దహెగాం(సిర్పూర్): మండల కేంద్రంలోని 240 సర్వే నంబర్‌లో 13 ఎకరాల భూమి వివాదస్పదమైంది. 58 ఏళ్ల క్రితం ఇళ్ల కోసం స్థలాలు కొనుగోలు చేసి 120 కు టుంబాలు నివాసం ఉంటున్నాయి. కానీ ఓ వ్యక్తి ఈ స్థలమంతా తమదేనని హైకోర్టులో కేసు వేయడంతో వివాదం తలెత్తింది. దీంతో రెవెన్యూ అధికారులు అందరికీ నోటీసులు జారీ చేయగా బుధవారం గ్రామస్తులు ఆధారాలను తహసీల్ కార్యాలయంలో అందజేశారు.
ఇవీ వివాదం..
దహెగాం మండల కేంద్రంలోని 240 సర్వే నంబర్‌లో 13 ఎకరాల భూమి తమ తండ్రి దుమ్మెన బాపు పేరున ఉందని, ఈ భూమిని రెవెన్యూ అధికారులు తనకు విరాసత్ చేయడం లేదని కౌటాల మండలానికి చెందిన దుమ్మెన ఇస్తారి హైకోర్టులో కేసు వేశాడు. దీంతో రెవెన్యూ అధికారులు ఆ భూమిలో ఇళ్లు నిర్మించుకున్న వారందరికీ నాలుగురోజుల క్రితం నోటీసులు జారీ చేశారు. బుధవారం ఇళ్లకు సంబం«ధించిన పత్రాలతో హాజరు కావాలని అందులో పేర్కొన్నారు. దీంతో 240 సర్వే నంబర్‌లో ఇళ్లు నిర్మించికున్న వారంతా బుధవారం తహసీల్ కార్యాలయంలో హాజరయ్యారు. ఇళ్ల పత్రాలు, డాక్యూమెం ట్లను అధికారులకు అందజేశారు. తమకు న్యాయం చేయాలని బాధితులు జూనియర్ అసిస్టెంట్ రామన్నకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా బాధితులు మాట్లాడారు. పెద్దవాగు ఒడ్డున పాత దహెగాం ఊరు ఉండగా 1956లో వచ్చిన భారీ వరదలకు కొట్టుకపోయింది. దీంతో 1960 సంవత్సరంలో దుమ్మెన బాపు వద్ద 240 సర్వే నంబర్‌లోని 13 ఎకరాల భూమిని చిలువేరు రత్నయ్య, పుప్పాల చిన్నన్న, కొమురవెల్లి శ్రీశైలం కొనుగోలు చేశారు.
సాదాబైనామా కూడా రాసి ఇచ్చారు. కొనుగోలు చేసి న వారి పేరు మీద సాదాబైనామా చేయాలని అప్ప టి సిర్పూర్(టి)లోని రెవెన్యూ కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నాం. కానీ దూరభారం ఉండగా అంతగా పట్టించుకోలేదు. దహెగాం రెవెన్యూ కార్యాలయంలో «సాదాబైనామా కింద పేరు మార్పిడి కో సం దరఖాస్తు చేసుకోగా 2003లో తహసీల్ కార్యాలయంలోని రికార్డులను మావోయిస్టులు కాలబెట్టడంతో రికార్డులన్నీ కాలిపోయాయి. దీంతో పాత రికార్డులను పునరుద్ధరించడంతో ఆ భూమి కౌటాల మండలానికి చెందిన దుమ్మెన బాపు పేరు మీద ఉందన్నారు. గత 58 సంవత్సరాల నుంచి ఇళ్లు నిర్మించుకొని 120 కుటుంబాలు నివసిస్తున్నాయని తెలిపారు. ఇళ్లకు సంబంధించిన టాక్స్‌లు ప్రతీ సంవత్సరం గ్రామపంచాయతీకి చెల్లిస్తున్నామని, ఈ స్థలాల్లో ఇళ్లు నిర్మించుకొని నివసిస్తున్న మాకు పట్టాలు ఇచ్చి న్యాయం చేయాలని బాధితులు కోరారు.
Comments
Please login to add a commentAdd a comment