనస్థాపానికి గురైన అన్నదాతలు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. గత నాలుగు నెలల్లో సుమారు 38 మంది రైతులు ఆత్మహత్యకు పాల్పడినట్లు అనధికారిక అంచనా. ప్రాజెక్టుల్లో నీళ్లున్నా.. జిల్లాలో జలయజ్ఞంలో భాగంగా నిర్మించిన ఎల్లంపల్లి, గొల్లవాగు వంటి ప్రాజెక్టుల్లో నీళ్లున్నా ఆ నీటిని ఆయకట్టుకు అందించలేని పరిస్థితి నెలకొంది. ఈ ప్రాజెక్టుల పనులు 90 శాతానికి పైగా పూర్తికాగా, మిగిలిన పది శాతం పనులు పూర్తి చేయక ఆయకట్టుకు నీరందడం లేదు. పెన్‌గంగా ప్రాజెక్టు నిర్మాణం విషయంలోనూ ఆయకట్టు రైతులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. -
బాలీవుడ్లో ‘కొమరమ్ భీమ్’
‘‘తెలంగాణ గడ్డపై ఆదివాసీల హక్కుల కోసం పోరాటం సాగించిన యోధుడు ‘కొమరమ్ భీమ్’. ఆయన చరిత్రను 1990లోనే సినిమాగా మలిచాను. రెండు దశాబ్దాల తర్వాత ఆలస్యంగా విడుదలైనా ఆ సినిమా ఘనవిజయం సాధించి, రాష్ట్ర, జాతీయ పురస్కారాలు అందించింది. ఒక తెలంగాణ వ్యక్తిగా కొమరమ్ భీమ్ జీవితాన్ని దేశానికి తెలియజేయాల్సిన బాధ్యత నాపై ఉంది. అందుకే... ‘కొమరమ్ భీమ్’ కథ ఆధారంగా బాలీవుడ్లో ఓ చిత్రాన్ని నిర్మించనున్నా’’ అని దర్శక, నిర్మాత అల్లాణి శ్రీధర్ తెలిపారు. సోమవారం ఈ విషయమై మాట్లాడుతూ -‘‘కొమరమ్ భీమ్ గొప్పతనం మొన్నటివరకూ చాలామంది తెలంగాణ ప్రజలకు కూడా తెలీదు. నా సినిమాతో అది తేటతెల్లమైంది. ఎనిమిది కేంద్రాల్లో వందరోజులు ప్రదర్శితమైందీ సినిమా. ఆ తర్వాతే హైదరాబాద్‌లో ట్యాంక్‌బండ్‌పై కొమరమ్ భీమ్ విగ్రహం పెట్టారు. ఆదివాసీలకు సంబంధించి ఏ సమావేశం జరిగినా ‘కొమరమ్ భీమ్’ చిత్రాన్ని ప్రదర్శించడం ఓ ఆనవాయితీ అయ్యింది. 8వ తరగతి సాంఘిక శాస్త్రంలో ‘కొమరమ్ భీమ్’ చిత్రం పాఠ్యాంశమైంది. ఒక దర్శకునిగా ఇంతకంటే నాకేం కావాలి’’ అన్నారు. డా. దయాకిషన్ గోయల్ ఈ సినిమాకు స్క్రిప్ట్ అందించనున్నారనీ, స్వీయ దర్శకత్వంలో తానే నిర్మించనున్న ఈ సినిమాలో ‘కొమరమ్ భీమ్’ పాత్రకు గాను.. నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా నుంచి మంచి నటుణ్ణి ఎన్నుకోవడం జరుగుతుందని అల్లాణి తెలిపారు. -
సీఎం పర్యటన ఖరారు!
కెరమెరి : కొమురం భీమ్ ఆశీర్వాదంతో జోడేఘాట్ అభివృద్ధి చెందుతుందని కలెక్టర్ జగన్మోహన్ అభిప్రాయపడ్డారు. మంగళవారం కెరమెరి మండలంలోని హట్టి బేస్ క్యాంపులో కొమురం భీమ్ వర్ధంతిపై వివిధ శాఖల అధికారులతో ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈనెల 8న రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ భీమ్ వర్ధంతి కార్యక్రమానికి హాజరవుతున్నట్లు తెలిపారు. సోమవారం స్వయంగా కేసీఆర్ చెప్పారని, ఏర్పాట్లు చేయాలని సూచించినట్లు కలెక్టర్ అన్నారు. కాశ్మీర్ ఎలాంటి ప్రాంతమో.. తెలంగాణకు ఆదిలాబాద్ అలాంటి ప్రాంతమని అందుకు సీఎం జోడేఘాట్‌లో జరుగు కొమురం భీమ్ వర్ధంతికి వస్తున్నారన్నారు. ఇది చారిత్రాత్మక నిర్ణయమన్నారు. అధికారులు, నాయకులు సమష్టి కృషితోనే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయగలమని అన్నారు. జోడేఘాట్‌లో గిరిజన మ్యూజియం, ఉద్యానవన కేంద్రం, వన్యమృగ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలంటే తాగునీరు, రోడ్డు, రవాణా, పాఠశాలల ఏర్పాటు, వైద్య సదుపాయం కల్పిస్తామన్నారు. భీమ్ ఆత్మకు శాంతి కలగాలంటే అవసరాలన్ని తీర్చాలన్నారు. ఇదే చివరి సమీక్షా సమావేశమని వివధ శాఖలకు అప్పగించిన పనులను తప్పకుండా గడువులోపు పూర్తి చేయాలన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక ప్రప్రథమంగా మన జిల్లాకు, అమరుని గ్రామమైన జోడేఘాట్‌కు రావడం మనందరి అదృష్టమని ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి, బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావ్ అన్నారు. అందరికి విద్య అందేలా చర్యలు తీసుకోవాలి - గిరిజన నాయకుల డిమాండ్ అనేక ప్రాంతాల్లో గిరిజన ఆదివాసీలకు విద్య అందనంత దూరంలో ఉందని అందుకు అధికారులు విద్య, వైద్యం అందించేందుకు చర్యలు తీసుకోవాలని కొమురం భీమ్ ఉత్సవ కమిటీ చైర్మన్ కోవ దేవ్‌రావు, గిరిజన సంఘాల నాయకులు సిడాం అర్జు, పెందోర్ దత్తు, కనక యాదవరావులు అన్నారు. సీఎం కేసీఆర్ స్వయంగా భీం వర్దంతి కి రావడం గిరిజనుల అదృష్టమన్నారు. ఈ కార్యక్రమంలో ఐటీడీఏ ఇన్చార్జి పీవో ప్రశాంత్‌పాటిల్, ఏవో భీమ్, కాగజ్‌నగర్ డీఎస్పీ సురేశ్‌బాబు, జెడ్పీటీసీ అబ్దుల్‌కలాం, సర్పంచ్ భీంరావు, జొడేఘాట్ గ్రామ పటేల్ సోము విద్యుత్, ఆర్అండ్బీ, ఐకేపీ, ఏజీఎస్, ఐటీడీఏ ఈఈ, డీఈ, ఏఈ, ఐసీడీఎ ఆర్టీవో తదితర శాఖలకు చెందిన అధికారులున్నారు. -
ఆదిలాబాద్ లో విమానాశ్రయం: కేసీఆర్
హైదరాబాద్: కొమురం భీమ్ వర్థంతిని అక్టోబర్ 8న అధికారికంగా నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఉత్తరాఖండ్ లోని జిమ్ కార్బెట్ తరహాలో ఆదిలాబాద్ జిల్లాలోలోని కొమురం భీమ్ స్వస్థలం జోడేఘాట్ ను అభివృద్ధి చేస్తామని సీఎం కేసీఆర్ తెలిపారు. జోడేఘాట్ ను పర్యాటక కేంద్రంగా ఏర్పాటు చేస్తామని చెప్పారు. త్వరలోనే ఆదిలాబాద్ లో విమానాశ్రయం నిర్మిస్తామన్నారు. ఆదిలాబాద్ జిల్లాలో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటుచేయనున్నట్టు కేసీఆర్ వెల్లడించారు. -
ఆర్డినెన్స్‌ను అడ్డుకునేందుకు... కొమరం భీంలా పోరాడదాం
వేలేరుపాడు, న్యూస్‌లైన్: పోలవరం ముంపు ప్రాంతాలను ఆంధ్రప్రదేశ్‌లో విలీనం చేసేందుకు జారీ చేసిన ఆర్డినెన్స్‌ను అడ్డుకునేందుకు ఆదివాసీలంతా కొమరం భీం మాదిరిగా పోరాడాలని న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి పోటు రంగారావు పిలుపునిచ్చారు. ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా వేలేరుపాడు మండలంలోని మారుమూలనున్న కొయిదాలో అఖిలపక్షం ఆధ్వర్యంలో శనివారం జరిగిన పాదయాత్రలో ఆయన పాల్గొన్నారు. ఇక్కడ ఏర్పాటైన సభలో పోటు రంగారావు మాట్లాడుతూ.. ఆంధ్రాలోని బడా పారిశ్రామికవేత్తల స్వప్రయోజనాల కోసం ఇక్కడి ఆదివాసీలను ప్రధాని మోడీ, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నీట ముంచుతున్నారని ధ్వజమెత్తారు. విలీనంపై పార్లమెంటులో, అసెంబ్లీలో ఎలాంటి చర్చ జరపకపోవడం వెనుక ఏపీ పెద్దల కుట్ర ఉందన్నారు. ఆర్డినెన్స్ రద్దు చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా దశల వారీగా ఆందోళన చేపట్టనున్నట్టు చెప్పారు. జూన్ 2వ తేదీన ముంపు మండలాల్లో బ్లాక్ డే జరపనున్నట్టు చెప్పారు. 20 కిలోమీటర్లు సాగిన పాదయాత్ర కొయిదాలో శనివారం ప్రారంభమైన పాదయాత్ర రాత్రికి 20 కిలోమీటర్ల దూరంలోగల కన్నాయిగుట్టకు చేరింది. ఈ పాదయాత్రకు గిరిజన గ్రామాల్లో విశేష స్పందన లభించింది. మేడేపల్లి నుంచి మరో బృందం ప్రారంభించిన పాదయాత్ర మల్లారం వరకు సాగింది. ఈ పాదయాత్రలో న్యూడెమోక్రసీ నాయకులు ఎస్కె.గౌస్, గోకినేపల్లి వెంకటేశ్వరావు, సీపీఐ అశ్వారావుపేట నియోజకవర్గ కన్వీనర్ ఎండి.మునీర్, వైఎస్ఆర్ సీపీ మండల కన్వీనర్ కేసగాని శ్రీనివాస గౌడ్, వివిధ పార్టీల నాయకులు కారం దారయ్య, అమరవరపు అశోక్, ఎస్కె.నజీర్, వలపర్ల రాములు, గిల్లా వెంకటేశ్వర్లు, పూరెం లక్ష్మయ్య, గడ్డాల ముత్యాల్రావు తదితరులు పాల్గొన్నారు. -
చే గువేరా.. రావాలా?
నయా సీన్: ‘‘అదేంటిసార్... ఇలా చేశారు. పొద్దస్తమానం అటు చేగువేరానూ, ఇటు కొమరం భీమ్‌నూ తలచుకుని, తలచుకుని, కొమరం భీం పేరును కొందరే పేటెంటు చేసుకుని వాళ్ల టెంట్లో ఉంచుకున్నారని కుమిలి కుమిలి, మళ్లీ ఇలా వాళ్ల సిద్ధాంతాలకు పూర్తిగా వ్యతిరేకులైన బాబూ, మోడీలను సమర్థించారేంటిసార్?’’ ‘‘ఒరే బాలూ... నేను మొదట్నుంచీ ఇంతేరా! బాబూ, మోడీల రూటే. కాకపోతే వాళ్లు గడ్డం చేసుకోరూ, నేను చేసుకుంటానంతే తేడా!’’ ‘‘అదేంట్సార్... ఎక్కడైనా పవనం అంటే అది మొదట నైరుతీ నుంచి వీచాలి. ఆ తర్వాత ఈశాన్యం నుంచి వీచాలి. భారత్‌కు వర్షాలనిచ్చే మంచి పవనాలు అవే సార్. అలాంటిది మీరు వాయవ్యం నుంచి గుజరాత్ మీదుగా వీచాలంటున్నారు. మీకో విషయం తెలుసా? భారత్‌లో అలా వీచే పవనాలూ ఉన్నాయి. ఆ వాయవ్యపవనాలను ‘లూ’ అంటారు సార్. అవి వాయవ్య భారతదేశంలో వీస్తూ జనాలకంతా పరమ ఉబ్బరింత కలిగించే భరించలేనంత వేడి వేడి పవనాలు సార్. పోయి పోయి మీరూ జనాల్ని మతం పేరిట వందలాది మందిని ఊచకోత కోసిన భారత వాయవ్య గుజరాతీ పవనాన్నే ఆశ్రయించారు. ఆ పవన ధర్మం, మీ పేరిట ప్రవచించిన పవన ధర్మం ఒకేలా ఉన్నాయేంటి సార్?’’ ‘‘ఒరే బాలూ... నేనేమైనా పవనం ఎలా వీచాలంటూ ఓ పుస్తకం రాశానట్రా? గాలివాటుగా పోవడమే ‘పవన’ ధర్మం. కాబట్టి అలా చెప్పా. పవన ధర్మాలంటూ చెప్పి చిర్రాక్కు కిర్రాక్కు పుట్టించకు. ఎందుకంటే నాకు ధర్మాలు నచ్చవ్. నాకు నచ్చేదల్లా ‘ఇజం’ అంతే! ’’ ‘‘సరే... ధర్మం మాట వదిలేద్దాం. మరి ‘ఇజమ్’ అని పుస్తకం రాశారు కద సార్. అలా రాశాక ఇజమ్ పై అవగాహన ఉండాలి కదా. చేగువేరాకూ, బాబుకూ, మోడీకీ సాపత్యమేంట్సార్?’’ ‘‘చేగువేరాలాగే వాళ్లిద్దరికీ గడ్డం ఉంది చూడు. ఒకేలాంటి ఫ్యాషన్ అనుసరించడం కూడా ఒక ఇజమే కదరా బాలూ!’’ ‘‘ఇజానికి మీరిచ్చిన నిర్వచనం గమ్మత్తుగా ఉంది సార్. కానీ మీ సినిమా విలన్ సిద్ధప్పది చిత్తూరు కదా! అలాగే మీ రాజకీయాల్లోనూ చిత్తూరు బాస్‌ను చిత్తు చేస్తారనుకుంటే నెత్తినెక్కించుకున్నారు కదా సార్. అదేంటో మీరన్నీ ఎప్పుడూ పరస్పర విరుద్ధమైనవి చేస్తూ ఉంటా రు. అదేమిటంటే మీ తిక్కకో లెక్కుందంటారు’’ ‘‘రివర్సులో ఏం చేశాన్రా బాలూ?’’ ‘‘నిజాయితీపరులనే కావాలంటారు. కానీ ఏలేరు స్కాములూ, ఎయిర్‌పోర్టు, ఎమ్మార్‌లకు భూములూ ఉంటూ అవినీతికి పాల్పడ్డవారికి వత్తాసులిస్తారు. చేగువేరా, కొమురంభీమ్లంటారు. కానీ విప్లవమూర్తులుగా రగిలిపోయే వాళ్ల సిద్ధాంతాలకు పూర్తిగా విరుద్ధంగా వ్యవహరించే ఫాసిస్టులకు వెన్నుదన్నవుతారు. పార్టీ పెడతానంటారు. పోటీ పెట్టనంటారు. ఇవన్నీ చూస్తుంటే ఒకటనిపిస్తోంది సార్’’ ‘‘ఏవనిపిస్తోందిరా బాలూ?’’ ‘‘మీకు తిక్క ఉంది. కానీ మీ తిక్కకు లెక్కలేద్సార్! మీకోసం సాక్షాత్తూ ఇక చేగువేరాయే దిగిరావాల్సార్’’ ‘‘ఎందుకురా బాలూ... తన ఇజాన్ని నాకు అర్థమయ్యేలా బోధించడానికా?’’ ‘‘కాద్సార్. చేగువేరా డాక్టర్ కదా! మీ తిక్కకు వైద్యం చేయాలంటే డాక్టర్ అవసరం కదా. సాక్షాత్తూ చేగువేరాయే స్వయంగా వచ్చి వైద్యం చేస్తే పవన కళ్యాణం ఎలా ఉన్నా లోకకళ్యాణం మాత్రం ఖాయం సార్’’ ‘‘లాస్ట్ పంచ్ మనదైతే ఆ మజాయే వేరు. కానీ ఇక్కడది నీదయ్యిందేమిట్రా బాలూ!’’ -
భీమ్ విగ్రహ ధ్వంసానికి యత్నం
ఖానాపూర్, న్యూస్‌లైన్ : ఖానాపూర్ మండల కేంద్రంలోని జంగల్‌హన్మాన్ చౌరస్తాలో ఉన్న కొమురం భీమ్ విగ్రహాన్ని ధ్వంసం చేసేందుకు శుక్రవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు యత్నించారు. రాజ్‌గోండ్ సేవాసంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భీమ్ విగ్రహాన్ని ఆయన మనవడు సోనేరావు, ఎంపీ రాథోడ్ రమేశ్ 15 రోజుల క్రితం ఆవిష్కరించారు. ఈ విగ్రహం దిమ్మెకు ఉన్న శిలాఫలకాన్ని శుక్రవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు పగులగొట్టారు. విగ్రహాన్ని ధ్వంసం చేసేందుకు యత్నించారు. తలభాగం స్వల్పంగా దెబ్బతింది. శనివారం దీనిని నిరసిస్తూ స్థానిక రాజ్‌గోండ్ సేవా సంఘం నాయకులు విగ్రహం వద్ద బైఠాయించి ఆందోళనకు దిగారు. భీమ్ విగ్రహం ధ్వంసానికి యత్నించి, శిలాఫలకం పగులగొట్టిన నిందితులను పట్టుకుని కఠినంగా శిక్షించాలని, అప్పటివరకు ఆందోళన కొనసాగిస్తామని ఏఐకేఎంఎస్ జిల్లా అధ్యక్షుడు నంది రామయ్య డిమాండ్ చేశారు. ఈ సంఘటనను సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ తరఫున ఖండిస్తున్నామని పేర్కొన్నారు. ఈ విషయమై ఈ నెల 11న ఆందోళన చేపట్టనున్నట్లు తెలిపారు. విగ్రహాన్ని ఎస్సై రాము పరిశీలించారు. కార్యక్రమంలో రాజ్‌గోండ్ సేవాసంఘం అధ్యక్ష, కార్యదర్శులు అంకుశ్రావు, కుడిమెత మధు, నాయకులు కొమురం దేవరావు, లక్ష్మణ్, ఎల్లయ్య, శంకర్, బుక్య గోవింద్, మాలవత్ రోహిదాస్, మక్కల బీమన్న, గాండ్ల శ్రీనివాస్ పాల్గొన్నారు. -
ఘనంగా కొమురం భీమ్ వర్ధంతి
ఇంద్రవెల్లి, న్యూస్‌లైన్ : మండలంలోని కేస్లాపూర్ నాగోబా ఆలయ ప్రాంగణంలో ఉన్న కొమురం భీమ్ విగ్రహం మంగళవారం ఆయన వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. కేస్లాపూర్ కొమురం భీమ్ కమిటీ, సర్పంచ్ మెస్రం నాగ్నాథ్ ఆధ్వర్యంలో 73వ వర్ధంతి కార్యక్రమాన్ని మంగళవారం ఘనంగా జరుపుకున్నారు. ముందుగా గిరిజన సంప్రదాయం ప్రకారం ప్రత్యేక పూజలు చేశారు. ముఖ్య అతిథులుగా