సాక్షి, ఆదిలాబాద్: కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా, బెజ్జూర్ మండలంలోని ఏటిగూడ వద్ద నడి రోడ్డుపై పెద్ద పులి హల్‌చల్ చేసింది. ప్రయాణికులను, పాదచారులను వెంటాడింది. పులి వెంబడించడంతో ఇద్దరు యువకులు పరుగు తీసి కింద పడిపోయి మళ్ళీ పరిగెత్తి సమీపంలో ఉన్న చెట్టు ఎక్కారు. ప్రమాదం తప్పడంతో బతుకుజీవుడా అని ఊపిరి పీల్చుకున్నారు. మరో ఇద్దరు యువకులు బైకులపై తప్పించుకున్నారు. ఆరుగురు వ్యక్తులు కమ్మర్గాం గుండె పల్లి గ్రామాల నుంచి బెజ్జూర్ మండల కేంద్రానికి వస్తోన్న క్రమంలో ఈ ఘటన చోటు చేసుకుంది. పులి సంచారంతో అటవీ ప్రాంతంలో ప్రయాణం చేయాలంటేనే స్థానికులు, గిరిజనులు జంకుతున్నారు. (చదవండి: ఐదు రోజులాయే.. పెద్దపులి చిక్కేనా..?)
వారం రోజుల క్రితం పులి ఓ యువకుడిపై దాడి చేసి హతమార్చిన సంగతి తెలిసిందే. ఇప్పటికి ఇంకా ఆ పులి ఆచూకీ చిక్కలేదు. తాజాగా మరోసారి పులి హల్‌చల్ చేయడంతో స్థానికులు, గిరిజనులు భయాందోళనకు గురవుతున్నారు. ఈ నెల 11న ఆసిఫాబాద్ జిల్లా దహెగాం మండలం దిగిడ గ్రామానికి చెందిన విఘ్నేష్ (22)పై పులి దాడి చేసి హతమార్చింది. పులిని పట్టుకునేందుకు 12 బృందాలు రంగంలోకి దిగిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment