సోనేరావుకు కొమురం భీం పురస్కారం | Komuram Bhim Award to soneravu | Sakshi
Sakshi News home page

సోనేరావుకు కొమురం భీం పురస్కారం

Published Sun, Aug 9 2015 1:39 AM | Last Updated on Sun, Sep 3 2017 7:03 AM

సోనేరావుకు కొమురం భీం పురస్కారం

సోనేరావుకు కొమురం భీం పురస్కారం

 హైదరాబాద్: కొమురం భీం మనుమడు సొనేరావుకు కొమురంభీం పురస్కారం లభించింది. శనివారం హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో తెలంగాణ గిరిజన సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ప్రపంచ గిరిజన దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా సోనేరావుకు కొమురం భీం పురస్కారాన్ని విశ్రాంత ఐఏఎస్ రాంచంద్రు నాయక్ అందజేశారు.

రాంచంద్రునాయక్ మాట్లాడుతూ గిరిజనులకు నష్టాలు కలిగించే పనులను ఎవరూ చేయొద్దని కోరారు. అటవీ ప్రాంతాల్లో లభించే ఖనిజ సంపదపై గిరిజనులకు హక్కు కల్పించాలని డిమాండ్ చేశారు. అనంతరం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో జేఎన్‌టీయూ ప్రొఫెసర్ బాబు, భాషా సాంస్కృతిక శాఖ డెరైక్టర్ ఎం.హరికృష్ణ, జి.శంకర్‌నాయక్, సీతారాంనాయక్ తదితరులు పాల్గొన్నారు.   
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement