గోండు వీరుడు కొమరం భీం విగ్రహాన్నిగుర్తుతెలియని వ్యక్తులు మంగళవారం రాత్రి ధ్వంసం చేశారు.
కరీంనగర్: గోండు వీరుడు కొమరం భీం విగ్రహాన్నిగుర్తుతెలియని వ్యక్తులు మంగళవారం రాత్రి ధ్వంసం చేశారు. ఈ సంఘటన జిల్లాలోని మహాముత్తారం మండలం యామన్‌పల్లిలో చోటుచేసుకుంది. ఈ ఘటనలో కొమరం భీం విగ్రహం చేయి ధ్వంసమైంది. గుర్తు తెలియని వ్యక్తులు 15 రోజుల క్రితం విగ్రహాన్నిధ్వంసం చేస్తే కాంగ్రెస్ నాయకులు విగ్రహానికి మరమ్మతులు చేయించారు. మళ్లీ మంగళవారం దుండగులు మరోసారి విగ్రహాన్నిధ్వంసం చేశారు.