sone rao
-
సోనేరావుకు కొమురం భీం పురస్కారం
హైదరాబాద్: కొమురం భీం మనుమడు సొనేరావుకు కొమురంభీం పురస్కారం లభించింది. శనివారం హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో తెలంగాణ గిరిజన సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ప్రపంచ గిరిజన దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా సోనేరావుకు కొమురం భీం పురస్కారాన్ని విశ్రాంత ఐఏఎస్ రాంచంద్రు నాయక్ అందజేశారు. రాంచంద్రునాయక్ మాట్లాడుతూ గిరిజనులకు నష్టాలు కలిగించే పనులను ఎవరూ చేయొద్దని కోరారు. అటవీ ప్రాంతాల్లో లభించే ఖనిజ సంపదపై గిరిజనులకు హక్కు కల్పించాలని డిమాండ్ చేశారు. అనంతరం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో జేఎన్టీయూ ప్రొఫెసర్ బాబు, భాషా సాంస్కృతిక శాఖ డెరైక్టర్ ఎం.హరికృష్ణ, జి.శంకర్‌నాయక్, సీతారాంనాయక్ తదితరులు పాల్గొన్నారు. -
కొమురం భీం వారసుడికి రూ.10 లక్షలు
హైదరాబాద్: ఆదిలాబాద్ గిరిజన ఉద్యమకారుడు కొమురం భీం వారసుడు సోనేరావు కుటుంబానికి ప్రభుత్వం రూ.10 లక్షల ఆర్థిక సాయాన్ని మంజూరు చేసింది. గతేడాది అక్టోబరులో ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు ఆదిలాబాద్ జిల్లా జోడేఘాట్‌లో కొమురం భీం వర్ధంతి కార్యక్రమానికి హజరై ఈ మేరకు హామీ ఇచ్చారు. అక్కడ ఆ గిరిజన వీరుడి స్మారక మ్యూజియంతోపాటు ఇతర నిర్మాణాలు చేపట్టేందుకు రూ.25 కోట్ల మేర ప్రత్యేక ప్రాజెక్టును కూడా ప్రకటించారు. ఈ నిర్మాణానికి సంబంధించి రూ.18.75 కోట్లను కూడా ప్రభుత్వం విడుదల చేసింది. ఆ నిధుల నుంచి సోనేరావు కుటుంబానికి రూ.10 లక్షలు అందజేయాల్సిందిగా ప్రభుత్వం పర్యాటకాభివృద్ధి సంస్థను ఆదేశిస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. -
ఆదిలాబాద్ జిల్లా పేరును మార్చండి: సోనేరావు
హైదరాబాద్: ఆదిలాబాద్ జిల్లా పేరును గిరిజనల కోసం పోరాటం సాగించిన ఉద్యమ నేత కొమరం భీమ్ పేరుగా మార్చాలని ఆయన మనవడు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కి విజ్క్షప్తి చేశారు. సచివాలయంలోని సీఎం కార్యాలయంలో కేసీఆర్ ను కొమరం భీమ్ మనవడు సోనే రావు కలిసి విజ్క్షాపన పత్రాన్ని సమర్పించారు. వెనుకబడిన ఆదిలాబాద్ జిల్లా అభివృద్దికి, గిరిజనుల అభివృద్ధికి, సంక్షేమానికి మరిన్ని పథకాలను ప్రారంభించాలని కేసీఆర్ కు సోనేరావు సూచించారు. -
భీమ్ విగ్రహ ధ్వంసానికి యత్నం
ఖానాపూర్, న్యూస్‌లైన్ : ఖానాపూర్ మండల కేంద్రంలోని జంగల్‌హన్మాన్ చౌరస్తాలో ఉన్న కొమురం భీమ్ విగ్రహాన్ని ధ్వంసం చేసేందుకు శుక్రవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు యత్నించారు. రాజ్‌గోండ్ సేవాసంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భీమ్ విగ్రహాన్ని ఆయన మనవడు సోనేరావు, ఎంపీ రాథోడ్ రమేశ్ 15 రోజుల క్రితం ఆవిష్కరించారు. ఈ విగ్రహం దిమ్మెకు ఉన్న శిలాఫలకాన్ని శుక్రవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు పగులగొట్టారు. విగ్రహాన్ని ధ్వంసం చేసేందుకు యత్నించారు. తలభాగం స్వల్పంగా దెబ్బతింది. శనివారం దీనిని నిరసిస్తూ స్థానిక రాజ్‌గోండ్ సేవా సంఘం నాయకులు విగ్రహం వద్ద బైఠాయించి ఆందోళనకు దిగారు. భీమ్ విగ్రహం ధ్వంసానికి యత్నించి, శిలాఫలకం పగులగొట్టిన నిందితులను పట్టుకుని కఠినంగా శిక్షించాలని, అప్పటివరకు ఆందోళన కొనసాగిస్తామని ఏఐకేఎంఎస్ జిల్లా అధ్యక్షుడు నంది రామయ్య డిమాండ్ చేశారు. ఈ సంఘటనను సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ తరఫున ఖండిస్తున్నామని పేర్కొన్నారు. ఈ విషయమై ఈ నెల 11న ఆందోళన చేపట్టనున్నట్లు తెలిపారు. విగ్రహాన్ని ఎస్సై రాము పరిశీలించారు. కార్యక్రమంలో రాజ్‌గోండ్ సేవాసంఘం అధ్యక్ష, కార్యదర్శులు అంకుశ్రావు, కుడిమెత మధు, నాయకులు కొమురం దేవరావు, లక్ష్మణ్, ఎల్లయ్య, శంకర్, బుక్య గోవింద్, మాలవత్ రోహిదాస్, మక్కల బీమన్న, గాండ్ల శ్రీనివాస్ పాల్గొన్నారు.