హాజరైన ఖానాపూర్ ఎమ్మెల్యే సుమన్ రాథోడ్, ఉట్నూర్ ఏఎస్పీ అంబర్‌కిశోర్‌ఝాలకు కేస్లాపూర్ గిరిజనులు ఘన స్వాగతం పలికారు. ముందుగా నాగోబా ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి, అనంతరం భీమ్ వర్ధంతి కార్యక్రమానికి హాజరయ్యారు. భీమ్ విగ్రహం వద్ద ప్రత్యేక పూజలు చేసి, పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం దర్బార్ హాలులో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే సుమన్ రాథోడ్ మాట్లాడుతూ, గిరిజన యువత ఐక్యంగా ఉండి కొమురం భీమ్ ఆశయ సాధనకు కృషి చేయూలన్నారు. కాగా, గిరిజన గ్రామాల అభివృద్ధికి సబ్‌ప్లాన్ నిధుల విడుదల కోసం ప్రయత్నిస్తున్నామని తెలిపారు. అవి వస్తే గ్రామాలు అభివృద్ధి సాధిస్తాయని పేర్కొన్నారు. ఈ సందదర్భంగా గిరిజన నాయకులు సిడాం భీమ్రావ్, కనక తుకారం, కనక లక్కేరావ్ గిరిజన గ్రామాల్లో కనీస సౌకర్యాలు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని, పోలీసు శాఖలో ప్రభుత్వం విడుదల చేస్తున్న ఐఏపీ నిధులతో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల అభివృద్ధికి కృషి చేయూలని ఏఎస్పీ అంబర్‌కిశోర్‌ఝా దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన ఆయన.. విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు. అలాగే గిరిజన యువకులు శాంతిభద్రతల విషయంలో పోలీసులకు సహకరించాలని కోరారు. రాయిసెంటర్ జిల్లా మెడి మెస్రం దుర్గు, మాజీ ఎంపీపీ కనక తుకారం, టీఆర్ఎస్ ఎస్టీ సెల్ జిల్లా ప్రధాన కార్యాదర్శి కనక లక్కేరావ్, కిసాన్‌మోర్చా జిల్లా అధ్యక్షుడు దీపక్‌సింగ్ షెకావత్, జాతీయ మానవ హక్కుల వేదిక రాష్ట్ర కార్యదర్శి ఆత్రం భుజంగ్‌రావ్, పీఆర్టీయూ జిల్లా ఉపాధ్యక్షుడు అనిల్ రాథోడ్, కేస్లాపూర్ సర్పంచ్ మెస్రం నాగ్నాథ్, కేస్లాపూర్ గ్రామపటేల్ మెస్రం వెంకట్రావ్, ఐటీడీఏ మాజీ చైర్మన్ సిడాం భీమ్రావ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మీర్జా యూకూబ్‌బేగ్, ఆదివాసీ సంక్షేమ పరిషత్ నాయకుడు మధు, మాజీ ఎంపీటీసీ కినక జంగు, ఏఎంసీ మాజీ చైర్మన్ వెంకట్రావ్, అర్క ఖమ్ము పాల్గొన్నారు. గిరిరాజులుగా బతకాలి ఆదివాసీ గిరిజనులుగా కాకుండా గిరి రాజులుగా సమాజంలో గర్వంగా బతకాలని ఏఎస్పీ అంబర్‌కిశోర్‌ఝా అన్నారు. కేస్లాపూర్లో భీమ్ వర్ధంతి కార్యక్రమానికి ముందుగా గిరిజనులు, గిరిజన నాయకులతో సమావేశమయ్యారు. గిరిజనుల కోసం ప్రభుత్వం అన్ని విధాలుగా పథకాలు అమలు చేస్తోందని, వాటిని సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా అభివృద్ధి చెందాలని సూచించారు.