బంజారా, ఆదివాసీ భవన్‌లకు శంకుస్థాపన చేసిన సీఎం కేసీఆర్
గిరిజనుల సమస్యలపై వీటిల్లో చర్చలు జరగాలి
12 శాతం రిజర్వేషన్లను కచ్చితంగా అమలుచేస్తాం
రాష్ట్రంలోని తండాలన్నింటినీ పంచాయతీలుగా మారుస్తాం
పరిధిలోకి లంబాడాలు, వాల్మీకి బోయలను చేరుస్తామని వెల్లడి
సాక్షి, హైదరాబాద్: త్వరలో సిద్ధమయ్యే బంజా రా, ఆదివాసీ భవనాలు గిరిజనుల అభ్యుదయానికి వేదికలు కావాలని తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఆకాంక్షించారు. గిరిజనుల సమస్యల పరిష్కారా నికి ఈ వేదికలపై మేధావులతో చర్చలు జరగాలని, వాటి ఫలితాలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని ఆయన సూచించారు. గురువారం హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ రోడ్ నంబరు-1లో బంజారా భవన్, కొమురం భీం ఆది వాసీ భవన్‌కు సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశా రు. అనంతరం బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ‘‘బంజారాలు, ఆదివాసీలు, గోండు లు తదితర గిరిజనవర్గాలు హైదరాబాద్‌లో తమకు కమ్యూనిటీ హాల్‌లు కావాలని ఎన్నో ఏళ్లుగా ప్రయత్నించాయి. సమైక్య పాలనలో వారడిగిన పనికాలేదు. తెలంగాణ వచ్చాక బంజారాహిల్స్‌లోనే బంజారా భవన్ నిర్మిస్తానని ఉద్యమ సమయంలోనే చెప్పిన. బంజా రాభవన్‌కు శంకుస్థాపన కూడా చేసుకున్నాం.. ’’ అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.
వరాల జల్లు..: ఐదు వందలకు పైగా జనాభా ఉన్న గిరిజన తండాలన్నింటినీ గ్రామ పంచాయతీలుగా మారుస్తామని సీఎం ఈ సందర్భంగా మరోసారి హామీ ఇచ్చారు. గిరిజనులకు కూడా త్వరలోనే మూడెకరాల భూమి ఇస్తామని... దానితోపాటు విద్యుత్, బోరు, మోటారు, ఒక ఏడాది వ్యవసాయానికి అవసరమయ్యే పెట్టుబడిని కూడా సమకూరుస్తామని చెప్పారు.
అంటువ్యాధులతో అల్లాడుతున్న గిరిజన తండాలకు 400 వైద్య బృందాలను పంపాలని నిర్ణయించామన్నారు. సమతుల పోషకాహారం తీసుకోవడం, వ్యాధులకు మందులు వాడడం, మూఢ నమ్మకాలకు దూరంగా ఉండడం తదితర అంశాలపై ఆ బృందాలు అవగాహన కల్పిస్తాయని కేసీఆర్ తెలిపారు. కేబినెట్ విస్తరణలో గిరిజన సంక్షేమ విభాగానికి గిరిజనుడినే మంత్రిగా నియమిస్తామన్నారు. గిరిజనుల ఇళ్లలో ఆడపిల్ల పెళ్లికి కల్యాణ లక్ష్మి పథకం కింద రూ. 51 వేలు అందజేయనున్నట్లు సీఎం పేర్కొన్నారు. బంజారాల కులదైవం సేవాలాల్ జయంతి ఉత్సవాలకు, జంగూభాయ్ జయంతి నిర్వహణ కోసం ఒక్కో జిల్లాకు వేర్వేరుగా రూ. 10 లక్షల చొప్పున కేటాయిస్తామని సీఎం చెప్పారు. వచ్చే ఎన్నికల్లోగా ప్రతి లంబాడీ తండా, గిరిజన, కోయ గూడాలకు, చెంచుపేటల్లోని ప్రతి ఇంటికి మంచినీటి నల్లా కనెక్షన్ ఇస్తానని.. లేకపోతే ఓట్లు అడగబోమన్నారు. అయితే ఈ సదుపాయం ప్రజలందరికీ చేరేలా తండాలు, గూడేల పెద్దలు బాధ్యత తీసుకోవాలన్నారు.
12 శాతం రిజర్వేషన్‌లోకి లంబాడాలు, వాల్మీకి బోయలు..
ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్నట్లుగా గిరిజనులకు 12 శాతం రిజర్వేషన్ ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం స్పష్టం చేశారు. 9 శాతం గిరిజనులుంటే 12 శాతం రిజర్వేషన్ ఎలా ఇస్తారని ఓ పెద్దమనిషి తనను ప్రశ్నించారని.. గిరిజ నులతో పాటు కాగిత, లంబ లం బాడీ, వాల్మీకి బోయలనూ ఈ జాబితాలో చేర్చబోతున్నట్లు తాను చెప్పానన్నారు. రిజర్వేషన్ల విషయమై త్వరలోనే హైకోర్టు రిటైర్డ్ జడ్జితో కమిటీ వేయనున్నట్లు సీఎం తెలిపారు. ఈ సందర్భంలో ‘రజకులను కూడా గుర్తించాల’ం టూ ఒక వ్యక్తి బ్యానర్‌తో సభా ప్రాంగణంలో హల్‌చల్ చేశా డు. ఇది సందర్భం కాదని సీఎం వారించినా వినకపోయే సరికి పోలీసులు అత న్ని పక్కకు తీసుకెళ్లారు. కార్యక్రమంలో వివిధ జిల్లాల నుంచి వచ్చిన గిరిజనులు ప్రదర్శించి న.. బంజారా, గుస్సాటి, థింసా, కొమ్ము, కో య, డప్పు నృత్యాలు ఆకట్టుకున్నాయి. సభలో బంజారా నేతలు సీతారాం నాయక్, రాములు నాయక్, శంకర్‌నాయక్, కిషన్‌సింగ్, డిప్యూటీ సీఎం రాజయ్య, మంత్రులు ఈటెల రాజేందర్, నాయిని నర్సింహారెడ్డి, జోగు రామన్న, పోచా రం శ్రీనివాసరెడ్డితో పాటు పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారులు పాల్గొ న్నారు. కాగా బంజారా, ఆదివాసీ భవన్‌లతో పాటు దళితుల కోసం జగ్జీవన్‌రామ్ భవన్‌ను కూడా ప్రారంభిస్తామని ప్రభుత్వం ప్రకటిం చినా.. పలు కారణాల వల్ల వాయిదా వేసింది.
అభ్యుదయానికి వేదికలు కావాలి: కేసీఆర్
Published Fri, Dec 12 2014 3:07 AM | Last Updated on Tue, Aug 14 2018 10:51 AM
Advertisement
Advertisement