హైదరాబాద్: ఆదిలాబాద్ గిరిజన ఉద్యమకారుడు కొమురం భీం వారసుడు సోనేరావు కుటుంబానికి ప్రభుత్వం రూ.10 లక్షల ఆర్థిక సాయాన్ని మంజూరు చేసింది. గతేడాది అక్టోబరులో ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు ఆదిలాబాద్ జిల్లా జోడేఘాట్‌లో కొమురం భీం వర్ధంతి కార్యక్రమానికి హజరై ఈ మేరకు హామీ ఇచ్చారు.
అక్కడ ఆ గిరిజన వీరుడి స్మారక మ్యూజియంతోపాటు ఇతర నిర్మాణాలు చేపట్టేందుకు రూ.25 కోట్ల మేర ప్రత్యేక ప్రాజెక్టును కూడా ప్రకటించారు. ఈ నిర్మాణానికి సంబంధించి రూ.18.75 కోట్లను కూడా ప్రభుత్వం విడుదల చేసింది. ఆ నిధుల నుంచి సోనేరావు కుటుంబానికి రూ.10 లక్షలు అందజేయాల్సిందిగా ప్రభుత్వం పర్యాటకాభివృద్ధి సంస్థను ఆదేశిస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.
కొమురం భీం వారసుడికి రూ.10 లక్షలు
Published Wed, Jun 10 2015 11:25 PM | Last Updated on Sun, Sep 3 2017 3:31 AM
Advertisement
Advertisement